హిందు మతంలో అంతర్గతంగా కులాంతర వివాహాలు & విధవా వివాహాలు సాధ్యమా, కాదా అనేది తరువాత చర్చిస్తాను. ప్రాథమిక విషయాలలో అయినా హిందు మతంలో మార్పు సాధ్యమా, కాదా అనేది ఇక్కడి ప్రశ్న.

ముహూర్తం అనేది మూఢనమ్మకం. పురోహితుడు చేతి గడియారం టైం ఆధారంగా ముహూర్తం పెడతాడు. పూర్వం గడియారాలు లేవు. మన పూర్వికులు పగటి పూట సూర్యుని దిక్కు, రాత్రి పూట నక్షత్రాల దిక్కు చూసి టైం చెప్పేవాళ్ళు. సూర్యోదయం, సూర్యాస్తమయం అన్ని ప్రాంతాల్లో ఒకేలాగ ఉండదు. చేతి గడియారం చూపించే టైం ఆధారంగా ముహూర్తం పెడితే అక్కడ వాస్తవ సమయం నుంచి చాలా తేడా వచ్చే అవకాశమే ఎక్కువ. ఈ విషయం తెలిసి సైన్స్ టీచర్లు కూడా ముహూర్తం ప్రకారమే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చేతి గడియారం టైం ముహూర్తానికి ప్రామాణికం అని చెపితే నాసా శాస్త్రవేత్తలు నవ్వుతారు. మరి అమెరికాలో స్థిరపడిన ఒక హిందువుకి నాసాలో శాస్త్రవేత్త ఉద్యోగం దొరికితే అతనికి హిందు పంచాంగం చూడకుండా పెళ్ళి ముహూర్తం నిర్ణయించుకునే ధైర్యం ఉంటుందా? కంటికి కనిపించే వాస్తవాలకి కూడా విరుద్ధంగా హిందువులు మూఢనమ్మకాలని ఆచరిస్తుంటారు. అలాంటప్పుడు ఇతర విషయాలలో హిందు మతంలో మార్పు ఎంత వరకు సాధ్యం?
Praveen the freethinker
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. ఈజిప్ట్‌లోని సైన్ నగరంలో summer solstice నాడు మిట్ట మధ్యాహ్నం పూట సూర్యుడు నెత్తి మీద ఉన్నట్టు కనిపించినా, అదే సమయంలో అలెక్సాండ్రియా నగరంలో సూర్యుడి వల్ల నీడ పడుతుంది. భూమి గుండ్రంగా ఉండడం, అది axially tilted కావడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. టైమ్ జోన్‌ని లోకల్ టైమ్ కూడా సూర్యోదయానికీ, సూర్యాస్తమయానికీ మేచ్ అవ్వదు. ఈ విషయం జ్యోతిష్యులకి తెలియదు.

    ReplyDelete
    Replies

    1. ఏమి విన్నాణం ! ఏమి విన్నాణం :)


      జిలేబి

      Delete
  2. ఇక్కడ తెలంగాణాలో ముహూర్తం గురించి అసలు పట్టించుకోరు. నేను ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ఒక్కరు కూడా టైం కి జీలకర్ర బెల్లం పెట్టుకోలేదు. ఊరికే ముహూర్తం అని వ్రాస్తారు కానీ వాళ్ళిష్టం వచ్చినపుడు వాళ్ళు పెళ్ళిచేసుకుంటారు. ఆంధ్రాలో టైం కి జీలకర్రా బెల్లం పెడతారు కానీ తాళి కట్టే సమయం వాళ్ళిష్టం.
    అసలు తాళి కట్టే సమయం ముఖ్యమా జీలకర్రా బెల్లం పెట్టే సమయం ముఖ్యమా అన్నదే తేలలేదు. మీరు హిందూ మతం గురించి అడుగుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. ICU (Indian Cine Universe) ప్రకారం తాళికట్టే సమయమే ముఖ్యం. దానికి ఆధారాలు:
      (1) "తాళికట్టు శుభవేళ ..మెడలో..కళ్యాణమాల.." అని పాటలు రాసారేగాని "జీలకర్ర పెట్టు వేళ...బెల్ల..మ్మ్ కలపాల మల్లా..." అని ఏ పాటాలేదుకదా!
      (2) "ఆగండి", "ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు" లాంటి డవిలాగులు తాళికట్టడానికి సెకెన్లో వెయ్యోవంతుముందు చెప్తారేగాని జీలకర్ర బెల్లం పెట్టేముందు ఒక్క వెధవా ఏం మాట్లాడడు. పోనీ అభ్యంతరవాది ఆ కూత కూసాకైనా "లాభం లేదురా అబ్బాయి, ముహూర్తానికి జీలకర్ర బెళ్ళం పెట్టేశాం, కావాలంటే ఇంద ఈ మిగిలిన బెళ్ళం తిను" అని ఎవ్వడూ సముదాయించడు.
      (3) ఎంతటి మొండిఘటం లాండి స్త్రీ అయినా హీరోగాని విలన్ గాని బలవంతంగా తాళి కడితే "నువ్వు జీలకర్ర బెల్లం పెట్టలేదు కాబట్టి ఈ పెళ్ళి తూచ్" అని అంటుందా? అనదు. పైగా మామూలుగా తాళికట్టే మొగుడికిచ్చె రెస్పెక్ట్ కంటే రెండింతలు ఎక్కువే ఇస్తుంది పాత సినిమాల్లో!
      పోనీ సైంటిఫిక్ గా చెప్పుకున్నా నెత్తిమీద పెట్టిన జీలకర్ర బెళ్ళం తలస్నానం తో అంతరించిపోతుంది. కాని మెడలో తాళికి లైఫ్ టైం ఎక్కువ!
      సో ఈ లెక్కన తాళికట్టే సమయమే ముఖ్యమన్నమాట!!

      అన్నట్టు మీ వ్యాఖ్య చూసి నాకో విచిత్రమైన ఘటన గుర్తొచ్చింది.
      ఒక ఊళ్ళొ పెళ్ళి జరుగుతోంది. కరెక్ట్ గా తాళి కట్టే సమయానికి పక్కనే ఉన్న తమ్ముడు పీటలమీద ఉన్న అన్నని తోసేసి చటుక్కున వధువు మెడలో తాళి కట్టేసాడు (ఎందుకంటే ఆ అమ్మాయి ఈ తమ్ముడు ముందునుంచే ప్రేమలో ఉన్నారట). ఇపుడు చెప్పండి. ఆమె ఎవరికి భార్య అవుతుంది? జీలకర్ర బెళ్ళం పెట్టిన అన్నకా? లేక తాళి కట్టిన తమ్ముడికా? ఈ ప్రశ్నకి సమాధానం తెలియకపోయినా చెప్పకపోయారో మీ బ్లాగుకి వెయ్యి స్పాం కామెంట్లు వస్తాయి!

      Delete
    2. ఏ స్త్రీనయినా బలవంతంగా వివాహం చేసుకుంటే అది రాక్షస వివాహం అవుతుంది. రాక్షస వివాహంలో స్త్రీ ఇష్టాఇష్టాయిష్టాలతో పనిలేదు.
      మనుష్యులకి జరిగే పెళ్ళిలో జీలకర్రా బెల్లం ఎవరు పెట్టినాసరే ఆ స్త్రీకి ఎవరు ఇష్టమయితే అతనే ఆమె భర్త !

      Delete
    3. Surya garu, you are awesome and your comments are hilarious!!

      Neeharika garu, మీరు తాళిగురించి పూర్తిగా IGNORE చేసారు!!

      Delete
    4. విసుకిగారూ కృతజ్ఞతలు.
      @నీహారిక, మీ లాజిక్ లో లోపం ఉంది. స్త్రీకి ఎవరు ఇష్టమైతే వారు ప్రియుడు అవుతారు.పెళ్లి ఎవరు చేసుకుంటారో వారు భర్త అవుతారు. నేను అడిగింది భర్త ఎవరని. ప్రియుడు ఎవరని కాదు!

      Delete
    5. @ Surya,
      >>>>ఆమె ఎవరికి భార్య అవుతుంది? జీలకర్ర బెళ్ళం పెట్టిన అన్నకా? లేక తాళి కట్టిన తమ్ముడికా? >>>

      ఏందీ మీ బోడి లాజిక్ ?
      ఎవరికి భార్య అవుతుంది అని అడిగితే ఆ స్త్రీకి ఎవరు ఇష్టమయితే అతనే ఆమె భర్త అని చెప్పాను. తాళి కట్టినవారినే భర్త అని అంటారు కానీ ఇక్కడ సమస్యే తాళి కదా ? ఎవడుబడితే వాడు బలవంతంగా తాళికట్టేస్తే పెళ్ళయిపోతుందా ?
      ఆవిడకి మాజీ ప్రియుడు అయినంతమాత్రాన సర్వహక్కులూ ఇచ్చినట్లు కాదు. మీరు చెప్పిన కేసులో స్త్రీ అభిప్రాయం కీలకం. అత్యంత కీలకమైనదాన్ని వదిలేసి హిందూసంప్రదాయం అంటూ పట్టుబట్టడం అవివేకం.

      Delete
    6. ఎందుకంత కోపం? ఇదుగో ఈ బెల్లం తిని శాంతించండి!

      Delete
  3. అవకాశం మరియు అవసరం బట్టి అన్ని సాద్యమేనండి.

    sometimes convenience compromises the traditions.

    ReplyDelete
  4. హిందూ మతంలో అనేక మార్పులు జరిగాయి. ఇంకా జరుగుతాయి.

    ReplyDelete
  5. ముప్పావు వంతు సాంప్రదాయ హిందూ వివాహాలలో తాళి/జీలకర్ర బెల్లం గట్రా ఉండవు. ఏడు అడుగులు (అగ్నిసాక్షి) నడవడమే standard procedure.

    "తాళి కట్టు శుభవేళ" తరహా పాటలు, హీరోయిన్ పుస్తెలు కళ్ళకు అద్దుకోవడం వగైరాలు మద్రాస్ సినిమా వాళ్ళు కల్పించిన పైత్యం.

    ReplyDelete
    Replies
    1. తాళి జీలకర్ర బెల్లం ఉండవా? ఇంకా నయం పెళ్లి భోజనాలు కూడా ఉండవనలేదు.

      Delete
    2. బొంబాయి సినిమాలలో తాళి కట్టే సీన్ ఉండదు. మద్రాస్ సినిమాల దరిదాపులకు కూడా కనిపించని ఊరేగింపు పాటలే బాలీవుడ్ ప్రత్యేకత. "ఈ పెండ్లి జరగడానికి వీల్లేదు" డయలాగు సప్తపది సీనుకు ముందుంటుంది. ఎవరి ఫార్ములాలు వాళ్ళవి. అఫ్కోర్స్ తాళి కళ్ళకు అద్దుకోవడం, ఏక్ చుటికీ సిందూర్ కీమత్ తుమ్ క్యా జానో రెండూ పైత్యాలే.

      Delete
  6. @🦁తెలుగులో సొల్లండి(అరవం)😁
    @జై గారు,
    పైన పోస్టు ఏమిటీ మీరు వ్రాసేది ఏమిటీ..తకిట తకిట...

    ReplyDelete
    Replies
    1. సూర్య గారి "ICU (Indian Cine Universe)" వ్యాఖ్యకు స్పందన

      Delete
  7. // "(అరవం)" //

    "అరవ"కండి మరయితే 😀 😀.
    అయినా, విజయవాడ కాలేజ్ లో చదివుంటారు కదా (మారిస్ స్టెల్లానా??), మీకు ఇంగ్లీష్ తో సమస్యేమీ ఉండకూడదే నీహారిక గారూ 🤔?
    🦁

    ReplyDelete
    Replies
    1. ఆ.. మ... నాన్ మారిస్ స్టెల్లా కాలేజ్ పటిట్టున్...ఇంగ్లీష్ పార్కలాం రొంబ కష్టమారిరిక్కు..

      Delete
    2. అప్పిడియా? "జిలేబి" గారి దగ్గర కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా తమిళం నేర్చుకోండి, ఇంకా త్వరగా పట్టుబడుతుంది.

      అనుకున్నా, మారిస్ స్టెల్లా కాలేజ్ బాపతేనని అనుకున్నా. అంతకు ముందు నిర్మలా కాన్వెంట్ కూడానా? మరి మీరే ఇంగ్లీష్ "రొంబ కష్టం" అంటే ... మీకు చదువు చెప్పిన నన్స్ అంతా హర్ట్ అవుతారు.

      ఎనీవే, నేను పైనిచ్చిన లింక్ లోని విషయం సరళమైన ఇంగ్లీష్ లోనే ఉంది. చదివి చూడండి 👍

      Delete
  8. అమావాస్య అనేది చంద్రుని యొక్క ఫేజ్ మాత్రమే. మరి అమావాస్య నాడు పెళ్ళి చేసుకునే ధైర్యం శ్రీహరికోట సైంటిస్టులకైనా ఉంటుందా? సూర్యగ్రహణం నాడు సూర్యుడు కనిపించకుండా చంద్రుడు అడ్డుతాడు. ఆ గ్రహణం ప్రభావం భూమి మీద ఏమాత్రం ఉండదు. ఆ ప్రభావం మనిషిపై కూడా ఏమాత్రం ఉండదు. మరి సూర్యగ్రహణం నాడు పెళ్ళికి ముహూర్తం పెట్టడానికి పురోహితులు ఒప్పుకుంటారా?

    ReplyDelete
    Replies
    1. అమావాస్యనాడు సూర్యగ్రహణం ఉన్నరోజు ముహూర్తం పెట్టమని ఏ తలమాసినోడైనా అడిగితే పెట్టడా ? ఆయనసొమ్మేంపోతుంది ? పెళ్ళిలో ఏవైనా ఎక్కువతక్కువలు జరిగితే సముద్రంలోని అలల్లా ఎగిరెగిరిపడకుండా ముందు జాగ్రత్త చర్యగా అమావాస్యరోజు ముహూర్తం పెట్టుకోరు.

      Delete
    2. అమావాస్యనాడు వివాహానికి ముహూర్తం పెట్టడం, సూర్యగ్రహణంరోజు విడాకులు తీసుకోవడం, హిందూమతంలో మీరు కోరుకుంటున్న మార్పులు ఇవేనా ? ఇంకా ఉన్నాయా ?

      Delete
    3. సైoటిస్టులు అమావాస్యనాడే పెళ్లి చేసుకోవాలని రాసుందా? సూర్యగ్రహణం నాడే కాదు ఏ రోజైనా ముహూర్తం పెట్టుకోడానికి మీకు పురోహితులెందుకు డబ్బులు దండగ. మీది మీరే పెట్టుకోవచ్చుగా?

      Delete
    4. - అమావాస్యనాడు వివాహానికి ముహూర్తం పెట్టడం, సూర్యగ్రహణంరోజు విడాకులు తీసుకోవడం, హిందూమతంలో మీరు కోరుకుంటున్న మార్పులు ఇవేనా ? ఇంకా ఉన్నాయా ? -
      good question

      Delete
    5. Very good question. ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపొయింది.

      Delete
  9. సైన్సు సైన్సే నమ్మకం నమ్మకమే. ఊరికె హిందూ మతం మీద బడి ఏడుపులెందుకు. Seemingly illogical beliefs are the nature of human beings. No religion is an exception. Hinduism is the most Catholic of all religions. Try finding fault with other religions. All religions have their good qualities and shortcomings.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top