----------------------------------
అంశం - 'తెలుగు' పదం అర్ధం తెలుసుకోవడం
పదం పంపిన వారు - సత్యనరహరి
ఈ ప్రశ్న నన్ను ఒక 6వ తరగతి చదివే పాప అడిగింది . వాళ్ళ అమ్మ గుజరాతి , నాన్న తెలుగు. గుజరాత్ లో మాటలాడే గుజరాతి , కర్ణాటకలో కన్నడ , పంజాబ్ లో పంజాబీ , మహారాష్ట్రలో మారాటి , తమిళనాడు తమిళం , ఒరిస్సా లో ఒరియా, బెంగాల్లో బెంగాలి ఇలా అన్నారు కదా, మరి "ఆంధ్రలో ఆంధ్రం అనకుండా 'తెలుగు' అని ఎందుకు అన్నారు అంకుల్ ? "అని అడిగింది . దానికి నేను ఇలా సమాధానం చెప్పాను. తెలుగు అనే పదం "తెలుసు" , లేదా "తెలివి" అనే పదం నుంచి వచ్చింది . దీనికి ప్రాంతీయ అర్థం కాదు విషయాలు తెలుసుకొంటూ పోవటమే దీని లక్ష్యం. సంస్కృతం తర్వాత తెలుగుకే అంతటి వ్యాకరణ నియమాలు, సుందర తత్వం ఉండేది. తెలుగు పదం గురించి మీకు తెలిసిన విషయాలను కూడా ఇక్కడ వ్యాఖ్యానించగలరని విజ్ఞప్తి.
----------------------------------
*Re-published
*Re-published
ReplyDeleteతెలుగు అన్నపదము తెనుగు నుంచి వచ్చెను.
తెనుగు అన్న పదమున కర్థము దక్షిణ భాష.
తెన్ - అనగా అరవము లో దక్షిణము ; తెన్ మొழி లా అన్న మాట. అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజు.
అనగా తెనుగు అరవము నుంచి వచ్చెను లేక అరవమునకు దగ్గిరి భాష. అరవ దేశమునకు పై భాగము గోదావరికి క్రింది భాగము లో మాట్లాడు భాష.
ఆంధ్రము అన్నది ఉత్తరాది సంస్కృతము నించి వచ్చినది అనగా గోదావరి తీరమునకు పై బడి న ప్రదేశము లో నించి వచ్చినది. అట్లా వచ్చి వచ్చి గోదావరి దాటి తెనుగు తో కలిసి పోయెను.
ఇట్లు
జిలేబి
జిల్బెఇ
కేరళలో మళయాలం.
ReplyDelete