చర్చాంశం - సాహిత్యం, మాండలికాలు, తెలుగు భాష
చర్చాంశాన్ని పంపిన వారు - పల్లా కొండల రావు.
సన్యాసి అని తిట్టడం సరయినదేనా!?
సాధారణంగా ఈ పదాన్ని తిట్టడానికి ఉపయోగిస్తుంటాము. సన్యాసి అనే పదానికి ఇది విక్రుతి లేదా వాడుక భాషలో సన్యాసికి బదులుగా సన్నాసి అని వాడుతుంటారు. సాధారణంగా పని చేయకుండా ఉండేవారిని ఇలా తిడుతూ ఉండడం మనం వ్యావహారికంగా చూస్తుంటాము. ఇది మాండలీకానికి సంబంధించినది కాదనుకుంటాను. నాకు తెలిసి తెలంగాణా - ఆంధ్రాలలో ఇరు ప్రాంతాలలోనూ ఇలాగే వాడతారనుకుంటాను. మరో రకంగా చెప్పాలంటే సంసారి కానివాడిని సన్యాసి అంటారనుకుంటాను. గృహస్తాశ్రమం - సన్యాశ్రమమ అంటూ హిందూ ధర్మంలో చెప్తుంటారు. నాకీ ఆశ్రమాల గురించీ తెలీదు. తెలిసిన వారు చెప్పాలి. ఇక్కడ నేనడగదలచుకున్నది ఎవరినైనా సన్నాసి అంటూ తిట్టడం సరయినదా? సన్నాసి అనేది సన్యాసి విక్రుతి అయితే సన్యాసి అనే ఓ జీవన విధానాన్ని కించపరచడం అవదా?
*Re-published
ఇక్కడ సన్యాసి అంటే భాద్యత లేకుండా తిరిగే వాడు అని. నిజమైన సన్యాసి భాద్యతలనుంచి విముక్తుడయితే, మనం తిట్టే సన్యాసి భాద్యతలనుంచి తప్పించుకు తిరిగేవాడు
ReplyDeleteవజ్రం గారు, అలాగే జరుగుతున్నదండీ. అయితే అలా పోల్చి తిట్టడం సన్యాస జీవితాన్ని అవమానించడం అవుతుందా? అనేదే నా ప్రశ్న. సన్యాసి అంటే ఏయే బంధనాలనుంది విముక్తుడవడమని హిందూ ఆశ్రమ ధర్మం చెపుతున్నదో తెలిసినవారు వివరిస్తే బాగుంటుందనుకుంటున్నాను. సన్యాసి తన పనులు తానే చేసుకుంటాడు. జీవించడానికి శ్రమ చేయాల్సిన అవసరం ఉన్నదా? లేక భిక్షాటననే సూచించారా? తెలుసుకోవాలనుంది.
Deleteకొత్త కామెంట్లు సరే,పాత పోష్టు లన్నీ యేమయినట్టు?కాలగర్భంలో కలిసి పోయినట్టేనా?!
ReplyDeleteపాత పోస్టులలో అవసరమైనవి రీ పబ్లిష్ చేస్తాను హరి బాబు గారు.
Delete