సమాచార హక్కును గూర్చి ప్రజలకు తెలియజేయాలి
- వజ్రాల పరబ్రహ్మం
ప్రసంగిస్తున్న పరబ్రహ్మం |
ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని తెలిసికొనుట. అధికార యంత్రాంగంలోని పని విధానాన్ని తెలిసికొనుట, అవినీతిని నిర్మూలించుట, qధికారులతో జవాబుదారీ తనాన్ని పెంపొందించుట బొదలగు వానిని సాధించుటకై ఏర్పడినదే సమాచార హక్కు చట్టమని వజ్రాల పరబ్రహ్మం పేర్కొన్నారు. ఆదివారం బోనకల్ లోని పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన స్టడీ సర్కిల్ లో సమాచార హక్కు చట్టం - అవగాహన అనే అంశంపై ఆయన మాట్లాడారు. స్టడీ సర్కిల్ కన్వీనర్ చలమల అజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. గత 2 ఆదివారాలుగా సమాచార హక్కును గూర్చి అవగాహన కలిగించటం జరిగింది. సమాచారం పొందే హక్కు ప్రతి పౌరునకు ఉందనీ, దరఖాస్తుదారుడు ప్రభుత్వం నుండి 30 రోజులులోగా ఏ కార్యాలయం నుండైనా కోరిన సమాచారం పొందుటకు హక్కు కలిగి ఉన్నాడని, సంబంధిత అధికారి 30 రోజులలోగా సమాచారం ఇవ్వకపోతే అతనిపై కమీషన్ కు ఫిర్యాదు లేదా పై అధికారికి అప్పీలు చేసుకునే అవకాశం ఉందని, తెలిపారు. ప్రతి గ్రామంలోని ప్రజలకు సమాచార హక్కును గూర్చి విద్యావంతులకు, నిరక్షరాస్యులకు తగిన అవగాయన కలిగించుతకు మనం ఎంతో కృషి చేయాలని కోరారు. పల్లె ప్రపంచం స్టడీ సర్కిల్ లో తదుపరి వారం నుండి ప్రకృతి జీవన విధానం - షుగర్ వ్యాధి నివారణ మార్గాలు అనే అంశంపైనా, రిజర్వేషన్ల పైనా చర్చలు కొనసాగుతాయని పల్లా కొండల రావు తెలిపారు. ఆదివారం ఉదయం బిజినెస్ ప్లాన్ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఆదాయం పొందిన ఏజెంట్లకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు, కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు చలమల అజయ్ కుమార్ , బలగాని నాగరాజు, రామన అప్పారావు, పల్లా అరవింద్ , షేక్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
హాజరైన సభ్యులు |
మాట్లాడుతున్న సభ్యులు, ఏజెంట్లు |
వార్తల క్లిప్పింగులు
మన తెలంగాణ
ఆంధ్రజ్యోతి
నమస్తే తెలంగాణ
సూర్య
నవ తెలంగాణ
ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.