మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
Name: | Praveen |
E-Mail: | deleted |
Subject: | ఇది పోరపాటా లేదా అజ్ఞానమా? |
Message: | సి.పి.ఐ., సి.పి.ఎం.ల కార్యకర్తలలో చాలా మందికి కమ్యూనిజం అంటే ఏమిటో తెలియదు. ఇది నా హైపోథీసిస్ కాదు, కళ్ళతో చూసిన వాస్తవం. విజయనగరం జిల్లాలో ఒక వామపక్ష విద్యార్థి సంఘం (సి.పి.ఐ. అనుబంధ సంస్థో, సి.పి.ఎం. అనుబంధ సంస్థో గుర్తు లేదు) వాళ్ళు అంటించిన పోస్టర్లలో మండలానికొక కాలేజ్ పెట్టాలనీ, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెంచాలనీ వ్రాసి ఉంది. ప్రభుత్వం అనేది ఉన్నదే సొంత ఆస్తి వ్యవస్థని పరిరక్షించడానికి. సొంత ఆస్తిని రద్దు చేస్తే ప్రభుత్వం అవసరం ఉండదు. సొంత ఆస్తి రద్దు అవ్వాలని కోరుకునేవాడు ఎవడూ ప్రభుత్వం బలపడాలని కోరుకోడు. నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే పరిశ్రమలు పెట్టాలి కానీ దానికి ప్రభుత్వ ఉద్యోగాలు (తహసీల్దార్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు) పెంచడం మార్గం కాదనుకుంటాను. ఈ వామపక్ష విద్యార్థి సంఘంవాళ్ళకి కమ్యూనిజం అంటే ఏమిటో తెలుసా, లేదా అనే సందేహం వస్తుంది. కమ్యూనిజమ్‌ని మొదట ప్రతిపాదించినది ఫ్రాన్స్‌కి చెందిన విక్తోర్ దీ'హూపే. కమ్యూన్ అంటే ఉమ్మడి, కమ్యూనిజం అంటే ఉమ్మడి ఆస్తివాదం. కమ్యూనిజం సాధించడానికి గతితార్కిక చారిత్రక భౌతికవాదం అవసరం అని ప్రతిపాదించినది మాత్రం మార్క్స్, ఏంగెల్స్‌లు. సొంత ఆస్తి ఉన్నప్పుడే ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసులూ, పోలీస్ స్టేషన్‌లూ, కోర్టులూ అవసరం అవుతాయి కానీ ఉమ్మడి ఆస్తిలో వాటి అవసరం ఉండదు. కమ్యూనిజం అంటే ఏమిటో తెలిసినవాడు (అతను మార్క్సిస్ట్ అయినా, కాకపోయినా) ఎవడూ ఈ వామపక్ష విద్యార్థి సంఘంవాళ్ళని కమ్యూనిస్టులు అనుకోడు. |
-----------------
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ పోస్టర్లు చూసాను. ఈ పోస్టర్లు చూసిన తరువాత నేను డైలెమాలో పడిపోయాను. - ప్రవీణ్
ReplyDeleteconcept:నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే పరిశ్రమలు పెట్టాలి కానీ దానికి ప్రభుత్వ ఉద్యోగాలు (తహసీల్దార్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు) పెంచడం మార్గం కాదనుకుంటాను.
ReplyDeletequestion:పరిశ్రమ పెట్టాలంటే పెద్ద స్థాయిలో పెట్టుబడి పెట్టాలి.ఎవడన్నా పెట్టుబడితో వస్తే నీలాంటి రాజీ పడని వాడు కమ్యునిష్టు సిద్ధాంతం ప్రకారం అంత స్థాయిలో వాడి దగ్గిర చేరినది దోపిడీ సొమ్ము కాబట్టి వీలు కుదిరితే చంపో లేకుంటే బొక్కలో తోయించో వాడి సొంత ఆస్తిని అర్జెంటుగా అందరికీ పంచెయ్యాలని అంటాడు.పెట్టుబడీ రాదు,పరిశ్రమలూ రావు,ఉద్యోగాలూ రావు,నినాదాలూ కంఠశోషా మిగుల్తాయి.
స్వంత ఆస్తి అనేది లేకపోతే పెట్టుబడి పెట్టే స్థాయి డబ్బు ఇప్పటికిప్పుడు ఎవడు ఇస్తాడు?పోనీ విప్లవం వచ్చేవరకు స్వంత ఆస్తిని ఒప్పుకుని అప్పుడు రద్దు చెయ్యాలని రాజీ పడితే ఆ విప్లవం ఎప్పటికి వస్తుంది?రాజీ పడకపోతే పరిశ్రమలు రావు - విప్లవమూ రాదు!రాజీ పడినవాళ్ళని అసలు కమ్యునిష్టులే కాదంటావు!కమ్యునిష్టు సిద్ధాంతం అంటే అన్నిటి మీద క్లారిటీ ఇచ్చేది అని గదా చెప్తారు,మరి నీకీ కన్ఫ్యూజన్ యేంటి తమ్ముడూ?
చైనాలో సాంస్కృతిక విప్లవ సమయంలో మేనేజర్‌లు లేకుండానే కొన్ని ఫాక్టరీలు నడిచాయి. మేనేజర్లు అవసరం లేని దానికి పెట్టుబడి మాత్రం అవసరమా?
ReplyDeleteమేనేజర్లకీ పెట్టుబడికీ సంబంధం ఏంటి?ఏ రకం కమ్యూనిష్టు సిద్ధాంతం ఫాలో అవుతున్నావు నువ్వు!
Deleteబోడిగుండుకీ మోకాలుకీ ముడిపెట్టి కమ్యూనిజం చావుని ఇంకాస్త ముందుకి లాక్కు రాకు!హరిబాబు అనే హిందూమతతత్వవాదికి కమ్యూనిజం గురించి ఏమి తెలుస్తుందిలే అనుకోకు - నాకు తెలిసే అడుగుతున్నాను.