జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం బలపడుతుందా?
ఇటీవలి కాలంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్ టి ఆర్ స్థాపించిన పార్టీని ఇప్పటిదాకా చంద్రబాబు సారధ్యంలో ముందుకు నడిపారు. ఆయన తన వారసుడిగా కుమారుడు లోకేష్ ని రాజకీయాలలో స్థిరపరచాలని చూస్తున్నారు. అయితే లోకేష్ లో నాయకత్వ లక్షణాలు లేకపోవడం తో తరువాత తెలుగుదేశం నాయకుడు ఎవరన్నది ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్ టి ఆర్ తెలుగుదేశం బాధ్యతలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. తారక్ రాజకీయాలలో రాణిస్తారా? ఆయనను చంద్రబాబు రానిస్తారా? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి?
- Palla Kondala Rao
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
He has ten years of film career ahead of him. Why drag him into politics. What are his credentials to lead a party. Individual centric parties are a double edged sword.
ReplyDeleteIf he really wants to join politics let him work as full-time apprentice for five years to understand issues.
చంద్రబాబు కాబట్టి అందరినీ లిమిట్లో ఉంచి పార్టీని నడపగలుగుతున్నాడు. ఇప్పటికీ, ఎప్పటికీ తెదేపాకి చంద్రబాబే దిక్కు. చంద్రబాబు తర్వాత, పార్టీకి.. అన్న తెదేపా గతే..
ReplyDeleteటీడీపీ పార్టీ కనీవినీ ఎరగని దారుణ ఓటమికి కారణాలు &ప్రస్తుత అధోగతి దిద్దుబాటుకు చర్యలు లాంటి ప్రశ్నలను ఎదురుకోకుండా ఎవరు రావాలి చర్చించడం వలన లాభం లేదు.
ReplyDeleteఅతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు రామారావు 1989 పరాభవం తాలూకా చెత్త రికార్డును 2019 చంద్రబాబు అధిగమించాడు. జూనియరుడు వస్తే చాలని అందలం ఎక్కిస్తే ఆ రికార్డును కూడా బద్దలు కొట్టేసే అవకాశం ఉంది.
బాలయ్య తొడకోడితే రైలు నిజంగా కదులుతుందా? ఈ ప్రశ్నా అలాంటిదే☺️
ReplyDeleteకదలడమేంటి? వెనక్కి పారిపోతేనూ...
Deleteనాయకత్వ లక్షణాలు అంటూ ప్రత్యేకం గా ఏవీ లేవని నేను అనుకుంటాను.
ReplyDeleteలోకేష్ తనంత తాను చంద్ర బాబు లేకుండా అధికారం లోకి రాలేకపోవచ్చు, కానీ వెనక తండ్రి ఒక దఫా ఉంటె ఇక లాగించేస్తాడు, ఈ ముఠా లను అధికారం ఉన్నప్పుడు ఎవడైనా మేనేజ్ చేయగలడు, అతని కులం అతని వెంట ఉండటం అన్నిటికన్నా ముఖ్యం.
నేను వినడం - లోకేష్ , చంద్ర బాబు కన్నా చాలా మంచివాడు అని.
లోకేశం బాబు మంచితనం గురించి తెలువదు కానీ అతను ఊళ్లెమ్మట తిరిగి జనంతో మమేకం కాగలడా అన్నది పేద్ద డౌటే. ఏసీ గదులలో కూచొని కంప్యూటర్ లెక్కలు చూసి మనమే గెలుస్తున్నామని మురిస్తే ఏమవుతుందో మొన్నే చూసాం.
Deleteమిగతావి బాగుంటే సొంత కులం మద్దతు *కూడా* ప్లస్ పాయింటు అవుతుంది కానీ మనోళ్ళొక్కళ్ళే చాలు అనుకుంటే కొంప కొల్లేరవడం ఖాయం. రామారావు చంద్రబాబులు ఖుర్చీ కోసం కొట్టుకున్నప్పుడు అసమదీయులు ఎందరో (ఉ. గోరంట్ల, ముద్దుకృష్ణ, నెహ్రు) రామారావు వెంబడి నిలిచినా గజపతి, యనమల, కోటగిరి లాంటి ఇతర కులస్థుల మద్దతుతో బాబే నెగ్గాడు.
తెలుగు దేశం యొక్క డొల్లతనం వాళ్ళు లోకేష్ కి మంగళగిరి ని ఎంచుకోవడం లోనే తేటతెల్లం అయింది. తాను దత్తత తీసుకున్న, వాళ్ళ తాత గారి గ్రామం, నిమ్మకూరు నియోజకవర్గం లో తాను నిలబడకపోవడం తోనే వాళ్లకు వాళ్ళ మీదే నమ్మకం లేదన్నది రుజువయ్యింది. అదీకాక కేవలం తాము నివాసం ఉంటున్నామన్న మరియు అమరావతిని అభివృద్ధిని చేసామన్న కారణాలతో మంగళగిరిని కంచుకోటగా భావించుకుని పోటీకి దిగడం ... ఇదీ 40 ఏళ్ళ రాజకీయానుభవం! టీడీపీ వాళ్ళు దత్తత తీసుకున్న ఏ గ్రామంలోనూ ఆ పార్టీకి మెజారిటీ దక్కకపోవడం వాళ్ళ నిజాయితీకి, చిత్తశుద్ధికి, పనితనానికి ప్రజలిచ్చిన తీర్పు కొలబద్ద. నిజానికి సమాజం కనీసం రెండేళ్ల ముందు నుంచే ఇండికేషన్స్ ఇస్తోంది 'ఈసారి టీడీపీ గెలవడం కష్టం' అని. పాట్టించుకున్నవాడెవడు? లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి బదులు ఎత్తి చూపిన ప్రతివాడికి బురద పూయడం ఘనతగా భావించుకుని, బాకారాయుళ్లతో ఎదురు దాడులు చేయించి అమూల్యమైన కాలాన్ని చేతులారా వృధా చేసుకుంది టీడీపీ. బాధాకరమైన విషయం ఇప్పటికీ వాళ్ళు ఇంకా అదే దారిలో ముందుకెళ్లడం. ఆంధ్రా ప్రజల దురదృష్టం ఏ పార్టీలోనూ సరైన దృక్పధమున్న నాయకుడు లేకపోవడం. ఉన్నవాళ్లలో వారికి జగనే బెటర్ అనిపించి గెలిపించడంలో వాళ్ళ తప్పేముంది, ఉన్నవాళ్లు సరిగా చేయడం లేదు అన్న అభిప్రాయం కలిగించిన వాళ్లదే ఆ తప్పు. ఆ తప్పే జగన్ని గొప్పగా గెలిపించింది అంతే తప్ప తన విజయంలో జగన్ది చిన్న పాత్రే. వైరి పక్షాల పాత్రే ఎక్కువ.
Delete