తెలంగాణాలో 
నిజాం కాలం లో తెలుగు పరిస్థితికీ, నేటి పరిస్థితికీ తేడా ఏమిటి?
  • మీ అభిప్రాయాలు తగిన ఆధారాలతో ఉంటే మంచిదని విజ్ఞప్తి.
  • నిజాం పాలనలో తెలుగుకు బూజు పట్టిందన్న వాదన సరయినదేనా?
  • లేక తెలుగు కవులకు మంచి వెలుగులే ఉండేవన్నది నిజమా?
  • మొత్తం మీద తెలంగాణాలో నిజాం కాలం నాటి తెలుగు పరిస్తితి ఎలా ఉండేది?
  • నేడు తెలంగాణాలో తెలుగు పరిస్తితి ఎలా ఉన్నది?
*Re-published

Post a Comment

  1. ఆంగ్లేయుల కాలంలో దేశంలో అక్షరాస్యత 12% ఉంటే హైదరాబాద్ రాష్ట్రంలో అది కేవలం 4% ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉండగా అందులో 8 తెలుగు మాట్లాడే జిల్లాలు. కానీ స్కూల్‌లలో ఉర్దూ మీదియం ఉండడం వల్ల చాలా మంది చదువు నేర్చుకునేవాళ్ళు కాదు. చదువుకున్నవాళ్ళు కూడా ఉర్దూ లిపిలో తెలుగు వ్రాసేవాళ్ళు. సురవరం ప్రతాపరెడ్డి గారు కర్నూల్ జిల్లాలోని తన బంధువుల ఇంట్లో ఉండి తెలుగు మీదియంలో చదువుకున్నారు.

    ReplyDelete
  2. మీరు కరీంనగర్ లో చదివినట్లున్నారు ప్రవీణ్?

    ReplyDelete
  3. నేను కరీమ్‌నగర్‌లో మూడవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు చదివాను. నా మిగితా విద్యాభ్యాసం అంతా శ్రీకాకుళంలోనే జరిగింది.

    ReplyDelete
  4. ప్రవీణ్ గారు,
    తెలంగాణా వెనుకబాటుకు కారణం తెలుగు భాష అభివృద్ధికాకపోవడమూ ఓ కారణమని నా అభిప్రాయం. ఇక్కడ బలవంతంగ ఉర్దూ మాత్రమే చదివించేవారని, తెలుగు బదులు ఉర్దూ మాట్లాడించడానికి బలవంత పెట్టేవారని తెలుగు పాఠశాలలు చాలా తక్కువగా ఉండేవని పెద్దలు చెప్పేవారు. మాది ఆంధ్రా బోర్డర్ ప్రాంతం కనుక మా ప్రాంతం వారు చెప్పేదాని ప్రకారం తెలంగాణాలో తెలుగుకు నిజాం కాలంలో గడ్డు పరిస్తితే ఉండేది. ఆంధ్రా ప్రాంతం వెళ్లి చదువుకున్నవారు, తెలంగాణాలో తక్కువ స్కూళ్లలో మాత్రమే తెలుగు ఉండేది కనుక చాలా దూరం నడచి వెళ్లి చదువుకునేవారని తెలుసు. కానీ నిన్న శ్యామలీయం గారి బ్లాగులొ జై గారి ప్రశ్న నాకు చిత్రంగా అనిపించింది. అయితే ఆయన ఒక్క ఉదాహరణ చెప్పండని చాలెంజ్ చేసినట్లడిగితే దీని గురించి తేల్చాలనుకున్నాను. తేల్చాలంటే కోపంతో కాదు కదా? ముందు తెలుసుకోవాలి కదా? అందుకే ఈ ప్రశ్న ఉద్భవించింది. మీరైతే కాస్త వివరంగా చెప్పగలరేమో ప్రయత్నిస్తారా? ఆలస్యమైనా ఫర్వాలేదు ఈ ప్రశ్నపై సవివరంగా ఓ ఆర్టికల్ వ్రాయగలరా? లేదు ఆల్‌రెడీ సమాధానం వివరాలు రెడీగా ఉంటే కామెంట్ల రూపంలో ఇక్కడే చెప్పినా ఫర్వాలేదు. మీరు కరీం నగర్ లో చదివారు కాబట్టీ అక్కడ పరిస్తితులూ గమనించే అవకాశం ఉంటుంది కనుకనే మీరు కరీం నగర్ లో చదివిన విషయాన్ని అడిగానండీ.

    ReplyDelete
  5. కరీమ్‌నగర్ జిల్లాలో ముస్లిం జనాభా కేవలం 7%. అక్కడి ప్రజలు ఉర్దూ పదాలు అంతగా ఉపయోగించరు. నాకు వాళ్ళ భాష సులభంగానే అర్థమయ్యేది. ఉర్దూ తెలంగాణలో చాలా మందికి non-native కనుక ఉర్దూ మీదియం చదువుల రోజుల్లో తెలంగాణలో చాలా మంది ఎందుకు చదువుకోలేదో ఊహించడం కష్టం కాదు.

    ReplyDelete
    Replies
    1. అర్ధం కాలా! మీ కామెంట్ ఉద్దేశం?

      Delete
    2. తెలుగు తమ భాష కాదనీ, తమ ప్రాంతంలో అక్షరం ముక్క రానివాడు కూడా హిందీ మాట్లాడుతాడనీ వాదించే కొందరు తెలంగాణావాళ్ళని ఉద్దేశించి అలా అన్నాను. హిందీ వేరు, ఉర్దూ వేరు. ఉర్దూలో "భ" వ్రాయడానికి "బ" పక్కన "హ" వ్రాస్తాను. ఉర్దూ రాక ముందు నిజాం రాజులు మాట్లాడిన పెర్సియన్ భాషలో అది కూడా లేదు. వాళ్ళు "భ"ని "బ" అనే వ్రాసేవాళ్ళు. నిజాం బూజు వల్లే తమకి తెలుగు సరిగా రాకుండా పోయిందని ఒప్పుకోలేనివాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారులెండి.

      Delete
    3. అదా! అర్ధం కాక మాత్రమే అడిగానండీ. అవును హిందీ వేరు - ఉర్దూ వేరు. మా నాన్న ఉర్దూ కొంత మాట్లాడేవాడు. తెలుగుకు నిజాం కాలంలో చాలా ఇబ్బందులుండేవనే నాకు మా ప్రాంత పెద్దల ద్వారా తెలుసు. ఎలా? అని వివరంగా చెప్పాలంటే ఆధారాలతో సహా వివరించాలి. నాకు తెలిసినదానివరకే అయితే అది సరిపోదు. మధ్యలో మొండివాదనల వీరులకు కరెక్టుగా సమాధానం చెప్పలేకపోతే అసలుకు మోసం వస్తుంది కనుక. తెలుసుకునే అవకాశం ఉండి వీలుపడక నాకు తెలీనవి, కొద్ది కొద్దిగా తెలిసినవాటి జోలికి పోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. భాషల విషయంలో మీలాంటి పట్టున్నవారయితే కాస్త వివరంగా చెప్పగలరని నా అభిప్రాయం. నిజాం ను అతిగా అనవసరంగా పొగడడం రజాకార్లు, దేశ్ ముఖ్ ల పట్ల అనవసర ఉదాసీనత లాగే తెలుగుకు నిజాం కాలం లో బూజు పట్టిందన్న నిజాన్నీ అంగీకరించలేకపోతే అది తప్పే. అయితే ఇక్కడ ఆ బూజు ఎలా పట్టిందన్నది సవివరంగా చెప్పాలంటే చరిత్ర అధ్యయనం సరిగా జరగాలి. ప్రస్తుతానికి ఆ విషయంలో నాకు సరిపడా నాలెడ్జ్ లేదు.

      Delete
    4. ఘటకేసర్ రైల్వే స్తేషన్ మీద ఉర్దూలో స్పెలింగ్ "ghtkysr" అని ఉంటుంది. ఆ స్పెలింగ్‌లో "y" ఒకటే vowel sound. దానికి దీర్ఘం గానీ హ్రస్వం గానీ సూచించేది ఏమీ లేదు. ఆ లిపిలో తెలుగు వ్రాయడం ఎంత కష్టమో ఊహించండి. నిజాం పోయి తరాలు గడిచినా ఆ బూజు మాత్రం పోలేదు.

      Delete
  6. కరీమ్‌నగర్‌లో మేము ఉన్న వీధిలో ముస్లింలు లేరు. దూరదర్శన్‌లో హిందీ సినిమాలు చూసేవాణ్ణి కానీ ఉర్దూలో మాట్లాడుకునేవాళ్ళని స్థానికంగా వీధికి ఒకరిద్దరిని మాత్రమే చూసాను.

    ReplyDelete
  7. హిందీ వేరు, ఉర్దూ వేరు. మొగుడు పెళ్ళాల్ని హిందీలో పతి-పత్నీ అంటే ఉర్దూలో శౌహర్-బీవీ అంటారు. తెలంగాణావాళ్ళు తమకి హిందీ వచ్చని చెప్పుకుంటారు కానీ వాళ్ళు హిందీలో లావారీస్, ఆవారా లాంటి పదాలకి కూడా అర్థాలు చెప్పలేరు.

    ReplyDelete
  8. వారెందుకు అర్ధాలు చెప్పలేకపోతున్నారు? కారణాలేమై ఉంటాయి?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top