రాజకీయాలు ప్రక్కన బెట్టండి. పుకార్లు వదిలేయండి. శాస్త్రీయంగా ఆలోచించండి. కార్యకారణ సంబంధాలను గమనంలో ఉంచుకోండి. ప్రకృతి సూత్రాలను ఆధారం చేసుకోండి. మీకుగా మీరు మీ మెదడును మధించండి. ధైర్యంగా మీ మనసు చెప్పిన మాటలను చెప్పండి.
కరోనా వంటి విపత్తులు ప్రపంచానికి నేర్పుతున్న పాఠం ఏమిటి? ఇలాంటి సందర్భాలలో మనిషి ఏం చేయాలి? ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందుచూపు ఉంటే వైరస్ లను నిరోధించలేమా?
కరోనా వస్తే అందరూ చనిపోవడం లేదన్న సత్యాన్ని దృష్టిలో ఉంచుకుని.... ఎంత పెద్దవారైనా, పెద్దవారనుకుంటున్నవారైనా సరే ఎవరు ఏం చెపుతున్నారన్నది, ఏం చెప్పి... నాలుక కరచుకుని ఇపుడేమి చెపుతున్నారన్నది పక్కన బెట్టి మరీ ఆలోచించండి.
ప్రకృతికీ మనిషికీ ఉండాల్సిన సంబంధం ఏమిటి? ప్రకృతికీ సైన్సుకూ ఉండాల్సిన సంబంధం ఏమిటి? ఎవరి పాపాలకు ఎవరు బలి అవుతున్నారు? కరోనా ఖాళీ సమయంలో ప్రతీ కుటుంబం ఒకే అనుభూతిని, ఆపదలను అనుభవించడం లేదన్నది నిజం. దేశ దేశానికీ ఈ విపత్కర పరిస్థితిలో ప్రజలెదుర్కుంటున్న బాధలు, ప్రభుత్వాలు, సమాజం చేపడుతున్న/ చేస్తున్న చర్యలూ భిన్నంగా ఉంటున్నాయి. వివిధ రకాల మనసులు వ్యాపింపజేస్తున్న భావాలు భిన్నంగా ఉంటున్నాయి.
గుర్తుంచుకుందాం. ఇదే మెదటిదీ లేదా ఆఖరి విపత్తూ కాదు. మనిషి మెదడు ఎన్నో ఛాలెంజ్ లను ఎదుర్కుంది. ఇంకెన్నో సవాళ్ళను పరిష్కరించుకుంటుంది. త్వరలోనే కరోనాను ఎదుర్కుంటుందన్న దానిలో అనుమానం లేదు. ఆపద వచ్చినపుడు ఆందోళన పడడం, ఆనక ఊరకుండడం కాదు మనం చేయాల్సింది. మరింత చైతన్యంతో మెలగాలి. ఆ చైతన్యం పెంచుకోవలసిన, పెంచాల్సిన బాధ్యత ఏ ఒక్కరిదో అనుకోవడం సమంజసం కాదు. మంచి మనసుతో ఆలోచిద్దాం. భావితరానికి మనం ఇచ్చే వారసత్వ సంపద ఏమిటి? బిజీ గజి బిజి జీవితాలు గడపడం దేనికి? మనిషి ఉరుకుల పరుగుల జీవితానికి అర్ధం ఉంటోందా? మనిషిని మనీకి బానిసగా మార్చేస్తున్నది ఎవరు? ఎవరి పన్నాగానికి.... ఎవరి జీవితాలు బలి అవుతున్నాయి? ఈ జీవితాలకు అర్ధం ఉండాలి కదా? భావితరం క్షమించలేని వర్తమానం అవసరమా? ఏది మనిషికి సంతృప్తిని ఇవ్వాలి. ఏమి చేస్తే నిజమైన వారసత్వసంపదకు కారకులమౌతాము?
భయపడడమో.... భయాన్ని పెంచడమో.... పంచడమో కాదు మనం చేయాల్సింది. బాధ్యతగా ప్రవర్తించడం, ఆలోచించడం, అవగాహన పెంచుకోవడం... అవగాహన పంచడం.... ఆ పని మనమెందుకు చేయలేము? ఖచ్చితంగా చేయగలం.
- పల్లా కొండలరావు,
19-04-2020.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
ReplyDelete--కరోనా వంటి విపత్తులు ప్రపంచానికి నేర్పుతున్న పాఠం ఏమిటి?
పాఠము- మానవులు బుద్ధి జీవులు.
జిలేబి
బుద్ధి కి జ్ఞానము తోడై మానవత్వం,దానవత్వం మధ్య జరిగే పోరాటంలో ఏ ఆరాటం అయితే ప్రకృతిని, పర్యావరణానికి వినాశన హేతువు అవుతుందో (అధర్మము పెరిగినపుడు) ప్రకృతి తన కాపలాదారుణ్ణి (మనిషిని) దానవత్వాన్ని అంతం చేయరా నరుడా, అలసత్వం వహించిన యెడల నీకీ విపత్తులు తప్పవని జస్ట్ అపుడపుడు అలా హెచ్చరిస్తుంది.
Deleteజిలేబి గారు,
Deleteఇప్పుడు మానవుల్లో బుద్ధి లేని జీవులు ఎక్కువ అయిపోయారు. (కిమ్ నుండి ట్రంప్ దాకా)
< ఇప్పుడు మానవుల్లో బుద్ధి లేని జీవులు ఎక్కువ అయిపోయారు. >
ReplyDelete100% నిజం బోనగిరి గారు.