- ఆధ్యాత్మికత (spirtuality) అనేది మతభావనకు చెందినదా?
- ఆధ్యాత్మికత అంటే సరయిన నిర్వచనం ఏమిటి?
------------------------------------------------
అంశం : ఆధ్యాత్మికత
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
01. ఆధ్యాత్మికత అనేది మతాల చట్రాల్లో ఇమిడెంత చిన్నది కాదు. కాబట్టి ఏ మత భావనల పరిధిలో అది ఇమడదు. కాని అన్ని మతాలూ ఆధ్యాత్మికతనే బోధిస్తాయి కానీ ఈ మతాలేవీ సంపూర్ణం కావు.
ReplyDelete02. ఆత్మను ఉద్దరించటమే ఆధ్యాత్మికత. ఆ స్థితికి చేరుకున్న తరువాత ప్రాంత బేధాలు, కుల బేధాలు, మత బేధాలు, ఈర్ష్య, అసూయలు అన్నీ మననుండి మాయమై పోయి మనసు నిరంతర ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఇదంతా పుస్తక జ్ఞానమేనా లేక అనుభవ పూర్వకమా అని?
పుస్తక జ్ఞానం నుండి అనుభవానికి ప్రయాణంలో వున్నాను.
కామెంటుకు ధన్యవాదములు బాబు గారు. ఈ ప్రశ్నకు పెద్దగా స్పందన రావడం లేదు ఎందుకో తెలీదు. ఈ పదం విలువ పెద్దదే కానీ ఎక్కువమంది దీనిని అప్రాధాన్య అంశంగా భావిస్తున్నారనుకుంటున్నాను.
Deleteఅనుభవంలో ఏదో ఒక ఫలితాన్నిచ్చేదే పుస్తకంలోకి ఎక్కుతుంది. ప్రతి అనుభవమూ అది అసంపూర్ణమైనా సరే సత్యాన్వేషణకు దోహదపడుతుంది.
ఆధ్యాత్మికత అంటే మతానికి సంబంధించినది కాదు. కానీ ఆధ్యాత్మికత అంటే మతానికి చెందినది మాత్రమే అన్నంతగా ఇతరులు దానికి దూరంగా ఉండడం మూలాన మత వాదులు తాము మాత్రమే ఆధ్యాత్మికులమనుకుంటున్నారు.
< ఆత్మను ఉద్ధరించడమే.... > ఆత్మ అంటే? మీరే అర్ధంలో వాడారీ పదాన్ని వివరించగలరా?
కొండల రావు గారు,
Deleteఆత్మను ఉద్ధరించడమే.... > ఆత్మ అంటే? మీరే అర్ధంలో వాడారీ పదాన్ని వివరించగలరా?
మీరు వేసిన ప్రశ్న కు సమాధానం అంత తేలిగ్గా ఒక వాక్యంలో చెప్పగలిగిందికాదు కాబట్టి నాకు కొంత సమయం కావాలి. నాకు తెలిసినంతలో వీలయినంత వివరం గా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
Note: నాదొక రిక్వెస్టు. రిప్లై, డెలిట్ బటన్ తో పాటు ఎడిట్ ఆప్షన్ కూడా పెట్టండి. ఇంకొకటి ఎవరైనా వారు ఇంతకుముందు మీ వెబ్ సైట్లో ఏమేమి కామెంట్లు చేశారో చూసుకోవాలనుకుంటే వారి పేరుమీద క్లిక్ చేస్తే వారింతకు ముందు చేసిన కామెంట్లు అన్నీ కనపడేలాగా పెడితే చాలా బాగుంటుంది. ఎవరైనా టెక్నికల్ పర్సన్ సహాయం తీసుకోండి.
బాబు గారు, నేనుండేది పల్లెటూరిలో ఇక్కడ టెక్నికల్ విషయాలు అంతగా తెలిసినవారు లేరు. మీరింతకుముందు చెప్పినప్పుడే కొంత ప్రయత్నం చేశాను. కానీ ఎవరికీ సాధ్యం కాలేదు నేనడిగినవారివల్ల. తెలిసినవారు దొరికేంతవరకూ ఎడిట్ ఆప్షన్ సాధ్యం కాకపోవచ్చు.
Delete
ReplyDeleteఆధ్యాత్మికత కి నిర్వచనం నిత్యానందం
జిలేబి
మరీ ఇంత సింపులా?
Deleteహరికోవా!
తత్వశాస్త్రం ప్రపంచంలోని మౌలిక సమస్యలను గురించి ఆలోచించి సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆధ్యాత్మికత అనేది అందులోని ఒక పాయ. ఆ పాయకు చెందిన ఆలొచనా స్రవంతి మొత్తం ఆత్మ ప్రాధమికమైనది, ప్రకృతి ద్వితీయమైనది అన్న నిర్ధారణకు వచ్చి, ఆ తర్వాత మిగతా విషయాలను గురించి ఆలోచిస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే దేవుడు కావచ్చు, చైతన్యం కావచ్చు, మనస్సు కావచ్చు. ఆధ్యాత్మికత మతానికి చెందినా చెందక పోయినా, దాదాపు అన్ని మతాలూ ఆత్మ ప్రాధమికమన్న విషయాన్ని అంగీకరిస్తాయి. లేక పొతే మతానికి మనుగడ వుండదు.
ReplyDeleteఅందుకు విరుద్ధంగా తత్వశాస్త్రం లోని మరో భాగమైన భౌతికవాదం ఆత్మ ప్రాధమికమైనది అన్న వాదనతో విభేదిస్తుంది.
కొండలరావు గారు,
ReplyDeleteఆత్మ అంటే ఎలా చెప్పాలి. ఎక్కడ మొదలు పెట్టాలి. సరే, నాకు తెలిసిన జ్ఞానం తోనే మొదలు పెడతాను.
హేతువాదులు ఇవి అర్ధం లేని మాటలుగా భావించవచ్చు.
ఆత్మ అంటే ఒక సాఫ్ట్ వేర్. జంతువు గాని మనిషి శరీరం గాని ఒక హార్డ్ వేర్. సాఫ్ట్ వేర్ లేని హార్డ్ వేర్ పని చేయదు.
ఒకటే సాఫ్ట్ వేర్ అనేక జన్మల్లో అనేక హార్డ్ వేర్ లలో ప్రవేశించి తన జ్ఞానాన్ని వృద్ది చేసుకుంటుంది. జన్మ లక్ష్యం అదే.
అందుకే చూడండి మనం చనిపోయిన తరువాత కూడా ( తగులపెట్టకుండా వుంచితే ) శరీరం కొంతకాలం వుంటుంది.
అంటే హార్డ్ వేర్ వుంది. సాఫ్ట్ వేర్ వెళ్ళి పోయింది. కానీ ఎలాంటి స్పందనలు వుండవు. బ్రతికున్నప్పుడు ప్రతి మాటలకు, చేతలకు మనం స్పందిస్తాం. శరీరం కూడా స్పందిస్తుంది.
ఉదాహరణకు ఒక సుబ్బారావు అనే పేరున్న వ్యక్తిని తీసుకుందాం. అతను బ్రతికున్నప్పుడు
అతనా పేరుతో స్పందించేవాడు. చనిపోయిన తరువాత కూడా ఆ సుబ్బారావు అనే పేరున్న ఆ శరీరం అక్కడే వున్నదే.
మరి ఎందుకు స్పందించడం లేదు. అతనిలోని సాఫ్ట్ వేర్ ( ఆత్మ ) బయటకు వెళ్ళి పోయింది.
ప్రతి జన్మ లక్ష్యం ఆత్మ తన జ్ఞానాన్ని వృద్ది చేసుకోవడం.
ప్రతి మనిషి అనేక జంతు జన్మలతరువాత మనిషి జన్మకు వస్తాడు.
01. జంతు జన్మల నుండి మనిషి జన్మలలోకి కొత్తగా వచ్చిన వాళ్ళలో జంతు వాసనలు పోని వాళ్ళని మీరు గమనించే వుంటారు. వారి ప్రవర్తన ఎలా వుంటుందంటే, వాళ్ళు చాలా మూర్ఖంగా వుంటారు. వాళ్ళకి పది పైసల లాభం కలిగించే పనికోసం ఒక నిండు ప్రాణాన్ని తీయడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఇతరుల మనోభావాలతో వారికి సంబంధం లేకుండా ఇతరులను వారి ఆనందం కోసం మాటలతో అయినా లేక చేతలతో అయినా తీవ్రంగా గాయపరుస్తారు.
02. ఎన్నో వేల జన్మలు పూర్తయిన తరువాత ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన వారి ఆత్మ (ముక్తికి దగ్గరగా వున్న ఆత్మలు )లను ఎలా గుర్తించాలంటే వారు సకల జీవరాసులతో ప్రేమగా వుంటారు. వారి దగ్గరకు వెళితేనే ఏదో తెలియని ఆనందం మనని ఆవరిస్తుంది. ఎందుకని? ఒక తక్కువ స్తాయిలో వున్న ఆత్మ అత్యున్నత ఆత్మ స్థాయిలో వున్నవారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. ఉదాహరణకు గౌతమ బుద్దుడు, రామకృష్ణ పరమ హంస,
రమణ మహర్షి లాంటి వారు.
ఆత్మ తన జ్ఞానాన్ని ఎలా వృద్ది చేసుకోవాలి. ధ్యానం ద్వారా. ధ్యానం లో ఒక స్థాయికి వెళ్ళిన తరువాత మన భావాలకు
ఉన్న లిమిటేషన్స్ తొలగిపోతాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషం, దురాశ, దుర్మార్గమైన ఆలోచనలు మననుండి తొలగి పోతాయి. ఆత్మ అత్యున్నతస్థాయిలో ఏ విషయాన్నైనా చూస్తుంది. ఎలాగంటే విహంగ వీక్షణంలో నేలమీద ప్రాణులు, వస్తువులు కనపడినట్లు అంత అల్పంగా మన ఇదివరకటి సమస్యలు, ఆలోచనలు కనపడతాయి.
అదే ఆత్మ తన జ్ఞానాన్ని వృద్ది చేసుకుంటున్నది అనటానికి గుర్తు.
ఇలా అనేక జన్మల్లో జ్ఞానం వృద్ది అయిన తరువాత మహనీయుల స్తాయికి చేరుకుంటాం.
అదే ఆఖరి జన్మ కావచ్చు.
ధ్యానం అంటే ఏమిటి?
ధ్యానం అంటే కేవలం గమనింపు. మన ఆలోచనలని గమనిస్తూ కూర్చోవడం అంతే.
నది ఒడ్డున కూర్చుని నది ప్రవాహాన్ని గమనిస్తూ కూర్చున్నట్లు.
బాబు గారు,
Deleteమనుషులు, జంతువులలాగే ఆత్మలు పుడుతూ చస్తుంటాయా?
సాఫ్ట్ వేర్ లాగా ఒకే ఆత్మని అనేక ప్రాణుల్లో ఏక కాలంలో ప్రతిష్టించ వచ్చా?
ఆత్మలు మనుషులకూ, జంతువులకేనా, లేక కీటకాలకూ, వృక్షాలకు కూడా ఉంటాయా?
శరీరం ఆత్మకు జ్ఞానం కలిగిస్తుందా, లేక శరీరానికి ఆత్మ జ్ఞానాన్ని అందిస్తుందా?
ఆత్మలన్నీ భూమిపై తిరిగి తిరిగి పుట్టడానికి కారణం ఆత్మ జ్ఞానం పొందడం కోసమేనా?
పరలోకంలో లభించని ఆత్మజ్ఞానం భూమిమీద ఎలా లభిస్తుంది?
కేవలం భూమి మీదనే లభించ గలిగే ఆత్మజ్ఞానం ఎటువంటిది?
జీవిలోని essence ఆత్మలో ఉంటుంది అన్న భావన, జీవానికి ఆవల conciseness ఉంటుంది అన్నభావన కేవలం assumption. మనం ఒక emotionని అనుభవించడానికి మిలియన్లకొద్దీ న్యూరాన్లు అవసరమౌతాయి అన్నది medical science చెబుతుంది. దాని ప్రకారం మనిషి brain dead అయినప్పుడు ఆమనిషి ఆలోచనలు, consciousఅంతటితో ఆగిపోతాయి. ఇరుసువిరిగిన బండి ఏవిధంగా అవితే స్థలంలో ముందుకు కదలదో, brain dead ఐన జీవి అనుభవాలు అలవర్చుకోవడంలో అలాగే ముందుకు కదలదు. Brain dead ఐనప్పుడు న్యూరాన్లు పనిచెయ్యవుకదా మరప్పుడు అవిలేకుండానే ఆత్మ ఎలా చూస్తుంది? అనుభవిస్తుంది? ఎలా వింటుంది?
Deletesoftware అనేది కేవలం interpretation లేదా గుర్తు లేదా జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలను లేదా గుర్తులను లేదా interpretations ని hardware లో note-down చేసుకుంటారు. మనుషులు షాపింగ్‌కి వెళ్ళేటప్పుడు shopping-list నోట్ చేసుకుంటాం కదా అలాగే computer కొన్ని గుర్తులని magnetic strips మీద note చేసుకుంటుంది. ఈ shopping listలోని అక్షరాలూ, hard-diskలోని బైట్లూ, మనిషులోని అనుభవాలూ, అనుభూతులూ ఈ మూడూ ఒక్కటే. (అన్నట్లు అక్షరాలకుకూడా ఆత్మ ఉంటుందని మీరనుకుంటున్నారా?) ఎలాగైతే ఈ సోకాల్డు software ఒక CD/DVD/meagnetic medium ల్లో నిక్షిప్తం చెయ్యబడి ఉంటుందో, మనిషి ఆలోచనలు nuralogigacal medium (brain) నిక్షిప్తం చెయ్యబడి ఉంటాయి. (ఇంకొక coppy) నేనప్పుడు ఆ medium పాడైపోతే ఆలోచనలూ/software రెండూ అంతటితో ఉనికిలో ఉండడం ఆగిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే దేహంలేకుండా అనుభూతులు, జ్ఞాపకాలు సాధ్యం కాదు. ఆత్మ ఒక popular misconception/illusion తప్ప మరొకటికాదు.
ఇకపోతే బ్రాహ్మీ స్థితి లేదా 'నేనే విశ్వము, విశ్వమే నేను' అనే స్థితి (ఆత్మకు ఎరుకపడే స్థితి). దీన్ని ఇంగ్లీషులో transcendentalism అంటారు. ఈ స్థితికి కారణం మెదడులోని కొన్ని ప్రాంతాలు ఒక నిర్దిష్టరీతిలో suppress అవ్వడం/deactivate అవ్వడం. అలా వాటిని పనిచెయ్యకుండా చెయ్యడానికి ధ్యానం ఒకపధ్ధతి (బహుశా అత్యంత ఖర్చులేని ఒక పధ్ధతి), కొన్ని రకాల మందులనూ, కొన్ని ప్రత్యేక పరికరాలను వాడీ మనుషుల్లో ఈ transcendentalist అనుభూతుల్ని కలిగించవచ్చనేది ఇప్పటికే ఋజువైన విషయం. వీలుంటే ఈ వీడియోని చూడండి (http://www.ted.com/talks/jill_bolte_taylor_s_powerful_stroke_of_insight). ఆమె మెదడులోని ఎడమభాగం పనిచెయ్యడం మానేసినప్పుడు ఆమె తనదేహం ఎక్కడ మొదలై ఎక్కడ అంతమవుతుందో గుర్తుంచడం తనకు సాధ్యం కాలేదని, తాను (విశ్వమంతా) వ్యాపించి ఉన్నట్లుగా అనిపించిందని ఆమె చెబుతారు.
#Like all my questions, I'm VERY sure even the questions raised by my current comment will be left unanswered 'cause the best defense to logic is ignorance :-)#
Exactly!!
Deleteమీకు softwareతో పరిచయముదో లేదో నాకు తెలియదు. మనం software అని దేన్నైతే అంటున్నామో అది కేవలం 1s and 0s మాత్రమే (ఆ 1s and 0s యొక్క రిప్రజెంటేషన్ మన storage deviceని బట్టి మారుతూ ఉంటుంది). దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి లేదా దానికి ఎలా respond అవ్వాలి అన్నది ఎప్పుడూ ఒక hardware chipలో program అయ్యి ఉంటుంది. ఆprogrammingకూడా పూర్తిగా NAND-NOR gatesతో కూడి ఉంటుంది. ఆ భాగం పూర్తిగా semiconductorsతో కూడిన ఫక్తు hardware. Hardware is very basic without witch software cannot even EXIST!! Windows మీద పనిచేసిన software ఎందుకు Linux మీద పనిచెయ్యదంటే, Linux conventions for the executability are way different from those of Windows. Softwear ఎప్పుడూ hardwareమీద ఆధారపడుతుంది. దాన్ని interpretచేసే hardware లేనప్పుడు software అర్ధరహితం.
మన మెదడుకూడా ఇలాంటి ఒక BIOS(hardware programming)తో మొదలై, వివిధ అనుభూతుల్ని/అనుభవాల్ని (software programmsని) సంతరించుకుంటూ సాగుతుంది (తనకు అర్ధమయ్యే conventionsలో record చేసుకుంటూ సాగుతుంది).
Iconoclast,
DeleteLike software can not exist without physical storage medium, the consciousness can not exist without its physical carrier. Nicely explained!
ReplyDeleteవామ్మో వామ్మో,
ఉందొ లేదో అని తెలియని ఆత్మారాముడి మీద ఇంత పెద్ద చర్చ జరుగు తున్నదే !!
జిలేబి
శ్రీకాంత్ చారి గారు,
ReplyDelete01. మనుషులు, జంతువులలాగే ఆత్మలు పుడుతూ చస్తుంటాయా?
లేదండీ. ఒక ప్రాణి చనిపోయిన తరువాత ఆ ఆత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టి, తను భూమి మీద జన్మించడానికి అనువైన పరిస్తితులు వున్నప్పుడు మాత్రమే ఇంకొక ప్రాణిలోకి వస్తుంది.
02. సాఫ్ట్ వేర్ లాగా ఒకే ఆత్మని అనేక ప్రాణుల్లో ఏక కాలంలో ప్రతిష్టించ వచ్చా?
నేను సాఫ్ట్ వేర్ అన్నది ఒక ఉదాహరణలాగా చెప్పాను. అయినా మీ ప్రశ్నకి ఆన్సర్ , ఒకే ఆత్మని అనేక ప్రాణుల్లో ఏక కాలంలో ప్రతిష్టించటం కుదరదు.
03. ఆత్మలు మనుషులకూ, జంతువులకేనా, లేక కీటకాలకూ, వృక్షాలకు కూడా ఉంటాయా?
అన్నిటికీ వుంటాయి. మీరు రష్యన్ క్లిరియాన్ ఫోటో గ్రఫీ గురించి వినే వుంటారు.
04. శరీరం ఆత్మకు జ్ఞానం కలిగిస్తుందా, లేక శరీరానికి ఆత్మ జ్ఞానాన్ని అందిస్తుందా?
శరీరమే జ్ఞానం కలిగిస్తే, అందరికీ జ్ఞానం అందాలి. కానీ అలా లేదే. శరీర ఆలంబన తో ఆత్మ జ్ఞాన సముపార్జన కు పూనుకున్నప్పుడే జ్ఞానం లబిస్తుంది.
05. ఆత్మలన్నీ భూమిపై తిరిగి తిరిగి పుట్టడానికి కారణం ఆత్మ జ్ఞానం పొందడం కోసమేనా?
అవును ప్రధాన లక్ష్యం ఆత్మ జ్ఞానం పొందడానికి. దానితో పాటు గత జన్మల కర్మలు కూడా అనుభవించాలి.
అయితే ఇంకొక విషయం మీరు అడక్కపోయినా చెబుతున్నాను. మన ప్రజంటు జన్మ, మన కర్మల కనుగుణంగా మనం కోరుకుని వచ్చినదే.
06. పరలోకంలో లభించని ఆత్మజ్ఞానం భూమిమీద ఎలా లభిస్తుంది?
పరలోకంలో ఆత్మ జ్ఞానం లేదని కాదు. కానీ ఆత్మ జ్ఞాన సాధన చేయాలంటే శరీర ఆలంబన అవసరం.
07.కేవలం భూమి మీదనే లభించ గలిగే ఆత్మజ్ఞానం ఎటువంటిది?
ఆత్మ జ్ఞానం ఒక్క భూమి మీదనే కాదు, యూనివర్స్ అంతటా వుంది. కానీ దేహం కావాలంటే అది కేవలం భూమిమీదనే సాధ్యం కదా. కాబట్టి ఆత్మ జ్ఞాన సాధన కోసం భూమిమీదకి రాక తప్పదు.
మీరడిగిన ప్రశ్నలకు అత్యుత్తమమైన సమాధానాలు కాకపోయినా నాకు తెలిసిన నాలెడ్జ్ తో సమాధానం చెప్పాను అనుకుంటున్నాను. మంచి ప్రశ్నలు వేసినందుకు కృతజ్ఞతలు .
బాబు గారు,
Delete< మీరు రష్యన్ క్లిరియాన్ ఫోటో గ్రఫీ గురించి వినే వుంటారు. >
ఆక్యుపంచర్ లో చెప్పే శక్తి ప్రవాహాలను ఆధునిక వైద్యులు నమ్మనప్పుడు ఈ ఫోటోగ్రఫీ ద్వారా నిరూపించారంటారు. మీరు చెప్పే రష్యన్ క్లిరియాన్ ఫోటోగ్రఫీ అదేనా? దీనిని గురించి వివరించగలరా?
బాబు గారు,
Deleteమీ సమాధానాలకు ధన్యవాదాలు.
>>> లేదండీ. ఒక ప్రాణి చనిపోయిన తరువాత ఆ ఆత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టి, తను భూమి మీద జన్మించడానికి అనువైన పరిస్తితులు వున్నప్పుడు మాత్రమే ఇంకొక ప్రాణిలోకి వస్తుంది.
మీరు చెప్తున్న సమాధానం ప్రకారం విశ్వంలోని ఆత్మల సంఖ్య పెరగకూడదు, తగ్గ కూడదు. కాని భూమి మీద జనాభా మాత్రం ఏకకణ జీవి మొదలు కొని 700 కోట్ల మనుషులు, లక్షల కోట్ల ఇతర జంతువుల రూపంలో పెరిగింది. ప్రతి జీవికి ఒక ప్రత్యేక ఆత్మ వుండే పక్షంలో ఆత్మల సంఖ్య పెరగడం ఎలా సాధ్యమయింది?
జన్మించిన తర్వాత ఆత్మ జ్ఞానం కలిగి జన్మ రాహిత్యం పొందే పక్షంలో, రోజు రోజుకు వాటి సంఖ్య తగ్గాలి. ఒక రోజున అన్ని ఆత్మలకు పూర్తి జ్ఞానం కలిగి జీవరాశి మొత్తం నశించాలి. కాని దానికి విరుద్ధంగా జీవరాశి రోజు రోజుకూ పెరగడానికి కారణమేమిటి?
>>> పరలోకంలో ఆత్మ జ్ఞానం లేదని కాదు. కానీ ఆత్మ జ్ఞాన సాధన చేయాలంటే శరీర ఆలంబన అవసరం.
దీన్ని మరింత వివరించ గలరా?
అవునండి. దీనిని రష్యాలో 1939 లో అనుకుంటా కాకతాళీయంగా కనుక్కున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు కిర్లియాన్ టెక్నాలజి లో చాలా డెవలప్మెంట్ వచ్చింది. రష్యాలో ఆరా కలర్స్, దాని స్త్ర్రెంగ్త్ ని బట్టి రాబోయే రోగాల్ని కనుక్కోవడానికి కూడా దీన్ని వాడుతున్నారు. సరే దీనిచుట్టూ నమ్మకాలు, అపనమ్మకాలు ముడిపడి వున్నాయి. సైన్స్ అయితే దీన్ని ఇంకా నిర్ధారించలేదు. బిలియన్ డాలర్స్ బిజినెస్స్ వున్న మెడికల్ ఇందస్త్రీ
Delete( డ్రగ్, డాక్టర్స్ ) ఏమై పోవాలి. కానీ సైన్స్ నమ్మని వన్నీ లేనట్లు కాదు. ఉదాహరణకి రేకీ తీసుకోండి. అది పనిచేస్తున్నది. కానీ దాన్ని డాక్టర్లు నమ్మరు. అంత మాత్రాన అది లేనట్లు కాదు. అలాంటి అక్కల్ట్ సైన్సెస్ ఎన్నో వున్నాయి.
http://en.wikipedia.org/wiki/Kirlian_photography
DeleteApparently coins have souls too. Isn't this some thing like 'night vision' or infrared photography.
"సైన్స్ నమ్మని వన్నీ లేనట్లు కాదు."
నిజమే! భూతవైద్యమూ, చేతబడీ, బాణామతీ, స్వస్థత సభల్లో కుంటివాళ్ళకు కాళ్ళు రావడమూ, పుట్టపర్తిబాబాగారి మాయలూ, కామెర్ల వ్యాధి గ్రస్థుడికి వాతల వైద్యమూ, సహగమనాలవల్ల భార్యల స్వర్గారోహణమూ అన్నీ నిజాలే!. Scientific ఋజువుల్లేనంతమాత్రాన అవన్నీ అబధ్ధాలుకావు!
మీలో ఎంతమంది టాబ్లెట్లనుకాక రేకీ వైద్యుణ్ణి ఆశ్రయించి వున్నారు. నమ్మకాలు వేరు నిజం వేరు. నిజానికి ఋజువులుకావలి (ఎంతమంది నమ్ముతున్నారు అన్న ప్రచారం అఖ్ఖర్లేదు). నమ్మకానికి ఋజువులఖ్ఖర్లేదు. That's the definition.
Occult is not science dear!!
ఇక్కడి చర్చకు సూటిగా సంబంధించినది అవుతుందో కాదో గానీ నా స్వానుభవం ఒకటి వివరిస్తాను.నేను 200 సంవత్సరంలో హైదరాబాదులో నాడీ జోస్యం చెప్పే ఒక వ్యక్తిని కలిసాను నా గురించే.వేలిముద్ర ఇచ్చాను.లోపలికి వెళ్ళాక మా అమ్మగారి పేరు రప్పించటానికి రక్రకాల పేర్లు చెప్తూ నేనిక్కడ చర్చలో మిమ్మల్ని నిగ్గదీస్తున్నట్టు అవునా? కాదా? అని అడగటం మొదలెట్టాడు.నాలుగైదు తప్పు సమాధానాల తర్వాత నాకు విసుగొచ్చి నేనే చెప్పేస్తే చిన్నపిల్లాణ్ణి కసురుకున్నట్టు, "అలా చెప్పగూదదు,అడిగిందానికి మాత్రమే జవాబివ్వండి.మేము అవి సరి చూసుకున్నాక మీ వివరాలు వస్తాయి" అని క్లాసు పీకాడు!దాంతో నాకు కొంత అర్ధమయ్యి మిగతావి అతను చెప్పిన పధ్ధతిలోనే పూర్తి చేసాను.
ReplyDeleteఫలితం నమ్మశక్యం కానిదిగా వచ్చింది!చిన్నప్పుడు జరిగింది ఒకటి చెప్పాడు.అప్పటికి జరగనిదీ తర్వాత ఒకటి జరుగుతుందని చెప్పింది తర్వాత నిజంగానే జరిగింది - అదీ జరగదం తప్పనిసరి అన్నంత నిక్కచ్చిగా జరిగింది!. మొదటిది:మీ చిన్నప్పుడు మీ అమ్మగారికి జలగండం వచ్చింది, కేవలం మీ వల్లనే తప్పిపోయింది అన్నాడు!సన్నివేశం వివరిస్తాను.మా వూరికి మరో వూరికి మధ్యన ఒక చెరువు నధ్యన వున్న లంకలో ఒక దేవాలయం వుంది.మా అమ్మా, పిన్నమ్మలూ,పెద్దమ్మలూ అనదరితో కలిసి నేనూ వెళ్ళాను.ఆ గుడికి పక్కనే కాకతీయుల కాలం నాటి పెద్ద చెరువు వుంది.చాలా లోతు.అ చెరువు వైపుగా ఒక గోడ, దానికి తలుపు వుంది.అది తెరిస్తే అటూ ఇటూ అరుగులూ మధ్యలో చెరువు అంచుల దాకా మెట్లూ వున్నాయి.అడుగు అంచు మట్టితో గట్టులాగా వుంది.సరే చిన్నపిల్లాణ్ణిగా, అంతదూరం వెళ్ళాక అవసరం వచ్చింది.నీళ్ళు తీసుకు రావ్దనికి మా అమ్మగారు మట్టి తడిసి వుందతంతో కాలు జారి నీళ్ళలో పడిపోయింది.నేను గట్టిగా అరిచేసరికి బండి కట్టి మాతో వచ్చినతనికి ఈత వచ్చు గనక దూకి కాపాడాడు.దాదాపుగా అతను చెప్పినట్టే జరిగిందిగా!నేను అరవకపోయి వుంటే మిగతా వాళ్ళుచూసి రక్షించే అవకాశమే లేదు,తలుపు వేసేసి వుంది.
ఇప్పటి సైన్సు దీన్ని సాధించనూ లేదు,వ్యాఖ్యానించనూ లేదు - కానీ వాస్తవంగా జరిగింది.కేవలం బొటనవేలు ముద్రని చూసి అతను నాకు కూడా అతను చెప్పాకే గుర్తుకొచ్చిన సన్నివేశాన్ని అంత నిక్కచ్చిగా యెలా చెప్పగలిగాడు?
మిమ్మల్ని ఎగతాళిచేసే ఉద్దేశ్యంతో కాదండీ.
Delete'జలగండం' అనేమాట too genericగా లేదంటారా? మీరు అగ్నిగండం నుండి మీచిన్నవయసులో తప్పించుకున్నారు అని ఇంకొక జ్యోతిష్యులుగారు అంటే అప్పుడు మీరు దాన్ని మీజీవితంలోని ఏదో ఒక సంఘటనతో relate చేసుకోలేరా? నావరకునేను ఇలాంటి గండాలు చాలావాటినుండీ survive అయ్యాను. Unless you were born and brought up in quarantined situations, incidents with fire and water are very common. What more you living would be the very proof that you did survive them.
తర్వాత జరుగుతుంది అని చెప్పింది ఖచ్చితంగా జరిగింది అని చెప్పాను కదా!ఈ నాడీజోసం వాళ్ళు ఒక రెండు సంవత్సరాల కాలాన్ని యూనిట్ కాలం గా తీసుకుని చెప్తారు.మీకు ఒక కోర్టు కేసు వస్తుంది.కొంతకాలం చికాకు పెట్టి యెలా వచ్చిందో అలాగే పోతుంది అని చెప్పాడు మీకు అత్యంత ఇష్తమయ్న వ్యక్తి మరణం సంభవిస్తుంది అని కూడా న్నాడు.ఈ రెంటికీ అవినాభావ సంబంధం వుంది.
Deleteనాకు పిల్ల నిచ్చిన మామ మా మేనమామే.చిన్నప్పటి నుచి నాకు ఆయనంటే ఇష్టం.అతను రవుండ్ ఫిగరుగా చెప్పిన కాలంలోనే మా మామయ్య పోయారు.ఆయన బతికుండగా అప్పులు చెయ్యటం తీర్చటం చాలా ప్లాన్ గా చేశారు.ప్రైమరీ స్కూల్ టీచర్ అయినా ఒక అప్పు ఇవ్వాళ చేస్తున్నాం ఫలానా రోజుకి తీరుస్తానని చెప్తున్నాం అంటే అప్పటికి మనై యే రకమయిన ఆదాయం చేతికొస్తుందో ముందే ప్లాన్ చేసుకుని ఇస్తానన్న రోజుకి అన్ని లెక్కలూ తనె చూసి వాళ్ళింటికే తీసుకెళ్ళి తీర్చెయ్యటం చాలా నిక్కచ్చిగా చేసారు.అప్పుల వాళ్ళు ఇంటి మీద కొచ్చి యెప్పుడు తీరుస్తారు మా అప్పు అని నిలదియ్యటం అనేదాన్ని అసలు యేనాడూ భరించకూడదనే పట్టుదల.అందుకనే ఆయన పోయినప్పుడు మిగిలిపోయిన అప్పుల్ని అప్పుల వాళ్ళంతా అసలు మాత్రమే ఇవ్వగలం అని చెప్ప్తే సరేనని వొప్పుకుని ఆ ప్రకారమే తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయారు - ఒకే వొక్క ఆడమనిషి తప్ప.నాకు మాత్రం మొత్తం వడ్డీతో సహా ఇవ్వాలని పేచీ పెట్తింది.ఇప్పుడు ఈ ఒక్క మనిషికి ఇస్తే మిగిలిన వాళ్ళు మళ్ళీ వెనక్కొచ్చి పేచీ పెడితే యెలా?దాన్ని మాత్రం పెండింగులో పెడదామనుకున్నారు.కానీ అక్కడో చిక్కు వుంది.మీకూ తెలుసు మనిషి పోయిన యేదాది లోపు కిట్టించుకోకపోతే నోటు మురిగిపోతుంది.అప్పుడు నాపేరు ప్రస్తావన కొచ్చింది.నాతో అదే విలువ కుదిరేటట్టుగా కొత్తగా నోటు రాయించారు.నేను వొప్పుకోకపోతే యేమవుతుంది?మా మామయ్య పేరు చెడుతుంది, కాబట్టి వొప్పుకున్నాను!
కేవలం మర్యాదకి మాత్రమే తీసుకుంటున్నాం అని మధ్యవర్తిగా వచ్చిన ఆ ఆడమనిషి భర్తే చెప్పినా (తను గయ్యాళిదని చాలా వూళ్లలో పేరుంది!) ఆ మనిషి మాత్రమ్మ్ లాయరు నోటీసు పంపించింది.వొక రెండు మూదేళ్ళు లాగింది కేసు.మా వైపు లాయరు మా బంధువే.ఈ లోపు కొంతమంది పెద్దమనుషుల్ని ఇన్వాల్వ్ చేసి మేము ఇవ్వగలిగినంతే ఇచ్చేటట్టు వొప్పించి రాజీ చేస్సుకున్నాం.మొత్తానికి వొక రోజంతా కోర్టు ఆవరణలో గడిపాను.అది నూజివ్వీడు సెషన్సు కోర్టు మాత్రమే అయినా మొత్తం వాతావరణ మంతా రావిశాస్త్రి గారు వర్ణించినట్టే వుంది!ఇది కూడా కాకతాళీయ మేనా?ఇంకో కొసమెరుపు:నా వైపు నుంచి మీకు అత్యంత ఆప్తుడయిన వ్యక్తి మరణం అని వుంటే మా అత్తయ్య మరో విష్యం చెప్పారు - యెప్పుడో వొక హస్తసాముద్రికుడు చెయ్యిచూసి 60 చూడకుండానే చనిపోతారు అని మా మామయ్య గురించి చెప్పాడు అని!ఇవి కూడా అనుకొకుండా కుదిరిన రాండం మాచింగులేనా?
ఐకొనొక్లాస్ట్ గారు:
Deleteఅసలైన ఫినిషింగు టచ్చి!మీకు ఒక బ్రదర్ వున్నాడు.అతనికి పెళ్ళి కాలేదు.అవ్వదు,యెందుకంటే అతనికి మనోవైకల్యం అంటే పిచ్చి అని కూడా చెప్పాడు.అదీ నిజమే.ఇది కూదా రిలేట్ చేసుకుంటేనే కలుస్తుందా?!
శ్రీకాంత్ చారి గారు,
ReplyDelete01. మీరు చెప్తున్న సమాధానం ప్రకారం విశ్వంలోని ఆత్మల సంఖ్య పెరగకూడదు, తగ్గ కూడదు. కాని భూమి మీద జనాభా మాత్రం ఏకకణ జీవి మొదలు కొని 700 కోట్ల మనుషులు, లక్షల కోట్ల ఇతర జంతువుల రూపంలో పెరిగింది. ప్రతి జీవికి ఒక ప్రత్యేక ఆత్మ వుండే పక్షంలో ఆత్మల సంఖ్య పెరగడం ఎలా సాధ్యమయింది?
ఆన్సర్: మీరు ఇవాళ పెరిగిన మనుషుల సంఖ్య, జంతువుల సంఖ్య చూసి ఈ ప్రశ్న వేసారు. ఎన్ని ట్రిలియన్ల సూక్ష్మ జీవులు భూమి మీద, సముద్రంలో, వాతావరణం లో ఈ సృష్టిలో వున్నాయో మీకు గాని నాకు గాని తెలుసా? మరణించిన సూక్ష్మ జీవులు చిన్న చిన్న క్రిములు, పురుగుల జన్మలెత్త కూడదా? అదే విధంగా మరణించిన క్రిములు, పురుగులు అలాంటి కొన్ని వేల జన్మల తరువాత జంతు జన్మలు, అలాగే కొన్ని వందల,వేల జన్మల తరువాత మనుషుల జన్మలు తీసుకో కూడదా? ఇది అర్ధం చేసుకొంటే ఎందుకు భూమిమీద జనాభా(ఆత్మల సంఖ్య) ఇలా పెరిగిందో అర్ధమవుతుంది అనుకుంటున్నాను?
02. జన్మించిన తర్వాత ఆత్మ జ్ఞానం కలిగి జన్మ రాహిత్యం పొందే పక్షంలో, రోజు రోజుకు వాటి సంఖ్య తగ్గాలి. ఒక రోజున అన్ని ఆత్మలకు పూర్తి జ్ఞానం కలిగి జీవరాశి మొత్తం నశించాలి. కాని దానికి విరుద్ధంగా జీవరాశి రోజు రోజుకూ పెరగడానికి కారణమేమిటి?
ఆన్సర్: జీవరాశి పెరగడానికి కారణం పైన ఇచ్చిందే. ఆత్మ జ్ఞానం కలిగి జన్మ రాహిత్యం పొందటానికి ఆత్మకు కొన్ని వేల జన్మలు అవసరమవుతాయి. కొన్ని సార్లు జన్మలు వెంటవెంటనే ఉండచ్చు లేదా సుదీర్ఘకాలం పట్టచ్చు. కాబట్టి ఒక రోజున అన్ని ఆత్మలకు పూర్తి జ్ఞానం కలిగి జీవరాశి మొత్తం నశించటం అనేది వుండదు.
03.పరలోకంలో ఆత్మ జ్ఞానం లేదని కాదు. కానీ ఆత్మ జ్ఞాన సాధన చేయాలంటే శరీర ఆలంబన అవసరం.దీన్ని మరింత వివరించ గలరా?
ఆన్సర్: ఆత్మకు ఎటువంటి ఆకారం లేదు. జంతు శరీరం లో వుంటే జంతు రూపంలోనూ, మనిషి శరీరం లో వుంటే మనిషి ఆకారం లో వుంటుంది. జ్ఞాన సాధన కు చేయాల్సిన పనులు ఎటువంటి ఆకారం లేని ఆత్మ ఎలా చేస్తుంది. అందుకే ఆత్మకు శరీర ఆలంబన అవసరం.
ఐకనోక్లాస్ట్ గారు,
ReplyDelete500 లేక 600 సంవత్సరాల క్రితం భూమి బల్లపరుపుగా వుందని అప్పటి శాస్త్రవేత్తలు, మతాధికారులు, సామాన్య ప్రజలు నమ్మేవారు. లేదు భూమి గుండ్రంగా వున్నదని రుజువులు చూపలేని ఎవరో శాస్త్రవేత్త చెబితే ఆయనను మంటల్లో ఆహుతి చేసారు. పాపం, రుజువులు చూపలేని ఆ శాస్త్రవేత్త చెప్పింది ఆ కాలానికి అబద్దం గానే భావించారు. గాలిలో తరంగాల సహాయంతో మాట్లాడుకోవచ్చు అంటే పూర్వం నమ్మేవారా? లేక వీడికి పిచ్చి పట్టింది అనేవారా? ఇవాళ సెల్ ఫోన్స్ తో మాట్లాడుకుంటున్నామా లేదా? ఇప్పడు అది అబద్దమా లేక నిజమా? అలాగే ఇవాళ సైన్సు రుజువు చేయలేని ప్రతి విషయాన్ని అబద్దంగా భావించద్దు. రేపటి సైంటిస్ట్లు లు ఆధ్యాత్మికతను ప్రూవ్ చెయ్యచ్చు. ప్రూవ్ చేసినప్పుడే నేను నమ్ముతాను అంటే అది మీ ఇష్టం.
మీ బ్లాగు చూసాను. మీరు నిస్సందేహంగా ప్రజలో వున్న మేధావులైన కామెంటర్లలో ఒకరు. ఇంకొక విషయం మీరు తప్పుగా అనుకోనంటే చెబుతాను. మీ కామెంటు క్రింద భాగంలో, నా అన్ని ప్రశ్నలకు లాగే ఈ ప్రశ్న కు కూడా ఆన్సర్ రాదు అని మీకు మీరె సెల్ఫ్ డిక్లేర్ చేసుకోవటం ఎందుకో బాలేదు. క్షమించాలి ఇలా అంటున్నందుకు, అది తమరి వినయాన్ని మాత్రం సూచించటం లేదు.
బ్రూనో, గెలీలియోలముందున్నది తత్వవేత్తలేగానీ, scientistలు కాదు. వారందరూ (ముఖ్యంగా Ionian philosohers) ఋజువులతో పనిపెట్టుకోకుండా తామకు కనిపించినదాని తామునమ్మిన విధంగా theorize చేసుకుంటూ వెళ్ళారు. ఆనాటివాళ్ళు theorize చేసినవిషయాలు నేడు తప్పని ఋజువయ్యాయి.
Deleteఋజువేలేనప్పుడు ఏది నిజమో, ఏది మోసమో ఎలా నమ్మగలమన్నది నా మౌలిక ప్రశ్న. My logic is the obverse of yours. సైన్సుకి మునుపట ఎన్నో నమ్మకాలతో ప్రజలను వేధించుకుతిన్న సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. అవన్నీ తెలిసికూడా ఋజువులులేని వాటిని నమ్మకం base మీద అంగీకరించడం సరైనపనంటారా?
సరే కాసేపు సైను గురించి వదిలెయ్యండి. మనం నమ్ముతున్న నమ్మకాలు కనీసం repeatableగా ఉంటున్నాయా. మనం నమ్ముతున్న అన్ని నమ్మకాలతోనూ consistent గా ఉంటున్నాయా? నేను ఒకవేళ పదిహేనో శతాబ్ధంలో జీవిస్తున్నట్లైతే, ఖచ్చితంగా telepathyని, అంజనాలు వెయ్యడాన్నీ, wireless communicationను నమ్మేవాణ్ణికాదు. కానీ ఎప్పుడైతే wireless communication ప్రతిసారీ నమ్మకమైన మరియు ఖచ్చితమైన ఫలితాలను (more than a certain % -may be 90%) ఇవ్వడం గమనిస్తానో అప్పుడు underlying mechanism లేదా అందులో దాగున్న సైన్సు అర్ధం కాకున్నా, నేను దానిపై ఆధారపడడం మొదలుపెడతాను.
vkbaabu గారూ : పొరబడ్డారు. మీరుచూసింది నాబ్లాగు కాదు. నేను దానిని follow అవుతున్నాను అంతే. అలా రాసేంత స్థాయీ, ఓపికా నాకు లేదు.
Deleteవినయమ్మీద నాకు గౌరవంలేదు. నేను విషయాన్ని మాత్రమే గౌరవిస్తాను. I like truth and I think questioning is the only way to reason it out and so I question everything (even the things most people consider holly).
నమ్మకాలనేవి టాబ్లెట్లలాంటివి. ఖచ్చితంగా ఏదో ఒక టాబ్లెట్ రోగాన్ని కుదుర్స్తుంది. కాని అది ఏటాబ్లెట్ అని చెప్పడానికి డాక్టర్ కావాలి.
Deleteఆ డాక్టరే సైన్సు
ఈ ఐకోనో గారు ఒక చిత్రమైన మాట అన్నారు, "వినయమ్మీద నాకు గౌరవంలేదు. నేను విషయాన్ని మాత్రమే గౌరవిస్తాను." అని ఐతే "విద్య యొసగును వినయంబు" అన్నది చెప్పినవాడు మూర్ఖుడు కావాలి వీరి విజ్ఞానదృష్టికి. పోనివ్వండి విషయాన్ని గౌరవిస్తానన్నారు. సంతోషం. ఐతే మనదేశంలో స్వయంప్రకటితమేథావుల్లో హెచ్చుమంది లాగానే అందరు తెలుగువాళ్ళకీ అర్థం అవటంకోసం ఆంగ్లంలో ఏదో ఒక ఉవాచను అందించారు. అన్నట్లు, నేనే పొరబడ్డానేమో. ఈకాలం మేథావులకు సాధారణంగా వారు గౌరవిస్తామని చెప్పుకొనే విషయం ఎలాగూ ఉండదు సరే కాని వినయం మాత్రం బొత్తిగా శూన్యం అన్నది నిజమే కదా.
Deleteహరిబాబు గారు,
ReplyDeleteనాడీ జోస్యం పేరుతొ రకరకాల మోసగాళ్ళు ప్రజల దగ్గర ధనం కాజేస్తున్న ఈ రోజుల్లో మీకెవరో మంచి నాడీ జోస్యుడే తగిలాడు.
ఏది ఏమైనా తెలిసి తెలియని వయసులోనే మీ తల్లి గారిని మిరే కాపాడుకున్నందుకు అభినందనలు.
అక్కల్ట్ విద్యల పేరుమీద ఎందుకింత వివాదమంటే 100 మందిలో ఒకల్లో, ఇద్దరో కరక్టు గా శాస్త్రాన్ని అర్ధం చేసుకొని చెప్పగలుగుతారు. మిగతా వాళ్ళు శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతుంటారు. అలాంటి వాళ్ళ వల్లే, సైన్సు ను మాత్రమె నమ్మే వాళ్ళు వీటిని నిందించేది.
నాడీ జోస్యం పేరుతొ రకరకాల మోసగాళ్ళు ప్రజల దగ్గర ధనం కాజేస్తున్న ఈ రోజుల్లో మీకెవరో మంచి నాడీ జోస్యుడే తగిలాడు.
Delete>>
నేను యేదో ఒక అనుకోకుందా కలిసే లూజు విషయాన్ని రిలేట్ చేసేసుకుని ఫిక్స్ అయిపోయే తరహా మనిషిని కానండీ!
ReplyDeleteఆధ్యాత్మికత అనగా టైంపాసు బఠాణీలు
జిలేబి