తెలుగు బ్లాగర్లలో ఉత్సాహం తగ్గిపోతున్నదా? కారణాలేమిటి?
తెలుగు బ్లాగర్లలో ఉత్సాహం తగ్గింది. గతమంతా ఘనకీర్తి లేదు. ఎన్నో విషయాలు మీనుండి నేర్చుకున్న నాకు సోషల్ మీడియాలో బ్లాగుల పరిస్థితి చురుకుగా లేకపోవడం వెలితిగా అనిపిస్తోంది. ఎన్ని వేదికలు ఉన్నా బ్లాగు ప్రత్యేకత వేరు. తెలుగు బ్లాగర్లలో ఉత్సాహం తగ్గిపోతున్నదా? కారణాలేమిటి? తిరిగి బ్లాగర్లలో పునరుత్సాహం తీసుకురావడానికి ఏమి చేయాలి? మీ అమూల్యమైన అభిప్రాయం బ్లాగులలో ఉత్సాహం నింపడానికి తప్పక ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.
- పల్లా కొండల రావు.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
బ్లాగులు వ్రాసే వారికంటే వ్యాఖ్యాలు వ్రాసేవారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటున్నారు. మీరు కూడా టపాలు పెట్టడం తగ్గించారు.
ReplyDeleteమీ వంటి వారు మంచి మంచి వ్యాసాలు వర్తమాన విషయాలు వ్రాస్తే స్పందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము.
తవికలు , పైకూ పద్యాలు అయితే విరివిగానే వ్రాస్తున్నారు.
అయితే బ్లాగులు కొంచెం గాసట బీసట గా ఉన్నమాట నిజమే.
ఒకప్పుడు విరివిగా వ్రాసిన మంచి బ్లాగర్లు Facebook, పిట్టల్ వంటి ఇతర మాధ్యమాలు ఎంచుకుని తరలి పోయారు.
బ్లాగులు మంచి రచ్చబండ లాగా ఉపయోగ పడుతున్నాయి. కొంత విజ్ఞానం, రసానందం కూడా కలుగచేస్తన్నాయి. కొన్ని రాజకీయ బ్లాగులు విషం చిమ్ముతూ ఉన్నాయి.
మొత్తానికి రకరకాల బ్లాగులు కాలక్షేపానికి ఉపయోగిస్తున్నాయి.
పిట్టల్...funny :)
Deleteవీలయినప్పుడు వ్రాయడానికి ప్రయత్నిస్తాను సర్. నాకు చదవడం, వ్రాయడం అంటే బద్దకం. అడిగి తెలుసుకోవడం, ఇంటర్వ్యూలు, చర్చలు, మంచి వాదనలు నుండి గ్రహించడం వంటివి ఇష్టం. బ్లాగు వేదిక గా నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా ప్రజ ద్వారా. కొందరికి శత్రువునయ్యాను. నేనెవ్వరినీ శత్రువులుగా భావించడం లేదు. సహకరించిన, తప్పులు సరిదిద్దిన అనేక మంది మిత్రులకు, పెద్దలకు ధన్యవాదములు.
Deleteమిత్రులు కొండల రావు గారు,
ReplyDeleteఈ విషయంలో కొంత కాలం క్రిందటి వరకూ తెలుగుబ్లాగుల గురించి ఇలాగే మథనపడే వాడిని. కాని పరిస్థితులను గ్రహించి ఊరకున్నాను. నాధోరణిలో నేను వ్రాసుకుంటున్నాను. ఇష్టమైనవారు చదువుతారు. ఏవైనా స్పందనలు వస్తే వస్తాయి లేకుంటే లేదు - వాటి ఆమోదయోగ్యతను బట్టి ప్రచురిస్తాను. వీలైనంతవరకూ స్పందిస్తాను. ప్రస్తుతం వివిధకారణాల వలన అదీ కష్టంగా ఉంది. ఎవరికీ సలహాలిచ్చే స్థాయి నాకు లేదని నా అబిప్రాయం. నాకు తెలిసి బ్లాగర్లే తమకు తాము ప్రమాణాలు విధించుకోవాలి కాని ఎక్కువమందికి నిబధ్ధత లేక వాతావరణం బాగోలేదు. అంతకంటే ఏంఈ చెప్పలేను. అవసరం కూడా కాదు.
సలహాలు ఇచ్చే స్థాయి మీకు గాక ఇంకెవరికి ఉంటుంది సర్. నాతోపాటు చాలామందికి చాలా తెలియని విషయాలు చెప్పారు. మీరు సైలంట్ గా ఉండడం వల్ల బ్లాగుప్రపంచానికి నష్టం సర్. సలహాలు ఖచ్చితంగా స్వీకరించాలనుకోకూడదు, స్వీకరిస్తేనే చెప్పాలనుకోకూడదని నా అభిప్రాయం. మీరు రామకీర్తనలతో పాటు ఉపయోగపడే అంశాలద్వారా మళ్లీ ఏక్టివ్ కావాలని కోరుకుంటున్నాను.
Delete"కులకాంతలు" అంటూ ఒక సామాజిక వర్గం మీద కారు కూతలు కూసే వ్యాఖ్యాతలు ఉన్నంత వరకూ తెలుగు బ్లాగులు బాగుపడవు. Seems admins have also cheap taste.
ReplyDeleteబాహ్యప్రపంచానికి ప్రతిబింబంగానే బ్లాగుప్రపంచమూ ఉంటుంది sistla గారు. నేనూ ఇలాగే బాధపడి ఈ మధ్య blogs కు దూరంగా ఉంటున్నాను. కానీ అది కరెక్ట్ కాదనిపిస్తోంది. అందరూ సైలెంట్ గా ఉంటే వైలెన్స్ వాదులదే పై చేయి అవుతున్నది కదా? ఆలోచించగలరు.
Deleteబ్లాగులలో సుహృద్భావ వాతావరణం లేదు . కేవలం
ReplyDeleteవాదం వినా మంచి చెడులు లేవు . కేవలం ముగ్గురు
నలుగురు గొడవలు పడే మనస్తత్వం గాళ్ళ పుణ్యాన ఈ
అథోగతి ఏర్పడింది . వారికి శతకోటి వందనాలు .
మీరన్నదానిలో వాస్తవం ఉన్నది రాజారావు గారూ. ఈ కారణం వల్ల బ్లాగులు నిస్తేజం కావడం సరైనది కాదు కదా? చూద్దాం బ్లాగులకు మళ్లీ మంచి కాలం వస్తుందని ఎదురుచూద్దాం. మనవంతుగా మంచిని పంచుదాం. ధన్యవాదములు సర్.
Delete
ReplyDeleteసలహా - face book మూసేస్తే సరి :)
జిలేబి
మిత్రులందరికీ విజ్ఞప్తి. పై కామెంట్లలో బ్లాగులు నిరుత్సాహంగా ఉండడానికి గల కొన్ని కారణాలు చెప్పారు. అయితే ఇక్కడ నేను అడిగింది వేరు. అన్యధా భావించకుండా కాస్త మనసు పెట్టి ఆలోచించి తెలుగు బ్లాగర్లలో పునరుత్సాహం తీసుకు రావడానికి సూచనలు తెలుపగలరని విజ్ఞప్తి.
ReplyDelete