ప్రజాస్వామ్య పరిరక్షణలో గణనీయ పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియా
- సి.పి.ఎం స్టడీ సర్కిల్ కన్వీనర్ బోయనపల్లి కొండా
|
పల్లె ప్రపంచం సెమినార్ లో సోషల్ మీడియాపై మాట్లాడుతున్న బోయనపల్లి కొండా |
ప్రజాస్వామ్య పరిరక్షణలో సోషల్ మీడియా గణనీయ పాత్ర పోషిస్తున్నదని బోనకల్ మండల సి.పి.ఎం స్టడీ సర్కిల్ కన్వీనర్ బోయనపల్లి కొండా తెలిపారు. ఆదివారం బోనకల్ లోని పల్లెప్రపంచం ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి తన భావాలను,ఆవేదనను,నిరసనను స్వేచ్చగా వ్యక్తం చేసే అవకాశం సోషల్ మీడియా కల్పిస్తున్నదన్నారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో లేని అవకాశం, స్వేచ్చ సోషల్ మీడియాలో ఉంటున్నదన్నారు. సోషల్ మీడియా వల్ల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో బాద్యతయుతం పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా సామాజిక చైతన్యం పెంపొందించే పోస్టులను, ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా చేయడం ద్వారా ప్రజలలో చైతన్యం పెంచాలన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వినియోగదారులు బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. ముంబై బాల్ ధాకరే ఘటనలోనూ, ఢిల్లీ నిర్భయ ఘటనలోనూ సోషల్ మీడియా ద్వారా ప్రజలలో ఐక్యతను చైతన్యాన్ని కలిగించిన విషయాన్ని కొండా గుర్తు చేశారు. పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు రామన అప్పారావు, సురభి వెంకటేశ్వరరావు, మరీదు రోషయ్య, బంధం శివ ప్రసాద్, చలమల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News Clippings
|
28-12-2015 andhraprabha |
|
28-12-2015 andhrajyothy |
|
28-12-2015 namaste telangnana |
|
28-12-2015 manatelangana |
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం
ఇక్కడ నొక్కండి
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.