ఇంటింటా గ్రంధాలయం కోసం పల్లె ప్రపంచం సభ్యులు కృషి చేయాలని పల్లె ప్రపంచం అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. ఆదివారం బోనకల్ లో సంస్థ కార్యాలయంలో జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ నేటి ప్రపంచీకరణ నేపధ్యంలో సమాజంలో పుస్తకాల అధ్యయనం తగ్గడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. పౌరులకు మంచి అలవాట్లు నేర్పడం ద్వారా మంచి సమాజాన్ని, మంచి ఆలోచనలను పెంపొందించవచ్చన్నారు. ప్రతి ఇంటిలో మంచి పుస్తకాలను ఉంచాలనే లక్ష్యంతో పల్లె ప్రపంచం సంస్థ ద్వారా ఇంటింటా గ్రంధాలయం పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా పుస్తకాలు కొన్న సభ్యులకు 100% కొనుగోలు మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా మార్కెటింగ్ ప్లాన్ లో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశ్రాంత అధ్యాపకులు వజ్రాల పరబ్రహ్మం, సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు బలగాని నాగరాజు, రామన అప్పారావు, మరీదు కిషోర్, సురభి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ క్లిప్పింగ్స్
ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.