అనేక భయాలు, అనేక సందేహాలు, అనేక పుకార్లు........
కరోనా ఎఫెక్ట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. బిజీ గజిబిజి జీవితాన్ని ఒక్కసారిగా కట్టడి చేసి ఆలోచించండయ్యా అంటూ హెచ్చరిక చేసింది. ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న శక్తులపట్ల నిర్లక్ష్యధోరణిని వదలాలని అనేక పాఠాలు నేర్పుతుంది. ముఖ్యంగా ఆరోగ్య, వైద్య రంగాలు, వీటి పట్ల పాలకుల బాధ్యతలు, ప్రజలు నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. ఇంట్లో కూర్చుని ప్రపంచానికి మేలు చేసే అధ్బుతమైన అవకాశం కరోనా ఇచ్చింది. ఉపయోగించుకోవడానికి వినదగునెవ్వరుచెప్పిన ప్లాట్ఫాం ని పల్లెప్రపంచం బ్లాగు కల్పిస్తోంది.
బాధ్యతాయుతమైన పౌరుడిగా మీ అమూల్యమైన సూచనలు తెలుపండి. జనరల్ కామెంట్ల కంటే మీరు ఏమి ఫీల్ అవుతున్నారు? ఎవరికి ఏమి చెప్పాలనుకుంటున్నారు? తప్పైనా, ఒప్పైనా మీరు ఏమనుకునేది తెలియజేయండి. ఈ చర్చ మానవాళికి మేలు చేసేదిగా ఉండాలని కోరుతున్నాను. మనం మాత్రమే అన్నీ చెప్పలేకపోవచ్చు. కానీ మనం కూడా మంచిని పంచవచ్చు. ధైర్యంగా, బాధ్యతగా మీరేమనుకుంటున్నారో చెప్పాలని విజ్ణప్తి.
- పల్లా కొండలరావు,
25-03-2020
*Republished
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
------------------------------------
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ReplyDeleteకరోనా క్యాకర్నా ?
ఘర్ మే బైట్ కే సోజానా
శుభాకాంక్షలతో
జిలేబి
నిద్ర లేచాక.... క్యాకర్నా జీ?
Deleteసకల జనుల పోరామియు
Deleteనిక పోవుటకు పరమాత్మ నిమ్మళమును జే
ర్చ కరుణ జూపవలయు ఆ
నక "కోయీ రోడ్డు పైన నా నికలే" జీ!
వివిధ మాధ్యమాలలో సేకరించిన కొన్ని విషయాలు.
ReplyDelete1) The accumulated black karma of individuals, families, groups, nations, may return in the form of pandemic or catastrophes. చెడు కర్మల ఫలితాలను తప్పించు కోలేము.
2) ఒక WhatsApp message ఇలా ఉంది ' when you can't go outside, go inside'. కరోనా వల్ల వచ్చిన గృహ నిర్బంధం ఎవరికి వారు అంతర్ముఖులై తమకు నచ్చిన ధ్యాన / ప్రార్థనా మార్గాల ద్వారా మనస్సులను శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించు కోవచ్చు.
3) ఎప్పటి నుంచో చదవాలి అనుకున్న పుస్తకాలు చదువుకో వచ్చు. అలాగే మంచి సంగీతం వినవచ్చు.
4) ఇంటి పనులలో సహాయం చేయవచ్చు. సూర్య నమస్కారాలు, చిన్నపాటి వ్యాయామాలు అంతర్జాలంలో నేర్చుకుని చేయవచ్చు.
This compulsory homestay is a good opportunity to detoxify our minds and bodies.
ధన్యవాదములు GKK గారు. బాధ్యతాయుతమైన మీ స్పందనకు అభినందనలు. మీ సూచనలు ఎప్పుడైనా ఆపద లేదా విశ్రాంతి సమయంలో ఎవరికైనా ఆచరించడానికి పనికి వస్తాయి. ఇలాంటి సూచనలన్నీ ఒక్కచోట చేర్చడం, అవి కొందరికైనా ఏదో ఒక రకంగా ఉపయోగపడడమే ఈ టపా ఉద్దేశం.
Deleteపద్మాక్షి పద్మిని పద్మాసనాసీన
ReplyDeleteబంగారు తల్లికి ప్రణతు 🙏🙏లివిగొ
ఐశ్వర్యదాయిని అమృతప్రదాయిని
బంగారు తల్లికి ప్రణతు 🙏🙏లివిగొ
ఙ్ఞానప్రదాయిని కరుణాంతరంగిని
బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ
ఆరోగ్యదాయిని అభయప్రదాయిని
బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ
ఎల్లవేళల మమ్ముల నుల్లమలర
కడుపులో దాచి కాపాడు కనకదుర్గ లీలపోలేరు పరమేశ్వరీ లలితకు
పరమ బంగారు తల్లికి ప్రణతు🙏🙏 లివిగొ
నా వంతు సలహాలు కొన్ని:
ReplyDelete1. సొంత కారు ఉన్న వారు నిత్యావసర వైద్యం కోసం వెళ్లాల్సిన అవసరం కలిగిన పేషంట్లను దవాఖానకు తీసుకెళ్లవచ్చు. మనం కారు దిగకుండా & ఎవరికీ దగ్గరకి వెళ్లకుండా సామాజిక దూరం పాటించడం, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు మూడు రోజులకు ఒక రెండు ఘంటలు ఈ పనికి కేటాయించినా రాష్ట్రానికి, దేశానికి, మానవాళికి ఉడతా భక్తి సాయం.
2. తినడానికి దొరక్క ఎందరో కష్టపడుతున్నారు. రొట్టెలు, పులిహోర, పులగం ఏదయినా మనకు కుదిరింది కొన్ని పొట్లాలు కట్టి రోడ్లలో తిరుగుతూ పని చేయాల్సిన పోలీసు/మునిసిపల్ సిబ్బంది & వాలంటీర్లకు పంచవచ్చును.
3. మానసిక వికాస నిపుణులు ఫోన్/మెయిల్ ద్వారా నిరాశకు లోనయిన వారికి కౌన్సిలింగ్ (e.g. phone helpdesk for depression) చేయవచ్చును.
4. ఔషధ/ఆహార కొరత ప్రబలే అవకాశం ఉన్నందున దృష్ట్యా దుకాణాల ద్వారా సమాచారం సేకరించి "ఏ మందులు ఎక్కడ దొరుకుతున్నాయి" తరహాలో వెబ్ సమాచార కేంద్రాలు నడపవచ్చు.
నైపుణ్యత, ఆసక్తి & వెసులుబాటు బట్టి ఎవరికి కుదిరింది వారు చేయవచ్చును. పైని రాసినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గ్రామీణ వ్యవసాయ రంగాలలో ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది.
ఇటువంటి ఆలోచనలు ఉన్నవారిని దగ్గరకు (అంతర్జాలంలోనే సుమా) చేర్చి డూప్లికేషన్ లేకుండా కోఆర్డినేట్ చేయడం కూడా ఇంకో మంచి వ్యాపకం.
మీ సూచనలు బాగున్నాయి. ఆచరణకు సాధ్యం, బాధితులకు ఉపయుక్తంగా ఉన్నాయి. ధన్యవాదములు జై గారు.
Delete"ఇలాంటి సూచనలన్నీ ఒక్కచోట చేర్చడం, అవి కొందరికైనా ఏదో ఒక రకంగా ఉపయోగపడడమే ఈ టపా ఉద్దేశం" అని మీరు పైన మీ వ్యాఖ్యలో అన్నారు.
Delete"ఇటువంటి ఆలోచనలు ఉన్నవారిని దగ్గరకు (అంతర్జాలంలోనే సుమా) చేర్చి డూప్లికేషన్ లేకుండా కోఆర్డినేట్ చేయడం" అని నేను రాసిన కాసేపటికే మీరు కూడా దాదాపు అదే అర్ధంలో రాయడం సంతోషం.
మీ సత్సంకల్పానికి కుదిరిన మేరకు సాయం చేయగలిగితే అదృష్టంగా భావిస్తాము. ఈ బ్లాగు చదివిన వారిలో ఒక పది మందికి కొన్ని మంచి ఆలోచననలు తట్టి అందులో కొన్ని సాకారమయినా మంచిదే.
లక్కాకుల రాజారావు మాస్టారు పది మంది ముదుసలి నిరుపేదలకు పట్టెడన్నం మెతుకులు పెట్టి ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. ధనసాయం కంటే ప్రత్యక్ష సేవ ఎంతో రేట్లు ఉన్నతం.
ధన్యవాదములు జై గారు. రాజారావు గారి సాయం విషయం ఇపుడు మీ కమెంట్ ద్వారానే తెలుసుకున్నాను. సర్ కు అభినందనలు.
Deletehttp://sujana-srujana.blogspot.com/2019/07/blog-post.html
Deletehttp://sujana-srujana.blogspot.com/2019/07/blog-post_22.html
జై గారు, రెండు టపాలలో కమెంట్ పెడుతుంటే ఎర్రర్ వస్తుంది. సర్ ఇలాంటి సంతృప్తికరమైన పనులతో నిండు నూరేండ్లు ఆరోగ్యవంతులుగా వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. రాజారావు గారు చేస్తున్న మంచిపని స్పూర్తిదాయకం.
DeleteIndia has one doctor per 11,600 people. They include ayurvedic, siddha, naturopathy and unani doctors. This is the condition of medical services in India. What shold we do in such condition?
ReplyDeleteధన్యవాదాలు ప్రవీణ్ గారు. తప్పనిసరిగా ఇది ఆలోచించాల్సిన విషయం. ఇది గమనంలో ఉంచుకుంటూనే చేయాల్సింది చేయాలి. చెప్పాల్సింది చెప్పాలి. ఆ దిశగా పాజిటివ్ గా కూడా మీ లాంటి మేధావులు ఆలోచించాల్సిన సమయమిది.
Delete