------------------------------------------------
ప్రశ్నించడం అనేది తెలుసుకోవడానికి లేదా తెలిసినదానిని మరింత విస్తృతపరచడానికి అని నా అభిప్రాయం. ప్రశ్నలు ఎవరు ఎవరినైనా అడగవచ్చు. సమయం - సందర్భం - తెలుసుకోవాలనే జిజ్ఞాస - ఎదుటివారిని హేళన చేయకుండడం - అహంకారం ప్రదర్శించకుండడం వంటి కొన్ని నిబంధనలు వీలున్నంతమేరకు పాటిస్తూ ప్రశ్నలు అడిగితే చర్చలు సజావుగానే ఉంటాయి.
కొందరు ప్రశ్నించేవారిలో అవలక్షణాలున్నట్లే, తెలిసినవారు కొందరిలో చెప్పేటపుడూ అవలక్షణాలు కనబరస్తుంటారు. ప్రశ్నించడాన్ని కొందరు పరిమితంగానే అంగీకరిస్తారు. దైవదత్తాలని తాము నమ్మినవాటినీ, తాము భక్తిప్రపత్తులతో సాగిలబడి నమ్మేవాటిని ఇతరులు తెలుసుకోవాలని ప్రశ్నిస్తే వీరు సహించలేరు.
ఇలాంటి సందర్భాలలో వారి ప్రవర్తన చిన్నపిల్లల మంకుపట్టులా ఉంటుంది. తమను తాము సమర్ధించుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తారు. ప్రవర్తిస్తారు. "ఇలా అయితే నేనీ చర్చలలో పాల్గొనలేను", " కాల మహిమ సుమండీ" , "మా రోజుల్లో ఇలా ఉందా?", " మాలాంటి వారు ఇలాంటి చోట్ల ఇమడలేరు" "చర్చలు అనవసరం " " నేనిక ఫలానా చోట చర్చించను" ..................... ఇలా సాగుతుంటాయి వీరి డైలాగులు.
చర్చలలో విషయంపై దృష్టి కన్నా వ్యక్తిగత గౌరవాలకే వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విషయం ముఖ్యమా? వ్యక్తుల గౌరవం ముఖ్యమా? అంటే విషయమే ముఖ్యం. అదే సందర్భంలో చర్చలు గౌరవప్రదంగా ఉంటే మరింత విషయపరిజ్ఞానం లభిస్తుంది. చర్చలలో ఎదుటివారిని దుర్భాషలాడుతు మాట్లాడడం ఎంత తప్పో, తమ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ తో ఎదుటివారిని మాట్లాడనీయకుండా చిన్నపిల్లల్లా అలగడం, మంకు పట్టు పట్టడం కూడా అంతే తప్పని నా అనుభవం- అభిప్రాయం. ఈ అంశంపై మీ అభిప్రాయం పంచుకోవాలని విజ్ఞప్తి.
ప్రశ్నించే సందర్భంలో ' ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ' కు పాల్పడడం సబబా!?
- Palla Kondala Rao
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే దానికి ఎదుటివారు మూడు రకాలుగా స్పందించొచ్చు.
ReplyDelete1. తెలిసిందనుకుంటే జవాబు చెప్పడం.
2. తెలియదనుకుంటే ఆ విషయం చెప్పడం.
3. తెలిసినా చెప్పకుండా తప్పుకోవడం.
పై మూడు సహజమైన ప్రతిస్పందనలు. ఇవి మూడూ కాకుండా మీరు పైన ఉదహరించిన ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ నాలుగోది.
ఒక ప్రశ్న వెలికి వచ్చినపుడు వీరు ఎందుకంత గాభరా పడవలసి వస్తోంది?
1. ఆ ప్రశ్న వల్ల 'నమ్మకం' అన్న పునాదిపై తాము లేదా తమవర్గం కట్టిన కోటలు కూలుతాయేమోనని సందేహం.
2. విషయం పై సత్యాసత్యాలు తెలుసుకోవడానికి వీరికి నమ్మకమే మార్గం తప్ప తర్క విచక్షణ కాదని వారి ప్రగాఢ నమ్మకం. వారి నమ్మకానికి విరుద్ధంగా ఆ విషయంపై ఎవరైనా చర్చ మొదలు పెడితే వారు సహించలేరు.
గాభరా పడడమెందుకు?
వీరు విశ్వాస బేహారులు. ప్రజల గుడ్డినమ్మకం ఉన్నంత వరకే వీరికి, లేదా వీరి వర్గానికి ప్రయోజనకారి అవుతుంది. ఎప్పుడైతే ఆ మూఢవిశ్వాసం ప్రజల్లో అంతరిస్తుందో, అప్పుడు దానిపై ఆధారపడ్డటువంటి, వారియొక్క సంకుచిత ప్రయోజనాల వ్యాపారాలు, వాటివల్ల వచ్చే ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందుకే వారికి అంత గాభరా. ప్రశ్నని అణచివేయాలనే పట్టుదల. ఇక్కడ వ్యతిరేకించే వ్యక్తికే ప్రత్యక్ష ప్రయోజనాలు వుంటాయని నేను చెప్పడం లేదు. ప్రయోజనాలు దెబ్బతినేది ఆ వ్యక్తి ప్రాతినిథ్యం వహిస్తున్న సమూహానికి కావచ్చు, ఆ వ్యక్తి విశ్వసిస్తున్న సమూహానికి కావచ్చు.
ఇప్పటివరకూ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఆడవాళ్ళు మాత్రమే చేసేవారు.చీరతో కళ్ళొత్తుకుంటూ కుండ రెడీ గా పెట్టుకుని మరీ ఏడ్చేవాళ్ళు,ఇపుడు కాలంతో పాటు మగవారి భావాలూ మారిపోయి సీన్ రివర్స్ అయిపోయి,అలగడం,కన్నీళ్ళు పెట్టుకోవడం,మంకుపట్టు పట్టడం,తిట్టడం చేస్తున్నారు.మగవారిలో ఇలా సున్నితత్వం పెరగడానికీ , బాహుబలి లాంటి సినిమాలు విజయవంతం కావడానికీ కారణం మగవారిలో సాధారణంగా ఉండవలసిన శౌర్యం,వీరత్వం లోపించి దానిని కృత్రిమంగా సినిమాల్లోనూ,సోషల్ మీడియాలోనూ వెతుక్కుంటున్నారు.
ReplyDelete< మగవారిలో సాధారణంగా ఉండవలసిన శౌర్యం,వీరత్వం............... >
Deleteఎందుకలా అనుకుంటున్నారు?
ఝాన్సీ లక్ష్మి బాయి నుండి ఇందిరాగాంధీ వరకు మీరన్నది , మీలాగే చాలామంది అనుకుంటున్నది తప్పని నిరూపించారు కదా?