------------------------------------------------
అంశం : రాజకీయం.
ప్రశ్నిస్తున్నవారు : Marxist-Leninist. 
------------------------------------------------

దోపిడీకి తెలంగాణా - ఆంధ్రా అనే తేడాలుంటాయా?

Name:Marxist-Leninist 
E-Mail:deleted 
Subject:దోపిడీకి కులం, ప్రాంతం లాంటి అవధులు ఉంటాయా?  
Message:
రామోజీ ఫిల్మ్ సితీని లక్ష నాగళ్ళతో దున్నిస్తానన్న కె.సి.ఆర్. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సితీని పొగుడుతున్నాడు. ఈ విషయం తెలిసి కూడా కె.సి.ఆర్.ని ఇంకా నమ్ముతోన్న అభిమాన గణం ఉన్నారు.

దోపిడీకి కులం, ప్రాంతం లాంటి అవధులు ఉండవని తెలిసినా ఆ నిజాన్ని కొందరు అంగీకరించలేకపోతున్నారు. కె.సి.ఆర్. తెలంగాణాలోనే పుట్టాడు, పద్మనాయక వెలమ కులంలోనే పుట్టాడు. నిజమే, కానీ మనిషి కేవలం కులం మీదో, ప్రాంతం మీదో ఆద్గారపడి బతకడు కదా. పద్మనాయక వెలమలు మహారాష్ట్రలో కూడా ఉన్నారు, వారిలో సర్పంచ్‌లుగా గెలిచినవాళ్ళు కూడా ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్త్‌లు పూర్తైతే తెలంగాణా ఎడారి అయిపోతుంది, తెలంగాణాలోని పద్మనాయకుల భూములు కూడా ఎండిపోతాయి. కానీ మహారాష్ట్రలోని పద్మనాయకులు తమ భూములకి సాగు నీరు అందుతుందని సంతోషిస్తారే తప్ప తెలంగాణాలోని తమ కులంవారి భూములు బీడువారుతాయని బాధపడతారా? కర్ణాటకలోని కొప్పల్, రాయ్‌చూర్ ప్రాంతాల్లో చాలా మంది కమ్మవాళ్ళు ఉన్నారు. ఆల్మట్టి వల్ల ఆంధ్రా, తెలంగాణలలోని కమ్మవాళ్ళ భూములు ఎండిపోతాయని కర్ణాటకలోని కమ్మవాళ్ళు బాధపడతారా?

రామోజీరావు తన దగ్గరి బంధువుల్నే మోసం చేసి పైకి వచ్చినవాడు. అతనికి కులం, ప్రాంతం పెద్ద లెక్కలోకి రావు. తెలంగాణా వస్తే హైదరాబాద్ యొక్క ప్రాధాన్యత తగ్గిపోయి అక్కడి ధనవంతుల ఆస్తుల విలువ తగ్గిపోతుందనే ఏకైక కారణం చాలు, రామోజీ రావు తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకించడానికి. పద్మనాయక వెలమ కులానికే చెందిన కె.వి.పి. రామచంద్రరావు, మేకా ప్రతాప అప్పారావు, సుజయకృష్ణ రంగారావులు కూడా తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకించారు. తెలంగాణా ఏర్పడితే తమ కులంవాడు ముఖ్యమంత్రి అవుతాడు అనే ఆశలు వాళ్ళు పెట్టుకోలేదు. కులం కోసం మేడి పండు లాంటి హైదరాబాద్‌ని ఎవడు వదులుకుంటాడు?

కులం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో రాజకీయ నాయకుల్ని గుడ్డిగా ఆరాధించడం అమాయకత్వమే అవుతుందని ఈ అభిమాన గణం తెలుసుకుంటే మంచిది.

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. దోపిడికి ప్రాతీయ తేడాలుండవని నెత్తి,నోరు మొత్తుకుని చెప్పినవాళ్ళందరిని 'ఆంధ్రొళ్ళు" అని కొట్టిపారేశారు. KCR Ramoji Film City కి వెళ్ళింది లక్ష నాగళ్ళు సరిపోతాయా యింకా ఎక్కువ కావాలా అని చూడడానికి. కాకపోతే చూసి ముచ్చట పడి పొగిడేశాడు.
    యిందులో కులమెందుకు వచ్చిందో నాకర్ధం కాలా

    ReplyDelete
  2. ఫేస్‌బుక్‌లో ఒకాయన కె.సి.ఆర్.ని సమర్థించేటప్పుడు కుల ప్రస్తావన కూడా తెచ్చాడులే. కమ్మవాళ్ళూ, వెలమదొరలూ పూర్వం కాకతీయుల కింద సైనికులుగా పని చేసేవాళ్ళులే. అప్పట్లో ఆ రెండు కులాలూ ఒకటే అయ్యుండొచ్చు అనే hypothesis నిజమైనా కె.సి.ఆర్.ని కులం పేరుతో సమర్థించక్కరలేదు అనే తేలుతుంది.

    ReplyDelete
    Replies
    1. >>> ఫేస్‌బుక్‌లో ఒకాయన కె.సి.ఆర్.ని సమర్థించేటప్పుడు కుల ప్రస్తావన కూడా తెచ్చాడులే.

      KCRని ఎవరు ఎక్కడ కులం పేరుతో సమర్థించారు? లింకు గాని, స్క్రీన్ షాట్ గాని ఇవ్వగలరా ప్రవీణ్ గారు?

      Delete
    2. https://www.dropbox.com/s/d6hjtrl6v2lrchp/Screenshot_2014-12-15-12-51-37.png?dl=0

      Delete
    3. "మనకు నచ్చినా నచ్చక పోయినా, మన సమాజిక వర్గం అయినా కాకపోయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి సుప్రీం." ఇదీ మీరిచ్చిన లింకులోని వాక్యం.

      ఈ వాక్యంలో కులం పేరుతో సమర్థించడం ఎక్కడ వుంది?

      "సమాజిక వర్గం" అన్న పదం ఉపయోగించడమే నేరమైతే... మీరు ఈ పోస్టులోనే "కమ్మ, వెలమ" అంటూ కులాల పేర్లూ, అందులో అనేక ఉపకులాల పేర్లూ చెప్తూ వ్యాఖ్యానాలు చేయడాన్ని ఏమనాలి?

      Delete
    4. కమ్మవాళ్ళ మీద పడి ఏడవడమే తెలంగాణావాదం అని నమ్మేవాళ్ళని ఉద్దేశించే "కె.సి.ఆర్. పూర్వికులు కమ్మవాళ్ళు" అనే hypothesis వ్రాసాను. శతకోటి లింగాలలో ఒక బోడిలింగం లాంటివాడే రామోజీరావు. పెట్టుబడిదారీ సమాజంలో స్వార్థం అనేది సహజ స్వభావం కనుక రామోజీరావుకి కూడా ఆ స్వభావమే ఉంటుంది. అతన్ని కులం పేరుతో తిట్టాల్సిన అవసరం లేదు కానీ మొన్నటి వరకు అతన్ని కులం పేరుతో తిట్టి, ఇప్పుడు తమ అభిమాన నాయకుని కోసం ఆ తిట్లన్నీ మర్చిపోయేవాళ్ళని చూస్తేనే ఆశ్చర్యం కలుగుతోంది.

      Delete
    5. "కమ్మ" అనే కులం పేరు నేరుగా చెప్పకుండా "ఆ సామాజికవర్గం" అంటూ కమ్మవాళ్ళని తిట్టే పోస్త్‌లు ఫేస్‌బుక్‌లో చాలా కనిపిస్తాయి. "వెలమదొరలు" అని వ్రాయకుండా "దొరలు" అని వ్రాసి వెలమదొర (పద్మనాయక వెలమ) కులాన్ని తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కె.సి.ఆర్., జలగం వెంగళరావు తదితరులు పుట్టిన కులాన్ని కొన్ని ప్రాంతాల్లో "పద్మనాయక వెలమ" అంటే కొన్ని ప్రాంతాల్లో "వెలమదొర" అంటారు. మా ప్రాంతం (ఉత్తరాంధ్ర)లో ఆ రెండు పేర్లూ ఉపయోగిస్తారు. వాళ్ళని కేవలం "దొరలు" అనేది మాత్రం పత్రికల్లో, అది కూడా తిట్టడానికి. కమ్మవాళ్ళని తిట్టడానికి "ఆ సామాజిక వర్గం" అనీ, వెలమదొరలని తిట్టడానికి "దొరలు" అనీ euphemism ఉపయోగించడం ఈ మధ్య ఫాషన్ అయిపోయింది.

      Delete
    6. "సామాజికవర్గం" అనే పదాన్ని మొదట ఈనాడువాళ్ళు ఉపయోగించేవాళ్ళు. కులవ్యవస్థపై వ్యతిరేకత లేకుండా చెయ్యడానికి ఈనాడువాళ్ళు ఆ పదం కనిపెట్టారు. ఇప్పుడు ఆ పత్రిక సంపాదకుడు గారి కులాన్ని తిట్టడానికి "ఆ సామాజికవర్గం" అనే ప్రయోగం వాడుతున్నారు. నువ్వు ఎవరికైనా చెడు విద్యలు నేర్పిస్తే వాళ్ళు దాన్ని నీ మీదే ప్రయోగిస్తారు. ఈనాడువాళ్ళ ప్రయోగం ఇలాగే వికటించింది. ఇకనైనా ఈ పెంట లాంటి వాటికి సంస్కృత పేర్లు పెట్టడం మానాలి.

      Delete
    7. మీరిచ్చిన లింకులోని వాక్యంలో కులం పేరుతో సమర్థించడం ఎక్కడ వుంది? దీనికి మాత్రమే సమాధానం అడిగాను. మీరు అది తప్ప ఏదేదో చెపుతున్నారు.

      Delete
    8. "ఆ ప్రాంతమోడు గడ్డి తినగా లేనిది మన ప్రాంతమోడు గడ్డి తింటే విచిత్రమా" అంటూ ఆయన స్పష్టంగానే ప్రశ్నించాడు కదా. సంకుచితత్వం కులం పేరుతో ఉంటే ఏమిటి, ప్రాంతం పేరుతో ఉంటే ఏమిటి?

      Delete
    9. తెలుగు బ్లాగర్లు నన్ను బండ బూతులు తిట్టినా సిగ్గు పడకుండా ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని బలంగా సమర్థించిన కోస్తా ఆంధ్రుణ్ణి నేను. ఇప్పటికీ కోస్తా ఆంధ్ర బ్లాగర్లు నన్ను నమ్మరు. వాళ్ళు నన్ను అమృతం సీరియల్‌లోని అప్పాజీని చూసినట్టు చూస్తారు. నేను మా ప్రాంతంవాళ్ళ చేతే అడ్డమైన తిట్లు తిని తెలంగాణా ఏర్పాటుని సమర్థించినది తెలంగాణని రామోజీరావు లాంటి తోడేళ్ళకి మేత చెయ్యనివ్వడం కోసం కాదు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (కె.సి.ఆర్. గారి ప్రాంతానికి చెందినవాడు) ఆంగ్లేయుల మోచేతి నీళ్ళు తాగాడు, కె.సి.ఆర్. గారి కులానికే చెందిన బొబ్బిలి, పిఠాపురం, నూజివీడు, మైలవరం జమీందార్లు కూడా ఆంగ్లేయుల మోచేతి నీళ్ళు తాగారు. ఆయన్ని ప్రాంతం పేరుతో నమ్మినా, కులం పేరుతో నమ్మినా తేడా ఏమీ రాదు.

      Delete
    10. >>> "ఆ ప్రాంతమోడు గడ్డి తినగా లేనిది మన ప్రాంతమోడు గడ్డి తింటే విచిత్రమా" అంటూ ఆయన స్పష్టంగానే ప్రశ్నించాడు కదా. సంకుచితత్వం కులం పేరుతో ఉంటే ఏమిటి, ప్రాంతం పేరుతో ఉంటే ఏమిటి?

      ప్రాంతీయ సంకుచితత్వం సంగతి తర్వాత చర్చిద్దాం. ముందు కులం పేరుతో సమర్థించ లేదని ఒప్పుకుంటున్నట్టేనా?

      Delete
    11. నాకు ప్రాంతీయ గజ్జి వస్తే జాలిం లోషన్ రాసుకోను, కులగజ్జి వస్తే జాలిం లోషన్ రాసుకుంటాను. సరేనా?

      Delete
    12. "దోపిడీకి కులం, ప్రాంతం లాంటి అవధులు ఉంటాయా?" అంటూ మీరే ప్రశ్నలోకి కులాన్ని తీసుకు వచ్చారు. కులం ప్రసక్తి ఎందుకు వచ్చిందని పండు గారు అడిగితే ఫేస్‌బుక్‌లో ఏవరో అన్నారని చెప్పారు. దాని లింకు అడిగితే బుద్ధా మురళి గారి లింకు ఇచ్చారు. కాబట్టి ఈ ప్రశ్నకు ఆ లింకు మూలంగా మారింది. అందుకే మరో సారి అడుగుతున్నాను, డైరెక్టుగా జవాబివ్వండి.

      బుద్ధా మురళి గారు తన పోస్టులో కులం పేరుతో సమర్థించ లేదని ఒప్పుకుంటున్నట్టేనా?

      Delete
    13. ఈ పోస్త్ ఆయనొక్కడి గురించే కాదు కానీ నిజ జీవితంలో ఎవడూ ఉపయోగించని & పత్రికల్లో మాత్రమే ఉపయోగించే "సామాజికవర్గం" అనే పదం ఆయన ఎందుకు ఉపయోగించినట్టో?

      నాకు కులం మీద నమ్మకం లేదు కాబట్టి కులానికి అందమైన పేర్లు పెట్టాల్సిన అవసరం నాకు లేదు. వెలమవారి చరిత్ర గురించి వ్రాసేటప్పుడు నేను "సామాజికవర్గం" అనే euphemism ఎక్కడా వాడలేదు. పాకిస్తాన్‌లో బలోచ్ అనేది ఒక జాతి. బలోచీలు అందరూ తాము రక్త సంబంధీకులమనుకుంటారు. కానీ కుల వ్యవస్థలో ఒక కులానికి చెందిన డబ్బున్నవాడు తన కులానికి చెందిన పేదవాణ్ణి తన రక్త సంబంధీకునిగా అంగీకరించడు. ఒక కులంలోనే అందరూ సమానులు కానప్పుడు కులానికి సామాజికవర్గం అనే పేరు పెట్టడం అనవసరం కదా.

      ఒక కులంలోనే రెండు ప్రాంతాలవాళ్ళ మధ్య ఐక్యత లేదు. ముద్దసాని కోదండరాం రెడ్డి పక్కా తెలంగాణావాదైతే కిరణ్ కుమార్ రెడ్డి పక్కా సమైక్యవాది.

      Delete
    14. >>> ఎవడూ ఉపయోగించని & పత్రికల్లో మాత్రమే ఉపయోగించే "సామాజికవర్గం" అనే పదం ఆయన ఎందుకు ఉపయోగించినట్టో?

      ఆయన "మన సమాజిక వర్గం అయినా కాకపోయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి సుప్రీం." అంటే మీకు కులం పేరుతో సమర్థించినట్టుగా అనిపించింది. అలా కాక "మన కులం అయినా కాకపోయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి సుప్రీం." అని గనక రాసి వుంటే కులం పేరుతో సమర్థించినట్టు అనిపించి వుండక పోయేదా? ఇది కేవలం నాకు క్లారిటీ రావడం కోసమే అడుగుతున్నాను.

      Delete
    15. పత్రికల భాషని ప్రాక్తికల్ విషయాలకి వర్తింప చెయ్యాల్సిన అవసరం ఏముంటుంది? నేను పెళ్ళి సంబంధానికి వెళ్తే "నీది ఏ కులం" అని నన్ను అడుగుతారు కానీ "నీది ఏ సామాజికవర్గం" అని అడగరు, పేర్లు మార్చినా అర్థం మారదని వాళ్ళకి తెలుసు కాబట్టి. నాకు కుల పట్టింపులు లేవు. వాళ్ళకి కుల పట్టింపులు ఉంటే తమకి ఆ పట్టింపులు ఉన్నాయని డొంకతిరుగుడు లేకుండా చెప్పుకుంటారు. నిజం చెప్పడం తప్పు కాదు కానీ ఎక్కడా లేని డొంకతిరుగుడు రాజకీయాల విషయంలోనే ఎందుకు వస్తుంది?

      Delete
    16. "మన కులం అయినా కాకపోయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి సుప్రీం." అని గనక రాసి వుంటే కులం పేరుతో సమర్థించినట్టు అనిపించి వుండక పోయేదా?

      Delete
    17. చంద్రబాబునైతే కులం పేరుతో నెత్తికెక్కించుకుంటారు కానీ కె.సి.ఆర్.ని కులం పేరుతో నెత్తికెక్కించుకుంటే కె.సి.ఆర్.కీ ఏమీ రాదు, ఆ చెక్క భజన చేసినవాళ్ళకి కూడా ఏమీ రాదు. కె.సి.ఆర్. గారి కుల జనాభా ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చాలా తక్కువే. సోపేరు (జలగం వెంగళరావు పుట్టిన ఊరు) ఒకప్పుడు బొబ్బిలి సంస్థానంలో ఉండేది కాబట్టి ఆ ఊరిలో ఒక వీధి నిండా వెలమదొరలే ఉన్నారు. గతంలో వెలమ జమీందారీ సంస్థానాలలో లేని ప్రాంతాలలో ఈ కులంవాళ్ళు దాదాపుగా కనిపించరు. ఆ కులం పేరు చెప్పుకుంటే దాదాపుగా వోత్‌లు పడవు కాబట్టే సమైక్య రాష్ట్రంలో ఆ కులం నుంచి జలగం వెంగళరావు ఒక్కడికే ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కె.సి.ఆర్. కూడా ఆ అల్ప సంఖ్యాక కులం నుంచే వచ్చాడు. కులం పేరుతో జనాన్ని కె.సి.ఆర్. చుట్టూ వందిమాగధులుగా చేరమంటే ఎంత మంది అలా చేరుతారు? అలాంటప్పుడు కె.సి.ఆర్. తన కులం కానివాళ్ళకి కూడా హీరోయే అని ప్రత్యేకంగా చెప్పడం అవసరమా?

      Delete
    18. ఇన్ని సార్లు అడిగినా కూడా నా ప్రశ్నలకు మీరు సూటిగా సమాధనం ఇవ్వలేదు. కాబట్టి చర్చించే విషయానికి, కులానికి సంబంధం లేదని మీరు ఒప్పుకున్నట్టే.

      Delete
    19. "పద్మనాయకులకైనా, ఆ కులంవాళ్ళు కాకపోయినా, కె.సి.ఆర్.గారు వాళ్ళకి రాజాధిరాజు" అని ఆయన చెప్పాలనుకున్నాడేమో! "సామాజికవర్గం" అని వ్రాయకపోయి ఉంటే ఈ విషయం సులభంగానే అర్థమయ్యేది. కుల పూజ చెయ్యకపోయినా, వ్యక్తి పూజ కూడా తప్పే కదా.

      Delete
    20. సో... బుద్ధా మురళి గారు రాసిన వాక్యం మీకు ఏమాత్రం అర్థం కాలేదు అని తెలుసుకున్నాను!

      ఆయన పోస్టు సారాంశం ఇదీ!

      చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నపుడు రామోజీ కొన్ని చానళ్ళ ప్రారంభోత్సవానికి అప్పటి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుణ్ణి పిలిచాడు. కాని బాబు కూచుని చప్పట్లు కొడుతుంటే చానెళ్ళను తనే ప్రారంభించాడు. ముఖ్యమంట్రి తన సామజిక వర్గం (సారీ కులం) వాడని ఈజీగా తీసుకుని ఆయన అలా చేశాడని మురళి గారి భావం.

      ఇప్పుడు మురళిగారేమన్నారో చూద్దాం.

      "మనకు నచ్చినా నచ్చక పోయినా, మన సమాజిక వర్గం అయినా కాకపోయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి సుప్రీం."

      అంటే ఏంటన్న మాట? ముఖ్యమంట్రి తన కులం వాడైనా కాకపోయినా రాష్ట్రానికి సుప్రీం. కాబట్టి ఆయనకు ఇచ్చే విలువ ఇచ్చి ఆయన్ని గౌరవించాలి, అంతే కాని ముఖ్యమంట్రిని పక్కన పెట్టుకుని తను ప్రారంభించకూడదు అని.

      ఇది అర్థం చేసుకోలేక మీరు ఇందులోకి నానా రకాలైన వెలమల జాతి పురాణాలని తీసుకొచ్చి విషయాన్ని కలగా పులగం చేశారు!!

      Delete
    21. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తీసుకుపోయినట్టు జనానికి అర్థం కాని భాష మాట్లాడింది ఆయనే కదా. ఆ సామాజికవర్గం, ఈ సామాజికవర్గం అంటూ కుల చర్చల్లో పాల్గొనే అలవాటు నాకు లేదు కనుక సామాజికవర్గం పేరుతో ఆయన వ్రాసినది నాకు అర్థం కాకపోవడం విచిత్రం కాదు.

      నేను మార్క్సిస్త్‌ని కనుక నేను ఆర్థిక అంశాల గురించే ఎక్కువగా ఆలోచిస్తాను. కుల రాజకీయాలూ వగైరా నాకు అనవసరం.

      Delete
  3. కొంత మంది నిజంగానే కె.సి.ఆర్.ని కులం పేరుతో సమర్థిస్తూ ఫేస్‌బుక్‌లో వ్రాస్తున్నారు. అందుకే ఈ నిజాలన్నీ మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళు కె.సి.ఆర్.ని కులం పేరుతో సమర్థిస్తే నేను చరిత్రని తవ్వి కె.సి.ఆర్. కూడా కమ్మవాడేనని నిరూపించగలను. కోస్తా ఆంధ్రలో వెలమ కులంలో నాలుగు శాఖలు ఉన్నాయి. అవి ఆది వెలమ, పద్మనాయక వెలమ, కొప్పుల వెలమ & పోలినాటి వెలమ. కోస్తా ఆంధ్రలోని పద్మనాయకులకి దొడ్డపనేని, సూరనేని లాంటి ఇంటి పేర్లు ఉంటాయి. అవి దొడ్డప్పనాయుడు, సూరనాయుడు లాంటి పూర్వికుల పేర్ల నుంచి వచ్చినవి. తెలంగాణలోని పద్మనాయకులకి చెన్నమనేని, మేచినేని లాంటి ఇంటి పేర్లు ఉంటాయి. కాకతీయుల దగ్గర చెన్నమనాయుడు అనే పేరు ఉన్న కొందరు సైనుకులు ఉండి ఉండొచ్చు, వాళ్ళ సంతానమే చెన్నమనేనివాళ్ళు అయ్యి ఉండొచ్చు. "నాయుడు" అనే బిరుదుని ఒకప్పుడు వెలమవాళ్ళు కూడా ఉపయోగించేవాళ్ళు. కాకతీయులు రాకముందు కమ్మవాళ్ళూ, వెలమవాళ్ళూ ఒకటే అయ్యుండొచ్చేమో? తరువాతి కాలంలోనే ఇవి వేరువేరు కులాలుగా రూపాంతరం చెందాయేమో! ఈ hypothesis నిజమైతే కె.సి.ఆర్. కూడా కమ్మవాడు అనుకోవాలి. అప్పుడు వెలమ కులం పేరు చెప్పి కె.సి.ఆర్.ని సమర్థించక్కరలేదు.

    ReplyDelete
    Replies
    1. కులాన్ని వాటి సంకరాల్ని అంత లోతుగా తవ్వి తెల్చితే తప్ప దోపిడీ అనేది ఎక్కడైనా ఒకటే అనీ, దీనికి కుల-మత-ప్రాంత బేధాలు ఉండవని చెప్పలేమా? ప్రవీణ్ గారు.

      Delete
    2. నాకు తెలిసి చరిత్రలో సంకరం కాని కులం అనేది లేదు. దోపిడీని గుడ్డిగా నమ్మడానికి కుల అభిమానం ఉండాల్సిన అవసరం లేదని తెలియాలంటే ఈ చరిత్ర తెలియడం అవసరమే.

      Delete
  4. రేపు కె.సి.ఆర్. లగడపాటి పెప్పర్ గోపాల్‌కి చెందిన లాంకో హిల్స్‌ని పొగిడినా, తెలంగాణావాదులు ఇంకా ఆయన్ని నమ్ముతారా?

    ReplyDelete
    Replies
    1. నమ్ముతారు,అందులో అనుమానమే లేదు!
      పొగిడేవాళ్ళు పొగుడుతున్నారు,పొగిడించుకునేవాళ్ళు ఆనందిస్తున్నారు?
      మధ్యన మీకెందుకండీ కందకి లేని దురద?!

      Delete
    2. పూర్వం రాజు ఎంత చేతకానివాడైనా వందిమాగధులు అతన్ని పొగుడూ పాడేవాళ్ళు "రాజాధి రాజ, మహా వీర, పరమ శూర, వీర విక్రమ, మహా పరాక్రమశాలీ......" అంటూ. కె.సి.ఆర్. తన కార్యాలయంలో వందిమాగధులని పెట్టుకుంటే కొంతమంది తెలంగాణావాదులు తమ ఉద్యోగాలు వదిలేసి మరీ అక్కడ చేరుతారు.

      Delete
  5. నాయకుణ్ణి గుడ్డిగా నమ్మెటోళ్ళు గొఱ్ఱెలైతరు కానీ ప్రజలు ఎట్లైతరు? చంద్రబాబు నాయుడి వందిమాగధులకీ, కె.సి.ఆర్. వందిమాగధులకీ మధ్య తేడా ఏమిటి?

    ReplyDelete
    Replies
    1. గొర్రెలు జీవాలు,వాటికి కసవు కావాలి - అది యెవరు ఇస్తే వారే యజమాన్లు!
      ఈ నవీన వంది మాగధులకి తమకు మానసికోల్లాసమెవరిస్తె వారె నవాబులు?

      Delete
  6. మా బి.ఎ. పుస్తకాలలోని తెలుగు పాఠాల్లో చదివిన కథల్లోని వందిమాగధులని గుర్తు తెచ్చుకుంటేనే నవ్వు వస్తుంది. నిజజీవితంలో వందిమాగధుల్ని చూస్తే ఆ నవ్వుకి కడుపునొప్పి రాదా?

    ReplyDelete
  7. కెసీఆర్ రామోజీని కలవడం అన్నది ఒక రాజకీయ క్రీడ. దాని ఫలితాలు మంచా చెడా అన్నది ముందు ముందు తెలుస్తాయి. నాకైతే తెలంగాణా వాదానిని వెన్నుపోటు పొడిచిన రామోజీని కెసీఆర్ ఫిలంసిటీకి వెళ్ళి మరీ కలవడం అస్సలు నచ్చలేదు. అలాగే తుమ్మల, తలసాని మొదలైన వారికి పదవులు కట్టబెట్టడం కూడా.

    కాని రాజకీయాల్లో అన్నీ అందరికీ నచ్చినట్టు జరగవు. అందులో కొన్ని KCRకే నచ్చక పోవచ్చు కూడా. రాజకీయమనే మహా చదరంగంలో కెసీఆర్ కూదా ఒక పావు మాత్రమే. కాబట్టి వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో భాగం కాక తప్పదు. తప్పించుకోవాలంటే ప్రత్యక్ష రాజకీయాలే వదిలేయాలి... కోదండరాం లాగ.

    కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను దెబ్బతీయడమో, లేదా తనవైపుకు తిప్పుకోవడమో చేస్తున్నట్టు కనిపిస్తోంది. రామోజీని YSR అంతటివాడే తిప్పుకోలేక పోయాడు. మరి కేసీఆర్ తిప్పుకోగలడా (లేదా తొక్కివేయ గలడా) అన్నది భవిష్యత్తులో మాత్రమే తెలుస్తుంది.

    ఏది ఏమైనా మొత్తం ఎపిసోడ్‌లో ప్రవీణ్ చెప్తున్న కులం పాత్ర పెద్దగా లేదని మాత్రం చెప్పగలను.

    ReplyDelete
    Replies
    1. బడాబాబులు సంపదలు తాము పంచుకుంటూ వ్యూహాలూ ప్రతివ్యూహాలూ ప్రజల మీద వేస్తారు!
      చోటాబాబులు వ్యూహాలూ ప్రతివ్యూహాల్ని చూసి మురిసిపోతారు,సంపద మాత్రము వీరికి రాదు?

      Delete
  8. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు రామోజీరావుపై చర్య తీసుకోవడానికి ఇంత సమయం పట్టదు. అటవీ శాఖ రికార్ద్‌లు తిరగేసినా ఎంత భూమిని రామోజీ ఫిల్మ్ సితీ మింగేసిందో తెలుస్తుంది.

    ReplyDelete
    Replies
    1. అసలు చర్య తీసుకునే వుద్దేశమే లేనప్పుదు దార్లు యెలా కనిపిస్తాయి?
      దారి కనిపించాలంటే కారు చీకట్లో కూడా దీపాలు వెలిగించుకోవచ్చు గదా!

      Delete
  9. ఇక్కడ చర్చించబడుతున్న ఒకఱు - "నేను కూడా ఏమీ చెయ్యలేను" అంటూ సాక్షాత్తూ పి.వి.గారే ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన చేత నిస్సహాయంగా చేతులెత్తేయబడ్డ వ్యక్తి. ఇక కొత్తవాళ్ళొచ్చి ఏం చేయగలరనేది ఆలోచనీయాంశం.

    ReplyDelete
    Replies
    1. పీవీ, YSRలు కూడా ఏం చేయ లేక పోయినా అ వ్యక్తిని ఒక బక్క వ్యక్తి ఢీకొనాలి. ఆ వ్యక్తినే కాదు పోలవరం విషయంలో మోడీని కూడా ఢీకొనాలి. ఢీకొనే వ్యవహారంలో ఢీలా పడి ప్రభుత్వాన్నే ఉన్న కొద్ది తెలంగాణా ప్రభుత్వాన్ని కూడా పోగొట్టుకోవాలి. ఇదీ కొంతమంది (కుహానా?) తెలంగాణా వాదుల, మరికొంతమంది వ్యతిరేకుల మనోగతం.

      Delete
  10. మా ఉత్తరాంధ్ర యాసలో చెపుతున్నాను. రామోజీరావు కె.సి.ఆర్.కి ఫోన్ చేసి "మనిద్దరికీ తగువులేల? మీరు నా ఫిలిం సిటీ ఊసెత్తకపోతే నేను నా పేపర్‌లో మీ పార్టీకి వ్యతిరేకంగా రాయను, మనిద్దరం ఎవలు పనులు వాళ్ళు చూసుకుంటే మనిద్దరికీ మంచిది" అని చెప్పుంటాడు. కె.సి.ఆర్. అందుకు ఒప్పుకుని రామోజీ ఫిలిం సిటీని పొగిడుంటాడు.

    ReplyDelete
  11. ఆంధ్రాలో సమైక్యవాదం అంత బలంగా లేదు. ఇక్కడ జై సమైక్యాంధ్ర పార్తీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ వోత్‌లు పడినాయి. కేవలం హైదరబాద్ కోసం జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం గెలిచే అవకాశం లేదు కనుక తెలంగాణావాదం గెలిచింది. తెలంగాణా రావడం తప్పనిసరి పరిణామమే కానీ అది కె.సి.ఆర్. పెట్టిన భిక్ష మాత్రం కాదు.

    ReplyDelete
    Replies
    1. నాకు తెలిసి ఈ చర్చలో "కె.సి.ఆర్. పెట్టిన భిక్ష" అన్న వ్యాఖ్య ఎవరూ చేయలేదు. మరి మీకు ఈ వ్యాఖ్య రాయాలని ఎందుకు అనిపించిందో అర్థం కాదు! ఇదే కాదు, మీ అంత మీరే ఏదో ఊహించేసుకుని రాసేస్తే ఎలాగ?

      ఎలాగూ చర్చకు తెచ్చారు గాబట్టి వివరణ ఇస్తాను. 1972లో తెలంగాణా కూడా తెలంగాణా వాదం ఎక్కువగానే వుంది. అప్పుడు ప్రజలు 12 మంది TPS ఎంపీలను గెలిపించారు. కనీసం ఇప్పుడు కూడా అంతమంది TRS ఎంపీలను గెలిపించలేదు. మరి అప్పుడు తెలంగాణా ఎందుకు రాలేదు?

      వాదం వుంటే తప్పనిసరి పరిణామంగా వ్యవస్త వచ్చేటట్టయితే మావోయిస్టులు తుపాకులు పట్టుకుని అడవుల్లో ఎందుకు తిరుగుతున్నారు? "తప్పనిసరి పరిణామం" కోసం వేచి చూడవచ్చుగా? అన్నీ తప్పనిసరి పరిణామంగా వచ్చేటట్టయితే రష్యా, చైనా విప్లవాలలో లెనిన్, మావోల పాత్ర ఏమీ లేదని మీరు చెప్తున్నారా?

      తెలంగాణా ఏర్పడడంలో ఎంతోమంది పాత్ర వుంది. అందులో KCR పోషించిన పాత్ర తక్కువ ఏమీ కాదు. ఆ వ్యక్తి మనకు నచ్చనంత మాత్రాన అతని పాత్రను తక్కువ చేసి చూపాల్సిన అవసరం లేదు.

      Delete
  12. తెలంగాణా ఏర్పాటు తప్పనిసరి పరిణామమే. సమైక్యవాదులు తమకి హైదరాబాద్ తప్ప ఏమీ అవసరం లేదని ఏడ్చారు. ఆ ఏడుపు చూసి సోనియా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతుందని సమైక్యవాదులు ఎలా అనుకున్నారు? 2009 - 2014ల మధ్య భాజపా కేంద్రంలో అధికారంలో ఉండి ఉంటే, తెలుగు దేశం పార్తీని బాధ పెట్టడం ఇష్టం లేక 'తెలంగాణా అవసరం లేదు' అని చెప్పి భాజపా తప్పించుకునేది. ఆంధ్రాలో తెలుగు దేశానికి వందిమాగధ పత్రికలు ఉన్నట్టే దేశంలో భాజపాకి అలాంటి పత్రికలు ఉన్నాయి కనుక వాళ్ళ వల్ల 2019 వరకు తెలంగాణా రాకుండా పోయేది. భాజపా 2014కి ముందు అధికారంలో లేకపోవడం వల్లే తెలంగాణా ఏర్పాటు సులభమైంది.

    ReplyDelete
    Replies
    1. {ఆ ప్రాంతమోడు గడ్డి తినగా లేనిది మన ప్రాంతమోడు గడ్డి తింటే విచిత్రమా" అంటూ ఆయన స్పష్టంగానే ప్రశ్నించాడు కదా. }
      my request:నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసిన ఈ గొప్పవాక్యం యెవరు పృచ్చించారొ కాస్త్స్ చెబుదురూ?!

      Delete
    2. ఇది మాత్రము తిరుగులేని సత్యము!
      చరిత్ర చదివిన వారి మాట నిజము?

      Delete
  13. విషయం మాట్లాడడానికి వ్యక్తుల పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. దేశానికి స్వాతంత్ర్యం వద్దు అన్న బొబ్బిలి రాజులని కాంగ్రెస్‌లో చేర్చుకోగాలేనిది తెలంగాణా వద్దు అన్న తలసాని శ్రీనివాస యాదవ్‌కి మంత్రి పదవి ఇస్తే తప్పా అని అడిగింది కూడా ఆయనే. కమ్యూనిస్త్‌లని ఓడించాలనె ఏకైక లక్ష్యంతో జస్తిస్ పార్తీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఇప్పుడు కమ్యూనిస్త్ ఉద్యమం అంత బలంగా లేదు కాబట్టి కేవలం పదవుల కోసం పాలక పార్తీల మధ్య పొత్తులు ఉంటున్నాయి.

    ReplyDelete
  14. https://www.dropbox.com/s/ab4igloituu62we/Screenshot_2014-12-18-16-59-04.png?dl=0

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top