----------------------------------------
ప్రశ్నిస్తున్నవారు - పల్లా కొండల రావు
అంశం : రచనలు-విమర్శలు-వ్యక్తిగతాలు
----------------------------------------

ఓ రచనను విమర్శించేటప్పుడు రచయిత వ్యక్తిగత జీవితాన్ని తెగనాడడం అవసరమా?

కొందరు తమ వాదనను రచయిత వెలిబుచ్చిన భావాలపై గాక ఆ రచయిత వ్యక్తిగత జీవితంపై చేస్తుంటారు. కొందరు నేతలపై కూడా ఇలాగే విమర్శలు గుప్పిస్తుంటారు. ఇలాంటి పద్ధతివల్ల ఏమి ప్రయోజనం? ఇలా చేసేవారి అసలు ఉద్దేశం ఏమిటి? ఇది సరయినదేనా? తెలుగు బ్లాగులలో నేను గమనించిన వాటిలో కారల్ మార్క్స్, మావో, గాంధీ వంటి నేతలపైనా, రంగనాయకమ్మ , చలం  వంటి రచయిత పైనా ఇలాంటి విమర్శలను గమనించాను. రచనను, వ్యక్తుల జీవితాలను అవసరాన్ని బట్టి విమర్శించవచ్చు. రచనలోని అంశాలని విమర్శించాల్సిన సమయంలో  ఆ రచన చేసిన వారిని వారి వ్యక్తిగత జీవిత అంశాలతో విమర్శించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? మీ అభిప్రాయం ఏమిటి? 

------------------------------------------------
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. కొన్నిసార్లు అవసరం, నా వరకు నేను వ్రాసిన blog లో నేను ఆచరించేవి కొన్ని రాస్తుంటాను అంటే దాని అర్ధం నాకు ఒప్పు అన్నది ఇంకొకరి పైకి రుద్దడానికి నా ప్రయత్నం. దాన్ని ఆమోదించేవారు ఉంటారు వ్యతిరేకించే వారు ఉంటారు.
    నా జీవన విధానం తెలిసిన వారైతే నా వ్రాతని అన్వయించడం పదులు నేను చేసే చెడు అన్వయిస్తారు, అందుకే శ్రీరంగ నీతులు చెప్పడానికే అనే సామెత విసురుతారు!
    ఇక వ్రాసినవన్నీ నిజాలా? కాదు దాంట్లో తనని ఒక నాయకుడిగా సమర్దించుకుని వ్రాసినవి చాలా ఎక్కువ, అందుకేనెమో ఆ వ్రాతలు వ్రాసిన వారి మీద వ్యక్తిగత దూషణలు చేస్తుంటారు!
    ఇక అది సహేతుకం అవునా కాదా అంటే చెప్పలేను, ఎందుకంటే కొందరు ప్రజలందరూ capitalism వైపు వెళ్ళకూడదు అని చెప్పి /వ్రాసి వాళ్ళ పిల్లలను మాత్రం capitalist సంస్థలలో చదివిస్తారు.

    ReplyDelete
  2. పదేళ్ళ క్రితం తెలుగు బ్లాగులు లేవు కానీ ఒక ఇంగ్లిష్ వెబ్‌సైత్‌లో బాబాలూ, సన్యాసుల రాస లీలల గురించి చర్చ జరిగింది. ఒకాయన అన్నాడు "సన్యాసులు కూడా మనుషులే, వాళ్ళకి కూడా సెక్స్ కోరికలు ఉంటాయి" అని. నేను చెప్పినది ఏమిటి? "సన్యాసులు కూడా మనుషులే, వాళ్ళకి వ్యక్తి పూజ చెయ్యకూడదు" అని. నేను చెప్పినదే అతను తిరిగి నాకు చెప్పాడు. రాజకీయ నాయకులు ఏమీ దేవుళ్ళూ కాదు, సన్యాసులు కూడా కాదు. నిత్యం దైవ చింతనలో ఉండే సన్యాసులే తమ కోరికలని ఆపుకోలేనప్పుడు రాజకీయ నాయకులు మాత్రం అలా ఆపుకోగలరా?

    ReplyDelete

  3. ఇటువంటి ప్రశ్నలకు ఇతమిత్థంగా జవాబు ఇవ్వడం కష్టం.మామూలుగా వ్యక్తిగతవిమర్శ మంచిది కాదు.కాని ఒక వ్యక్తి ఒక విషయాన్ని అదేపనిగా ప్రచారం చేస్తూ దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అప్పుడు వ్యక్తిగతం గా విమర్శించవచ్చును అనుకొంటాను.

    ReplyDelete

  4. >>>> ఓ రచనను విమర్శించేటప్పుడు రచయిత వ్యక్తిగత జీవితాన్ని తెగనాడడం అవసరమా?

    జవాబు : మరీ మరీ అవసరం; ఇంకా ఆండోళ్ళైతే ఫెమినిజమంటూ వాయించాలి; మగ రాయుళ్ళైతే నాచియో , ఆంటి నాచియో తెలియాలి :) జిలేబులా జాంగ్రీ లా , పచ్చి మిరపకాయలా ఎండు మిరప కాయలా వాళ్ళ పుట్టు పూర్వోత్తరా లేమిటి ? వారి కి ఆస్తి ఎంత ? (పడవ లాంటి కారు ఉందా :)) ఇవన్నీ తెలియ వలెను :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  5. రంగనాయకమ్మ గారి విషయానికి వస్తే, ఆవిడ రచనలు చదవకుండానే ఆవిణ్ణి విమర్శించేవాళ్ళు ఉన్నారు. బాబు గోగినేని అనే నాస్తికుడు రంగనాయకమ్మ గారి రచనలు చదవలేదు. ఆయన రంగనాయకమ్మ గారి మీద ఇతర నాస్తికులు వ్రాసిన విమర్శలు చదివాడు. భారత నాస్తిక సమాజంవాళ్ళు నాస్తికత్వం వల్ల కులం, కట్నం పోతాయని నమ్మితే చిత్తజల్లు వరహాల రావు (సి.వి.)గారు నాస్తికత్వం వల్ల వర్గం కూడా పోతుందని నమ్మేవారు. గోగినేని గారు తాను భా.నా.స.వారి రచనలు చదివారో, సి.వి.గారి రచనలు చదివారో చెప్పలేదు. రంగనాయకమ్మ గారి విరోధులందరి అభిప్రాయం కూడా ఒకటి కాదు. ఒక వ్యక్తి గురించి తెలియకుండా, ఆ వ్యక్తి విరోధుల గురించి కూడా తెలియకుండా వ్యక్తిని తిడితే ఇలాగే ఉంటుంది.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top