ఎవరిని అడిగినా రాజకీయలను విమర్శించేవారే. రాజకీయమంతా రొచ్చంటున్నారు. అక్షరాస్యులు, ఉన్నత విద్యాభ్యాసం చేసినవారు సైతం ఓటుకు దూరంగా ఉంటున్నారు. రాజకీయం ప్రాధాన్యతని నేటి యువతైతే అసలు గుర్తించడం లేదు. సినిమా ప్రముఖులు, ఇతర ప్రముఖులు పలువురు సైతం రాజకీయాలంటే అనాసక్తి అన్నట్లే చెప్తుంటారు. ఇప్పటికీ రాజకీయాలలో మంచి నేతలున్నారు. వారికి మీడియాలో పెద్దగా ప్రచారం లభించడం లేదు. అంతా అసహ్యించుకుంటే మరి రాజకీయాలను బాగు చేసేదెవరు? ఈ వైఖరి వలన ఎవరికి నష్టం? ఎవరికి ప్రయోజనం? ఈ పరిస్తితిలో మార్పు రావాలంటే చేయాల్సినది ఏమిటి?
- పల్లా కొండలరావు
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
గుండెలమీద చెయ్యెసుకుని చెప్పండి. మనలో ఎవరు రాజకీయాలు చేయట్లేదు? అందుచేత మనల్ని మనమే అసహ్యించుకుంటున్నాం అన్నమాట!
ReplyDeleteఅర్ధం కాలేదు సూర్య గారు. రాజకీయం అంటే మీరు ఏ భావంతో ఈ వ్యాఖ్య చేశారు?
ReplyDelete