శనివారం నాడు రాఖీ పండుగను నేను 'ఇంటింటా గ్రంధాలయం' కార్యక్రమానికి ప్రచారంగా ఉపయోగించాను. ప్రతి సంవత్సరం రాఖీ పండుగకు మా అక్కలు రాఖీ కడితే మన సాంప్రదాయం ప్రకారం చీరెలో ఇతర బహుమతులో ఇస్తుంటాము. అయితే ఈ సంవత్సరం మాత్రం 'పల్లె ప్రపంచం ఫౌండేషన్' తరపున 'ఇంటింటా గ్రంధాలయం' పథకంలో భాగంగా పుస్తకాలను బహుమతులుగా ఇచ్చాను. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఇది.
మా అక్కలు శేషుకుమారి,లీల,విజయలక్ష్మి లతో నేను. |
ఈ కార్యక్రామానికి స్పూర్తి మాత్రం వనజ గారి కుమారుడి వివాహం కార్యక్రమంలో బుక్స్ పంపిణీ చేయడం. వనజ గారికి ధన్యవాదములు. 'బహుమానానికి పుస్తకం కొలమానం' అనే పోష్టును మీరు వీలయితే చదవండి. మీరు వీలయైనంతవరకు బహుమతులు ఇవ్వాల్సిన చోట పుస్తకాలు ఇస్తే పుస్తకం విలువను కాపాడడంతో పాటు ఒక మంచి అలవాటును పరిచయం చేయడం - వ్యాప్తి చేయడం చేసినవారవుతారు. చేస్తారు కదూ..............!
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.