తెలంగాణలో ఆర్.టి.సీ ఉద్యోగుల సమ్మె అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగుల డిమాండ్లు, గతంలో KCR ఇచ్చిన హామీలు ఇప్పటి ఆయన వైఖరిపై సోషల్ మీడియాలో వివిధ అభిప్రాయాలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
విశ్లేషకులు తమ అభిప్రాయం చెపుతున్నారు. వివిధ రాష్ట్రాలలో పరిస్తితులను బేరీజు వేస్తూ ప్రజారవాణ విషయంపై చర్చలు సాగుతున్నాయి. ఇందులో భిన్నమైన అభిప్రాయాలు ఉంటున్నాయి.
TSRTC ఉద్యోగుల సమ్మె, KCR వైఖరి ఈ రెండింటిపై మీ అభిప్రాయం ఏమిటి?
TSRTC ఉద్యోగుల సమ్మె, KCR వైఖరి ఈ రెండింటిపై మీ అభిప్రాయం ఏమిటి?
రాజకీయాలు పక్కన బెడితే, అసలు ప్రజారవాణ అనేది ఎలా నిర్వహిస్తే బాగుంటుంది?
మీ అభిప్రాయం తెలుపగలరు.
- Palla Kondala Rao
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలీనం చేసినా కూడా ఆర్.టి.సి.కి తగిన ఆదాయం లేకపోతే ఉద్యోగుల్ని రీట్రెంచ్ చెయ్యాల్సి వస్తుంది. సంస్థ ప్రభుత్వంలో విలీనం అయితే ఆ ఉద్యోగులకి రీట్రెంచ్మెంట్ ఉండదనేది భ్రమే. భారతీయ రైల్వే పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలో భాగం. అయినా రైల్వే ఉద్యోగుల్ని ప్రభుత్వం రీట్రెంచ్ చెయ్యాలనుకుంటోంది.
ReplyDeleteమీరు ఆర్.టీ.సి ఉద్యోగుల సమ్మెను తప్పుబడుతున్నారా?
Deleteఆర్టీసీ సమ్మెకు సామాన్య ప్రజల మద్దతు ఉందంటారా?
ReplyDeleteలేదు. ప్రజలలో అందరి ఉద్యోగుల పట్ల వ్యతిరేకత ఉన్నది. ఇదే కె.సి.ఆర్ ధైర్యం.
Deleteతెలంగాణ ఉద్యమానికి కూడా సామాన్యప్రజల మద్దతు సంపూర్ణంగా లేదు. ఇక్కడ ప్రశ్న సామాన్య ప్రజల మద్దతు గురించి కాదు కదా జై జీ.
Deleteఈ వ్యతిరేకత ఎన్ని రోజులు నిలబడుతుంది, ఎప్పుడు సానుభూతిగా మారుతుంది అన్నవి కీలక ప్రశ్నలు. అంత స్టామినా ఆర్టీసీ ఉద్యోగులకు ఉందా అన్నది అనుమానమే.
Delete"తెలంగాణ ఉద్యమానికి కూడా సామాన్యప్రజల మద్దతు సంపూర్ణంగా లేదు"
Deleteఇది తప్పుడు అవగాహన. ప్రజల మద్దతు లేకుండుంటే ఉద్యమం నిలబడేది కాదు.
ఇకపోతే ఆర్టీసీ సమ్మెకు వస్తే, ముందస్తుగా ప్రజాసమర్దన కూడగట్టకపోవడం యూనియన్లు చేసిన అతిపెద్ద వ్యూహాత్మాతక తప్పిదం.
ఔను. రాజకీయం కూడా నమ్మశక్యంగా లేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో సి.పి.ఐ టిఆర్ఎస్ కు మద్దతు నిస్తూ ఇటు ఆర్.టి.సి ఉద్యోగులసమ్మెకు మద్దతివ్వడం. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకులు అధికార TRS కు కోవర్టులుగా ఉండడం, బి.జె.పి వస్తుందా? అన్న అనుమానం వంటి అనేక కారణాల వలన ప్రజలు ముక్కు కోసినా ... అన్న చందాన కె.సీ.అర్ నే బెటర్ అన్న ధోరణిలో ఉన్నారు. అయితే RTC ఉద్యోగుల సమ్మె ఎంతకాలం నడుస్తుందన్న దానిని బట్టి, దానికి లభించే మద్దతుని బట్టి భవిష్యత్ ఆదారపడి ఉంటుందన్నదానిలో అనుమానం లేదు.
Delete< ఇది తప్పుడు అవగాహన. ప్రజల మద్దతు లేకుండుంటే ఉద్యమం నిలబడేది కాదు.
Delete>
తెలంగాణ ఏర్పాటు ముమ్మాటికీ సోనియాగాంధీ స్వార్ధమే.
మీ ఇష్టం అలానే అనుకోండి, ఇక్కడ చర్చ అది కాదు.
Delete"RTC ఉద్యోగుల సమ్మె ఎంతకాలం నడుస్తుందన్న దానిని బట్టి, దానికి లభించే మద్దతుని బట్టి భవిష్యత్ ఆదారపడి ఉంటుందన్నదానిలో అనుమానం లేదు"
కొంతవరకు అంగీకరిస్తాను అయితే ఆర్టీసీ సమ్మె కంటే ముఖ్యం (నిజానికి అసలైన రణరంగం) రెవిన్యూ "సంస్కరణ" రానుంది. అది బెడిసికొడితే మాత్రం తెరాసకు తిప్పలు తప్పవు.
కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకులు అధికార TRS కు కోవర్టులుగా ఉండడం"
ఎవరో ఆ కోవర్టులు? నాకయితే టీడీపీ కోవర్టులే ఎక్కువ అగుపిస్తున్నారు.
"బి.జె.పి వస్తుందా?"
సెప్టెంబర్ 17 భారీ చేరికలు అంటూ నెలల తరబడి ఊదరగొట్టారు, తీరాచూస్తే పచ్చంగీలు తప్ప ఎవరూ రాలేదు.
రెవెన్యూ సంస్కరణ హిట్టయితే.......?
Deleteనా అంచనా ప్రకారం రెవిన్యూ "సంస్కరణ" హిట్ అయ్యే అవకాశం లేనేలేదు. మోస్తరు సమస్యలు వస్తాయా లేక పూర్తిగా అట్టర్ ఫ్లాపా వేచి చూద్దాం!
DeleteYou got it wrong kondala rao garu. Telangana was formed with overwhelming support and desire of the people. Credit goes to everyone - People, Leaders, employees, students, KCR and Sonia Gandhi also.
DeleteOK GKK garu. its my opinion only.
Deleteమిగతా దేశంతో పోల్చుకుంటే, తెలుగు రాష్ట్రాలలో RTC సేవలు బాగుంటాయి. ఉద్యోగులు కూడ వీలైనంతమంది ఎక్కువ ప్రయాణికులని ఎక్కించుకుని సంస్థని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కాని ఒకసారి RTC ని ప్రభుత్వపరం చేస్తే, ఉద్యోగుల్లో ఆ సిన్సియారిటీ తగ్గిపోతుంది. ప్రభుత్వానికి భారంగా మారుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీలైనన్ని పన్ను రాయితీలు ఇచ్చి సంస్థని ప్రస్తుతం ఉన్నట్టు కొనసాగిస్తేనే బాగుంటుంది. కొంతమంది ప్రయాణికులకి ఇచ్చే రాయితీలకి పరిహారం సక్రమంగా సంస్థకి ఇవ్వాలి.
ReplyDeleteRTC ని ప్రైవేట్ పరం చేస్తే చార్జీలు పెరిగి ప్రజా రవాణా అస్థవ్యస్థం అవుతుంది. నగర, పట్టణ పరిధుల్లో విద్యుత్ బస్సులు నడిపితే ఇంధన ఖర్చు తగ్గుతుంది. పర్యావరణానికి మంచిది.
Agree with your view. Electric mini buses may be introduced. Also, smart card like metro card with swipe machine with the conductor can be thought of to do away with cash and tickets. There is a huge difference between the pay scales of RTC employees and state govt. employees. This has to be addressed.
DeleteThe days are over for strikes in the present times.
Rtc routelalo meeku thelisina oka route Peru mentioned cheyandi pl.even palle velugu ayina parva ledu.alantivi any depot meeku sameepamloni Danilo enni routes unnayo cheppagalara.
ReplyDeleteఒరిస్సాలో గ్రామ సేవక్ జీతం 8,000 మాత్రమే. అయినా ఒరిస్సాలోని గ్రామ సేవక్‌లలో ఒక్కడు కూడా గ్రామాల్లో నివాసం ఉండడం లేదు. పల్లెటూర్లలో పుట్టి పెరిగిన గ్రామ సేవక్‌లు కూడా పట్టణాల్లో ఇళ్ళు అద్దెకి తీసుకుంటున్నారు, నెలకి రెండు సార్లు మాత్రమే గ్రామాలకి వచ్చి పోతున్నారు. తెలంగాణాలో కూడా అంతే. అక్కడ 900 స్కూల్‌లలో టీచర్‌లు లేరు. పల్లెటూర్లలో పుట్టి పెరిగిన టీచర్‌లు కూడా ఉద్యోగం దొరికిన తరువాత పట్టణాలకి ట్రాన్స్‌ఫర్ చెయ్యించుకుంటున్నారు. ఆ 900 స్కూల్‌లనీ ప్రభుత్వం మూసివెయ్యాలనుకుంటోంది తప్ప అక్కడ డ్యూటీలో చేరమని ప్రభుత్వం టీచర్లకి చెప్పడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు సరిగా పని చెయ్యకపోవడంపై ఎన్నడూ నోరు విప్పని విరసం & న్యూ డెమోక్రసీలు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెలకి సపోర్ట్ ఇవ్వడానికి అత్యుత్సాహం ఎలా చూపుతున్నాయి?
ReplyDeleteప్రభుత్వరంగ సంస్థలలో నష్టం రావాడానికి ఉద్యోగులే కారణమా? ప్రభుత్వోద్యోగులందరూ పని చేయరా? వారితో సక్రమమ్గా పని చేయించాల్సిన బాధ్యత ఎవరిదంటారు? ఆర్టీసిని ప్రయివేటీకరించమంటారా? మీరు ఏమి పరిష్కారం చెప్పదలచుకున్నారు?
DeleteI did not suggest privatisation. A private lorry driver in a rural area earns Rs 300 per day and an inter-district lorry driver earns Rs 500 per day. An RTC conductor earns Rs 30,000 per month (Rs 1,000 per day). Do you think that these pseudo left parties would support a strike initiated by lorry drivers?
Deleteso... what is your suggestion?
Deleteఇంకా అర్థం కాలేదా? వామపక్ష సంఘాలు బూర్జువా పార్టీలకు కొమ్ముకాయడం మాని అర్జంటుగా తుపాకులు పట్టి అడవులబాట పట్టాలి. అప్పుడుగాని ప్రవీణ్ సాటిస్ఫై అవ్వడు☺️
Deleteఅపుడు తుపాకీ పట్టుకున్నవారి ఈగో మాత్రమే శాటిస్పై అవుతుంది. సమస్య పరిస్కారం కాదుగా... ప్రవీణ్ ఏమి చెప్పాలనుకుంటున్నదీ అతని ద్వారానే విందాం.
Deleteఆర్.టి.సి. డ్రైవర్, కండక్టర్ల ఇద్దరి జీతం కలిపితే నెలకి అరవై వేలు. మన రాష్ట్రంలో ఏ బస్సు వల్ల అంత ఆదాయం వస్తోంది? కుబుసం సినిమాలోని డాక్టర్ హరి ప్రసాద్‌లాగ తుపాకీ పట్టుకుని రణరంగంలోకి దూకడానికి నాకేమీ అభ్యంతరం లేదు.
Deleteఇక్కడ ప్రశ్న నీకు అభ్యంతరం వుందా? మూడు ఉందా? అని కాదు. అసలు ఏం చెప్పదలుచుకున్నావు అని!
Deleteసంస్థకే లేని ఆదాయం కోసం జీతం పెంచడం అవసరమా?
Delete