అక్షరాలను కుదించడమా? పదాలను పెంచడమా?
తెలుగు భాషాభివృద్ధికి మేలు చేసేదెలా?
భాషపై అభిమానమున్నవారే కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంత అనవసర వాదులాటలు ఆవేశకావేశాలు దొర్లినా మొత్తం మీద తెలుగు భాషాభివృద్ధిపై మన బ్లాగర్లంతా మంచి కృషే చేస్తున్నారు. తెలుగు వెలుగులు విరజిమ్మించగల సత్తా ఉన్నవారు నేటికీ ఉన్నారనిపించడం సంతోషించదగ్గ విషయం. మాతృభాషపై మమకారం తగ్గుతున్నదన్న వాదన సరయినది కాదని ఇది ఋజువు చేస్తున్నదనిపిస్తోంది.
శ్యామలీయం సర్, ప్రవీణ్ గారు, హరి బాబు గారు, శ్రీకాంత్ చారి గారు, జై గారు, అచంగ గారు, వజ్రం గారు,..... ఇలా చాలామంది తమ అమూల్యమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సంతోషించదగ్గ, ఆహ్వానించదగ్గ పరిణామం.
అయితే భాషాభివృద్ధి అంటే అక్షరాలు తగ్గిస్తేనే, అనుకోవడం తప్పని నా అభిప్రాయం. భాషాభివృద్ధి అంటే మరో భాషతో ఏవిధంగా పోల్చుకోవాలి? అని చూసుకుంటే అక్షరాల తగ్గింపును బట్టి కాదని నాకనిపిస్తోంది. మన తెలుగు అభివృద్ధి కావాలంటే తెలుగు పదాల వాడకం పెరగాలి. కొత్త పదాల పుట్టుక జరగాలి. గ్రాంధిక గందరగోళం తగ్గాలి. తేలికైన తెలుగు పదాలు అన్నింటా వాడబడేలా పెంపొందాలి. వాటిని ఏరి ఓ చోట కూర్చాలి. వాటన్నింటినీ తగిన విధంగా ప్రచారంలో వాడుకలో పెట్టే కృషి అంతటా జరగాలి. నిరంతరం ఇది వృద్ధినొందాలి. ఏ ఇతర భాషకూ తీసిపోని విధంగా తెలుగుదనం విలసిల్లాలి.
ఉదాహరణకు 'fly-over' కు ఓ సామాన్యుడు 'పైదారి' అని తేలికగా చెప్పేశాడని హరి గారు చెప్పారు. పండితులకే తట్టాలనిలేదు. అవసరం మేరకు సామాన్యులనుండే పదాల సృష్టి జరుగుతున్నదని దీనిని బట్టి తెలుస్తున్నది కదా? ఓ వైపు పరభాషా వ్యామోహంతో మన భాషను కావాలని తక్కువ చేసుకోవడం క్షమించరానిదే. నిజానికి అచంగ గారు చెప్పినట్లు కేవలం బద్దకమే తప్ప తెలుగు పదాల వాడకం గానీ, సృష్టి కానీ కష్టం కాదు. ఇష్టం తగ్గడమే ఈ నష్ట కారణం.
అక్షరాలు తగ్గించాలన్నా, పెంచాలన్నా వాటి ఉపయోగాన్ని బట్టి తప్ప ఏ ఇతర భాషనో చూసి ముఖ్యంగా put కూ but కు ఉచ్చారణలో గల తేడాని వ్రాతద్వారా చూపలేని english భాష ను చూసి నేర్చుకుని, మనం అక్షరాల సంఖ్య కుదింపు చేయాలనుకోవడం ముమ్మాటికీ తప్పే. అదే సందర్భంలో ఌ.ౡ లవంటి అక్షరాల సంగతి ఆలోచించాల్సిందే. ఏ అక్షరం ఏ అవసరం కోసమో తేల్చి బద్ధకం వదిలించుకుని , పర భాషా వ్యామోహం విదిలించుకుని మాతృభాషాభివృద్ధికి అందరం కృషి చేస్తే తెలుగు పదాల సంఖ్య పెంచడం వాటిని అందరికీ పంచడం అందరిచేతా పలికించడం కష్టం కాకపోవచ్చనుకుంటాను.
అయితే భాషాభివృద్ధి అంటే అక్షరాలు తగ్గిస్తేనే, అనుకోవడం తప్పని నా అభిప్రాయం. భాషాభివృద్ధి అంటే మరో భాషతో ఏవిధంగా పోల్చుకోవాలి? అని చూసుకుంటే అక్షరాల తగ్గింపును బట్టి కాదని నాకనిపిస్తోంది. మన తెలుగు అభివృద్ధి కావాలంటే తెలుగు పదాల వాడకం పెరగాలి. కొత్త పదాల పుట్టుక జరగాలి. గ్రాంధిక గందరగోళం తగ్గాలి. తేలికైన తెలుగు పదాలు అన్నింటా వాడబడేలా పెంపొందాలి. వాటిని ఏరి ఓ చోట కూర్చాలి. వాటన్నింటినీ తగిన విధంగా ప్రచారంలో వాడుకలో పెట్టే కృషి అంతటా జరగాలి. నిరంతరం ఇది వృద్ధినొందాలి. ఏ ఇతర భాషకూ తీసిపోని విధంగా తెలుగుదనం విలసిల్లాలి.
ఉదాహరణకు 'fly-over' కు ఓ సామాన్యుడు 'పైదారి' అని తేలికగా చెప్పేశాడని హరి గారు చెప్పారు. పండితులకే తట్టాలనిలేదు. అవసరం మేరకు సామాన్యులనుండే పదాల సృష్టి జరుగుతున్నదని దీనిని బట్టి తెలుస్తున్నది కదా? ఓ వైపు పరభాషా వ్యామోహంతో మన భాషను కావాలని తక్కువ చేసుకోవడం క్షమించరానిదే. నిజానికి అచంగ గారు చెప్పినట్లు కేవలం బద్దకమే తప్ప తెలుగు పదాల వాడకం గానీ, సృష్టి కానీ కష్టం కాదు. ఇష్టం తగ్గడమే ఈ నష్ట కారణం.
అక్షరాలు తగ్గించాలన్నా, పెంచాలన్నా వాటి ఉపయోగాన్ని బట్టి తప్ప ఏ ఇతర భాషనో చూసి ముఖ్యంగా put కూ but కు ఉచ్చారణలో గల తేడాని వ్రాతద్వారా చూపలేని english భాష ను చూసి నేర్చుకుని, మనం అక్షరాల సంఖ్య కుదింపు చేయాలనుకోవడం ముమ్మాటికీ తప్పే. అదే సందర్భంలో ఌ.ౡ లవంటి అక్షరాల సంగతి ఆలోచించాల్సిందే. ఏ అక్షరం ఏ అవసరం కోసమో తేల్చి బద్ధకం వదిలించుకుని , పర భాషా వ్యామోహం విదిలించుకుని మాతృభాషాభివృద్ధికి అందరం కృషి చేస్తే తెలుగు పదాల సంఖ్య పెంచడం వాటిని అందరికీ పంచడం అందరిచేతా పలికించడం కష్టం కాకపోవచ్చనుకుంటాను.
కొందరు శ,ష.సలు మూడూ కలపవచ్చంటున్నారు. వాటి ఉచ్చారణలో తేడా ఉన్నందున ఆ అవసరం లేదు. అలాగే 'ర' కు 'ఱ' కు తేడా ఉన్నది. 'ల' కు 'ళ' కు తేడా ఉన్నది. వత్తు అక్షరాలను తగ్గించాలంటున్నారు, తొలుత లేకనే కదా, లోపం ఉందని వాటిని తయారు చేసుకున్నది? అవి గ్రాంధిక గందరగోళానిక్కాదే చేర్చుకున్నది? సులభతరమైన పదాలను వాడడానికేనే? అలాంటప్పుడు వాటినేలా తొలగిస్తాం? అదెలా తెలుగుకు మేలు చేస్తుంది? బాధతోనో , మమకారంతోనో, మోజుతోనో అయితే తప్పు, తప్ప తప్పనిసరిగా ఉపయుక్తమైన అక్షరాలను రూపు మాపాలనుకోవడం భాషాభివృద్ధి కానేరదు. వీటన్నింటినీ కేవలం ఇతర భాషలలోని అక్షరాల సంఖ్యతో పోల్చి తగ్గిస్తామని అలా చేస్తే భాషాభివృద్ధి అవుతుందనుకోవడం తప్పు అవుతుందని నా అభిప్రాయం.
అక్షరాల సంఖ్య భాషాభివృద్ధికి ఆటంకం కాదు. ఉచ్చారణ మేరకు ఎలా పలుకుతామో తేడాలను బట్టి వ్రాయడానికి అవసరం మేరకు అక్షరాలుండాలి. ఈ నియమం మేరకు లేని అక్షరాలుంటే తగ్గించవచ్చు. లేదా ఇంకా అవసరం అనుకుంటే పెంచవచ్చు. అలా చూస్తే నాకైతే ఌ,ౡ లు మరియూ అరసున్నా తప్ప ఏ ఒక్క అక్షరమూ తగ్గించాల్సిన అవసరం కనపడడం లేదు. క్ష ను కూడా వర్ణమాలలో అక్షరంగా చేరిస్తేనే మంచిదేమో. ఎందుకంటే ఆ వత్తుతో ఆ అక్షరం ఒక్కటే ఉందనిపిస్తోంది. ఇది కేవలం నాకున్న జ్ఞానం మేరకు చెప్పేదే.
అక్షరాల సంఖ్య భాషాభివృద్ధికి ఆటంకం కాదు. ఉచ్చారణ మేరకు ఎలా పలుకుతామో తేడాలను బట్టి వ్రాయడానికి అవసరం మేరకు అక్షరాలుండాలి. ఈ నియమం మేరకు లేని అక్షరాలుంటే తగ్గించవచ్చు. లేదా ఇంకా అవసరం అనుకుంటే పెంచవచ్చు. అలా చూస్తే నాకైతే ఌ,ౡ లు మరియూ అరసున్నా తప్ప ఏ ఒక్క అక్షరమూ తగ్గించాల్సిన అవసరం కనపడడం లేదు. క్ష ను కూడా వర్ణమాలలో అక్షరంగా చేరిస్తేనే మంచిదేమో. ఎందుకంటే ఆ వత్తుతో ఆ అక్షరం ఒక్కటే ఉందనిపిస్తోంది. ఇది కేవలం నాకున్న జ్ఞానం మేరకు చెప్పేదే.
నా అభిప్రాయమేమంటే అక్షరాల సంఖ్య కుదించడo కాదు, పదాల పెంపే భాషాభివృద్ధికి దోహదం చేస్తుందని!
మీరేమంటారు?
- పల్లా కొండల రావు.
*Re-published
కర్చు తగ్గించడమా? సంపాదన పెంచడమా? ఆర్థికాభివృద్ధి సాధించేదెలా?
ReplyDeleteమీరు వేసిన ప్రశ్న ఇలాగే వుంది.
అక్షరాలను కుదించాలని చెప్పిన వారు పదాలను పెంచొద్దని ఎక్కడైనా అన్నారా? లేక మీరే ఊహించుకున్నారా?
ఉచ్చారణ రీత్యా అక్షరాల అవసరం ఉన్నప్పుడు వాటిని కుదించాల్సిన అవసరం లేదనే గదా నేను ఈ పోస్టులో చెప్పినది. అంత సూకర్యం గా ఉన్న అక్షరాలతో అవసరం ఉన్న పదాలను తేలికగా గ్రాంధిక గందరగోళం లేకుండా తగ్గించలేమా అని అడుగుతున్నాను శ్రీకాంత్ చారి గారు. అక్షరాలకు ఆర్ధిక జమా ఖర్చుల బడ్జెట్ కు పొంతనెలా పెడతామండి. తేలికైన పదాలు అక్షరాలు తగ్గించి తయారు చేయాలనుకోవడం సరి కాదు అంటున్నాను. భాష లో కి అవసరం రీత్యా కొన్ని కొత్త అక్షరాలను తెచ్చుకున్నాం. అలాగే అవసరమైన పదాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. అక్షరాలను కుదించి పదాలను పెంచమన్నారని నేనూ అనలేదు. రెండింటినీ చర్చలలో జరిగినదానిని వివరించానంతే. అందులో నా అభిప్రాయం చెప్పాను. ఊహించి చెప్పినదేదీ లేదు. ఊహించి చెప్పాల్సిన కోపమూ లేదు. భాష అభివృద్ధికి నా ఆలోచనలను పాజిటివ్ గా చెప్తున్నానంతే. నా ఆలోచనలే పాటించాలని శాసించడం లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ ఎవరి అభిప్రాయంలోనైనా పాజిటివ్ అంశాలే తీసుకోవాలి. చెప్పినవారెవరా? అని కాదు. అలా తీసుకున్నా భాష ఎలా వృద్ధి చెందే అవకాశం ఉన్నదో అదే ఆచరణలోకి వచ్చి తీరుతుంది. మనమంతా ఎవరి అభిప్రాయం వారం వారికున్న జ్ఞానం మేరకు చెప్తున్నామని నేను అభిప్రాయపడుతున్నాను. మీకున్న అభ్యంతరాలను నిరభ్యంతరంగా చెప్పవచ్చు. ఊహ అనే సమస్యే లేదు. తెలుసుకోవడం నిర్ధారించుకోవడమన్నదొక్కటే పాయింట్ నా వరకైతే. ఎవరేమి నేర్పినా నాకభ్యంతరం లేదు. నాకు అర్ధం కానిదానిని పదే పదే అడిగి తెలుసుకున్నా తప్పు లేదనే అనుకుంటున్నాను.
Deleteమీ ఉద్దేశం అది కాక పోవచ్చు, కాని మీ ప్రశ్న భాషాభివృద్ధికి ఆ రెండు ఆప్షన్లను కంపారిజన్ చేస్తున్న మాదిరిగా వుంది. పైగా మీరు చివర్లో చేసిన "అక్షరాల సంఖ్య కుదించడఒ కాదు, పదాల పెంపే భాషాభివృద్ధికి దోహదం చేస్తుందని" వ్యాఖ్య కూడా దానికి బలం చేకూరుస్తుంది.
Deleteభాషాభివృద్ధి అన్నది చాలా పెద్ద మాట. అందుకు అక్షరాలను తార్కికీకరించడం ఒక పాయ మాత్రమే. నేనా మాట అనగానే ప్రతి ఒక్కరూ తెలుగులో ఉన్న అక్షరాలన్నీ తీసి వేయమన్నట్టుగా భావిస్తున్నారు. ఒప్పుకోవడానికి అహం అడ్డు వచ్చినా కొన్ని అక్షరాలు కేవలం నామమాత్రంగా వున్నాయి తప్ప పలుకులో అణుమాత్రం కూడా తేడా లేదన్నది నా అభిప్రాయం. అలా వాదించిన వారిని పలికి చూపమని అడిగాను కూడా. అనవసరమైనవి తీసి అవసరమనుకుంటే కొత్తవి చేర్చవచ్చు కూడా.
ఇక పోతే పదాలను పెంచాలి అనగానే పెరగవు. పదాలు ధాతువుల వల్ల ఉత్పత్తి అవుతాయి. అటువంటి ధాతువులు సంస్కృతంలో వున్నాయి గాని, తెలుగులో లేవు. కాబట్టి తెలుగులో కొత్త పదాల నిర్మాణం అనుకున్నంతగా జరగడం లేదు. జరిగినవి కూడా కృతకంగా వుంటున్నాయి. కాబట్టి పదనిర్మాణానికి కావలసిన భాషా శిల్పాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి జరగాలి. అందుకు వ్యాకరణంలో మార్పులు, నూతన సిద్ధాంతాలు తప్పనిసరి.
చివరగా కొన్ని ఉదాహరణలు చెపుతాను.
మోహం - మోహించుట
పూజ - పూజించుట
అంటాం
స్నానం - స్నానించుట
గానం - గానించుట
అని ఎందుకు అనలేక పోతున్నాం? ప్రశ్నించుకోవాలి. సమాధానాలు వెతకాలి. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.
భాషలో సరైన నియమాలు ఉంటే పదాలు ఎవరో కనిపెట్ట నవసరం లేదు. నియమాలను అనుసరించి ఎవరు ప్రయత్నించినా అదే పదం వచ్చే సావకాషం వుండాలి. అందుకోసం భాషావేత్తలు కృషి చేయాలి.
శ్రీకాంత్ చారి గారు నాకు తెలిసినమేరకు ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించడంలో లోపం ఉంటే అది తప్పక ముందు ముందు మెరుగవుతుంది.
Deleteభాషాభివృద్ధి పెద్దమాట ఒప్పుకుంటాను. కానీ భాషను పెద్దలు మాత్రమే అభివృద్ధి చేస్తారంటే ఒప్పుకోను. ఆ మాటకొస్తే పర భాషావేత్తలతో పోలిస్తే మనవారు చేస్తున్న కృషి దిగదుడుపే. సామాన్యులే తెలుగుకోసం ఎక్కువ తపన పడుతున్నారు. అర్ధం కాని గ్రాంధిక గందరగోళం తప్ప అదే అర్ధాన్నిచ్చే తేలికైన తెలుగు పదాలను సృష్టించే దమ్ము వీరికి లేదా? లేక కాదు పాండిత్య ప్రతిభ అనేది అహం లా అడ్డుకోవడమూ ఓ లోపమే.
మీరన్నదానికి వేరేవిధమైన వక్రీకరణలను గమనించాను. దానివెనుక అనవసరమైన అంటగింపులనూ గమనించాను. ప్రస్తుతానికి వాటి జోలికి పోతే చర్చ పక్కదోవపడుతుందని నేను సున్నితంగానే వారికీ నా అభిప్రాయం చెప్పాను. అదే సందర్భంలో అక్షరాలను తగ్గించాలనే మీ వాదనలో మొండితనమే ఎక్కువ కనిపించింది తప్ప శాస్త్రీయత కనిపించలేదు.దీనిని సద్విమర్శగా స్వీకరిస్తే మీరు అక్షరాలపై మరింత లోతుగా ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. ఎన్నో విషయాలపై విషయసేకరణలో మీ పట్టుదలని గమనించినవాడిగా మాత్రమే మీకింత గట్టిగా చెప్తున్నాను.
తెలుగు అక్షరాల విషయంలో పలుకులలో తేడాలు మీరనుకుంటున్నట్లు లేదా అంటున్నట్లు నామ మాత్రం కాదనేది నా అభిప్రాయం. మీ బ్లాగులోనే గుండు మధు సూదన్ రావు గారి వివరణ చాలా బాగుంది. ఆయన కామెంట్ మరింతమందికి విస్తృతంగా వెళ్లడానికి పల్లెప్రపంచంలో పోస్టుగా ఉంచేందుకు అనుమతి అడిగాను. ఆయన ఓ.కే అంటే ఆ పోస్టు పబ్లిష్ అయ్యాక మరింత వివరంగా చర్చించవచ్చు.
ధాతువులగురించి నాకు ఏమాత్రం అవగాహన లేదు. తెలుసుకుంటాను. వీలయితే ప్రశ్నగా ఉంచుతాను. ఈ విషయం తెలిపినందుకు ధన్యవాదములు.
స్నానం - స్నానిచుట అనేది మనకు తెలీదేమో గానీ మన భాషా పండితులకు వ్యాకరణ నియమాలలో ఉండే ఉంటుందని నా అభిప్రాయం. అందరికీ తెలిసేలా తెలుగు వ్యాకరణాన్ని వ్యాప్తి చేయాలి.
భాషలో సరయిన నియమాలు ఉంటే పదాలు ఎవరో కనిపెట్టాల్సిన అవసరం లేదు. చాలా వరకూ అంగీకరిస్తాను. ఇదే విషయమై కప్పగంతు శివరామ ప్రసాద్ గారి బ్లాగులో ఓ ఆర్టికల్ చదివాను. బాగుంది. అయితే నియమాలు లేకనా? నియమాలు పండితులకు మాత్రమే తెలిసేలా ఉండడమా? లోపమెక్కడ జరుగుతున్నది? దీనిని విమర్శించాలి అంటే ముందు మనకు నియమాలు తెలియాలి. నాకైతే అంత నాలెడ్జ్ లేదు.
ఇక్కడ నాకో అనుమానం. సైకిల్ అనేదానికి తెలుగు పదాన్ని ఎలా ఏ నియమం ప్రకారం తయారు చేయాలి. ఎందుకంటే సైకిల్ ని మనం కనిపెట్టలేదు. అలాగే TRTAIN లేదా రైలు ని కూడా. ఇవీ ప్రసాద్ గారి ఆర్టికల్ చదివాక నేర్చుకున్నవే.
చూద్దాం చర్చలద్వారా మరింతగా విషయ పరిజ్ఞానం వస్తుందేమో మాలాంటివాళ్లకు. అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదములు.
>>> అదే సందర్భంలో అక్షరాలను తగ్గించాలనే మీ వాదనలో మొండితనమే ఎక్కువ కనిపించింది
Deleteఇప్పుడున్న అక్షరాలమీద ఈగ వాలకూడదు అని శాసించడం మొండితనమా, లేక అక్షరాల అవసరానవసారాలను పరిశోధించాలి అని చెప్పడం మొండితనమా? ఆలోచించండి. ఇలా కామెంట్లలో అక్షరాల గురించి వ్యాఖ్యానించలేం కాని వీలు చూసుకుని నేనే ఒక సవివరమైన పోస్టు రాద్దామనుకుంటున్నాను. అప్పుడు దాని గురించి చర్చిద్దాం.
ఇక పోతే కొన్ని అక్షరాలు తెలుగులో లేవు కూడా. మీరు గమనించారో లేదొ... మనకు "ఔ" వుంది కాని "oi" లేదు. దానికోసం మనం ఒయ్ అని రాసుకోవాల్సిందే. మిగతా ప్రదేశాల సంగతి తెలియదు కాని తెలంగాణలో ఈ అచ్చును విరివిగా పలుకుతారు.
ఉదా:
oiలు = పుస్తకాలు
poiన సారి = పోయిన సారి
oiనాల మారి = వగల మారి
ఇక పోతే గోదావరి జిల్లల్లో "చేస్తాం" అన్న అప్దాన్ని "చేస్తాం", "చాస్తాం" కి మధ్యగా పలుకుతారు. అలాగే చాలా ఇతర పదాలు కూడా. ఇంగ్లీషుఓ man మాదిరిగా అన్నమాట.
>>> స్నానం - స్నానిచుట అనేది మనకు తెలీదేమో గానీ మన భాషా పండితులకు వ్యాకరణ నియమాలలో ఉండే ఉంటుందని నా అభిప్రాయం.
అది పండితులు కాని పామరులు కాని వాడగా నేనయితే చూడలేదు. ఇక ఎవరైనా "గానించాలి" అనడం ఎక్కడైనా చూసారా? నియమాలను standardise చేయాల్సిన అవసరం తప్పక వుంది.
అక్షరాలను అవసరాలను బట్టి పరిశోధించి Standard చేయాలన్న మీ వాదనతో నేను విభేదించడం లేదు. పైగా స్వాగతిస్తున్నాను.
Deleteనేను మొండివాదన అన్నది మీరు సూచించిన ర ఱ ల ళ లాంటి వాటి గురించి , ఖ,ఘ వంటి ఒత్తు అక్షరాలగురించి మీ వాదనను బట్టి నేనలా అన్నాను.
అక్షరాలు తగ్గించినా పెంచినా నాకు అభ్యంతరం లేదు. కానీ దానికో అర్ధం ఉండాలి.
oi అర్ధం కాలేదు. oiలు అంటే పుస్తకాలు అనేది మీరు చెపితే తెలియడమే. oiనాలమారి కూడా తెలీదు. పోయినసారి అంటే క్రితం అనే అర్ధమేనా మీరు చెప్పేది? వైనము లో అయితే ఐ ఉంది కదా?
మీరు చెప్పేది ఒ + ఐ కలిపి రావాల్సిన అక్షరం గురించా? ఎలా అడగాలో సరిగా తెలియ్డంలేదు?
అక్షరాలు గురించి వివరంగా పోస్టు వ్రాయగలరు. మీకు అభ్యంతరం లేకుంటే పల్లె ప్రపంచం లో పబ్లిష్ చేయడానికి వీలయితే నాకు పంపండి. తెలుగుభాషకు సంబంధించినవన్నీ ఒక చోటకు తీసుకొద్దామనే నా ప్రయత్నంలో భాగమా అడిగాను తప్ప వేరే ఉద్దేశం కాదు. మీ బ్లాగులో అయినా ఫర్వాలేదు.
యాసలు వేరు పద నిర్దిష్టత వేరు కదా? గోదావరి జిల్లాల యాస కొద్దిగా మాత్రమే తెలుసు నాకు.
స్నానించుట అనవచ్చా? లేదా? అనే నియమాన్ని వ్యాకరన పండితులు చెప్పగలరేమో అంటున్నాను. తప్ప ఆ పదం ఉందనలేదు. నాకు ఉన్నట్లు ఎక్కడా తగల లేదు. ఏది సంధి నియమం అనేది వ్యాకరణ పండితులకు తెలియవచ్చేమోనన్నదే నా అభిప్రాయం.
అరబిక్ భాషలో "ఖ" ఉండదు. ఉర్దూవాళ్ళు సంస్కృత పదాల్లో "ఖ" వ్రాయడానికి "క" పక్కన "హ" పెడతారు. వాళ్ళు "కహ" అని వ్రాసారో, "క్హ" అని వ్రాసారో చూసినవాళ్ళకి అర్థం కాదు. అక్షరాలు ఎంజి ఉన్నాయని కాదు, అవి intelligibleగా లేదా comprehensibleగా వ్రాస్తున్నామా లేదా అనేది ముఖ్యం.
Delete>>> నేను మొండివాదన అన్నది మీరు సూచించిన ర ఱ ల ళ లాంటి వాటి గురించి , ఖ,ఘ వంటి ఒత్తు అక్షరాలగురించి మీ వాదనను బట్టి నేనలా అన్నాను.
Deleteనేను చర్చల్లో ఎక్కడా ఫలానా అక్షరలను తొలగించాలని సూచించలేదు. అక్షరాల హేతుబద్ధతతపై చర్చ జరగాలని మాత్రమే అన్నానని మరోసారి చెపుతున్నాను. ఎన్ని సార్లు చెప్పినా అందరూ (మీతో సహా) అదే పక్క దారి పడుతున్నారు. ఎందుకో తెలియదు కాని అక్షరాల గురించి మాట్లాడితేనే అందరూ ఆవేశాలకు లోనవుతున్నారు. వారితో నా వాదనను సమర్థించుకోవడానికి చేసే ప్రయత్నమే బహుశా మీకు మొండి వాదనలా కనబడుతున్నట్టుంది!
అక్షరాలను వాదనలోకి తెచ్చింది నాతో వాదించిన వారే అని గ్రహించ గలరు. వారు అవి ప్రస్తావించినపుడు నా అభిప్రాయం చెప్పే హక్కు నాకుందని భావిస్తాను.
నాతో ఈ విషయం పై తీవ్రంగా వాదించిన ప్రవీణ్ రకరకాల సమయాల్లో చేసిన వ్యాఖ్యలు చూడండి.
1. మా శ్రీకాకుళం జిల్లాలో పట్టణ ప్రాంతాలవాళ్ళు మాత్రమే "ళ" పలుకుతారు, సంస్కృత వాసన వల్ల.
2. తెలంగాణలో చదువుకున్నవాళ్ళు కూడా "ళ" పలకలేకపోతున్నారని ఒప్పుకుంటే సరిపోతుంది కదా.
3. అందుకే తెలుగువాళ్ళకి "క" & "ఖ" ఒకేలా వినిపిస్తాయి.
4. తెలుగులో "ఱ" "ర"గా మారి కొన్ని వందల సంవత్సరాలు అయ్యింది. తెలుగు నుంచి "ఱ" తొలిగించినది అందువల్లే.
5. కోస్తా ఆంధ్రలో కూడా చాలా మంది "శ" పలకలేరు.
6. ఈ రెండు రాష్ట్రాల్లో హిందీ వచ్చినవాడు ఒక్కడు కూడా లేకపోతే "శ, ష"లని తెలుగు నుంచి తొలిగించొచ్చు.
7. చిత్తూరు జిల్లాలో అందరూ "ళ"ని "ల"గానే పలుకుతారు.
అన్ని అక్షరాలు వుండాలని అరివీర భయంకరంగా వాదించిన ప్రవీణే అక్షరాల్లో ఇంత గందరగోళం వుందని స్వయంగా చెపుతున్నారు. అయినా ఈ గందరగోళాన్ని చర్చించ కూడదు అనడం ఎంతవరకు సమంజసం. చర్చించకూండానే "అన్ని అక్షరాలూ వుండి తీరాల్సిందే" అని తీర్మానించడం ఏవిధంగా కరెక్టు?
>>> మీరు చెప్పేది ఒ + ఐ కలిపి రావాల్సిన అక్షరం గురించా?
Deleteఔనండీ
మహాప్రాణములు (ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ, శ, ష, స, హ) సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చిన పదాల్లో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అందరూ సంస్కృత పదాలు కలిపిన తెలుగే మాట్లాడుతున్నారు. సంస్కృత పదాలు ఉపయోగించేటప్పుడు సంస్కృత ధ్వనులనే పలకాలి కదా. దీనికి వివాదం ఎందుకు?
Deleteతెలుగులో ఒకప్పుడు "ೞ" ధ్వని కూడా ఉండేది. తెలుగువాళ్ళు ఇప్పుడు దాని స్థానంలో "డ" లేదా "ర" పలుకుతున్నారు. తమిళ, మలయాళ పదాల్లో "ೞ" వచ్చినప్పుడు దాన్ని తెలుగులో "ళ"గా పలుకుతారు. ఉదాహరణకి కేరళకి చెందిన "ఈೞవ" కులం పేరు తెలుగులో "ఈళవ" అని వ్రాస్తారు. ఇప్పుడు "ೞ" తెలుగులో స్థానికంగా శాసనాల్లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దాన్ని శాసన "ళ" అంటారు. పిల్లలకి "ೞ" లాంటి archaic sounds నేర్పించక్కరలేదు కానీ ప్రస్తుతం వాడుకలో ఉన్న "ళ" నేర్పించాల్సిందే. అలాగే మహా ప్రాణములు (గాలి బలంగా ఊదుతూ పలికేవి) కూడా సరిగా పలకడం నేర్పించాలి.
Delete@ శ్రీకాంత్ చారి3 December 2014 22:55:00 GMT+5:30
Deleteక్షమించాలి శ్రీకాంత్ చారి గారు. మొండివాదన అనే పదాన్ని వెనుకకు తీసుకుంటున్నాను. మీరు ఎంత వాదించినా భాషపై అభిమానంతోనే అనేది నాకు 100% నమ్మకం ఉన్నది.
ఇతర బ్లాగులలో కొన్నిచోట్ల మీపై అవసరానికి మించిన వ్యాఖ్యానాలతో కొందరి కామెంట్లూ చూశాను. నాకలాంటి ఉద్దేశాలయితే లేవు. అలవాటుగా వచ్చే పదాలలో భాగంగా నేను వాడి ఉంటాను. లేదా అక్షరాలపై చర్చకు విసిగి వాడి ఉంటాను.
అయితే మీరూ, నేనూ ఆఖరకు భాషపై పట్టున్న శ్యామలీయంగారు, గుండు మధు గారు వంటివారుకూడా వారికి తెలిసిందే వాదిస్తారు. అందులో కూడా తప్పులుంటే అంతకంటే తెలిసినవారు సరిచేస్తారు. ఇక్కడ మళ్లీ శ్యామలీయం గారు గానీ మధు గారు గానీ తప్పులు చెప్పారని నేను నిర్ధారించడం లేదని మనవి. తెలుగు భాష విషయంలో వారివద్ద నేను నేర్చుకునే స్తితిలో ఉన్నాను తప్ప వారికి నేర్పే స్తితి లేదు. అదే సందర్భంలో భాషను అమ్మతో సమానం అని శ్యామలీయంగారంటే నేను అంగీకరించను తల్లితో ఏదీ సమానం కాదన్నాను. ఇక్కడ ఈ అంశం భావోద్వేగానికి సంబంధించినది. అక్కడ ఎవరిష్టం వారిది. నా భావోద్వేగమే మీకుండాలని వాదనకు దిగితే అది నాదైనా, శ్యామలీయంగారిదైనా తప్పు. కానీ శ్యామలీయం గారి మీద గౌరవానికి విషయ సేకరణలో వాదనకీ సంబంధం ఉంటే జ్ఞాన సముపార్జనకు ఆటంకమవుతుందని నా అభిప్రాయం.
నేను మొండివాదన అన్నది బహుశా పదే పదే అక్షరాలగురించే మీ బ్లాగులో చర్చ జరగడం వల్ల కావచ్చు. అది మీరన్నట్లు ప్రవీణ్ వల్ల అయినది కావచ్చు. ఇక్కడ కావచ్చు అనేది మళ్లీ వాటన్నింటినీ చదివే అవసరం లేకుకుండానే వివరించడానికి మాత్రమే తప్ప తప్పించుకోవడానికి మాత్రం కాదు. ప్రవీణ్ తో వచ్చిన చిక్కల్లా అదే తనకు చాలా విషయాలపై అపరిమితమైన నాలెడ్జ్ ఉంటుంది. వివిధ భాషలపై కూడా ప్రవీణ్ కు నాలెడ్జ్ ఉన్నది. ఒక్కోసారి చిన్న అంశాన్ని పట్టుకుని ఏకి పీకి లాగుతూ వ్యక్తిగత నిందలదాకా వెళతాడు. స్వతహాగా తను వ్యక్తులను కించపరచడు కానీ ఇలాంటివి తగిలినప్పుడు, ఎవరైనా కెలికినప్పుడు సమ్యమనం కోల్పోతుంటాడు. ఇది సరిచేసుకుంటే ప్రవీణ్ నుండి చాలా మెరుగైన సమాచారం బ్లాగు మిత్రులకు అందుతుంది.
అక్షరాల విషయంలోనూ , పాఠ్య పుస్తకాలలో తెలుగు పదాల సరళత గురించి మీ బ్లాగులో గుండు మధుసూదన్ రావు గారి కామెంట్లతో నేను ఏకీభవిస్తున్నాను. వాటినే ఆయన అనుమతితో ఈ రోజు పల్లెప్రపంచంలో ఓ పోస్టు వస్తుంది గమనించగలరు. మీ వాదన కొనసాగించండి. భాషాభివృద్ధికి అది ఉపయోగపడాలని నా కోరిక.
చర్చకు నేనెప్పుడూ వ్యతిరేకం కాదండీ. అదే పనిగా చర్చించినా తప్పులేదు కూడా. అయితే ఓ చర్చకు అంతం ఎక్కడ? అనేది ముఖ్యమే కదా?చర్చ అనేది తెలుసుకోవడానికీ లేదా తెలియజెప్పడానికి కదా? నాకు తెలిసి గుండు మధు గారి వ్యాఖ్యతో ప్రస్తుతానికి అక్షరాలపై చర్చపై ఒకింత ముందడుగు పడ్డట్లే. అంతకంటే మెరుగైన అవసరమైన కామెంట్ లేదా అభిప్రాయం వచ్చినప్పుడు అక్షరాల గురించి ఆలోచిద్దా. అక్షరాలను ఎవరు ఎక్కడ ఏ అక్షరాన్ని ఎలా పలికారని గాదు. ఆ అక్షరాన్ని ఎలా పలకడానికి నియమం ఉన్నదనేది ముఖ్యం. ఆ నియమాన్నీ ఇష్టం పెంచుకుంటే కష్టమైనా కొన్నాళ్లకు తెలుగువారంతా సక్రమంగా పలికేలా చేయగలం. అందుకు మనమంతా కృషి చేయాలి. ఆ కృషి చేసే వారసత్వం నిరంతరం కొనసాగ్తూ తెలుగు వెలుగులు విరజిల్లుతాయని ఆశిస్తున్నాను.
@శ్రీకాంత్ చారి3 December 2014 23:14:00 GMT+5:30
Delete< >>> మీరు చెప్పేది ఒ + ఐ కలిపి రావాల్సిన అక్షరం గురించా?
ఔనండీ >
శ్రీకాంత్ చారి గారూ!
ఒ, ఐ ఇవి రెండు అచ్చులు కదా? ఈ రెండింటి కలయికతో ఓ అచ్చు ఎలా ఉంటుంది? ఒ + ఐ సాధ్యమా? అది వ్యాకరణ నియమానికి అనుగుణంగా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుందా?
కొండలరావు గారు,
Delete>>> ఒ, ఐ ఇవి రెండు అచ్చులు కదా? ఈ రెండింటి కలయికతో ఓ అచ్చు ఎలా ఉంటుంది? ఒ + ఐ సాధ్యమా?
ఆంగ్ల అక్షరాలతో అది oi అవుతుంది.
ఇప్పుడున్న తెలుగు అక్షరాలతో వ్రాయాలంటే అది ఒయ్ అనాలి. శుభ్రంగా ఒయ్ అనొచ్చు కదా అని మీరు అనొచ్చు. అటువంటప్పుడు ఐ (ai) ని అయ్ అని కూడా అనొచ్చు. ఔ (ou) ని అవ్ అని కూడా అనొచ్చు, కాని అనడం లేదు కదా. అలాగే oi కూడా.
>>> అది వ్యాకరణ నియమానికి అనుగుణంగా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుందా?
వ్యాకరణ నియమాలు మనుషులు పెట్టుకునేవే. కాకపోతే వాటిని అందరిచేత ఆమోదింప జేయడానికే పరమ శివుడు చెవిలో చెప్పాడనో మరోటో కల్పించి వ్రాసారు ఆ కాలపు పండితులు. వ్యాకరణ నియమానికి అనుగుణంగా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుందా అని ఆలోచించే బదులు, ఆ శబ్దం వుందా లేదా అన్న విషయం ఆలోచించాలి. తర్వాత వ్యాకరణాల సంగతి ఆలోచించొచ్చు.
నాకు తెలిసి తెలంగాణాలో బాగా వాడతారు. కొన్ని పదాలు ఇదివరకే చెప్పాను.
అనంతపురంలో ఒయితారము అన్న పదం వాడుకలో వుంది. పలకడం ఒయ్‌తారం అనే పలికినా, వేరే మార్గం లేక ఒయి అని రెండు విడదీసి రాయల్సి వస్తుంది.
ఉత్తరాంధ్రలో వైరం అనే పదాన్ని ఒయిరం అంటారు. పలకడం మాత్రం ఒయ్‌రం అని పలుకుతారు.
ఇక తెలంగాణలో
ఒయ్‌నం = వైనం
ఒయ్‌లు = పుస్తకాలు
ఒయ్‌రు = వైరు
పొయ్‌మీద = పొయ్యి మీద
ఇక యూరోపియన్ భాషల్లో ఈ అచ్చు విరివిగా వాడతారు.
గమనిక: ఇది తెలుగు మరియు ఇతర భారతీయ భాషల్లో లేని అచ్చుగా నేను గమనించాను. అంత మాత్రాన అది పెట్టి తీరవలసిందే అని నేను వాదించడం లేదు.
శ్రీకాంత్ చారి గారు, ఒయ్‌లు = పుస్తకాలు గురించి మీ వివరణ నాకర్ధమయింది. ఇందులో ఆలొచించాల్సినది ఉన్నది. నాకైతే సమాధానం చెప్పే శక్తి లేదు. కానీ ఇప్పుడు స్పష్టంగా అర్ధం అయింది. తెలిసినవారు చెప్తారేమో చూద్దాం. మా తెలుగు మాష్టారు రిటైరై ఉన్నారు. రేపు ఆయన కలిస్తే అడిగి చూస్తానండీ.
DeleteGrammar is not related to religion. American and British Englishes have almost same grammar rules but different spelling and pronunciation rules. Grammar means using native-like method in sentence building and word building.
DeleteArabic has only 28 letters. So what? "P" and "V" are not found in Arabic and therefore Arabs would spell and pronounce my name "brafyn" instead of "Praveen".
ReplyDeleteఅక్షరాలు తక్కువా ఎక్కువా అన్నది సమస్య కాదంటున్నాను ప్రవీణ్ గారు. ఉన్న అక్షరాలు ఏవి ఎందుకు అవసరమో తేలికగా అవసరం మేరకు ఉంటే వాటిని తగ్గించాల్సిన అవసరం లేదంటున్నను. ఇంకా కొత్తవి అవసరమైనా తయారు చేసుకోవాలి అంటున్నాను. ఫలానా అక్షరం వల్ల ఒక్క ఉపయోగమూ లేదని తేల్చితే వాటిని తొలగించినా తప్పు లేదంటున్నాను. మనం తొలగించకున్నా వాడుకలో లేకుండా వాటంతటవే కనుమరగవుతాయి. ఉదాహరణకు ఌ,ౡ ల లాగా. కానీ అవసరం ఉన్నవి పలకడంలో తేడాలున్నవి మిగిలే ఉంటాయి. మిగల్చాలీ అంటున్నాను.
Deleteఇదే విషయమై గత పోస్టులో రెహ్మానుద్దీన్ గారు చెప్పినదీ పరిగణనలోకి తీసుకోవాలి. ప్రాచీన సాహిత్యాన్ని యథాతధంగా గ్రంధస్థం చేయాలంటే కూడా అక్షరాలు అన్నీ ఉండాల్సిందే.
అక్షరాలను తగ్గించడం వల్ల భాషకు జరిగే మేలు ఏమీ లేదనేది నా అభిప్రాయం. పదాల పెంపు వాటిని వాడకంలో పెట్టడం అంటే గ్రాంధిక అలకరణలకోసం గందరగోళంగా కాక సులభంగా తయారు చేస్తే తప్పక వాడకంలో ఉంటాయి. వాడకంలో ప్రజలు సృష్టిస్తున్న కొత్త పదాలకీ ప్రచారం కలిపించాలి అంటున్నాను.
భాషపై పట్టున్న మీ వంటి వారంతా కొత్త పదాలను తేలిక భాషలో తయారు చేసేందుకు కృషి చేయాలంటున్నాను.
తక్కువ పదాలతో కష్టమైన గ్రామర్ తో పలికే బదులు పలుకు వ్రాత ఒకేలా ఉండేలా సౌకర్యంగా ఉండే అక్షరాలుండడం మన తెలుగుకు ఉన్న అదనపు సౌకర్యమే. దానినెందుకు వదులుకోవాలి? మంచిని కొనసాగించి ఇంకా ఇతర భాషలలో ఉన్న మంచిని తెచ్చుకుని తెలుగుకు మరింత వెలుగు తెచ్చేందుకు ప్రయత్నించాలి.
https://www.dropbox.com/s/ntlg5yothfuiem6/Screenshot_2014-12-03-21-27-11.png?dl=0
ReplyDeleteతమిళంలో అక్షరాలు తక్కువగా ఉండడం వల్ల వచ్చిన సమస్యల గురించి చర్చ ఇది.
కొండల రావ్ గారూ,
ReplyDeleteకల & కళ కి భేదం తెలుసుకదా. షార్ట్ కట్ ఎక్కడ కూడా మంచి పద్దతి కాదు. ఎంత రవాణా సౌకర్యాలున్నా, ఒకరోజు పక్క ఊరికి పాత పద్దతిలో కాలి నడకలోనో, ఎడ్ల బండి లోనో వెళ్ళి చూడండి. వేగం తెచ్చిన నష్టాన్ని తెలుసుకోగలరు.
భాష ఆత్మాభివృద్దికి సహాయపడేదిగా ఉండాలి కానీ, రోజు వారీ అవసరలాకొరకు మాత్రమే కారాదు. ఆత్మాభివృద్ది కళ తోనే సాధ్యం. అందులో కావ్య పఠనం ఎంతో రమ్యమైనది. ఏ పని లో కూడా ఆత్మ లేకపోతే అది వినాశనానికొక సోపానం అవుతుంది. నేటి పాత్రికేయం చూడండి, అదొక కళ గా ఉందా ? పూర్తి బహిరంగ వ్యభిచారం. పేరు గొప్ప, ఊరు దిబ్బ.
ఫ్లై ఓవర్ ని తెలుగులో ఏమంటారో ప్రయోగాలు జరగనివ్వండి. చివరికి అది పుట్టిన ఆంగ్ల పదానికే పరిమితమవుతుందేమో.
నేటి నాటకాలనూ చూడండి, అది కళా ? మొన్న మేము సైతం అని స్టేజీ ఎక్కిన ప్రతి వాడూ, విషయ గంభీరతను ప్రదర్శించటంలో సంపూర్ణంగా విఫలమయ్యారు. వీళ్ళ అడుక్కునే మొహాలకు అభిమాన సంఘాలు ఒక ప్రక్క. ఆత్మ, (నాణ్యత ) లోపించిన విద్యా విధానం వల్ల పెరిగిన మంద బుద్ధులు ఆ సడిలోనే జీవించి మరణిస్తారు.
భాష అర్థాన్నీ, భావాన్నీ రెంటినీ తెలియజెప్పగలిగితేనే అది సంపూర్ణం అని నాకు తోస్తున్నది.
నాకు తెలిసినంతలో ఏదో పంచుకోబ్రయత్నించాను.
కాయ గారు,
Deleteవ్యావహారికం వేరు - గ్రాంధికం వేరు అని మిత్రులు గుండు మధుసూదన్ గారు వివరించి ఉన్నారు. అది పోస్టుగా ఉంచాను. వీలయితే చూడండి. వ్యాకరణ బద్ధమైన గ్రాంధికంలో పాఠ్యాంశాలు మరీ గ్రాంధికం కాకుండా తెలుగుతనం కోల్పోకుండా వీలయినంత సరళం చేయాలి. ఆ ప్రయత్నం భాషా పండితులే చేయాలి.
ఇక వాడుక భాషకు రూల్స్ పెట్టేది ఎవరు? పాటించేది ఎవరు? అక్కడ కమ్యూనికేట్ చేయగలిగి అప్పటి అవసరం తీర్చుకోగలిగితే చాలు. అంటే చెప్పేవాడి భావం వినేవాడికి అర్ధమైతే వారిద్దరి మధ్యా క్రియ పూర్తవుతుంది.
ఇక్కడ అదే సందర్భంలో fly-over కొత్తగా వచ్చినదానికి మేధావులు తయారు చేయలేని దానిని పైన చెప్పిన అవసరమే పైదారి అనే కొత్తపదంగా తేల్చింది. అయితే అది వ్యాకరణ బద్ధమా? కాదా? భాషా నియమానికి అనుగుణంగా ఉన్నదా? లేదా? అనేది భాషా పండితులు తెలచుతారు. ఇదో ప్రాసెస్.
పదం అర్ధాన్నీ భావాన్నీ రెంటినీ తెలిపితే మంచిదనే మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. కామెంటుకు ధన్యవాదములు.
కొండల రావు గారూ,
ReplyDeleteపదాలని కూర్చడానికి నేను మొదట్లో వూళ్ళు పట్టుకు తిరగాల్సి వస్తుందనే అపోహతో చాలా ఖర్చూ, భారమూ అని అనుకున్నాను.కానీ ఇప్పుడు మనం మీ బ్లాగులోనే దాన్ని చెయ్యవచ్చు.
నా ఆలోచన ఇది:
మీరు ఒక కొత్త సెక్షన్ తెరవాలి.పేరు "అచ్చ తెలుగు నుడికారం" అని పెట్టండి.ఇప్పటికే నా బ్లాగులోనూ ఇక్కడా ప్రస్తావనకి వచ్చిన నాలుగైదు మాటల్తోనే మొదలు పెట్టవచ్చు.
పదాలన్నిటినీ అకారాది క్రమంలో పబ్లిష్ చెయ్యవచ్చు.ప్రతి పదానికీ అక్కడ చెప్పాల్సిన అంశాలు
1.తెలుగు పదం = ఇంగ్లీషు పదం
తవ్వోడ = డ్రెద్గెర్
2.సేకరించిన వారు:నా పోష్టులో వున్నవాటికి నా పేరు వెయ్యొచ్చు.అక్కదా కామెంత్లలో కొందరు మరికొన్నిట్ని సూచించారు, చివర్లో ఆ లిష్టు ఇస్తాను.
3.వుపయోగించిన వారు:ఇది రెండు విధాల వ్యక్తుల్ని పరిచయం చేస్తుంది.యెవరు చెప్పారో తెలియని పదాలకి ఆజ్ఞాత వ్యక్తి అని వాడాలి.కొన్ని మాటల్ని ఒక పుస్తకంలో గానీ శాసనాల నుంచి గానీ తీసుకుంతే ఆ రచయిత పేరు
3.వాడకం:3వ అంశంలో చెప్పినట్టు యేదయినా పుస్తకం లోంచి తీసుకుంటే రచయిత వాడిన వాక్యాన్ని గానీ పద్యాన్ని గానీ వుదాహరణగా ఇవ్వవచ్చు.లేదంతే ఒక మోడల్ వాక్యం మనమే - అంతే మీరు ఇవ్వవచ్చు.
4.జన్మ ప్రదేశం:కొన్ని మాటలు ఇప్పటికే కొన్ని ప్రదేశాలకి మాత్రమే పరిమితమయితే కొన్ని మాటల్ని అన్ని జిల్లాల వాళ్ళూ అన్ని ప్రాంతాల వాళ్ళూ వడుతున్నారు.ఈ విధమయిన ప్రాంత సూచి ఆ మాట వాడుతున్న ప్రాంతాలకు గుర్తింపు నిస్తుంది.అన్ని ప్రాంతాల పదాలూ చ్చోటు చేసుకోవడం వల్ల రెండున్నర జిల్లాల భాషని రుద్దడం లాంటి అపార్ధాలు వుందవు.
ఈ పదనిధి చాలా అవసరం.మొదలు పెట్టదం తక్కువ పదాలతో మొదలు పెట్టినా లిష్టు పెరిగే కొద్దీ సేకరించి పంపే వారికి వుత్సాహం పెరగొచు.ఇలాంటివాటికి లాబహ్మ్ లేకపోయినా గుర్తింపు వుండాలి కదా!మెల్ల మెల్లగా ఇక్కడ లిస్తులో పదాలు పెరిగే కొద్దె వాదకం పెరిగి ఇదివరకు బలవంతంగా రుద్దాలనిపించే విధంగా జరిగిన ప్రామాణిక తెలుగు దాంతదే సహజమనిన పధ్ధతిలోనే రూపు దిద్దుకుంటుందేమో గదా?
చందస్సులో కూదా కేవలం తెలుగు పదాలనే వాదాలనే నిషేధం లేదు.మణిప్రవాళం పేరుతో ఇతర భాషా పదాల్నీ వెనకటి వాళ్ళు వుపయోగించహారు.ఆ ష్తానంలో ఇప్పుడు అచ్చ తెలుగు పదాల్ని కూడా వుపయోగించే వీలు దొరుకుతుంది.
నా వుద్దేశం అసలు భాషలో ఈ పదం వుంది దీన్ని మనం ఇలాగ వాడవచ్చు అని తెలిస్తే గదా వాడి భాషని పెంచగలిగేది అని! బ్లాగుల్లో మనం యెక్కడయినా ఆ లిస్టులోని పదాల్ని వాడినప్పుదు లింకుగా ఇక్కడ ఆ పదం వున్న పేజీని ఇస్తే మన పోష్టు చదివే వాళ్ళ్ళు కూడా ఇక్కడికి వస్తారు,కొత్త మాటల్ని చూస్తారు,వాళ్ళు కూడా నచ్చిన మాటల్ని వుపయోగిస్తారు.
-------------------------------------------------------------------------------
పైదారి = Fly-over
పొద్దు మాను = Light house
తవ్వోడ = Dredger
చిచ్చు గోలి(లు) = Lighter
పైవి నా పోష్టులో ఇచిన పదాలు.
------------------------------
కాల్దారి = Foot path
కిందారి = Subway
దొంగోడ=Submarine
గోరుగిల్ల/గోరుగల్ల=nail clipper/cuttter
వీవెన్ వీరపనేని
-------------------------------------
మునుగోడ=Submarine
bonagiri
--------------------
వీవెన్ వీరపనేని గారు కామెంటులో ఈ లింకు ఇచ్చారు.
http://www.andhrabharati.com/dictionary/About
P.S:http://magazine.palleprapancham.in/
మాదిరి
achchatelugu.palleprapancham.in/
అనే విధంగా వుత్సాహవంతులు వెళ్ళగలిగే విధంగా చెయ్యండి
హరిబాబు గారు,
Deleteమీ ఆలోచన బాగుంది.
హరిబాబు గారూ, నేను ఉటంకించిన జనార్ధన్ గారి టపా దొరికింది.
Deletehttp://telanganajanardhan.blogspot.in/2011/04/blog-post.html
హరి బాబు గారు మీ సూచన బాగుంది. నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఏ విషయం మీకు మెయిల్ చేస్తాను. మీ మెయిల్ ఐ.డీ ఇవ్వగలరు. తెలుగు భాష అభివృద్ధికి మనవంతుగా ఏమేమి చేయవచ్చో అన్నీ చేద్దా. మా పల్లెప్రపంచం విజన్ లో అదొక ఎజెండా. ధన్యవాదములు.
Deleteగుండు మధుసూదన్ గారి భావాలు కూడా చదివాను,బావున్నాయి - యాన మంచి కవి కూడాను! మరో అంశం వూహకి వచ్చింది
ReplyDelete5.మూలరూప విశ్లేషణ:తవ్వోడ లాంటివాటికి తవ్వుకుంటూ వెళ్ళే వోడ అని చెప్పి వొదిలెయ్య వచ్చు.కైఫీయత్తు అనే మాటకి వుర్దూ పదాన్ని కొంచెం మార్చాము గుణింతాన్ని చేర్చి అని చెప్పొచ్చు.ఫర్మానా అయితే అసలు మార్చకుండానే వుర్దూ పదాన్ని వున్నది వున్నట్టుగానే తీసుకున్నాం.అది కూదా పదానికి సంబంధించిన ముఖ్యమయిన అంశమే.
వీరపనేని గారు ఇచ్చిన లింకులో మాండలిక పదకోశాలు అని ఆల్రెదీ వున్నట్టున్నాయి - అక్కడి నుంచి కొడా వారి అనుమతితో సేకరించవచ్చు.అన్నీ ఒకచోత వీలయినంత తేలిగ్గా చేరుకోదగిన విధంగా ఇక్కద వుంచటానికి వారుకూడా వొప్పుకోవచ్చు.
ఆంధ్రభారతి నిఘంటు శోధనలో చేర్చిన నిఘంటువులు అందరికీ ఉచితంగానే వెతుక్కోగలిగే విధంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడి నుండి మరోచోట చేర్చడం ప్రయాస అవుతుందనుకుంటున్నాను. అయితే మనం ఆసైటుని నిర్వహించడానికి లేదా నిఘంటువులను డిజిటీకరించడానికి వారికి సహకారం అందించవచ్చు.
ReplyDeleteకొత్త తెలుగు పదాలను లేక పాత పదాలకే కొత్త వాడుకలను సేకరించడానికి నేను తెలుగుపదం అనే వికీ సైటుని మొదలుపెట్టి ఉన్నాను. దాన్నీ వాడుకోవచ్చు. అరుదుగా వాడే పదాల వాడుకలనూ లేదా రచనల్లో వాడుకల్లోకి వచ్చే కొత్త పదాలనూ ఇలా డాక్యుమెంట్ చెయ్యవచ్చు.
సేకరించడం ఒక ఎత్తయితే, వాటిని జనాలకు చేరేలా చెయ్యడం మరోటి.
కొత్త తెలుగు పదాల వ్యాప్తికీ, ప్రచారానికి కూడలిలో పైన ఈవారం తెలుగుపదం పేరిట చిన్న బ్యానరుని ప్రదర్శనకు ఉంచేవాడిని. కొన్ని పదాలను చిత్రరూపంలో వివరించానికీ ప్రయత్నించాను. వాటిని ఇక్కడ చూడవచ్చు.
మీరిచ్చిన లింకులను తీరికగా పరిశీలిస్తాను వీవెన్ గారు. వివరణకు ధన్యవాదములు.
Delete