ప్రశ్నిస్తున్నవారు : Aravind Palla
ప్రశ్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ కష్టమా? ఎందుకు?
ప్రశ్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ కష్టమా? ఎందుకు?
ప్రశ్న గురించి తెలంగాణ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, డా||బి.ఆర్.అంబేద్కర్
ప్రాణహిత-చేవెళ్ళ పథకం దాదాపు 80 వేల కోట్ల పై బడ్జెట్ తో నిర్మితమవుతోంది.
ఉత్తర తెలంగాణ గోదావరి నీటిని వినియోగించుకోవడం ఎత్తిపోతల ద్వారా మాత్రమే
సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టుపై పాజిటివ్ ప్రచారం ఎంతగా వుందో, నెగిటివ్
ప్రచారం కూడా అంతే వుంది. జయప్రకాష్ నారాయణ గారు కూడా కాళేశ్వరం
ప్రాజెక్టు ద్వారా వచ్చే ఫలితం కన్నా, నిర్వహణ వ్యయమే ఎక్కువుంటుందని, దాని
బదులు ప్రాజెక్టుకు ఖర్చుపెట్టిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తే వచ్చే
వడ్డీతోనే ఫలితం ఎక్కువుంటుందని అభిప్రాయపడ్డారు. ఇది ఎంతవరకు సమంజసం?
-----------------------------
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ఉమ్మడి రాష్ట్ర ఆదాయం ఏం చేసుకుంటారండీ ? ఇటువంటి తుగ్లక్ పనులు చేసి ఖజానా ఖాళీ చేసి అంతా తుగ్లక్ లేన్ లో ఉంటున్నవారి ఖాతాలోకి వేసేయడమే !
ReplyDeleteఅది అయిపోయే.... అప్పులు పెరిగే.....
Deleteమోంసాంటో మేతావులు & మిత్రపెట్టుబడిదారుల అనునాయుల తలతిక్క వాదనలు భలే వింతగా ఉంటాయి. పైగా ఇతగాడొక మాజీ ఐఏఎస్ అధికారట.
ReplyDeleteలక్షలాది ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రావాలంటే రైతులే స్వయంగా బోర్లు వేసుకొని, అవి మధ్యమధ్యలో కాలుతూ ఉంటే విద్యుత్తుకు మరమ్మత్తులకు మిత్తికి తెచ్చిన డబ్బులు పెట్టాలి. ఆ తగ్గిన ఖర్చులు పరిగణనలోకి తీసుకోకుండా ఇతగాడేదో కాకి లెక్కలు చెప్తున్నాడు.
పోనీ ఈ లెక్కించే విధానమయినా ఏడ్చిందా ఉందా అంటే అదీ లేదు. సాగునీటి ప్రాజెక్టుల జీవితకాలం కనీసపక్షం వందేళ్లు. ముడి సరుకులు & నాన్-ఫాసిల్ ఊర్జ నిజవెల పోకడలు దీర్ఘకాలికంగా తగ్గుముఖం చూపుతాయని ఏ మాత్రం ఎకనామిక్స్ అవగాహన ఉన్నవారయినా చెప్తారు. విస్తృత స్థాయి ఇన్వెస్ట్మెంట్ & సాంకేతిక ప్రగతితో economies of scale వస్తాయి. Prorating today's rates over the next 100-150 years is sheer idiocy.
Correction in my comment please:
Deleteపోనీ ఈ లెక్కించే విధానమయినా *సరిగ్గా ఏడ్చిందా* అంటే అదీ లేదు.
https://www.thehindubusinessline.com/opinion/a-white-elephant-in-the-making/article24584314.ece
ReplyDeletehttps://www.deccanchronicle.com/nation/current-affairs/100718/kaleshwaram-project-will-it-sink-the-telanganas-economy.html
ReplyDelete