గాంధీ పేరుతో చెపితే మనదేశం లో చాలా విషయాలకు సాధికారత వస్తుంది. మన జాతిని అంతగా ప్రభావితం చేసిన జననేత మన గాంధీ. ముఖ్యంగా గాంధీ సత్యం - అహింస ల పై ప్రయోగాలు , సింపుల్ జీవన విధానం ఇప్పటికీ మనకు ఆదర్శమే . విధానాల పరంగా ఆయనను విభేదించే వారు సైతం ఆచరణకు సంబంధించి ఆయనను ఆదర్శంగా తీసుకునేందుకు అంగీకరిస్తారు.

గాంధీ ఆచరణకు సంబంధించి నేను చదివిన ఓ సన్నివేశం మీతో పంచుకునేందుకు ఇక్కడ రాస్తున్నాను.

ఓసారి గాంధీజీ వద్దకు తన కొడుకుని తీసుకుని ఓ తల్లి వచ్చి " అయ్యా ! నా కొడుకు బెల్లం బాగా తింటున్నాడు . ఆరోగ్యం దెబ్బతింటుందని నేనెంత చెప్పినా వాడు వినడం లేదు. మీ మాటంటే వీడికి గురి. మీరైనా చెప్పండి వీడికి బెల్లం తినొద్దని. " అని కోరింది.

దానికి గాంధీ , ఓ వారం రోజుల తరవాత నీ కొడుకుని తీసుకుని రామ్మా ! అన్నాడట. ఆయన మాట మీద గౌరవంతో ఆ తల్లి వెళ్లింది.

వారం తరువాత కొడుకుతో సహా వచ్చి మళ్లీ గాంధీని కలసింది.

అపుడు గాంధీ రామ్మా అని వారిరువురినీ ఆప్యాయంగా పిలిచి కొడుకుతో " ఏరా చిన్నా ! అమ్మ చెప్పేది నీ మంచికోసమే కదా! నీ ఆరోగ్యం బాగుండాలనే కదా! నీవు మంచిగా ఉండాలనే కదా అమ్మ చెప్పేది. అమ్మను కష్టపెట్టకూడదు కదా! బెల్లం మానేస్తావా? అని చెప్పాడట . ఆ మాటలకు ఆ పిల్లవాడు గాంధీతో " మీరు చెప్పినట్లే వింటాను. బెల్లం మానేస్తాను. " అన్నాడట .

దీనితో ఆ తల్లి సంతోషించినా ఒక అనుమానంతో అక్కడే నిలబడి గాంధీని అడగాల్నా? వద్దా
? అని  సంశయిస్తుంటే గాంధీ గమనించి "ఈ విషయం వారం క్రితమే చెప్పొచ్చుగదా? అనేగా నీ సందేహం!" అంటే ఆమే అవునన్నట్లు తలూపింది.

దానికి గాంధీ నాకూ బెల్లం తినే అలవాటుందమ్మా! ఈ వారం లో నేను దానిని మానేసాను. అందుకే ఈ రోజు నీ కొడుకుకి చెప్పాను. నేను తింటూ నీ కొడుకుకి చెపిత నా మీద గౌరవం పోతుంది కదా ? అన్నాడట . ఈ సంఘటనతో ఆమెకు గాంధీజీ పై గౌరవం రెట్టింపైంది.

- Palla Kondala Rao,
17-03-2012.

Post a Comment

  1. This is happened to Ramakrishna Parama Hamsa,
    Any way nice article

    ReplyDelete
  2. నాకు సరిగా తెలియదండీ !ఆచరణకు సంబంధించి ప్రేరణగా ఉంటుందని వ్రాశాను.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top