దేశ భవిష్యత్తు పార్లమెంటులో కాక పాఠశాల్లో ఉంటుందని పల్లెప్రపంచం అధ్యక్షుడు పల్లా కొండరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని చిరునోముల ఉన్నత పాఠశాలో పల్లెప్రపంచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.భాగ్యక్ష్మి అధ్యక్షతన జరిగిన జరిగిన సభలో పల్లా కొండరావు మాట్లాడుతూ తల్లి దండ్రులలో శాస్త్రీయ థృక్పథం లోపించడం వల్ల పిల్లలకు సరైన ఆహారం అందించకపోవడంతో చిన్న వయసులోనే కంటిచూపు లోపం ఏర్పడుతుందన్నారు. చిన్నతనం నుండే పిల్లలకు పౌష్ఠికాహారాన్ని అందించడం వలన భవిష్యత్తులో వారు ఆరోగ్యకరంగా ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. విద్యార్ధుకు చిన్నప్పటినుండే ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలన్నారు. ప్రయివేటీకరణపై మోజుతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను చిన్నచూపు చూడడం సరైంది కాదని, పిల్లలను కేవం చదువులోనే కాకుండా సామాజిక థృక్పథాన్ని అలవరచాలని తెలిపారు. పల్లె ప్రపంచం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, గ్రంధాయా ఏర్పాటు, ప్రకృతి జీవన విధానం, మహిళాభ్యుదయం వంటి విషయాలో ప్రజలో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పోతూరి సీతారామారావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షు పోలేబోయిన శ్రీకాంత్, నాయకుడు తేనే వెంకటేశ్వర్లు తదితయి పాల్గన్నారు.సభానంతరం విద్యార్డులకు బోనకల్ సంహిత ఐ కేర్ సెంటర్ డాక్టర్ యర్రంశెట్టి మంజరి కంటివైద్య పరీక్షలు నిర్వహించారు. దృష్టిలోపం ఉన్న విద్యార్ధినిలకు పల్లె ప్రపంచం ఫౌండేషన్ తరపున కళ్లజోళ్లు ఇవ్వనున్నట్లు పల్లా కొండల రావు తెలిపారు.
వార్తల క్లిప్పింగులు
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.