సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని పల్లెప్రపంచం టీం లీడర్ కాంసాని చలపతి రావు తెలిపారు. ఆదివారం బోనకల్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సెమినార్ లో ఆయన మాట్లాడుతూ భూసారాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. రసాయినక ఎరువులను విపరీతంగా వాడడం వల్ల పర్యవరణం దెబ్బతినడమే కాక తినే ఆహారం కలుషితం అవుతుందన్నారు. శాఖాహారం హాహాకారంగా మారకుండా ఉండాలంటే రైతులు సాంప్రదాయ పద్దతులలో సేంద్రియ వ్యవసాయాన్ని సాగుచేయాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై అపోహలు తొలగించుకోవాలని, ప్రభుత్వం , స్వచ్చంధ సంస్థలు, రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు అందరూ సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని, ప్రచారం కల్పించాలని కోరారు. ప్రక్రుతిని కాపాడుకోవడం ద్వారా మాత్రమే మానవాళి మనుగడ కొనసాగుతుందన్నారు. లాభాల వేటలో ప్రక్రుతిని ధ్వంసం చేస్తే తీవ్ర వినాశనం తప్పదన్నారు. పల్లె ప్రపంచం అధ్యయన కేంద్రం కన్వీనర్ చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సంస్థ అధ్యక్షులు పల్లా కొండల రావు, కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, విశ్రాంత అధ్యాపకులు వజ్రాల పరబ్రహ్మం, సభ్యులు బొప్పాల అజయ్ కుమార్, బంధం శివ ప్రసాద్, బలగాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
news clippings
namaste telangana 21-12-2015 |
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.