కరోనా.....అందరికీ కష్టకాలం.....కానీ చాలా మందికి బిజీగజిబిజి జీవితం నుండి తీరిక దొరికిందనేది నా భావన. దీనిని రకరకాలుగా వినియోగించుకుంటున్నారనుకుంటున్నాను.
నేను కూడా కరోనా తీరిక సమయాన్ని 1) పల్లెప్రపంచం విజన్ కోసం 2) దానికి సంబంధిం సాఫ్ట్వేర్ వర్క్ కోసం 3) పెండింగ్ పనులను క్లియర్ చేసుకోవడం 4) రోజూ మినిమం ఒక గంట శారీరక శ్రమ చేస్తున్నాను.
పనికి మధ్య గ్యాప్లో బ్లాగు చూడడం, వీడియోలు చూడడం, వాట్సాప్ చూడడం పాత అలవాటే. ఇందులో నాకు శారీరకశ్రమ వల్ల లాభాలు తెలిసిరావడం, పెండింగ్ పనులను క్లియర్ చేయడంలో భాగంగా కృషి విద్యాలయం వీడియోలు, ఫోటోలు ఇతర జ్ఞాపకాలు ఒకచోటకు చేర్చడం అన్నది సంతృప్తిని ఇస్తున్నాయి. ఆ ఆనందాన్ని ఈ టపా ద్వారా మీతో పంచుకుంటున్నాను.
మొక్కల పెంపకం కు సంబంధించిన మట్టి పనులు చేస్తున్నాను. మొదటి రోజు శారీరక శ్రమ చేయడం మొదలు పెట్టినపుడు రెండు, మూడు నిమిషాలు చేయగానే చెమటలు పట్టి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. అపుడనిపించింది మనం మన శరీరాన్ని ఎంత సుకుమారంగా పెంచుతున్నామో అని. ఆరోజు నుండి పట్టుదలగా ఏదో ఒక శారీరక శ్రమ చేయడం మొదలు పెట్టాను. గ్యాప్ లేకుండా ఒక అర్ధగంట వరకూ చేసే స్థితికి వచ్చాను. ప్రస్తుతం రోజుకు సగటున గ్యాప్ తీసుకుంటూ రెండుగంటలు పని చేస్తున్నాను. కరోనా లాక్ డౌన్ పీరియడ్ పెరిగితే యోగా నేర్చుకుందాం అనుకుంటున్నాను. చూడాలి. ఖచ్చితంగా రోజుకు కనీసం గంట సమయం శారీరక శ్రమ (వాకింగ్,యోగా, ఇతర చిన్న పనులు) చేయాల్సిందేనని నిర్ణయించుకున్నాను. దీనివల్ల శరీరంలో మంచి మార్పులు కనబడుతున్నాయి. ముఖ్యంగా నిద్ర మంచిగా పడుతోంది. కరోనా సమయంలో ఇదో మంచి ఆనందాన్ని, ప్రయోజనాన్ని ఇచ్చిన విషయం.
రెండవ అంశం వాట్సాప్ చూడడంలో భాగంగా ఎపుడో ఏర్పాటు చేసిన కృషి విద్యాలయం గ్రూపు ఈ మధ్య ఏక్టివ్ గా మారింది. ఇపుడు గ్రూపులో షుమారు 40 మంది ఉన్నారు. కరోనా అనంతరం వీరు ఏక్టివ్ గా ఉండకపోవచ్చు. కనీసం కొంతమందైనా టచ్ లో ఉండేవారికోసం నా బ్లాగులో కృషి విద్యాలయం కోసం ఓ లేబుల్ ఉంచాలనిపించింది. 20 ఏండ్ల తరువాత వారితో గ్రూపులో ఇపుడు మాట్లాడుతుంటే చాలా చాలా హేపీగా ఉంది. అది మాటలలో చెప్పలేను. ఒక్కసారిగా పాతరోజులకు వెళ్ళిపోయి మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసిందనే చెప్పాలి. ఇది ఎల్లకాలం ఉండకపోవచ్చు. బట్ నా కోసం నేను కృషి విద్యాలయం జ్ఞాపకాలు వ్రాసుకోవాలని ఐడియా తట్టింది. ఖాళీ దొరికినపుడల్లా కృషి విద్యాలయం జ్ఞాపకాలు వ్రాద్దామని అనుకుంటున్నాను. వీలైతే మా స్టూడెంట్స్ సహకరిస్తే వారి వాయిస్ ని వినిపిద్దామనుకుంటున్నాను. ఇది కేవలం నాకోసం మాత్రమే. ఎవరికైనా ఉపయోగపడితే సంతోషమే.
నేను బోనకల్ లో కొంతకాలం కృషి విద్యాలయం పేరుతో స్కూలు నడిపాను. పదిమంది విద్యార్ధులతో ప్రారంభించిన ఆ స్కూలు కొద్దికాలంలోనే మండలంలో టాప్ లెవల్ కు వచ్చింది. తరువాత కొన్ని అనవసర కార్యక్రమాల వల్ల కృషి విద్యాలయం మూతపడింది. నేనెపుడూ ఆ స్కూలుని మూసేద్దాం అనుకోలేదు. కానీ అలా జరిగిపోయింది. నా జీవితంలో అదో చరిత్ర. చరిత్ర అనడం అతిశయోక్తిగా ఉంటుంది గానీ నా జీవితంలో అత్యంత ఆనందంగా ఉన్న సమయం మాత్రం కృషి విద్యాలయం లో మాత్రమేనని ఖచ్చితంగా చెప్పగలను. డబ్బులైతే సంపాదించలేదు గానీ చాలా ఆనందంగా, సంతృప్తిగా సాగిన రోజులవి 18 మంది టీచర్సు, ముగ్గురు ఇతర స్టాఫ్ వర్కర్సు , షుమారు 400 మంది విద్యార్ధులు వారి తల్లిదండ్రులుతో పరిచయాలు..... ఆ స్కూలుకు సంబంధించి నేను చేసిన ప్రయోగాలు, పాపరాజు బ్యాచ్ స్టూడెంట్స్ నాకు నేర్పిన అంశాలు చాలా జ్ఞాపకాలున్నాయి. ఒక్కసారిగా వాటిని చెప్పలేను. గుర్తుకు కూడా రావు. ఒక్కో అంశంను మా స్టూడెంట్స్ కోసం పల్లెప్రపంచం బ్లాగులో వ్రాసుకుంటాను.
పల్లా కొండలరావు,
27-04-2020.
Olden days are Goldendays-Sweet and short too🤩.In the sense,Awesome Video Sir.Once I just recalled those movements..😇.Thanks for Everything LOL😍 PK sir.
ReplyDeleteపాత రోజులు గోల్డెన్‌డేస్-స్వీట్ మరియు చిన్నవి కూడా. అర్ధంలో, అద్భుతం వీడియో సర్.ఒకసారి నేను ఆ కదలికలను గుర్తుచేసుకున్నాను..అన్నిటికీ ధన్యవాదాలు LOL😍 PK సర్.
ReplyDeleteWe r here now because of u thanku sir
ReplyDeletetq balbahadur. అమ్మ, నాన్న బాగున్నారా? ఎక్కడుంటున్నావ్? ఏం చేస్తున్నావ్? తమ్ముడు హరిబహుదూర్, సిస్టిర్స్ ధన, జయ బాగున్నారా?
DeleteSir amma nana kmm lo ùntaru nenu thamudu hyd and dhana huzunagar,jaya palvancha
DeleteK bal
DeleteNever... Forget those days sir and thank a lot sir for giving us a wonderful life for us..
ReplyDeleteTQ raju
DeleteSandhya, chintal sravan
ReplyDeleteDazy Chinni shyamala Sunitha srujana prathima Swapna..... And all
DeleteI will not forget those school days in my life time ,very sweet days I have spent in krushi vidyalayam , I'm very grateful to Kondal Rao Sir ,jwala sir ,koteshwara rao sir , they are my brahma ,vishnu ,Maheshwara,they have given me not only education
ReplyDeleteTQ Santhosh
DeleteSir maa photos unta pampinchandi
ReplyDeleteవీలుని బట్టి ఇదే బ్లాగులో పోస్ట్ చేస్తాను బాలూ.
DeleteThank you sir,
ReplyDeleteWith this video we all recalling those golden moments. We didn't expected that we all can view those days movements maintaining all such memorables.
Great sir������.
Iam very happy to see all my teachers ,friends,classmates and everyone.
Prathima
ధన్యవాదములు ప్రతిమా!
Deleteమీ క్లాసులో ఎపుడూ నువ్వే కదా బెస్ట్ స్టూడెంట్. క్లాసులోనే కాదు స్కూలులోనే చదువులో నువ్వే ఫస్ట్ కదా. మరోసారి అభినందనలు. ఆ వీడియోలో ప్లెడ్జ్ చేయించేది నీవా? కర్లకుంట సునీత నా?
1993-1994 vivek school BONAKALU M. BHASKAR RAO MY phone number 9640590043 Sir please call me SIR
ReplyDeleteహాయ్ భాస్కర్ రావు గారూ! బాగున్నారా? ఇపుడెక్కడుంటున్నారు? ఈ మధ్యలో ఎపుడైనా బోనకల్ వచ్చారా? నా నంబర్ పాతదే.
Delete