భారత ప్రభుత్వం ఇంగ్లిష్ మాధ్యమ విద్య పేరుతో జనాన్ని ఫూల్ చేస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 85% మందికీ, MBA విద్యార్థుల్లో 94% మందికీ ఇంగ్లిష్ సరిగా రాదని ప్రభుత్వం చెయ్యించిన సర్వేలోనే తేలింది. 

ఇంగ్లిష్‌తో పోలిస్తే హిందీ నేర్చుకోవడం సులభం. హిందీలో "the, a" లాంటి articles ఉండవు, perfect tenses కూడా ఉండవు. ఇంగ్లిష్‌లో I have been అనాల్సిన చోట I was అంటే ఇంగ్లిష్‌వాళ్ళు విచిత్రంగా చూస్తారు కానీ హిందీలో అలాంటి తేడాలు ఉండవు. మన కేంద్ర ప్రభుత్వం హిందీని ప్రోత్సహించకపోవడానికి కారణం తమిళ తంబీల అభ్యంతరమే. హిందీ భాష దేశ స్వాతంత్ర్య సంగ్రామం వల్ల ప్రాచుర్యం పొందింది. అప్పట్లో మద్రాస్ రాష్ట్రంలో దేశ స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకించిన Justice Party అధికారంలో ఉండేది. హిందీ భాష అవసరం లేదని Justice Party నాయకులు అనుకున్నారు. ఆ Justice Party పేరు మారి DMK అయ్యింది. DMK దెబ్బకి తమిళనాడులో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌తో సహా జాతీయ పార్తీల నాయకులు ఎవరూ హిందీ గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. 

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో కూడా చాలా మందికి హిందీ రాదు. ఆంధ్ర ప్రదేశ్ ఒకప్పుడు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండడం వల్ల ఇక్కడ చాలా మంది హిందీ నేర్చుకోలేకపోయారు. తెలంగాణా నిజాం పాలనలో ఉండేది. అప్పట్లో అక్కడ దఖినీ ఉర్దూ అధికార భాషగా ఉండేది. దఖినీ ఉర్దూలో పెర్సియన్, అరబిక్ పదాలు ఎక్కువగా ఉంటాయి. హిందీ మాట్లాడేవాళ్ళకి ఆ భాష అర్థం కాదు. ఉదాహరణకి వేశ్యని హిందీలో "వేశ్యా" అంటారు, ఉర్దూలో "అస్మత్ ఫరోష్" అంటారు. అరబిక్ భాషలో అస్మత్ అంటే శీలం, పెర్సియన్ భాషలో ఫరోషీ అంటే వర్తకం. అస్మత్ ఫరోష్ అంటే శీలాన్ని అమ్ముకునే స్త్రీ అని అర్థం. పెర్సియన్, అరబిక్ పదాలు అంతగా వినని హిందీవాళ్ళకి అస్మత్ ఫరోష్ లాంటి పదాలు పాషాణ పాకం (రాయితో చేసిన మిఠాయి)లాగ కొరక రానివిగా ఉంటాయి. అందుకే హైదరాబాదీ ఉర్దూ విన్న తెలంగాణావాసులు హిందీలో వెనుకబడిపోతారు. 

జెర్మనీలో చాలా మందికి ఇంగ్లిష్ రాదు. అయినా జెర్మనీ 200 సంవత్సరాల క్రితమే పెట్టుబడిదారీ దేశం అయ్యింది. మన దేశంలో ఇంగ్లిష్ అధికార భాష అయినా ఇప్పటికీ ఇక్కడ 70% మంది పల్లెటూర్లలోనే ఎందుకు ఉంటున్నారు? స్పెలింగ్ రూల్స్ ఇంగ్లిష్, జెర్మన్ భాషల్లో వేరువేరుగా ఉంటాయి. జెర్మనీలో చాలా మందికి ఇంగ్లిష్ వ్రాయడం కూడా రాదు. ఖ (aspirated k)ని ఇంగ్లిష్‌లో వ్రాడానికి kh వాడుతారు కానీ జెర్మన్‌లో అయితే ch వాడుతారు. ముహమ్మద్ ప్రవక్త భార్య ఖదీజా పేరుని ఇంగ్లిష్‌లో Khadijah అని వ్రాస్తే జెర్మన్‌లో Chadīdscha అని వ్రాస్తారు. ఆ స్పెలింగ్ రూల్స్‌తో ఇంగ్లిష్‌లో వ్రాస్తే ఇంగ్లిష్‌వానికి ఒక్క ముక్క కూడా అర్థం కాదు. 

ఇంగ్లిష్ వ్రాయడం కూడా రాని ఒక దేశంవాళ్ళు 200 సంవత్సరాల క్రితమే పెట్టుబడిదారీ వ్యవస్థని అభివృద్ధి చేసుకుంటే మన దేశం ఆ దేశం కంటే 500 సంవత్సరాలు వెనుకబడి ఉంది. మనం ఇంకా ఇంగ్లిష్ చదువుల వల్లే బాగుపడతామని నమ్ముతున్నాం.
- Praveen Kumar


Post a Comment

  1. ప్రవీణ్, ఈ మొత్తం ఆర్టికల్ లో , ఇంగ్లీష్ అవసరమా , కాదా అని ఎక్కడ చెప్పావు నువ్వు ?
    సెకండ్ పేరా లో , హిందీ నేర్చుకోవడం సులభం అని చెప్పావు . తమిళ్నాడు లో హిందీ ఎందుకు నేర్చుకోరో చెప్పావు .
    మూడో పేరా లో వేశ్య ని వివిధ బాషల లో ఏమంటారో చెప్పావు .
    నాలుగో పేరా లో జర్మనీ లో ఇంగ్లీష్ లేదు అని చెప్పావు .

    అవసరమా కాదా అని ఎక్కడ చెప్పావు ? ,
    మనం ఒప్పుకున్నా , ఒప్పుకోక పోయినా , ఇంగ్లీష్ అంతర్జీతీయ భాష అయి కూర్చుంది కాబట్టి , ఖచ్చితంగా నేర్చుకోవాలి . టూత్ బ్రష్ నుండి , టాయిలెట్ పపెర్ వరకు అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటాయి సూచనలు . మన దేశం లో IT సేవలు అన్ని సర్వీసెస్ బేస్డ్ కాబట్టి , మనం ఇంకొకరికి సేవ చేస్తున్నాం కాబట్టి, యజమానుల భాష మనకి ఖచ్చితంగా రావాలి .
    ఇకపొతే జర్మనీ , మరి కొన్ని యూరోప్ కంట్రీస్ లో, ఇంగ్లీష్ కన్నా స్థానిక భాష కె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు .
    కాని ఇప్పుడు తరం లో వాళ్ళు కూడా ఇంగ్లిస్ నేర్చుకుంటున్నారు . జర్మనీ లాంటి దేశాలని మినిహయిస్తే , నో ఇంగ్లీష్ నో జీవితం .

    ReplyDelete
    Replies
    1. ఒకడికి ఇష్టం లేనిది మనం బలవంతంగా నేర్పించలేము. ఇందియాలో ఎక్కువ మంది చదివేది మార్కుల కోసమే కానీ చదువంటే ఇష్టంతో కాదు. ఆ పద్దతిలో చదివినవాడు MBA చదివినా అతను letter drafting కూడా సరిగా చెయ్యలేడు. అందుకే ఆవు వ్యాసం సరిగా వ్రాయడం రానివాడు IAS పరీక్ష పాసవ్వడం ఉత్తర భారత దేశంలో జరిగింది.

      Delete
  2. In Europe, English is widely spoken only in England, Ireland and some parts of Nederlands. Italians can't speak English. Their English sounds like the butler English spoken by Indians.

    ReplyDelete



  3. ఉద్యోగానికి అవసరమో లేదో తెలీదు కాని తెలుగు బ్లాగుల్లో కామెంట్లు రాయడానికి మాత్రం ఇంగ్లీషు చాలా చాలా అవసరం :)

    జిలేబి

    ReplyDelete
  4. It is difficult to type Telugu on Micromax mobile. I use Telugu while using Galaxy Tab.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top