ప్రకృతిలోని జీవుల్లో మనిషి భిన్నమైనవాడు. తెలివిగా శ్రమిస్తూ పరికరాలను తయారుచేస్తూ, పరికల్పనలు చేస్తూ ప్రకృతిని ఉపయోగిస్తూ, ప్రకృతిపై ప్రభావం చూపుతూ తనను తాను నిరంతరం అభివృద్ధి పరచుకుంటాడు. మనిషి అంటే 'మనసు ప్రధానమైన వ్యక్తి' అని చెప్పొచ్చు. మనిషి యొక్క ఆలోచనా విధానమే మనసు. పరిస్తితుల ప్రభవితంతో మనిషికి కలిగే ఆలోచనలు, స్వభావ రీత్యా ఉండే ఆలోచనలు ఉంటాయి. స్వభావరీత్యా అని అనడంలో నా ఉద్దేశం పరిస్తితిని బట్టి మనుషులకు భిన్నస్వభావం తో కూడిన ఆలోచనలు (భిన్న ఆలోచనలు) వస్తాయి. ఒకానొక పరిస్తితిలో అందరికీ ఒకేవిధమైన ఆలోచన రాకపోవచ్చు. ఇది సహజమే. అయితే మనిషి స్వభావం పుట్టుకతో ఏర్పడుతుందా? పరిస్తితుల ప్రభావం ఎంత? 'మానవస్వభావం' పై మీ అభిప్రాయం ఏమిటి?
- పల్లా కొండల రావు.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
మీ స్వభావాన్ని మీరు వివరించుకుంటే మానవ స్వభావాన్ని వివరించినట్లే. కాదా ఏమిటి?!
ReplyDeleteకాదు.
Delete