ప్రశ్నించడానికి భక్తి ప్రపత్తులు తప్పనిసరిగా ఉండాల్నా? తెలుసుకోవడమే లక్ష్యం అయితే భక్తి ప్రపత్తులు లేకపోతే నష్టం ఏమిటి? ఉంటే కష్టం ఎందుకు? ప్రశ్నించడానికి తెలుసుకుందామనుకునేవారికి గురువు పట్ల భక్తి ప్రపత్తులుండడం అనే సాంప్రదాయాన్ని మీరు సమర్ధిస్తారా?
- Palla Kondala Rao
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
ప్రశ్నించడానికి భక్తి అవసరం లేక పోవచ్చు, కాని సమాధానం రావాలంటే గురువు గారికి శిష్యునిమీద దయ కలగాల్సిందే!
ReplyDeleteఒకోసారి భక్తి మరీ ఎక్కువైతే అసలు ప్రశ్నించడమే సాధ్యం కాకపోవచ్చు. అందుకనే పవన్ కళ్యాన్ మోడీని, బాబును ప్రశ్నించలేక పోతున్నాడు!
భక్తి ఎక్కువైతే అవసరమైనపుడు కూడా ప్రశ్నించలేకపోవచ్చని పవన్ కళ్యాణ్ ఉదాహారణ తెలుపుతుందంటారు. కనుక ప్రశ్నించడానికి భక్తి అడ్డంకి కూడా కావచ్చంటారు. నక్కీరుడు శివుడి భక్తుడే అయినా ప్రశ్నించి తప్పును నిలేశాడని చెప్తుంటారు. నక్కీరుడి ఉదాహరణ భక్తి ఉన్నా తప్పును ప్రశ్నించాలని చెప్తుంది. భక్తికీ , ప్రశ్నించడానికి సంఘర్షణ ఏర్పడినపుడు ప్రశ్నించడమే మంచిదని దేవుడినైనా ప్రశ్నిస్తేనే తప్పులు బయటపడతాయని నక్కిరుడి ఉదాహరణ చెప్తుంది. కనుక ప్రశ్నించడానికి భక్తి అడ్డంకిగా ఉండకూడదంటే బాగుంటుందేమో శ్రీకాంత్ చారి గారు.
Delete
ReplyDeleteప్రశ్న: ప్రశ్నించడానికి భక్తీ ప్రపత్తులు అవసరమా ?
జవాబు: రెండూ అవసరం లేదు ; ప్రశ్న కి జవాబివ్వ గల 'తలమాసిన' వాడు ఉన్నారు అని తెలిస్తే చాలు ప్రశ్నలు వాటికంతటికి అవే శర వేగం తో తన్ను కొచ్చేస్తాయి :)
ఉదాహరణ కి టపాదార్లు +కామింటు దార్లు :)
జిలేబి
అరే .... జిలేబి చేదుగా ఉండకూడదే ! :)
Deleteభయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవం ఎక్కువైతే ప్రశ్నించడం వీలుపడదు.
ReplyDelete