బ్లాగ్..బ్లాగ్..బ్లాగ్.. నిత్యం నెటిజెన్లకు వినిపించే మాట. చాలామంది గొప్ప వ్యక్తులు తమ బ్లాగులలో వ్రాసుకునే విషయాలు వార్తలుగా వస్తుంటాయి. అసలు బ్లాగ్ అంటే ఏమిటి? ఎవరు బ్లాగింగ్ చేయవచ్చు? ఎలా? ఏమిటి ప్రయోజనం అనే విషయాలు చూద్దాం.
బ్లాగ్ అనేది "వెబ్ లాగ్" నుండి వచ్చినది. బ్లాగ్ గురించి ఆన్‌లైన్ లో తెలుసుకోవాలంటే కొన్ని మిలియన్ పేజీలే సమాచారం ఉంది. సింపుల్ గా డిఫైన్ చెయ్యాలంటే, మన నిత్య జీవితంలో జరిగే విషయాలను లేదా మనకు నచ్చిన, ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకోవడానికి "బ్లాగ్" పుట్టినది. టెక్నికల్ గా బ్లాగ్ అంటే "ప్రతి నిత్యం సమాచరం లేదా పోస్ట్లతో అప్డేట్ అయ్యేది". చాలామంది ఈనాడు, సాక్షి లాంటి పత్రికల పోర్టల్‌ను వెబ్సైట్లగానూ, బ్లాగర్ మరియు వర్డ్‌ప్రెస్ బ్లాగులను మాత్రమే బ్లాగులుగా గుర్తిస్తున్నారు. ఇది నూటికి నూరు శాతం తప్పు.
వెబ్‌సైట్ అంటే?
ఒక వెబ్సైట్ లో పోస్ట్లు ఉండవు. ఉదాహరణకు "గూగుల్" ఒక వెభ్సైట్. వెబ్ సైట్లో కొన్ని పేజీల మారని సమాచరం మాత్రమే ఉంటుంది. అదే బ్లాగు అయితే దీనికి డిఫరెంట్ గా ఉంటుంది. మనకిష్టమొచ్చిన సమాచారం తో పోస్టులు వ్రాసుకోవచ్చు.
బ్లాగును సృష్టించడం ఎలా?
ఆన్‌లైన్ లో నేడు బ్లాగుని తయారుచేసుకోవడం, డిజైన్ చేసుకోవడం అన్నీ పూర్తిగా ఉచితం మరియు సులభం. బ్లాగును తయారుచేసుకోవడానికి ప్రస్తుతం చాలా వెబ్సైట్లు అవకాశం ఇస్తున్నాయి. అందులో అత్యంత ప్రాముఖ్యత పొందినవి బ్లాగర్ (గూగుల్) మరియు వర్డ్‌ప్రెస్.
బ్లాగుల వల్ల ఉపయోగాలు?
బ్లాగుని ఒక ఆన్‌లైన్ డైరీలా ఉపయోగించుకోవచ్చు. మీకు తెలిసిన ఎన్నో విశయాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయవచ్చు. ఏ మనిషికీ అన్ని విషయాలూ తెలియవు. ఒకరికి తెలిసిన విషయాలు మరొకరికి తెలియకపోవచ్చు. మనం ఉన్నా లేకపోయినా, మనకు తెలిసిన విషయాలను షేర్ చేసుకోవడం ద్వారా, అవి వేరొకరికి ఉపయోగపడవచ్చు.
సత్సంబంధాలు ఏర్పరచుకోవచ్చు !
బ్లాగుల వల్ల ఆన్‌లైన్ లో అనేక మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది (Communication).మన భావాలతో దగ్గరగా ఉండేవారు మనకు స్నేహితులవుతారు. మన సమాచారాన్ని మరింతగా అప్డేట్ చేసుకోవచ్చు. మనకు తెలిసినవి వారికి , వారి ద్వారా మనం నిత్యం నేర్చుకోవచ్చు.
ఆదాయం సంపాదించుకునే అవకాశం !
మన బ్లాగులను Monetize చేసుకోవడం ద్వారా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత Ad Networks లో Google Adsense మొట్ట మొదటి స్థానంలో ఉంది. కానీ, ప్రస్తుతం Google తెలుగు భాష లో రాసే బ్లాగులకు Ads ఇవ్వడం లేదు. మరి కొంత కాలంలో అన్ని భాషలకు Adsense వస్తుందని Google అధికారికంగా చెప్పింది. గూగుల్ కు ఆల్టర్నేటివ్ గా చాలా Ad Serving Sites ఉన్నాయి. ఒకసారి ఆన్‌లైన్ లో సర్చ్ చేసి మీకు నచ్చిన Ad Serving Site లో రిజిస్టర్ అయ్యి Ads ను డిస్ప్లే చేసుకుని ఆదాయం తెచ్చుకోవచ్చు.
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.