షుగరు రహిత సమాజాన్నినిర్మించేందుకు పల్లె ప్రపంచం కృషి
షుగరు రహిత సమాజాన్ని నిర్మించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. ఆదివారం సంస్థ కార్యాలయంలో జరిగిన 'ప్రక్రుతి జీవన విధానం - షుగరు వ్యాధి నిదానం' అనే అంశంపై ఆయన మాట్లాడారు. షుగరు వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని అల్లోపతి మందులు వాడుతూనే ప్రక్రుతి జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా షుగరును పూర్తింగా తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు. గ్రామ గ్రామానా షుగరు వ్యాధిపై అవగాహనా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొద్దిపాటి ఆహారపు అలవాట్లు చేసుకోవడం, శారీరక వ్యాయామం పెంచడం ద్వారా షుగరును పూర్తిగా అరికట్టవచ్చన్నారు. పాలిషుడ్ పదార్ధాలను వాడడం నిషేధించాలన్నారు. ఫౌండేషన్ అధ్యయన కేంద్రం కన్వీనర్ చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రిజర్వేషన్లపై బలగాని నాగరాజు మాట్లాడుతూ రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. ఇన్నేళ్ల భారత స్వాతంత్ర్యంలో రిజ్ర్వేషన్లు కొనసాగుతున్నా ఆ వర్గాల పరిస్తితి మారలేదన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు వజ్రాల పరబ్రహ్మం, సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, బలగాని నాగరాజు, పల్లా అరవింద్, మరీదు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ద్వారా ఆదాయం పొందిన ఏజెంట్లకు 53వేల రూపాయల చెక్కులను అందజేశారు.
-----------------------------------------------------------------------
news clippings
andhrajyothy daily
namaste telanganana
sakshi daily
navatelangana daily
manatelangana daily
visalandhra daily
surya daily
ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.