పల్లె ప్రపంచంలో 'ఇంటింటా గ్రంధాలయం' ప్రారంభం
గ్రామీణ ప్రాంత ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి పల్లెప్రపంచం సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని బోనకల్ జెడ్.పి.టి.సి బాణోతు కొండా అన్నారు. ఆదివారం పల్లెప్రపంచం ఫౌండేషన్ తరపున ఇంటింటా గ్రంధాలయం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు పల్లా కొండల రావు అధ్యక్షతన జరిగిన సభలో కొండా మాట్లాడుతూ ఇంటింటా గ్రంధాలయం పథకాన్ని మండల ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్ధులు-యువకులు వినియోగించుకోవడం ద్వారా చైతన్యం పొందవచ్చన్నారు. సంస్థ అధ్యక్షులు పల్లా కొండల రావు మాట్లాడుతూ ఒక ఏడాదిపాటు సంస్థలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరు కుటుంబానికి రు.10వేల రూపాయలవరకు పుస్థకాలను కొనుగోలు చేయవచ్చన్నారు. వీరందరికీ BPP ద్వారా 100% నగదు తిరిగి లభించేలా పథకం రూపొందించామన్నారు. ఆధ్యాత్మికత, ఆరోగ్యం, యోగా, ధ్యానం, ఆక్యుపంచర్, చరిత్ర, మార్క్సిజం వంటి అన్ని అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి ఇంటిలో చిన్న పిల్లల చేతిలో సెల్‌ఫోన్‌కు బదులుగా పుస్తకాలు ఉండేలా చేయడమే ఈ పథకం లక్ష్యమన్నారు. ఇంటర్నెట్ వచ్చినా పుస్తకం విలువ పుస్తకానికి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రంగనాయకమ్మ రచించిన ఇంగ్లీషు కీకారణ్యంలోకి ప్రవేశించండి పుస్తకాన్ని కుమారి రచ్చా సింధుజ ప్రారంభించారు. సంస్థ తరపున ఆన్లైన్లో వెబ్ పోర్టల్ 'ప్రజ' ను మాజీ ఎం.పి.పి కొమ్ము శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సభలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యదర్శి బి.అంజయ్య, సభ్యులు రచ్చ మధుసూదన్ రావు, చలమల అజయ్ కుమార్, లగడపాటి రామారావు, రామన అప్పారావు, బలగాని నాగరాజు,మండెపుడి శ్రీనివాస రావు, వనవాస రాఫు తదితరులు పాల్గొన్నారు.
|
ప్రసంగిస్తున్న బోనకల్ జెడ్.పి.టి.సి సభ్యుడు బాణోతు కొండా |
|
ప్రజ పోర్టల్ ని ప్రారంభిస్తున్న బోనకల్ మాజీ ఎం.పి.పి కొమ్ము శ్రీనివాస రావు. |
|
ఇంటింటా గ్రంధాలయం పథకంలో ఇంగ్లీషు కీకారణ్యం లోకి ప్రవేశించండి బుక్ ని ప్రవేశపెడుతున్న చి. సింధు |
|
ప్రసంగిస్తున్న పల్లా కొండల రావు. |
|
ప్రసంగిస్తున్న బోయనపల్లి అంజయ్య |
|
ప్రసంగిస్తున్న బలగాని బాలరాజు |
|
ప్రసంగిస్తున్న చలమల అజెయ్ కుమార్ |
|
ప్రసంగిస్తున్న మండెపుడి శ్రీనివాస రావు |
|
ప్రసంగిస్తున్న రామన అప్పారావు |
|
ప్రసంగిస్తున్న రచ్చా మధుసూదన్ రావు. |
|
ప్రసంగిస్తున్న వనవాస రావు. |
న్యూస్ క్లిప్పింగ్స్
సూర్య పత్రిక
- పల్లా కొండల రావు
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.