----------------------------------
అంశం - 'సోది' పదం అర్ధం తెలుసుకోవడం
పదం పంపిన వారు - పల్లా కొండల రావు
----------------------------------
*Re-published

Post a Comment

  1. ఏ ఆలోచన అయినా మానసికంగా ఒకసారి రూపుదిద్దుకుని, భౌతికంగా ఒకసారి ఆచరణలోకి తీసుకురావడం జరుగుతుంది. భవిష్యత్తుని ఊహించి చెప్పేదే సోది అయినా ఎవరైనా విసిగిస్తే కూడా సోది చెప్పవద్దు అని అంటాం.

    సోది అనేది భవిష్యత్తుని ముందుగా ఊహించి చెప్పేది.భౌతికంగా జరిగేది వర్తమానం.ఇందులో కూడా రాశుల ప్రభావం ఉంది.కర్కాటక రాశి,వృశ్చిక రాశి,వృషభ రాశి వారు భవిష్యత్తుని ఊహిస్తూ చెప్పే విషయాలు నిజమయిపోతాయి.నేను నమ్మనండీ అంటే నేను వాదించేది లేదు.వాస్తవంలో నిరూపించేవరకూ మౌన ముత్తమ భాషణమ్ కొన్నికొన్ని సందర్భాల్లో. ఇంతకంటే చెప్పలేను.

    కర్కాటక రాశి వారికి పూనకాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.వారికి ఆవేశం ఎక్కువగా ఉండి కోపంలో అన్న మాటలు నిజమయిపోయి, మంచి జరిగితే దేవతగా కీర్తిస్తారు,చెడు జరిగితే చేతబడి చేసారని ఆరోపిస్తారు.భవిష్యత్తు చెప్పడం అనేది వారికి తెలియకుండా జరిగిపోతున్నపుడు వారిని నిందించడం కానీ ఆరాధించడం కానీ చేయకూడదు.

    ReplyDelete
    Replies
    1. ఆలోచనకు ప్రేరణ భౌతిక పరిస్తితులే. ఆలోచించినట్లుగా లేదా ఊహించినట్లుగా పరిస్తితులు ఉండవచ్చు. ఉండకపోవచ్చు.

      పేరుగాంచిన జ్యోతిష్యులు చెప్పిన ప్రధానమైన అంశాలు క్రికెట్, రాజకీయం, యుగాంతం లాంటివి ఫెయిలయినవి ఎన్ని చూసినా నమ్మేవారి గురించి ఏమీ వాదించలేము.

      సోది అనేది గతంలో పల్లెల్లో విస్తృతంగా ఉండేది. ఎరుకల వారు ఒక వృత్తిగా దీనిని చెప్పేది. ఇపుడు టెక్నాలజీ జ్యోతిష్యులు, రంగురాళ్ల రాయుళ్లు వచ్చాక అన్ని పల్లె వృత్తులకొచ్చినట్లే దీనికి ముగింపు దశ వచ్చింది.

      అయితే ఈ సోది అనేది ఎలా పుట్తింది? సోది వృత్తికి బేస్ ఏమిటి? దేనిని ఆధారం లేదా అంచనా వేసుకుని వారు సోది చెప్పేవారు? దొంగ సోది చెప్పి సొమ్ము చేసుకునేవారు కాక నిజంగానే సోది వృత్తిగా కొనసాగిన విధానం గురించి నేనడుతుతున్నది.

      ఇక ఇపుడు వెధవ సోది, అనవసర సోది అని మనం వాడేది ఎలా అలవాటయింది. సోది అనవసరమైనదనే కదా? ఆచరణలో అది నిజం కాదని నిర్ధారించుకునే కదా?

      నా ప్రశ్న ఉద్దేశం సోది ఓ కులవృత్తిగా ఎలా ఏర్పడింది? ఇప్పటి అనవసర విషయవాదనకు అర్ధంగా సోది ఎలా మారింది? ఈ రెండింటికి సంబంధం ఏమిటి? తెలిసినవారు వివరిస్తారని.

      Delete
    2. మీరు మొదట్లో కొన్ని ప్రశ్నలు అడిగారు,ఇపుడు ప్రశ్నలకోసమే ఒక బ్లాగు తెరిచారు.చర్చ ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.బ్లాగర్ ఉచితంగా వస్తుంది కాబట్టి, మీకు చర్చలు నిర్వహించడం లో ఆసక్తి ఉంది కాబట్టి మీరు కూడా ఉచితంగా చేస్తున్నారు.

      సోది చెప్పడం అనేది కూడా ఆసక్తితో మొదలయింది.భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కొందరు రాజులు/రాణులు సోదిని నమ్మడం మొదలుపెట్టారు,ఒకరు మొదలుపెడితే ఇంకొకరు వస్తారు.అలా పల్లెటూరులో ఎక్కువగా నమ్మేవాళ్ళు ఉండడం తో దానినే ఉపాధిగా మార్చుకుని డబ్బులు ఇవ్వలేరు కనుక బియ్యం అడిగి సోది చెప్పడం మొదలుపెట్టారు.

      యుగాంతం,క్రికెట్,రాజకీయాల గురించి కొందరు చెప్పిన జోస్యం ఫెయిల్ అయిన మాట నిజమే అయినా ముందుగానే చెప్పినట్లు సోది అనేది అక్షర జ్ఞానం కూడా లేనివారి వాక్పటిమ, కొన్నిసార్లు నిజమయిపోతాయి.దానినే వాక్ శుద్ధి అని అంటారు.సోది నచ్చితే మంచిది,నచ్చకపోతే వెధవ సోది, ఇక ఈ సోది నా వల్ల కాదు.

      Delete
    3. నీహారిక గారికి సోది (గురించి) చెప్పడం రాదన్నమాట :)

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top