కులభోజనాలు మానేద్దాం - వన భోజనాలను ప్రేమిద్దాం
కుల భోజనాలను మానేసి వన భోజనాలను ప్రేమిద్దామని పల్లె ప్రపంచం అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. ఆదివారం బోనకల్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భారతీయ సంస్కృతిలో 'వన సమారాధన' అనేది మంచి సాంప్రదాయమని, దీనిని కుల ఆధిపత్య ప్రదర్శనగా, కుల భోజనాల కార్యక్రమంగా మార్చడం సరయినది కాదని అన్నారు. పల్లె ప్రపంచం ఆధ్వర్యంలో కులంతో సంబంధం లేకుండా వన భోజన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రపంచంలో పని చేస్తున్న సభ్యులతో పాటు కులంతో సంభంధం లేకుండా జన భోజనాలుగా వన భోజనం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య , విశ్రాంత అధ్యాపకులు వజ్రాల పరబ్రహ్మం, సభ్యులు బలగాని నాగరాజు, మరీదు కిషోర్, సురభి వెంకటేశ్వర రావు, రామన అప్పారావు, బందం శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వార్తల క్లిప్పింగులు
ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.