రిజర్వేషన్లను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి - తన్నీరు రవి డిమాండ్
రిజర్వేషన్లను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని తెలుగుదేశం బోనకల్ మండలాధ్యక్షుడు తన్నీరు రవి డిమాండ్ చేశారు. ఆదివారం బోనకల్ లోని పల్లె ప్రపంచం కార్యాలయంలో జరిగిన 'రిజర్వేషన్లు వివిధ పార్టీల వైఖరి' అనే అంశంపై జరిగిన సెమినార్ లో ఆయన మాట్లాడుతూ ఆనాటి పరిస్తితులలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్లను పూర్తిగా సమీక్షించాలని రవి కోరారు. ఓటు బేంకు రాజకీయాలకోసం అన్ని పార్టీలు ఈ అంశంపై నాటకాలాడుతున్నాయన్నారు. రిజర్వేషన్ల ఫలాలు పక్క దోవ పడుతున్నాయని, మరో వైపు అగ్ర వర్ణాలలోని పేదల పరిస్తితి దారుణంగా తయారయిందన్నారు. మేధస్సును త్రుంచివేయడం సమాజ ప్రగతికి ఆటంకమన్నారు. కులం ఆధారంగా లేని పరిస్తితులు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్ధిక ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. బలగాని నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు మాట్లాడుతూ మాతృభాషలొ విద్యాబోధన మంచి ఫలితాలనిస్తుందని, వ్యక్తి వికాసానికి దోహదపడుతుందని అన్నారు. మమ్మీ డాడీ సంస్కృతికి లోనుకావద్దని కోరారు. ప్రపంచీకరణలో భాగంగా ఇతర దేశాలలో మంచిని గ్రహించాలి తప్ప మనదైన మంచి సంస్కృతీ సాంప్రదాయాలను చులకన చేయడం, పరాయితనంపై అనవసర మోజు పెంచుకోవడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు సురభి వెంకటేశ్వర రావు, బంధం శివప్రసాద్, మరీదు రోషయ్య తదితరులు పాల్గొన్నారు .
వార్తల క్లిప్పింగులు
|
ఆంధ్రజ్యోతి మధిర జోన్ 14-12-2015 |
|
namaste telangana madhira zone 14-12-2015 |
|
surya 14-12-2015 |
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం
ఇక్కడ నొక్కండి
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.