ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని సి.పి.ఐ బోనకల్ మండల కార్యదర్శి గరిడేపల్లి రవి డిమాండ్ చేశారు. ఆదివారం బోనకల్ లో జరిగిన రిజర్వేషన్లు-వివిధ పార్టీల వైఖరి అనే అంశంపై జరిగిన సెమినార్ లో రవి మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వాల నుండి అనేక రాయితీలు పొందుతున్నందున ప్రైవేటు రంగంలో కూడా సమాజంలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది సి.పి.ఐ వైఖరి అన్నారు. సమాజంలో కులం పేరుతో వివక్ష ఉన్నంతవరకూ ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు కొనసాగించడమే కాక ప్రైవేటు రంగంలో అన్ని చోట్లా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పల్లె ప్రపంచం అధ్యయన కేంద్రం కన్వీనర్ చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ లో పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపైనా ఉందని పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, విశ్రాంత అధ్యాపకులు వజ్రాల పరబ్రహ్మం, సభ్యులు బలగాని నాగరాజు, రామన అప్పారావు, బొప్పాల అజయ్ కుమార్, బొబ్బిళ్ల తిరుపతి రావు, సురభి వెంకటేశ్వర రావు, మరీదు కిషోర్ , బంధం శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వార్తల క్లిప్పింగులు
ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.