ఇది చాలాముఖ్యమైన అంశం. నేను ఇంతకు ముందు కరోనా నుండి ప్రపంచం నేర్వాల్సిన పాఠాలేమిటి? అని అడిగినపుడు మన బ్లాగర్లనుండి పెద్దగా స్పందన రాలేదు. మనిషికి శాపమైన కరోనా ప్రకృతికి వరమైందంటూ ఈనాడులో మంచి ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ లో వ్రాయని చాలా పాజిటివ్ అంశాలు మీ మెదడులో ఉన్నాయన్నది నా నమ్మకం. జస్ట్ వాటిని మీకు నచ్చినట్లు గొంతు విప్పి కలం ద్వారా మీ గళం వినిపించండి.
- పల్లా కొండలరావు,
23-04-2020.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
ReplyDeleteప్రపంచం ఇంకా బతికుంది.
ఆహా...
Deleteఅందరూ చావడం లేదు.
ReplyDeleteఆలయాలలో కొబ్బరిచిప్పల బాధ తప్పింది. ప్రభుత్వాలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని తెలిసింది.
ReplyDeleteఆలయాల బాధే తప్పిందికదండీ. మైకుల హోరులు, బైకుల,కార్ల జోరులు లేకుండా దైవం కూడా ప్రశాంతంగా ఉన్నాడు.
Deleteసో దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నారు. పాయింట్ నోటెడ్.
Deleteదేవడు పై నా అభిప్రాయం ఈ బ్గాగులోనే ఓ వ్యాసం వ్రాశాను కదా.
Deleteదైవం ఉంది. అది మనిషిలోనే నిండి ఉంది. రాక్షసం ఉంది. అదీ మనిషిలోనే ఉంది. ఇవి రెండూ ప్రకృతిలో భాగమే.
అంటరానితనం అంటే ఏమిటో అందరికీ తెలిసి వచ్చింది.
ReplyDelete