" సైన్స్ ఓ మూఢనమ్మకంగా మారుతోంది " ------ మీ కామెంట్!? " 

ఇటీవల నేను విజయవాడనుండి ఖమ్మం కు ట్రైన్ లో వస్తున్నప్పుడు నా దగ్గరున్న ఆక్యుపంచర్ బుక్స్ చూసి పక్కన ఒకతను ఈ కోర్సుకు సర్టిఫికెట్లు ఎవరిస్తారన్నాడు. వివరం చెప్పాను. అతని మాటలను బట్టి తెలంగాణావాడనుకుని మీది కరీంనగరా? అన్నాను. 'వరంగల్' అన్నాడు. నేనూ విజయవాడలోనే కుంగుఫూ కోర్సు నేర్చుకుంటున్నాని చెప్పాడు. ప్రక్రుతి జీవన విధానం గురించి చాలా విషయాలు చర్చించాడు. హైదరాబాద్ దగ్గరలోని ఆల్వాల్ వద్ద వెంకటరెడ్డి అని ఒకరు 70 ఏండ్ల వయసులోనూ చాలా ఆరోగ్యంగా ఉంటారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ప్రక్రుతి జీవనం సాగిస్తున్నాడని అన్నాడు..... 

ఇలా వివరాలు చెప్తూ డాక్టర్లు అవసరం లేకపోయినా మందులు వ్రాస్తూ ఫార్మ కంపెనీలతో కుమ్మక్కై మనుషుల శరీరాలతో దారుణంగా ఆడుకుంటున్నారన్నాడు. నిజమే అన్నాను. డాక్టర్లు - హాస్పిటల్స్ నాశనం కావాలన్నాడు. తప్పన్నాను. ఒప్పుకున్నాడు. 

కానీ సర్ అవసరమైనప్పుడే అంటే శర్జికల్ విభాగాలకే అల్లోపతిని వాడాలన్నాడు. అవసరమైనప్పుడు ఏ వైద్యవిధాన్నైనా వాడాలి. కాకుంటే అనవసరంగా డాక్టర్లు బాగుపడడానికి ఏ వైద్యవిధానాన్ని ఉపయోగించకుండా వ్యవస్థలో మార్పులు రావాలన్నాను. 

ఈ సందర్భంగా అతనో మాట అన్నాడు... అదే : " సైన్స్ ఓ మూఢ నమ్మకంగా మారింది సర్ " అని. అర్ధం కాలేదన్నాను. అవసరం లేకున్నా సైన్స్ పేరుతో ప్రతీదానిని శల్యపరీక్ష చేస్తూ సాంప్రదాయ వైద్య విధానాలపట్ల ప్రజలలో భయాందోళనలకు గురి చేస్తున్నారన్నాడు. నేను అంగీకరించలేదు. సాంప్రదాయవైద్యం పేరుతోనూ, ఆధునిక వైద్యం పేరుతోనూ ప్రజల అమాయకత్వాన్ని బట్టి దోపిడీ జరుగుతూనే ఉన్నది. దోపిడీకి వైద్య విధానానికీ సంబంధం లేదని చెప్పాను. సైన్స్ మూఢనమ్మకంగా మారడం కాదు. సైన్స్ ఈ వ్యవస్థలో దోపిడీదారులకు ఉపయోగపడుతుంది. అది సైన్స్ తప్పు కాదు కదా? అన్నాను. అతను అర్ధం కాలేదన్నాడు. 

ఈలోగా నేను ట్రైన్ దిగాను." ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? ప్రతీదానికి సైన్స్ పేరు చెప్పి శల్యపరీక్ష చేయడం అవసరమా? సైన్స్ ఓ మూఢనమ్మకంగా మారుతున్నదా?
 పల్లా కొండల రావు.

-----------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. మనిషికి దేవుడు విచక్షణా జ్ఞానాన్ని ఇచ్చాడు. కాని మనిషి దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడంటె అది మనిషి తప్పే, కత్తులతో కూరగాయలూ తరగవచ్చును, తలకాయలూ తరగవచ్చును కదా? తలకాయలు తరిగే వారి సంఖ్య మితిమీరి పోతోందని కత్తి అన్నది లేకుండా పోవాలని కోరుకుంటారా? మేధస్సు బాగా ఉన్న వాళ్ళు అది ఆట్టే లేని వారిని దోచుకుంటున్నారన్నది నిర్వివాదం అని ప్రకటించి, మనుష్యులకు మేధస్సు ఉండకూదదు అని కోరుకోగలమా?
    విజ్ఞానశాస్త్రాలు మానవనాగరికతాపురోభివృధ్ధికే అన్నదాంట్లో విప్రతిపత్తి లేదు కాక లేదు. ఐతే శాస్త్రజ్ఞుల ఆవిష్కరణలు వినాశనానికి దారితీయటం అన్నది శాస్త్రజ్ఞులనూ కలవరపెట్టే విషయమే అన్నదీ ఒప్పుకోవాలి. ఆల్‌ఫ్రెడ్ నోబుల్ అనే ఆయన తాను కనిపెట్టిన డైనమైట్ విధ్వంసాలకు వినియోగపడుతుంటె విలవిల్లాడటం జగమెరిగినదే. మానవస్వార్థం దేనిని విడువదు కాబట్టి శాస్త్రవిజ్ఞానాలనూ విడువదు. అంతమాత్రం చేత సైన్స్ అంటె మూడనమ్మకంలా ఐపోతోది కాబట్టి దీనినీ నిరోధించాలి అనుకుంటే అది అసమంజసమైన ఆలోచనావిధానం!

    ReplyDelete
  2. మీరు చర్చించిన వ్యక్తీ ఆలోచనల్లో ఇంకా పరిపక్వత రాలేదని మీరు రాసిన దాన్ని చదివితే అర్థమవుతోంది. మీ చర్చలో అనేక సార్లు తానూ చెప్పినదాన్ని తర్వాత కాదని అతను ఒప్పుకోవడమే అందుకు సాక్ష్యం. యౌవన ప్రాయంలో తమకు చాలా తెలుసని ఇతరులకు తెలియజెప్పాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అలా తెలిసీ తెలియని విషయాలపై కూడా చర్చకు దిగుతూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. బహుశా అలాంటిదే అనుకుంటా మీ అనుభవం.

    >>> ప్రతీదానికి సైన్స్ పేరు చెప్పి శల్యపరీక్ష చేయడం అవసరమా?

    అవసరం లేదు. కాని రోగ నిర్ధారణ జరిగే వరకు రకరకాల పరీక్షలు చేయడం డాక్టరు విధి. రోగ నిర్ధారణ జరిగాక కూడా డబ్బులకోసం పరీక్షలు చేయడం తప్పు.

    రోగి తలనొప్పి అని వెళ్ళాడనుకోండి, తలలో జలుబు ఉన్నట్టు నిర్ధారణ అయితే డాక్టరు దానికే మందులు ఇస్తాడు. జలుబు లేకపోతే అప్పుడు మరో పరీక్ష చేయాలి. కంటి చూపు మసకబారినా తలనొప్పి వస్తుంది. తలలో ఏదైనా సిస్ట్ ఉండొచ్చు. ఇంకా అనేక కారణాలు ఉండొచ్చు. సాధారణంగా చిన్న వాటితో మొదలు పెట్టి నిర్ధారణ కాక పొతే పెద్ద పెద్ద పరీక్షలు చేస్తారు. అంతేకానీ ముందే పెద్ద పెద్ద పరీక్షలు చేయడం సాధారణంగా జరగదు. అలాగే కడుపునోప్పికి గ్యాస్ కారణం కావచ్చు. అల్సర్ కావచ్చు. కిడ్నీ కావచ్చు. అపెండిసైటిస్ కావచ్చు. మరోటి కావచ్చు. నిర్ధారించేది పరీక్షలే.

    ఒక రుగ్మతను శాస్త్రీయంగా పరీక్ష చేసి నిర్ధారించినపుడు అది మూఢనమ్మకం కాదు. అలా కాక ఏ పరీక్ష లేకుండానే ఇది ఫలానా రోగం అని నిర్ధారించే నాటు వైద్యానిదే మూఢనమ్మకం అవుతుంది.

    ReplyDelete
  3. ఇక్కడ ఇది నాకు జరిగినది నేను వ్రాస్తాను, నాకు ౨౦౦౭ లో Accident జరిగింది. తలకు దెబ్బ తగిలింది అది పడిపోవడం వలన.
    అది మా తల్లిదండ్రులు కు తెలియదు, కానీ వైద్యులు Bangalore లోని Hosmat Hospital వాళ్ళు మీ అబ్బాయి తలలో నరం చిట్లింది బ్రతకడం కష్టం అన్నారు, కానీ జరిగింది పుర్రె లోపల కాదు పుర్రి పైన ఉండే భాగంలో!
    దాంతో మా తల్లిదండ్రులు హైరానా పడ్డారు, మా నాన్నగారికి తెలిసిన ఒక వైద్యుడిని సంప్రదిస్తే పై విషయం చెప్పి మా ఊరు తీసుకు రమ్మన్నారు!
    ఊరుకు తీసుకు వెళ్ళారు!
    మరి రెండురోజులు Hosmat లో ఉంచి నన్ను ICU లో పెట్టి రోజూ లేదా నాకు మెలుకువ వచ్చినప్పుడల్లా మత్తు injection ఇచ్చేవారు, ఆ రెండు రోజులకు లక్షా యాభై వేలు దండుకున్నారు!
    ఆ test లు అసలు అవసరం లేదు అన్ని సార్లు చెయ్యడం అని మా వైద్యుడు అన్నారు!
    మరి ఎందుకు చేసారు అని అడిగితె పరిపక్వత లేని చదువులు మరియు అక్కడ చదువుతున్న విద్యార్ధులకు నువ్వు ఒక వస్తువువు అందుకే ఇది జరుగుతుంది!

    ఇక వైద్యం ఒకటే కాదు అన్నిట్లోనూ ఆయన చెప్పినది ఇలా అర్ధం చేసుకోవాలి!
    మానవత్వం లేని ఏ ఇజం అయినా మూఢ నమ్మకం!

    ReplyDelete
  4. నాటు మందులు అమ్మేవాడు ఎలాంటి పరిశోధన చెయ్యడు. అతని తాత నాటు మందులు అమ్మాడు కనుక అతను కూడా నాటు మందులు అమ్ముతాడు. డ్రగ్ కంపెనీలైతే కొత్తగా కనిపెట్టిన మందుల్ని ముందుగా జంతువుల మీద ప్రయోగం చేస్తాయి. ఆ ప్రయోగం సక్సెస్ అయితే మనుషుల మీద ప్రయోగం చేస్తారు. మనిషి అనుమతి లేకుండా అతని మీద ప్రయోగం చెయ్యడం నేరం. ఆ ప్రయోగం కూడా సక్సెస్ అయితే డ్రగ్ కంట్రోల్ అధికారుల అనుమతి తీసుకుని ఆ కొత్త మందుని మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. ప్రైవేట్ డాక్టర్లు మాత్రమే మెడికల్ రిప్రజెంటేటివ్‌లతో కుమ్ముక్కై అవసరం లేని మందులు వ్రాస్తారు. ప్రభుత్వ డాక్టర్ అయితే తన ఆసుపత్రిలో స్టాక్‌లో ఉన్న మందులు ఇస్తాడు, ఆ మందులకి రికార్డులు కూడా వ్రాస్తాడు. ఓవర్ ప్రిస్క్రిప్షన్ అనేది ప్రైవేట్ డాక్టర్లతో ఉన్న సమస్య కానీ ప్రభుత్వ డాక్టర్లతో ఉన్న సమస్య కాదు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top