మానవ జీవనావసరాలలో జ్ఞానానికి తొలి ప్రాధాన్యతనిచ్చి జ్ఞానాన్ని దైవంగా భావించడం జరిగింది .అందుకు ప్రతీకగా “ సరస్వతీ _ బ్రహ్మ” ల మూర్తులను రూపొందించుకొని అర్చించినారు .పాడి పంటలు  మొదలైన సర్వ సంపదలనూ ఆరాధనా భావంతో కొలిచి అందుకు ప్రతీకగా  “ లక్ష్మీ _ విష్ణు “ ల మూర్తులను రూపొందించుకొని అర్చిస్తున్నారు . సృష్టికి మూలమైన స్త్రీ పురుష తత్త్వపు పవిత్రతకు ప్రతీకగా లింగ రూపంలో పార్వతీ పరమేశ్వర మూర్తులను రూపొందించుకొని అభిషేకిస్తున్నారు . మానవ మనుగడకు ఆధారభూతాలైన భూమినీ , నీటినీ , నిప్పునూ , గాలినీ గౌరవించి వాటికి ప్రతీకలుగా దేవతా మూర్తులను రూపొందించి కొలుస్తున్నారు . తలపెట్టిన కార్యంలో విజయం సిధ్ధించాలంటే అవసరమైనది బుధ్ధి కుశలత . బుధ్ధి కుశలత ద్వారా విజయం సిధ్ధించడమనే భావనకు ప్రతీకగా “గణేష్ మూర్తి” ని రూపొందించి ప్రార్థిస్తున్నారు. నదులను పుణ్యతీర్థాలుగా, పర్వతాలను పుణ్యక్షేత్రాలుగా  అడవులను వనదేవతలుగా, ప్రకృతిని ప్రకృతి మాతగా....... ఇలా విశ్లేషిస్తూ పోతే ,  భారతీయ తాత్వికతలో చెట్టూ, పుట్టా, జంతువూ, పక్షీ ........  ప్రతిదీ మానవ మనుగడకు అవసరమై  తద్వారా  పూజార్హమై కొలవ బడుతున్నవి .

ఇలా, మానవ మనుగడకు దోహదపడే అన్నింటినీ.........అది భావన కావచ్చు , ప్రకృతిలోని పదార్థం కావచ్చు . మరి, భారతీయ తాత్వికతలో దైవం లేని దెక్కడ?    ఐతే ........ జ్ఞానం, సంపద, కార్య సిధ్ధి  మొదలైన మానవావసరాలను సాధించడానికి ఏతత్సం బంధమైన అవగాహన, పట్టుదల, కృషి  మాత్రమే ఉపయోగపడుతాయని గుర్తుంచుకోవాలి. కృషిని వదిలి, దైవాన్ని అడ్డంపెట్టుకొని చేసే మోసగాళ్ళ మాయమాటల వల్ల, మోసాల క్రతువుల వల్ల ఎలాంటి ప్రయోజనం సిధ్ధించదు. మౌఢ్యాన్ని వీడిన  చైతన్యవంతులు దైవాన్ని ఎల్లెడలా వీక్షించి సత్య, జ్ఞాన, ఆనంద పరవశులౌతారు.  ఇక, యుగ యుగాల మానవ చరిత్రలో ఎందరో మహనీయులు పుట్టి , తమ తమ కాలాలలోని మానవ సమాజాలను చైతన్య పరచి, అండగా నిలిచి ఆరాధ్యులైనారు. కృతజ్ఞతగా ఆయా మహానుభావుల మూర్తులకు గుళ్లు గోపురాలు కట్టి, పూజించడం, వారి జయంతులను పర్వదినాలుగా నిర్వహించడం భారతీయ తత్వంలోని గొప్పదనం. ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తే, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుధ్ధుడు, సాయి మహరాజ్, క్రీస్తు, మహమ్మదు....... ఇంకా అనేక మంది మహనీయులు వందనీయులు. ఇంకా, ప్రాంతాల వారీగా ప్రసిధ్ధులైన మహనీయులెంతో మంది జనాల నీరాజనాలందుకుంటున్నారు. మరి, భగవత్తత్వం ప్రతిభాసించని చోటెక్కడ?  దైవం లేనిదెక్కడ?  మలిన మస్తిష్కాలలో తప్ప .

- వెంకట రాజారావు . లక్కాకుల
--------------------------------------------------
మీరూ 'జనవిజయం' కు రచనలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
*Republished

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top