( image courtesy : google )
యోగా హిందువులు మాత్రమే చేయాలా?
గతంలో యోగాసనాలు శాస్త్రీయమా? అంటూ ఓ పోస్టు చూసి ఆశ్చర్యపడ్డాను. ప్రాణాయామం చాలా మేలు చేస్తుంది. ఇతర ఆసనాలవల్ల కూడా ఉపయోగాలున్నాయి. అయితే వీటి శాస్త్రీయతపై ఓ చోట చర్చ జరగడమూ చూశాను. మంతెన సత్యనారాయనరాజు గారు అయితే తేలికగా ఉండేలా సెలెక్టెడ్ ఆసనాలను వాటివల్ల కలిగే ప్రయోజనాలను ఆరోగ్యపరంగా శాస్త్రీయంగా వివరిస్తారు. ఆయన ప్రసంగాలు , వీడియోలు చూస్తే మనకా విషయం అవగతమవుతుంది.
మన సనాతన ధర్మం, ఋషి సంస్కృతి లేదా సాంప్రదాయాలలో చాలా సైన్స్ దాగి ఉంది. మతాన్ని మితిమీరి విమర్శించడం లేదా అభ్యుదయం పేరుతో ప్రతీదానిని మూఢత్వంగా కొట్టి పారేయడమూ సరయినది కాదు. ఇపుడు యోగాని ఐక్యరాజ్య సమితి వారు గుర్తించారంటున్నారు. ఇటీవలి వరకు ఆక్యుపంచర్ కు కూడా గుర్తింపు లేదు. కొన్ని ముఖ్యమైన జబ్బులకు ఆక్యుపంచర్ ను గ్రీన్ తెరపీగా గుర్తిస్తున్నారు. చైనాలో ఆక్యుపంచర్ కు మoచి ప్రాధాన్యత ఉంది. ఇండియాలో ఆయుర్వేదాన్ని అటకెక్కిస్తున్నారు. చదువుకున్నవారు ఎన్ని సైడెఫెక్టులున్నా ఇంగ్లీషు వైద్యం పై అవసరానికి మించిన మోజుని పెంచుకుంటున్నారు.
ప్రతి వైద్య విధానమూ మంచిదే. వీటన్నికంటే జీవన విధానం ముఖ్యమైనది. జీవనవిధానాన్ని అలవాట్లు శాసిస్తాయి. అందుకే మంచి అలవాట్లను ఆచారాలుగా, సాంప్రదాయాలుగా పెట్టుకోవాలి. ఇప్పటికే ఉన్న సాంప్రదాయాలలో మంచివాటిని సైంటిఫిక్‌గా ప్రూవ్ కాగలిగిన వాటిని కొనసాగించాలి. ఆచరణలో నష్టం కలిగించని వాటిలో సైన్స్ ఇంకా కనిపెట్టలేకపోయినా వాటిలోని అంతరార్ధాన్ని వెలికితీసే పాజిటివ్ ప్రయత్నాలు చేయాలి.
ప్రతి వైద్య విధానమూ మంచిదే. వీటన్నికంటే జీవన విధానం ముఖ్యమైనది. జీవనవిధానాన్ని అలవాట్లు శాసిస్తాయి. అందుకే మంచి అలవాట్లను ఆచారాలుగా, సాంప్రదాయాలుగా పెట్టుకోవాలి. ఇప్పటికే ఉన్న సాంప్రదాయాలలో మంచివాటిని సైంటిఫిక్‌గా ప్రూవ్ కాగలిగిన వాటిని కొనసాగించాలి. ఆచరణలో నష్టం కలిగించని వాటిలో సైన్స్ ఇంకా కనిపెట్టలేకపోయినా వాటిలోని అంతరార్ధాన్ని వెలికితీసే పాజిటివ్ ప్రయత్నాలు చేయాలి.
అలాగే గతంలో ఏదైనా దేవుడి పేరుతో చెపితే వింటారని అనేక మంచి విషయాలను హిదూ మత ఆచారాలలో పొందుపరచారు. వీటిలో పరిశీలన, అనుభవం , సైన్స్ దాగి ఉందనడం అతిశయోక్తి కాదు. అనేక అలవాట్ల వెనుక ఉన్న సైన్స్ ని కేవలం అభ్యుదయం అనే మూఢత్వంతో వెక్కిరింపుగా, హేళనగా చూడడం అశాస్త్రీయమే అవుతుంది.
ఐన్‌స్టీన్ లాంటి గొప్ప సైంటిస్టే నేను చదువుకున్నవారి నుండి కొంత , చదువురాని వారి నుండి మరికొంత జ్ఞానం సంపాదించానని వినయంగా చెప్పాడని నా మిత్రుడొకరు చెప్పేవాడు. ఆచరణ ద్వారా ఫలితాలు రాబట్టిన అలవాట్లను, సాంప్రదాయాలను, సదాచారాలను హేళనగా చూడడం కంటే వాటిలో దాగి ఉన్న సైన్స్ ని వెలికి తీయడమే సమాజానికి అసలైన మేలు చేస్తుంది. మతం-దేవుడు వేరు కార్యాచరణలోని సదాచారాలు, సాంప్రదాయాలు వేరు. ఈ రెండింటినీ ఒకేలా చూడడం హ్రస్వదృష్టే కాగలదు.
ఏ మతం పేరుతో చెప్పినా అందులో కార్యాచరణకు మంచి ఉన్న ప్రతీ మంచిని స్వీకరించాలి. అలాగే హిందూ జీవన విధానంలో సైన్స్ నీ స్వీకరించాలి. అదే సందర్భంలో హిందూ జీవన విధానంలో మంచికీ , హిందూ మతమలోని చెడుకీ పొంతన పెట్టి చూడడమూ మంచిది కాదు. ఏ మతానికైనా ఇది వర్తిస్తుంది.
యోగా పేరుతో మత ప్రయోజనాలు పొందుదామనుకునే సంకుచిత ఆలోచనలవల్ల సమాజానికి నష్టం జరుగుతుంది కనుక ఇలాంటి అంశాలలోని సైన్స్‌ని అవి ఏ మతానివైనా సరే వెలికి తీసి అందరికీ పంచాల్సిన అవసరం ఉన్నది. ప్రక్రుతిలో ఉన్నదానినే సైన్స్ కనిపెట్టగలదు. ప్రక్రుతి సిద్ధమైన ధర్మాలతో పరిశీలనగా, ఫలితాత్మకంగా తయారైన మంచి సాంప్రదాయాలు ఏమి చెప్తున్నాయో పరిశీలించి వాటిలోని మంచిని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత సైన్స్ పై ఉందంటే మీరేమంటారు?
- Palla Kondala Rao,
18-12-2014
*Republished
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
మనిషి హిందువైనా,క్రిస్టియనైనా లేకా ముస్లిమైనా ప్రాణానికి ముప్పువాటిల్లే పరిస్తితులువస్తే ఎక్కడికి వెళతారు?అందరూ దవాఖానాల దారి పట్టాలసిందే..వారి వారి స్తోమతలనుబట్టి.అలాగే ఆరోగ్య సమస్యలనేవి మతాన్నిబట్టి రావుకదా.అనారోగ్యసూచనలు కనబడగానే అందరం దానిని తగ్గించుకునే మార్గాలు అన్వేషిస్తాం,తగు జాగ్రత్తలు తీసికుంటాం.ఇంకా కొంచెం ముందుగా ఆరోగ్యాన్ని పదికాలాలపాటు జాగ్రత్తగా ఉంచుకోవాలనే తలంపుతో ఈమద్యకాలంలో నడక,యోగా,మెడిటేషన్ వంటివి పాటిస్తూ ప్రజలలో కొంత ఆరోగ్యంపట్ల అవగాహన పెరిగింది.దానికి మతానికి ముడిపెట్టడం విడ్డూరంగా వుంది.గాయమైతే అందరికీ నొప్పి ఒకేలా కలుగుతుంది.అలాగే ఆరోగ్యం అందరికీ ముఖ్యమే. దానికోసం ఎవరైనా, ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు.ఇందులో యోగాని హిందూ మతానికి ముడిపెట్టడం పరమ మూర్కత్వం.మానవులందరి శరీర నిర్మాణం ఒకటే .మతాన్ని బట్టి శరీర భాగాలు,అంతర్గత నిర్మాణం ఉండవ్ కదా.అలాంటపుడు ఎవరైనా యోగా చేయవచ్చు. పంచభూతాలు అందరికీ ఒకటే.కాకుంటే వారు ఉచ్చరించే పేర్లు వేరై ఉండవచ్చు.సూర్యుడు ఏఒక్క మతంవారికో వెలుగునీయటంలేదు కదా అలానే సూర్య నమస్కారాలు కూడా ఎవరైనా చేయవచ్చు.అందరికీ ఆరోగ్యం ప్రధానమైనపుడు ఏదీ ఏఒక్కరికీ పరిమితం కాదు.
ReplyDeleteమతం ఇప్పటికీ మానవ జీవితాలను ప్రభావితం చేస్తున్నదనేది నిజం. దేవుడి పేరుతో చెపితే వింటారనే సదుదేశంతో అన్ని మతాలలోను జీవన విధానానికి సంబంధించిన విషయాలలో కొన్ని మంచి విషయాలూ చెప్పారు. అవి ఆయా కాలాలో ఆచరణలో పదే పదే పరిశీలించి ఫలితాలు రాబట్టిన అంశాలున్నాయి. వాటిని గుడ్డిగా వ్యతిరేకించడం తప్పు. మతం మీద దాడి చేయడం లేదా ఫలానా మతం మంచిది కాదనడం లేదా ఫలానా మతంలో ఫలానా మంచి విషయాలున్నాయి కనుక ఆ మతంలో చెప్పినవన్నీ మంచివే అని నొక్కి వక్కాణించడం ఇలాంటివన్నీ మనిషికి మేలు చేయవు. మతం-దేవుడు అనేవి వ్యక్తిగత విశ్వాసం. మతం లేదా దేవుడి ప్రవచనాల పేరుతో చెప్పినవి సమాజాన్ని ప్రభావితం చేసేవాటిలో మంచివాటిని స్వీకరించాలి. చెడ్డవాటిని తిరస్కరించాలి. ఎందుకు? ఎలా? అనేది తేల్చాల్సింది మాత్రం సైన్సే తప్ప మత గ్రంధాలు కాదు.
Deleteచాలా బాగా చెప్పారు. రోజులు మారుతున్నాయ్.విఙానం పెరుగుతున్నకొద్దీ మనిషిలో కొన్ని చాంధస భావాలు మాసిపోవటం లేదు.మార్పుకోసం ఆశతో ఎదురుచూడ్డం తప్ప ఏమీ చేయలేం.
Deleteహిందువులు యోగా చేస్తారు, క్రిష్టియన్లు ప్రార్ధన చేస్తారు, ముస్లింలు నమాజ్ చెస్తారు. ప్రార్ధన, నమాజ్ వల్ల వచ్చే లాభ నష్టాలే యోగా వల్లనూ సాధ్యం. ఈ మూడూ వ్యర్ధాలే నా దృష్టిలో. మనిషిని మరింత స్వార్ధపరున్ని , ఒంటరిని చేసేవే ఇవన్నీ. వీటివల్ల కలిగేది తాత్కాలిక ఉపసమనమె ( కొండలరావు గారు, మీ తర్వాతి ప్రశ్న ఎలా చేస్తాయో చెప్పండి అని. ఇప్పటికే చాలా చర్చలు నడిచాయి, ఇది నా అభిప్రాయం గా మాత్రమె చూడొచ్చు.)
ReplyDeleteయోగాసనాలు వేరు ప్రార్ధనలు వేరు మౌళి గారు. యోగా వల్ల ఉపయోగం ఉన్నది. నమాజ్ లో వజ్రాసనం వల్ల ఉపయోగం ఉన్నది. ఇక నమాజ్ అయినా , హిందువుల పూజ అయినా, క్రైస్తవుల ప్రార్ధన అయినా వారి వ్యక్తిగతం. ఇక్కడ ప్రశ్న దాని గురించి కాదు. మీరు తరువాత ప్రశ్న అంటూ బ్రాకెట్లో చెప్పినది అర్ధం కాలేదు.
Deleteపూజలు చేసే హిందువులు పదిశాతం ఉన్నారేమో కొండలరావు గారు. మిగిలిన వారి లో కొంత శాతం యోగా చేస్తారు. రెండూ చేసేవారు ఎవరయినా ఉంటె అది వాళ్లకి ఇంకాస్త తీరిక ఉన్నట్లు. పూజల వలన ఏదయినా ప్రయోజనం ఉంటె అవే ప్రయోజనాలు యోగా వలన కూడా ఉంటాయి. లేదు అని మీరు అనుకొంటే పూజలకి, యోగా కి వ్యత్యాసం మీరు చెప్పొచ్చు
Deleteమౌళి గారు, నేను భక్తుడిగా ఉన్నపుడు పూజలు చేసేవాడిని. పూజవల్ల ప్రయోజనం ఉండదు. ధ్యానం లేదా సెల్ఫ్ హిప్నాటిజం వల్ల కొంత ఉపయోగం ఉంటుందని చెప్పగలను. యోగా తెలుసుకున్నాక అప్పుడప్పుడు యోగాసనాలను ట్రై చేస్తాను. యోగావల్ల ఉపయోగం ఉన్నది. ప్రాణాయామం వల్ల చాలా ఉపయోగం ఉన్నది. యోగాసనాలు వ్యాయామానికి సంబంధించినవి. దీనికీ, పూజకూ సంబంధం లేదని స్పష్టంగా చెప్పగలను. అవి రెండూ ఒకటే అని గుడ్డిగా వాదిస్తే ఉపయోగం ఉండదు. తీరిక చేసుకుని వీలయితే రోజులో ఒక గంట యోగాసనాలు కేటాయిస్తే ఎవరికైనా మంచిదని చెప్పగలను. యోగా ను మతానికి లింకు పెట్టకుండా అందులోని సైన్స్ ని అందరికీ పంచితే మంచిదనేది నా అభిప్రాయం. యోగాసనాలు చేసేవారికి వాటి ఫలితాలు తెలుస్తాయి. చేయకుండా విమర్శించేవారికి వాటి ఉపయోగం తెలిసే అవకాశం లేదు. తెలీకుండా విమర్శించడం వల్ల ఉపయోగం ఉండదు.
Deleteయోగాకి, మతానికి లింక్ స్పష్టం గా ఉంది.అది ఒకరు పెట్టింది కాదు. నేను మా అమ్మతో మాట్లాడి మరీ కన్ఫర్మ్ చేసికొన్నాను . తను మొదట మీలానే ఆలోచించారు, కాని తను కొన్ని ప్రశ్నలకి వాళ్ళ యోగా గ్రూప్ తరుపున సమాధానం చెప్పే దశలో ఈ యోగా ఒక హిందూ మత ప్రచార సాధనం గా మాత్రమె మనుగడలో ఉన్నట్లు అర్ధం చేసికో గలిగారు. హిందూమతం ప్రచారానికి యోగాని జనం పై రుద్దడం లో నాకు అభ్యంతరం లేదు. జనం అజ్ఞానం ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసికోడానికి ఎప్పుడూ పనికొస్తుంది అది.
Deleteఒకప్పుడు పూజవలన ,మీరు భక్తుడిగా ఉండి చేస్తున్నందువలన తప్పకుండా మీకు ప్రయోజనం కనిపించి ఉంటుంది. అలాగే ఇప్పుడు యోగ బాగున్నట్లనిపిస్తుంది. రేపు ఇంకొకటి పూజ, యోగా ని మించి సంతోషాన్నిస్తుంది. అది తోటపని కావచ్చు, లేదా చారిటీ కావచ్చు. ఈ రెండింటికి ఉన్న పవర్ యోగాకి, పూజకి లేదు. యోగా, పూజలు సమాజం తో కలుస్తున్నట్లు కనిపిస్తాయి కాని సమాజానికి దూరంగా వ్యక్తిగత స్వార్ధాన్ని ప్రతిబింబిస్తాయి. ( నేను కూడా యోగా స్కూల్ డేస్ నుండి చేసాను, తర్వాతా ఆర్ట్ అఫ్ లివింగ్ వలన చాలా హెల్దీ గా ఫీల్ అయ్యాను..కాని అవన్నీ మేడి పండులే, కాబట్టి ఇప్పుడు వాటి అవసరం లేదు )
మౌళిగారు, దేనినీ గుడ్డిగా విశ్వసించడం లేదా గుడ్డిగా వ్యతిరేకించడం తప్పు. మీ అమ్మగారు చెపితే విని నమ్మడం కాదు. మీరు యోగాసనాలు వేసి ఫలితం ఉంటుందా? లేదా? నిర్ధారించుకోండి. నేను పూజలు చేసేటప్పుడు ఫలితం లేదని చెప్పాను. యోగా చేసేటప్పుడు ఫలితం ఉన్నది కనుక ఉన్నదని చెపుతున్నాను. పూజ అనేది భగవంతుని ప్రార్ధించడం కోసం చేసేది. అందులో విశ్వాసం ద్వారా కొందరికి సంతృప్తి కలగవచ్చు. పూజవల్ల ప్రయోజనం ఉండదని నా అనుభవాన్ని అభిప్రాయంగా చెప్పినట్లే యోగా వల్ల ఫలితం ఉంటుందని అనుభవపూర్వకంగా చెప్తున్నాను. యోగా వేరు - పూజ వేరు. యోగాలో వ్యాయామం ఉన్నది. యోగాని నాస్తికులయినా చేయవచ్చు. వ్యాయామం ద్వారా శరీరానికుండే సహజ రోగ నిరోధకశక్తిని పెంచుకోవడానికి యోగా ఉపయోగపడుతుంది. హిందూ సంస్కృతిలో ఉన్న మంచి విషయాలలో యోగా ఒకటనేది నా అభిప్రాయం.
Deleteమీకు చెప్తున్నది కూడా అదేనండీ, గుడ్డి గా విశ్వసించకండి . అది తప్పు అని నేను చెప్పడం లేదు . తప్పొప్పులతో పనిలేదు ఇక్కడ. ఎందుకు పనికి రాదు. మా అమ్మ చెపితే విని నమ్మానని మీకెవరు చెప్పారు???? నమ్మలేదు కాబట్టే ప్రశ్నలు అడిగి తన సమాదానాల్లోనే తనకు తెలియని చూపించడం మాత్రమె జరిగింది.
Deleteమీరు పూజ చేసేరోజుల్లో ఉన్న నమ్మకమే మీకిపుడు యోగ చేసే రోజుల్లో ఉంది, దానర్ధం యోగా పూజల కన్నా మెరుగైనది అని మాత్రం కాదు. ఇంకో ప్రచారం మొదలయ్యే దాకా ఇది ఉంటుంది ఆచరణలో. ఆ యోగా గట్రా చేసేవారికి దూరంగా ఉండొచ్చు కాని ఇంట్లో వాళ్ళని మార్చుకోక తప్పదు కదా. కాబట్టి సందర్భాన్ని బట్టి వాళ్లకి తగినట్లు గా కౌన్సిలింగ్ ఇవ్వాలి , అదే చేస్తున్నాను .
యోగా ఒక్కటేనా పూజలు కూడా ఎవరయినా చెయ్యొచ్చు ఇందులో . నాస్తికులు పూజలు చెయ్యొద్దని ఎవరయినా అన్నారా ??? వాళ్ళు పూజలు చేస్తే ఎవరు కొడతారు? ఎవరిష్టం వాళ్ళది . చెయ్యకూడదని నేను కూడా అనలేదు . గుడ్డిగా నమ్మి సమయం చేసికోవద్దు అని మాత్రమె చెప్తున్నాను . పూజలని తగ్గాక యోగా ప్రచారంలోకి వచ్చింది . తర్వాత ఇంకోటి
మౌళి గారు, మీరు పై కామెంటులో మా అమ్మతో మాట్లాడి కంఫర్మ్ చేసుకున్నానంటే అలా చెప్పాను. నేను పూజ, యోగాలను రెంటినీ ఒకే గాటన కట్టకూడదని చెప్పినది పై కామెంటులలోని వివరణ సరిపోతుంది. కొత్తగా చెప్పేదేమీ లేదు.
Deleteసరే, యోగా కి హిందూ సంస్కృతిలో భాగం అంటున్న మీరు యోగ ని హిందువులు మాత్రమె చెయ్యాలా అనడం లో అర్ధం లేదు. మిగిలిన వారికి వారి విధానాలు ఉండనే ఉన్నాయి. అది ముందే చెప్పాను. మీ పాటికి మీరు 'చేయకుండా విమర్శించేవారు' అని నిర్దారించేస్తే మీ తప్పవుతుంది. మీరు ఇలా గుడ్డిగా అవతలివారి గురించి ఒక నిర్ణయానికి రావడం మీకు యోగా పై గుడ్డి నమ్మకం ఉండడమే కారణమా ?
Deleteఈ యోగాలు, ధ్యానాలు కొత్తేమి కాదు . కాకపొతే క్రొత్తగా తెలిసినదేంటి అంటే పిరమిడ్లు, ధ్యాన కేంద్రాలు పేరుతొ విలువైన సమయాన్ని కళ్ళు ముక్కు మూసుకొని, ఇంకా పనికిమాలిన ప్రసంగాలు వింటూ ( ఇవి వినడానికి అద్భుతంగానే ఉంటాయి, చేతల్లో సున్నా ప్రయోజనాన్ని ఇస్తాయి) .వీటి మూలంగా వ్యక్తులు మరింత స్వార్ధ పరులు గా మారే అవకాసం పెరుగుతోంది.
ఇంతటి గొప్ప యోగా, ధ్యాన కేంద్రాలు హిందువులుకు మాత్రమె దగ్గరగా ఎందుకు ఉన్నాయి. ఎవరూ మాలపల్లి లో నో, సాయుబు పాలెం లోనో యోగా కేంద్రం ఎందుకు పెట్టటం లేదు (నేను కావలసినంత పరిశోధన చేసాను, ఎక్కడో ఒకటి ఉంది ఉంటె అది లెఖ్ఖ కాదు) ??? సమాధానాలు 1. గిట్టుబాతవ్వడు కాబట్టి 2.ఇంకా వాళ్ళని దూరంగా ఉంచే విధానాల్లో ఇవి ఉన్నాయి కాబట్టి. 3. వాళ్లకి దూరంగా జనాల్ని గుంపులు కట్టిస్తున్నారు కాబట్టి
మీరు యోగాసనాలను , ధ్యాన కేంద్రాలను కలిపేస్తున్నారు. నేను అనని వాటిని అన్వయించుకుంటున్నారు. మాలపల్లెల్లోనూ, దళితవాడలలోనూ, తండాలలోనూ యోగాసనాలు వేసే యువత నాకు తెలిసినవారు ఉన్నారు. మంచి ఎక్కడ ఉన్నా అందరికీ పంచాలని, అందరూ స్వీకరించాలని చెప్పడమే నా ఉద్దేశం. అది మంచిది కాదని మీరు నిర్ధారించుకుంటే వదిలేయండి మౌళి గారు.
Deleteఇక్కడ అన్వయించుకోవడం ఏమిటండీ . సబ్జెక్ట్ యోగా అయినప్పుడు "హిందూ సంస్కృతిలో ఉన్న మంచి విషయాలలో యోగా ఒకటనేది నా అభిప్రాయం." అని చెప్పడం పూర్తిగా అసందర్భం కదా ? చెయ్యాలా అని చర్చిస్తూ హిందూ సంస్కృతీ గొప్పతనమొ విషయాలో అని మాట్లాడ్డం వర్తిస్తుంది . అప్పుడు యోగా హిందూ సంస్కృతి కి ముంది నుండే ఇంకో చర్చ పూర్తి గా సంబంధం లేని కోణం లో వెళ్తుంది. ఒకవేళ గమనిన్చుకోకపోతే చూడండి. అయినా అన్ని మతాల సారం ఒకటే అన్న తర్వాత పలానా మతం లో పనికొచ్చే సంగతులున్నాయనడం హాస్యాస్పదం.
Deleteయోగా మాతో చేయించారు , తర్వాత ఆర్ట్ ఓఫ్ లివింగ్ కీ నేను వెళ్లాను . ఇప్పుడు ధ్యానాలు వస్తున్నాయి. ఇవన్నీ కాక ప్రాణిక్ హీలింగ్ ...ఇవన్నీ రక రకాల ఆకారాలున్న పాత్రలు. గురువుని బట్టిరకరకాల పేర్లు . అసలు ఇవన్నీ వదిలేసి తోటిమనిషి తో కలిసి ఉంటె వీటిలో డొల్లతనం బయట పడుతుంది. ఏది ఏమయినా యోగ చేస్తున్న మనిషి సంతోషం గా ఉంటె కారణం యోగా అవ్వాల్సిన పని లేదు.
మీకు అర్ధమయ్యేలా చెప్పలేకపోతున్నందుకు క్షమించాలి మౌళి గారు. ఏ మతం లేదా జీవన విధానం లేదా సంస్కృతిలోనైనా ఆచరణ ద్వారా పరిశీలించి ప్రయత్నించి ఫలితాలు పొందిన అంశాలను ఎవరైనా ఉపయోగించుకోవాలి అని చెప్పడమే నా ఉద్దేశం. యోగాసనాలు శారీరక వ్యాయామానికి సంబంధించినవి. ధ్యానం అనేది మనసుకు సంబంధించినది. మనసు పై సైన్స్ పరిశోధనలూ జరుగుతున్నాయి. యోగా పేరుతో జరిగే వ్యాపారమంతా లేదా ఇంకేదైనా తంతునైనా మంచిదని ఆచరించడని నేను చెప్పలేదు. అలాగే యోగా ను ధ్యానాల తో కలిపి చెప్పలేదు. కేవలం యోగాసనాలలో ఉన్న సైన్స్ ని, యోగాసనాల వల్ల ఫలితాలనీ అందరూ వినియోగించుకోవచ్చు అని చెపుతున్నాను. మీరేమో మాలపల్లెల్లో , సాయిబుల పాలెం లలో ఎందుకు లేవని అడుగుతున్నారు. అక్కడ కూడా దీనికి ప్రత్యామ్నయంగా లేదా ఆచరణలో ఇంకా మంచిగా ఉన్న వాటిలో సైన్స్‌నీ తీసుకోవచ్చు. నేను చెప్పదలచుకున్నదీ అదే. ఏ మతంలోనైనా ఎక్కడైనా మంచి ఉంటే తీసుకోండి అని. అలాగే హిందూ జీవన విధానంలో ఉన్న యోగాలో ఉన్న మంచిని హిందువులు మాత్రమే చేయాల్సిన అవసరం లేదు, హిందువులుగా మారితేనే చేయాల్సిన అవసరం లేదు, అందరూ చేయవచ్చు అని. దీనికి హిందువులుగా బ్రతకండని చెప్పడానికీ తేడా ఉందనే నేననుకుంటున్నాను. ఒకవేళ యోగాసనాలలో సైన్స్ లేదనీ, యోగాసనాలవల్ల నష్టం ఫలానా విధంగా ఉందంటే మీరు వివరించవచ్చు.
Delete@Kondala Rao PallaDecember 25, 2014 at 9:49:00 AM GMT+5:30
Deleteమీకు అర్ధమయ్యేలా చెప్పలేకపోతున్నందుకు క్షమించాలి మౌళి గారు.
hari.S.babu
"హిందూ సంస్కృతిలో ఉన్న మంచి విషయాలలో యోగా ఒకటనేది నా అభిప్రాయం." అని మీరు అంత ఖచ్చ్జితంగా చెప్పాక ఆయన "మీకు చెప్తున్నది కూడా అదేనండీ, గుడ్డి గా విశ్వసించకండి . అది తప్పు అని నేను చెప్పడం లేదు . తప్పొప్పులతో పనిలేదు ఇక్కడ. ఎందుకు పనికి రాదు. మా అమ్మ చెపితే విని నమ్మానని మీకెవరు చెప్పారు???? నమ్మలేదు కాబట్టే ప్రశ్నలు అడిగి తన సమాదానాల్లోనే తనకు తెలియని చూపించడం మాత్రమె జరిగింది. " అన్న తర్వాత కూడా ఆయన stand ఏమిటో మీకే అర్ధం కాలేదు కొండలరావు గారూ!
హిందూమతానికి సంబంధించిన దేన్నీ ఆయన ముట్తుకోడు,అసలు హిందూమతంలో అపాటించహద్గినది ఉందని ఆయన నమ్మడు.ఆయననై మీఎరు యోగాకి అనుకూలంగా మాట్లాడించలేరు.
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteయోగా మానవుల కోసం.
ReplyDeleteజిలేబి
అసలు యోగా అంటే ఏమిటి? దాని లక్ష్యం ఏమిటి? పై కామెంట్లు కొన్ని హాస్యాస్పదంగా ఉన్నాయి.క్రింది లింక్ ఒకసారి చూడండి.
ReplyDeletehttp://www.sakshyammagazine.com/2015/06/blog-post_21.html