' నాకు నచ్చిన పాట ' శీర్షికలో ఈ  పాటను పరిచయం చేసిన వారుమల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి గారు. 
   ***   ***   *** ***  
చిత్రం        :     ఆత్మ బంధువు. (1962)
గానం       :      ఘంటసాల వెంకటేశ్వరావు.
సంగీతం    :      K.V మహదేవన్.
గీత రచన  :      సముద్రాల జూనియర్.
***   ***   *** ***
ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు గారి నటన, దానికి ధీటుగా యస్వీ.రంగారావు గారి నటన చూసి తీరవలసిందే కానీ చెప్పనలవి కానిది. ఈ రోజుల్లో ఆ కధలు ఇప్పటి వాళ్ళకు సోదిగా అనిపించవచ్చు. కానీ బంధాలు, ఆప్యాయతలు, భాద్యతలు, పెద్ద-చిన్న గౌరవాలు ఎన్ని నిక్షిప్తమై ఉంటాయో! 

ఈ కధలో.ఒక పక్క తల్లిగా కన్నాంబ గారి హృద్యమైన నటన కళ్ళ నీరు తెప్పిస్తుంది. అమాయకమైన అక్షర జ్ఞానం లేని పాత్రలో కేవలం పెంచిన తల్లిదండ్రులపై ప్రేమ, పిల్లలపై మమకారం, కుటుబం చిన్నాబిన్నమైనపుడు రామారావు గారి వ్యధ, అది చక్క బెట్టటానికి సావిత్రి, తను పడే కష్టాలు సినిమా మొత్తం హృదయాన్ని కదిలించే సన్నివేశాలతో నాకు బాగా ఇష్టమైన సినిమా. 

అందునా ఈ పాటంటే మరీ ప్రాణం. దాని సాహిత్యమొచ్చి సముద్రాల జూనియర్ ఎంత బాగా వ్రాశారో!


ఎవరో ఏవూరో ఎవరు కన్నారో,ఈ విధి నను కొలువా తపమేమి చేశాను కృష్ణయ్యా.. ! చెప్పినట్టుగా సేవలు చేసేను, మా మేలే ఎపుడూ తలచేను, పిల్లలకు ప్రేమలు పంచేను, విసుగే లేదు ఆ కన్నులకు కృష్ణయ్యా! అని అర్ధం వచ్చే చరణాలు. మనసులను కదిలిస్తాయి. 

ఈ పాట సాహిత్యమంతా ఒక ఎత్తు. ఈపాటకు యస్వీ రంగారావుగారి అభినయం చూడాలి మనసున్న ప్రతీవారికీ కళ్ళ నీళ్ళు రాక మానవు.

                                                          ***    ***     ***     ***

ఎవరో ఏ ఊరో 
ఎవరో ఏ ఊరో ఎవరు కన్నారో (2)
ఈవిధి నను కొలువ తపమేమి చేసానో (2) కృష్ణయ్యా (ఎవరో ఏ ఊరో)

చెపినట్టు వినియేను సేవలు చేసేను
పసిపిల్లలకు అల్లారుపాట పాడేను
కనురెప్ప విధాన మా మేలే తలచి కాపాడేను

విసుగే లేదు ఆ కన్నులలోను కృష్ణయ్యా, కృష్ణయ్యా(ఎవరో ఏ ఊరో)
మమకారము నా మది పెరిగేను
కృష్ణయ్య ఉపకారము ఇంతింతని పలుకగలేను

సఖుడై, మంత్రియై, సద్గురుసత్తముడై
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుథ్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం
కనరాని దేవుడై, కనులకు సేవకుడౌ రంగయ్యా (ఎవరో ఏ ఊరో)

రంగా రంగా (6)
***    ***     ***     ***

ఈ సినిమాలోనే మరో 2 పాటలు " మారదు మారదు మనుషుల తత్వం మారదు" ,  "చదువు రాని వాడవని దిగులుచెందకు". కూడా చాలా బాగుంటాయి. " చదువు రాని వాడవని " పాటలోని సాహిత్యం నాడు, నేడూ అందరినీ ఆలోచింప జేసేలా వుంటుంది.

నాకు మాత్రం పై పాట, యస్వీ ఆర్ గారి నటన చాలా ఇష్టం. ఈ ఒక్క పాట కోసం సినిమా చాలా సార్లు చూసాను, చూస్తూనే వుంటా ఇప్పటికీ! మా పిల్లలూ, వారూ కొంచెం హేళన చేసినా, నా అభిరుచులు ముందు అవి పట్టించుకోను.

ఇదండీ నాకు నచ్చిన పాట! మీకు కుదిరితే మీరూ చూడండి. నాకు నచ్చిన పాట గురించి ప్రస్తావించుకునే అవకాశమిచ్చినందుకు "పల్లె ప్రపంచం" కు ధన్యవాదాలు.

మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి

***   ***   ***   
*** *** *** మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే ఇక్కడ నొక్కండి. *** *** *** 
*Republished

Post a Comment

  1. ధన్యవాదములు రాజ్యలక్ష్మి గారు.

    ReplyDelete
  2. “ ఎవరో, ఏ ఊరో .... “ మనసును కదిలించేసే గొప్ప పాట 👌. రాజ్యలక్ష్మి గారిలాగానే నేను కూడా ఆ సినిమాని ఈ పాట కోసమే చూస్తుంటాను. మంచి పాటని ముందుకు తెచ్చినందుకు రాజ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top