మృతుని కుటుంబ సభ్యులకు పల్లెప్రపంచం ఫౌండేషన్ నగదు వితరణ
బోనకల్ మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో శనివారం గుండెపోటుతో కార్పెంటర్ పనిచేస్తున్న చీమకుర్తి లక్ష్మణాచారి(30) మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ నేపథ్యమైనందున మృతుని కుటుంబ సభ్యులకు పల్లెప్రపంచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దహన సంస్కారాల నిమిత్తం 5000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా పల్లె ప్రపంచం అధ్యక్షులు పల్లా కొండల రావు మాట్లాడుతూ పేద కుటుంబం కావడంతో తాము నిర్వ్హిస్తున్న స్వచ్చంధ సంస్థ సభ్యులు చలించి తమవంతుగా ఈ ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. 30 ఏండ్ల చిన్న వయసులోనే లక్ష్మణాచారి మృతి చెండం బాధాకరమన్నారు. లక్ష్మణాచారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఇద్దరు పసి పిల్లలు ఉన్నందున, వారి కుటుంబ పరిస్తితిని గమనించి ప్రభుత్వం నుండి ఈ కుటుంబానికి తగిన సహాయం అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు, కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు మరీదు రోషయ్య, సురభి వెంకటేస్వర రావు, మరీదు కిషోర్, బలగాని నాగరాజు, రామన అప్పారావు, చలమల అజయ్ కుమార్ పాల్గొన్నారు.
News Clippings
|
27-12-2015 navatelangana |
|
27-12-2015 andhrabhumi |
|
27-12-2015 andhrajyothy |
|
27-12-2015 eenadu |
|
27-12-2015 manatelangana |
|
27-12-2015 namaste telangana |
|
27-12-2015 visalandhra |
|
27-12-2015 andhraprabha |
Nice Article
ReplyDeleteNava Telangana