Maharshi movie, a great tribute to farmers.
మహర్షి సినిమా చాలా బాగుంది. వంశీ పైడిపల్లికి అభినందనలు. ఇప్పటి దర్శకులలో కొరటాల శివ మీద మాత్రమే ప్రత్యేక అభిమానం ఉన్న నాకు మహర్షి సినిమా చూశాక వంశీపైన గౌరవం పెరిగింది. నేటి తరానికి బోర్ కొట్టకుండా తమ బాధ్యతని, తాము మరచిపోతున్న మూలాలని గుర్తించడానికి పనికొచ్చేలా అనుక్షణం తీర్చిదిద్దిన మూవీ మహర్షి.
పల్లె మూలాలను ప్రేమించే ప్రతీ వ్యక్తి ఇది నిజమైతే బాగుండు.... ఇలా జరిగితే బాగుండు.... అనిపించేలా ఉంది మహర్షి సినిమా.... ఈ సినిమాలోని ముసలి రైతు పాత్ర వ్యవసాయం గురించి ‘ఏ నా కొడుకయ్యా నా భూమిని లాక్కునేది....’ అని కార్పోరేటులకు హెచ్చరికగా డైలాగులు చెప్పేటపుడు థియేటర్ లో అన్ని క్లాసుల ప్రేక్షకుల నుండీ ఈలల మోత మోగింది. బహుశా మహేష్ అభిమానులు అతనికి కొట్టే ఈలల కంటే కూడా సగటు ప్రేక్షకుడిగా ఒరిజినల్ గా వచ్చిన ఈలలవి. పల్లెప్రపంచంపై మనలోపల దాగి ఉన్న నిజమైన ప్రేమకి ఆనవాలుగా ఈ ఈలలని గుర్తించాలి.
శ్రీమణి పాటల సాహిత్యం, దేవిశ్రీ మ్యూజిక్, డైలాగ్స్ .... అన్నీ బాగున్నాయి. పాత్రలకి తగిన నటులను ఎన్నుకున్నారు. ముఖ్యంగా అల్లరి నరేష్ కు ఈ సినిమాతో కొత్త కెరీర్ ప్రారంభం కావడం ఖాయం. జయసుధ పాత్ర కూడా బాగుంది.
హీరో కృష్ణ పోలికలు అడుగడుగునా కనిపించే మహేష్ నటనలో మాత్రం కృష్ణతో పోల్చలేము. కానీ ఈ సినిమా మాత్రం కృష్ణని గుర్తు చేస్తుంది. కృష్ణ అభిమానులకు మహేష్ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. మహేష్ ఈ సినిమాతో నిజమైన సూపర్ స్టార్ గా ఎదిగాడు. కానీ, ఈ సినిమా ప్రారంభానికి ముందు మహేష్ నటించిన థమ్సప్ యాడ్ ధియేటర్లలో వేస్తుండడం సినిమాకి, నిజానికి ఉన్న తేడాని గుర్తు చేస్తుంది. మహేష్ ఇకనైనా ఆలోచించి ఇలాంటి ఇలాంటి చెత్త యాడ్స్ చేయకుండా ఉండే డేరింగ్, డేషింగ్ నేచర్ అలవరచుకుంటాడని, సినిమాలలో మాత్రమే గాక బయటకూడా సామాజిక బాధ్యతని గుర్తిస్తడాని ఆశిద్దాం.
ఇప్పటి యూత్ చూడాల్సిన, చూపించాల్సిన సినిమా మహర్షి. నిడివి ఎక్కువ ఉన్నా ఆఖరి సన్నివేశం వరకూ ధియేటర్లో కూర్చుండబెట్టేలా ఈ సినిమాని అద్భుతంగా మలచిన వంశీ పైడిపల్లికి మరోసారి అభినందనలు.

కృష్ణ అని వ్రాయాలి కదా ?
ReplyDelete‘లేఖిని’ని ఉపయోగించి మార్చేశాను.
Deleteఅవును. కానీ నా లాప్ టాప్ లో రావడం లేదు. సాఫ్ట్వేర్ మార్చాలి.
ReplyDeleteరైతు సమస్యలను దైన్యాన్ని కూడా తెలివిగా సినిమా బిజినెస్ కు వాడుతున్నారు. వందల కోట్ల బడ్జట్ తో సినిమాలు తీస్తూ పదుల కోట్లు పారితోషికం తీసుకుంటున్న వారు నిజంగా రైతులకు సహాయమ చేస్తే బాగుంటుంది. ఒకవైపేమో అమెరికాలో కార్పొరేట్ అధిపతి చాలా సులభంగా అయిపోతాడు హీరో. మన దేశంలో మాత్రం కార్పొరేట్ బూచితో పోరాడతాడు. ఇదే సినీ మాయ.
ReplyDeleteThis is common Sir.. Same thing was shown in Circar.. I'm sure even Satya Nadella or Sundar P can't get things done here in India as they could make possible in USA.
DeleteI received my Family Visa extension Documents with a name change very comfortably in a Day but took me a couple of months to get the same amendment for the certificate here after using high influence and 2 Big bucks :)
I have watched it yesterday.. If we ignore glitches here and there, overall movie was good!!