Home
»
భారతీయం
»
మీరేమంటారు?
» సనాతన ధర్మం అంటే ఏమిటి? దీనిని తెలుసుకోవడానికి సిలబస్ ఏమిటి? సనాతన ధర్మం - హిందూధర్మం ఒక్కటేనా?
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
please read this blog you will get the answer
ReplyDeleteBELOW IS PART 106 OF MY SANATANA DHARMA SERIES..
http://ajitvadakayil.blogspot.com/2018/09/sanatana-dharma-hinduism-exhumed-and.html
నాకు తోచిన (తెలిసిన) మేరకు రాస్తున్నాను, తప్పులు/అభ్యంతరాలు ఉంటే మన్నించాలని అభ్యర్థన.
ReplyDeleteQ. సనాతన ధర్మం అంటే ఏమిటి?
A. ఏ ధర్మం అయినా కొన్ని నమ్మకాల* (belief systems) & కొన్ని విలువల (value systems) కలయిక. ఉ. విలువ= ఎప్పుడూ నిజమే చెప్పాలి, నమ్మకం= ఎప్పుడూ నిజం చెప్పేవారికి మంచే జరుగుతుంది.
* సదరు నమ్మకాలలో సృష్టి కారణపరమార్థాలు ఉన్నాయా లేదా అన్నది వేరే చర్చ. అది తప్పనిసరి అనుకంటే జైన బౌద్ధ షింటో వగైరాలు ధర్మాలు కావు.
సనాతనం అంటే అనాదిగా (from human creation) వస్తున్నది లేదా ప్రారంభం ఎప్పుడు జరిగిందో గుర్తు తెలీనంత కాలం (from times immemorial) నుండి ఉన్నది. మానవుడు రాత పద్ధతులు (writing systems) కనుక్కోక ముందే మొదలయింది కనుక కొంత భాగాన్ని గ్రంధాలలో క్రోడీకరించినా తత్తిమ్మా అంశాలు మౌఖిక సంప్రదాయాలు & ఆచారాల ద్వారానే ప్రాచుర్యం పొందుతాయి.
Q. దీనిని తెలుసుకోవడానికి సిలబస్ ఏమిటి?
A. గ్రంధాధార ధర్మాలలో (యెహూదీ, క్రైస్తవం & ఇస్లాం) ప్రధాన సిలబస్ సదరు గ్రంధం కాగా అనుబంధ సాహిత్యం సెకండ్ పేపర్.
సనాతన ధర్మంలో (లేదా ధర్మాలలో) పుస్తకాలు అర్ధం చేసుకుంటే (లేదా భట్టీయం వేస్తే) సరిపోదు, పైగా అసంబద్ధ పాండిత్యం కూడా కావొచ్చును. సనాతన ధర్మాన్ని జీవితం ద్వారా అర్ధం చేసుకోవడం అత్యవసరం.
Q. సనాతన ధర్మం - హిందూధర్మం ఒక్కటేనా?
A. భారత సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం అని కూడా అంటారన్నది ఒక నమ్మకం. ఈ వాదన ప్రకారం అనేక దేశాలలో *అక్కడి సనాతన ధర్మాలు* అంతరించి పోగా ఆసియాలో హిందూ, తావ్ లాంటి *కొన్ని సనాతన ధర్మాలు* నిలదొక్కుకున్నాయి.
పై వాదనకు భిన్నంగా భారత సనాతన ధర్మమే ప్రాంతీయంగా కాస్త మారుతూ విశ్వమంతా ఆవరించిందని కొందరి నమ్మకం.
ఇంకో ఆలోచనా సరళి ప్రకారం "హిందూ ధర్మం" అన్నది మతం కాదు, ఒక జీవన విధానం మాత్రమే.
సంస్కృతి , జీవన విధానం ఈ రెండూ ఒకటే అనవచ్చా జై గారూ
Deleteకొండలరావు గారూ, సంస్కృతి & జీవన విధానాల నడుమ కొన్ని సున్నితమయిన తేడాలు లేదా
Deleteoverlaps ఉంటాయనుకుంటాను.
నాకు తెలిసి సంస్కృతిలో "shared memories" (తెలుగులో "పంచుకున్న జాపకాలు" అంటారేమో?) అవసరం. ఇది జీవనశైలిలో నిగూడంగా/అంతర్లీనంగా ఉంటుందేమో కానీ ప్రత్యక్షంగా కనిపించక పోవోచ్చును.
సంస్కృతి అంటే సంస్కరించబడిన విధానం (పని, పద్ధతి) అనవచ్చా!
Deleteకొండల రావు గారూ, నేను చెప్పదలిచిన "shared memories" మాటకు "సామూహిక జ్ఞాపకాలు" అనే అర్ధం సరిపోతుందనుకుంటా. ఉ. నా చిన్నప్పటి ఆటపాటల గుర్తులు నా సొంతం కానీ "నాది ఫలానా వంశం" అనుకోవడం అనుభవం కాకపోయినా దాదాపు అలానే అనిపిస్తుంది.
Deleteమీరు చెప్పిన "సంస్కరించబడిన విధానం (పని, పద్ధతి)" నిర్వచనం నాకు ఎందుకో సరి అనిపించలేదు. I may be wrong.
k jai garu. syamaleeyam gaarini adugudaam.
Deletejai గారూ, పైన రఘు గారి లింక్ లో ఉన్నది తెలుగులో కి తర్జుమా చేసే అవకాశం ఉన్నదా మీకు?
ReplyDeleteతర్జుమా సంగతి మానె అర్ధం చేసుకోవడమే నాకు కష్టమండీ. రఘు గారే తెలుగులో ఏదయినా మంచి లింక్ ఇవ్వగలరేమో.
Deletek sir.
Deleteభగవద్గీత (chapter 3) కర్మయోగ ఆచరణలోని పంచమహా యజ్ఞములు ఉపయోగపడుతాయి. అవి:
ReplyDelete1. బ్రహ్మ యజ్ఞ : మత గ్రంధములు చదివి జ్ఞాన మార్జించుట.
2. దేవ యజ్ఞ: ప్రకృతి , పరిసరాలను జాగ్రత్త గా చూచుట.
3. పితృ యజ్ఞ: తల్లి తండ్రులను గౌరవించుట .
4. మనుష్య యజ్ఞ: తోటి మానవులను గౌరవముగా చూచుట.
5. భూత యజ్ఞ: జంతు ప్రపంచమును ప్రేమతో చూచుట.
మన జీవితంలో మనం చేసే పనులు చాలావరకు ఇతరులతో చెయ్యవలసి ఉంటుంది. అందరినీ అన్నిటినీ మనం కట్టుబాటులో ఉంచలేము. వారి వారి కర్మ ఫలాల ప్రకారం వారు ప్రవర్తిస్తూ ఉంటారు. మనం చెయ్యగలిగినదల్లా మంచి జరగాలని ప్రార్ధించటమే.
Thanks Rao garu.
Delete"సనాతన ధర్మం అంటే ఏమిటి?అది ఎందువల్ల ప్రత్యేకమైనది!" అనేది చాలా కాలం క్రితమే చెప్పాను.ఒక్క మాటలో చెప్పడం కష్టం కాబట్టి అక్కడికి వెళ్ళి చదవండి.
ReplyDeleteThank you hari garu.
Deleteఇక సిలబస్ గురించి అడిగారు."అనంతావైశ్చ వేదాః" అన్నది ఆర్యోక్తి.దృశ్యమాన ప్రపంచం సమస్తం జ్ఞానస్వరూపమే,అందులో చీమలకీ తేనెటెగలకీ గోచరించిన జ్ఞానం కన్న మానవులకి వ్యక్తమైనది కొంచెం ఎక్కువ.దానినే వేదం అని పిలుస్తారు.దీనికి పేర్లు కూడా చాలా ఉన్నాయి.ఇంగ్లీషు భాషలోని science అనే పదానికి పర్యాయపదం అనదగిన "శాస్త్రం" అనేది కూడా వేదానికి వర్తిస్తుంది.
Deleteవేదం సార్వకాలిక సత్యాల సమాహారమైన విజ్ఞానసర్వస్వం.వైదిక సాహిత్యంలో 18 విద్యాస్థానములు ఉన్నాయి.విద్యాస్థానం అంటే Branch of Study అని అర్ధం.వేదములు నాలుగు - 01.ఋగ్వేదం,02.శుక్ల,కృష్ణ యజుర్వేదాలు,03.సామవేదం,04.అధర్వ వేదం. ఇక వేదాంగములు ఆరు - 05.శిక్ష,అంటే Phonetics,06.కల్పం,అంటే Study of Rituals,07.వ్యాకరణం,అంటే Grammer,08.నిరుక్తం,అంటే Etymology,09.ఛందం,అంటే Prosody,10.జ్యోతిషం,అంటే Astronomy. ఇవి కాక ఉపాంగములు నాలుగు - 11.మీమాంస, 12.న్యాయశాస్త్రం, 13.పురాణములు, 14.ధర్మశాస్త్రము. ఉపవేదములు అనేకం ఉన్నాయి, కానీ ముఖ్యమైనవి తీసుకుంటే - 15.ఆయుర్వేదం,అంటే Medical Science:ఇది ఋగ్వేదం నుంచి పెరిగిన శాస్త్రం,16.అర్ధశాస్త్రం,అంటే Economic Science:ఇది అధర్వవేదం నుంచి పెరిగిన శాస్త్రం,17.ధనుర్వేదం,అంటే Military Science:ఇది యజుర్వేదం నుంచి పెరిగిన శాస్త్రం,18.గాంధర్వవేదం,అంటే Musical Science:ఇది సామవేదం నుంచి పెరిగిన శాస్త్రం.
వీటిలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం అనే వాటిని శృతి అంటే Revealed లేక Perceived అనీ మిగిలినవాటిని స్మృతి అంటే Memorizes లేక Created అనీ అంటారు.ఋగ్వేదం అనేది ఒక Collection of Prayers లాంటిది.యజుర్వేదం అంటే యజ్ఞాలకు సంబంధించిన Sacrificial Manual వలె ఉంటుంది.సామవేదం అనేది Rigvedic hymns in musical form అనేటట్లు ఉంటుంది.ఇక అధర్వవేదంలో మానవుల దైనందిన జీవితానికి ఉపయుక్తమైన Magical Charms ఉంటాయి.ప్రతి వేదం మళ్ళీ నాలుగు ఉపవిభాగాల కింద ఏర్పరచబడి ఉంది:1).మంత్రసంహిత->ప్రధానమైన భాగం.ఋగ్వేదంలోని మంత్రాలను మాత్రం ఋక్కులు అంటారు.మిగిలినవాటిని మంత్రాలు అంటారు - వీటిని అందరూ అధ్యయనం చెయ్యవచ్చు. ప్రస్తుతం మన తెలుగువాళ్ళకి సంస్కృతం కన్న తెలుగు కన్న ఇంగ్లీషు ఎక్కువ అర్ధం అవుతుంది గనక ఇంగ్లీషులో “A compilation of all realized hymns: This section should be the best focus for who is in Brahmacharya-ashrama, that is during the stage of education” అని చెప్తున్నాను. 2).బ్రాహ్మణములు->సంహితలలోని విషయానికి వ్యాఖ్యానములతోనూ కర్మకాండలకు సంబంధించిన వివరాలతోనూ కూడుకున్న వచనభాగం.ఇంగ్లీషులో “Explanations of how to put them to practical use: This section should be the best focus for who is in Grihastha-ashrama, that is during the stage of householder” అని చెప్తున్నాను.వీటిని సంహితను అధ్యయనం చేసిన తర్వాత మరింత తెలుసుకోవాలనే ఆసక్తి గలవారికి బోధిస్తారు.3).అరణ్యకములు->ప్రతి వేదమంత్రానికీ సామాన్య అర్ధం,సాంకేతిక విశేషం,ఆధ్యాత్మిక సంబంధం అనే పాఠాంతరాలు ఉంటాయి గనుక వాటిమధ్యన సమన్వయం ఎలా చెప్పుకోవాలో సూచించే వచనం.ఇంగ్లీషులో “Various internal observations to follow: This section should be the best focus for who is in Vaanaprastha-ashrama, that is during the stage of renounceation” అని చెప్తున్నాను.నాగరికులకూ లౌకికులకూ ఇవి అనవసరం గనక ఆచార్యత్వాన్ని ఇష్టపడినవారికి బోధిస్తారు.4).ఉపనిషత్తులు-> ఇంగ్లీషులో “Footnotes which capture the essence of the entire veda: This section should be the best focus for who is in Sanyaasa-ashrama, that is during the final stage of before seeking/attaining moksha” అని చెప్తున్నాను నేను.
మొత్తం వైదికం సాహిత్యాన్ని ఒక మనిషి అధ్యయనం చెయ్యలేడు.వేదాలను విభజించి పరిష్కరించినది 28 మంది వ్యాసులు అని విష్ణు పురాణమే చెప్తుంది.అందువల్లనే బ్రాహ్మణులు కూడా ఒక్కొక్క కుటుంబం వారు ఒక్కొక్క భాగాన్ని తీసుకుని నిన్న మొన్నటి వరకు మౌఖికంగానే ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తూ అవి ద్యోతకం అయిన మొదటిరోజున అలా ఉండేవో అదేలా ఒక్క అక్షరం తేడా లేనంత నిక్కచ్చి రూపంలో నిలిపి ఉంచారు.ఇప్పుడు ప్రింటు రూపంలో దొరుకుతున్నాయి.ఆర్యసమాజ్ వారి శాఖల వద్ద దొరికేవి మాత్రమే అధికారికమైనవి.