-----------------------------------------------
అంశం :సంప్రదాయం-ఆచారాలు
ప్రశ్నిస్తున్నవారు : ప్రవీణ్
------------------------------------------------
Name: | Praveen |
E-Mail: | deleted |
Subject: | ఆడవాళ్ళకి బొట్టూ, గాజులూ మంగళసూత్రాలూ అవసరమా? |
Message: |
రోజా, సుమలు మంగళసూత్రాలు పెట్టుకోకపోవడం పై ఫేస్‌బుక్‌లో కొంత మంది చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసారు. "మంగళసూత్రం తీసెయ్యడం మాత్రమే ఎందుకు? సన్నీ లియోన్‌లాగ బికినీ వేసుకోవచ్చు కదా" అనే అర్థం వచ్చేలా వ్రాసారు. రోజా, సుమలు సినిమా & టి.వి. నటులు. వాళ్ళు మంగళసూత్రాలు పెట్టుకోవడం అన్ని వేళలా సాధ్యం కాదు. నేను ఈ విషయం స్పష్టంగానే చెప్పాను. వాళ్ళకి అది అర్థం కాలేదు.
అసలు బొట్టూ, గాజులూ పెట్టుకోవడం కూడా అనవసరమే అని నేను అంటాను. 20 ఏళ్ళ అమ్మాయి బొట్టు పెట్టుకోకపోతే ఆమెకి పెళ్ళి కాలేదనీ, 60 ఏళ్ళ ఆవిడ బొట్టు పెట్టుకోకపోతే ఆమె విధవ అనీ అనుకునే వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. భర్తకీ, బొట్టుకీ సంబంధం ఏమిటి అని అడిగే సెన్స్ మాత్రం వాళ్ళకి లేదు. ముస్లింలూ, యూదులూ స్త్రీకి భర్త చనిపోయిన మూడు నెలల తరువాత రెండో పెళ్ళి చేస్తారు. హిందువులు మాత్రం భర్త చనిపోయిన స్త్రీ బొట్టు పెట్టుకోవడాన్ని కూడా హర్షించలేరు. బొట్టు పేరుతో మూఢనమ్మకాలు వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆడవాళ్ళందరూ బొట్టు తీసెయ్యడమే మంచిదని నేను అంటాను. |
-----------------------------
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
రమా సుందరి అనే బ్లాగర్ ఓ సారి ఫేస్‌బుక్‌లో వ్రాసారు, ఆవిడ బొట్టు పెట్టుకోకపోవడం వల్ల ఆవిణ్ణి దళిత క్రిస్టియన్ అనుకుని గుంటూరులో ఆవిడకి ఇల్లు ఎవరూ అద్దెకి ఇవ్వలేదని.
ReplyDeleteఅవసరమా? కాదా? అన్నది సామాజిక చైతన్యం పైనా, వ్యక్తిగత ఇష్టాలపైనా ఆధారపడి ఉంటుంది. బలవంతంగా ఆచరిమ్పజేయడమూ, వద్దని అతి విమర్శలు చేయడమూ రెండూ తప్పే.
Deleteవాళ్ళు బొట్టు పెట్టుకోకపోవడంపై వాళ్ళ భర్తలకే అభ్యంతరం లేనప్పుడు ఈ మందకి మాత్రం అభ్యంతరం ఎందుకు?
ReplyDeleteGood Question ☝👍
Deleteఅత్యధిక హిందువులలో పుస్తెలు కట్టే ఆచారం లేదు.
ReplyDeleteis it correct?
DeleteHindu tradition was never unique. In our village, even brahmins eat beef but in Uttar Pradesh, Muslims are killed on doubt of beef eating.
Deleteకొండలరావు గారూ, ఇవన్నీ ప్రాంతీయ ఆచారాలేనండీ. పుస్తెల ఆచారం చెలామణీ ఉన్న ప్రాంతాలలో (కొన్ని) క్రైస్తవ పెండ్లిండ్లలో సైతం ఫాదరీలు "this holy mangalasutram" అంటూ "మంత్రం" చదువుతూ తాళి కట్టిస్తారు.
Deleteమరోవైపు అనేక ప్రాంతాలలో ఈ కింది వాక్యంలో "బొట్టు" బదులు "నుదుట సిందూరం" అని సవరించాల్సి ఉంటుంది.
"20 ఏళ్ళ అమ్మాయి బొట్టు పెట్టుకోకపోతే ఆమెకి పెళ్ళి కాలేదనీ, 60 ఏళ్ళ ఆవిడ బొట్టు పెట్టుకోకపోతే ఆమె విధవ అనీ అనుకునే వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు"
tq jai garu.
Deleteఇంతకు ముందు దుర్గెశ్వరగారు తన బ్లాగులో.. హిందూ ఆచారాలైన బొట్టు, పసుపు లాంటి ముత్తైదు లక్షణాలు.. ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రస్తావించారు. "మరి విధవలకి ఆ ఆరోగ్యం అవసరంలేదా?" అని కామెంటు పెట్టాను. అది జీవితంలో ప్రచురించబడదు..
Deleteఅవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటే, వాటిని విధవలుకూడా దరించొచ్చు.. అని ఒప్పుకోవాలి. మంచిది కాదు/అంత అవసరమైతే లేదు అనుకుంటే.. వాటిని తమ తమ ఇష్టాలకి వదిలెయ్యాలి.
< అవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటే, వాటిని విధవలుకూడా దరించొచ్చు.. అని ఒప్పుకోవాలి. మంచిది కాదు/అంత అవసరమైతే లేదు అనుకుంటే.. వాటిని తమ తమ ఇష్టాలకి వదిలెయ్యాలి. >
Deletegood.
ReplyDeleteఆండోళ్ళ విషయాలు మీ మగోళ్ళ కెందుకు :)
జిలేబి
మీరు “ఆండోళ్ళు” కారని బ్లాగులోకంలో గుసగుస 😉.
Deleteమిమ్మల్ని, ముద్దుగా, అభిమానంగా, ఆప్యాయంగా "నర్సన్" అని పిలుచుకుని అయ్యర్ గారి సర్సన్ కలుపుకుంటే తెలుగు వాన్నైన నన్ను "నర్సయ్య° అని తెలుగులో
Deleteముద్దుగా పిలవకుండా ఛత్ అరవల్లో కలపడ మేంటని మీరు కినుక వహించి ఇంటిగుట్టు బయట పెట్టడం ఎంతవరకు కరెక్టని అడుగుతుండానయ్యా. శర్మ గారు, రాజారావు గార్ల అండతోనేనా మీకీ సాహసం అని నా సద్విచారం. 😉 జెఫ్/జేక్
“నర్సన్”, “సర్సన్” .... ఎంతైనా మీరు మీరే 😁😁😁
Deleteఅవునండి, పెద్దల ఆశీస్సులు, విద్వాంసుల అండ ఉంటే ధైర్యం రాకేం చేస్తుంది. ఎంత సాహసమైనా చెయ్యచ్చు 🙂.
"హవాయి " లో అమ్మాయి పువ్వు కుడివైపు పెట్టుకుంటే ఒక అర్ధం ఎడమ వైపు పెట్టుకుంటే ఒక అర్థం (పెళ్ళి అయినట్లు కానట్లు). ఇక్కడ అమెరికాలో అమ్మాయిలు ఉంగరం ఒక వేలికి పెట్టుకుంటే ఒక అర్ధం ఇంకొకవేలుకి పెట్టుకుంటే ఇంకొక అర్ధం. అల్లాగే మనకి కూడా కొన్ని అలవాట్లూ ఆచారాలూ ఉన్నాయి. వాటిని ఆచరించాలా వద్దా అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. నేను సంఘ జీవినా కాదా అనేది కూడా ఎవరికీ వారే నిర్ణయించుకోవచ్చు స్వతంత్ర దేశంలో.
ReplyDelete