ఆశాల పాదయాత్రకు పల్లె ప్రపంచం ఫౌండేషన్ వితరణ
ఆశా కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం గత 98 రోజులుగా బోనకల్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట సమ్మె శిభిరాన్ని నిర్వహిస్తున్నారు. తమ ఆందోళనలో భాగంగా ఈ నె 10వ తేదిన భద్రాచం నుండి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర విషయంపై సిఐటియు మండల కార్యదర్శి వ్లంకొండ సురేష్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ మధిర డివిజన్ కార్యదర్శి రామన సరోజిని పల్లె ప్రపంచం ఫౌండేషన్ వారికి వివరించారు. మండలం నుండి నలుగురు ఈ పాదయాత్రలో పాల్గంటున్నామని, వారికి పాదయాత్ర బూట్లు, తదితర వస్తువుకు వితరణ అందజేయాలని కోరారు. దీనికి స్పందించి స్థానిక మండ పరిషత్ కార్యాయం వద్ద సమ్మె శిభిరంకు వెళ్ళీ 2వేల రూపాయల చెక్ ను వారికి అందజేశారు. ఈ సందర్భంగా కొండల రావు మాట్లాడుతూ పల్లె ప్రపంచం ఫౌండేషన్ మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఆశాలు గత 98 రోజుగా నిరవధిక సమ్మె చేస్తున్నారని, వారికి తమ పల్లె ప్రపంచం ఫౌండేషన్ తరపున ఎంతో కొంత ఆర్థిక సహకారం అందించాలని భావించామని, అందులో భాగంగానే ఈ 2వే రూపాయలను అందజేస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ మహిళకు పూర్తి స్థాయిలో అండదండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు రామన అప్పారావు, మరీదు కిషోర్, సురభి వెంకటేశ్వర్లు, బలగాని నాగరాజు, సిపియం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిపియం డివిజన్ కమిటీ సభ్యులు మాదినేని రామ చందర్ రావు పాల్గొన్నారు.
భద్రాచం పాదయాత్రకు నలుగురు:
బోనకల్ మండం నుండి ఆశా పాదయాత్రకు ఇరుగు యశోద, రామన సరోజిని, కొంగల వెంకటరమణ, కనకపుడి అలివేలు పాల్గొంటున్నారని ఆ సంఘం డివిజన్ కార్యదర్శి రామన సరోజిని తెలిపారు.
News Clippings
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.