చర్చకు ఉంచిన పదాలు : బృందము - గుంపు
బృందం - గుంపు ఈ రెండు పదాలను ఒకే అర్ధానికి వాడవచ్చా?
Name: | శివరామప్రసాదు కప్పగంతు |
E-Mail: | deleted |
Subject: | బృందము - గుంపు |
Message: | ఆంగ్లలో ఉన్న "group" అన్న పదానికి తెలుగు సమానార్ధమిచ్చే పదం "బృందము" లేదా " బృందం". కాని మనం అనేకసార్లు "గుంపు" అనే పదం తెలుగులో గ్రూపు అనే ఆంగ్ల పదానికి బదులుగా వాడబడటం చూస్తుంటాము. "గుంపు" అంటే ఏదో (చిత్రం) జరుగుతోంది అని చూడటానికి ఒకళ్ళొకోకళ్ళకి సంబంధం లేనివారు పోగుపడినప్పుడు, అలా పోగుబడిన వాళ్లకు సామూహిక నామము గుంపు. వాళ్ళందరికీ ఒకే దృక్పథం ఉండాలని లేదు. కాని, "బృందం" అంటే ఒక పని చెయ్యటానికి ఒకే ధ్యేయంమీద తమ దృష్టి కేంద్రీకరించి ఒకచోట కలిసి పనిచేసే వాళ్ళని నా దృష్టి. ఆంగ్లంలో కూడా క్రౌడ్ (Crowd) గ్రూప్ (Group) వేరువేరు పదాలు ఒక పదానికి బదులుగా మరొక పదం వాడకూడనివి. |
*Re-published
బృందం అన్నప్పుడు దానిలో ఉన్న వారికి మధ్య ఏదో ఒక విషయమై సామాన్యమైన విషయం ఉంటుంది. ఇది mathematicsలో group వంటిది.
ReplyDeleteగుంపు అన్నప్పుడు అది ఒక జనసమూహమే కాని దానిలో ఏదో ఒక విషయమై సామాన్యమైన విషయం ఉండాలన్న నియమం లేదు. mathematical గా చెప్పాలంటే ఒక random collection అన్న మాట.
Team nd group r different meanings.Team contains certain limited number of people nd where as group may exceed thislimitation..
ReplyDeleteగుంపు అన్నది నీచార్ధంలో వాడబడే మాట
ReplyDeleteబృందం అంటే ఎవరి చేతనైనా ఏర్పాటు చెయ్యబడ్డ సమూహం.
ReplyDeleteగుంపు అంటే తనంత తానుగా ఏర్పడ్డ సమూహం.