- సంస్కృతి అంటే ఏమిటి? పాశ్చాత్య సంస్కృతి అంటే ఏమిటి?
- సంస్కృతి - ఈ పదం అర్ధం ఏమిటి? నిర్వచనం గా ఏమి చెప్పాలి?
- పాశ్చాత్య సంస్కృతి అంటే ఏమిటి?
- భారతీయ సంస్కృతి అంటే ఏమిటి?
- మనిషికి సంస్కృతి ఏ విధంగా సహాయకారిగా ఉండాలి?
- సంస్కృతి అంటే సంస్కరించలేనిదా? అదేమన్నా గుదిబండా?
- ఏ సంస్కృతికి కట్టుబడి ఉండాలి?
- బలవంతంగానో, ఈర్ష్యతోనో సంస్కృతిని అనుసరించాలా?
-Palla Kondala Rao,
15-2-2014.
15-2-2014.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
"సంస్కృతి అంటే సంస్కరించలేనిదా? అదేమన్నా గుదిబండా?"
ReplyDeleteమంచి ప్రశ్న. దీన్ని మీరు సంస్కృతి రక్షకులనడగాల్సిఉంది.
ఒకాయనేమో Apr 1 అనేది ఇతరులను గేలిచేసేది. అది మన సంస్కృతికాదు అని టపావేస్తాడు. ఇంకొకాయనేమో కొత్తసంవత్సర వేడుకలు జరుపుకొనేవారిని గేలిచేస్తూ గొర్రెలని అంటాడు.
ఒకాయనేమో సహనం మన సంస్కృతి లక్షణం అంటాడు. ఇంకొకాయనేమో ప్రేమికులరోజుపైన అసహనాన్ని వ్యక్తంచేస్తాడు.
ఏదైనా పాశ్చాత్య సంఘటనలను విమర్శించాల్సివస్తే "యత్ర నాత్యంతు..." అని తగులుకుంటారు. ఇళ్ళలోమాత్రం భార్యలను "ఒసేయ్/ఓయ్/ఏమోయ్" అని పిలుస్తారు (ఆ భార్యామణీ మాత్రం భర్తను "ఏమండీ" అని మాత్రమే పిలవాలి. ఇంకెలా పిలిచినా హర్టవుతాడు గురుడు). తనకన్నా తక్కువ చదువుకున్న పిల్లని, తనకన్నా తక్కువ సంపాదిస్తున్న పిల్లని ఆఖరికి తనకన్నా తక్కువ ఎత్తున్న పిల్లని మాత్రమే పెళ్ళిచేసుకుంటారు. ఏం? తనకన్నా ఒక్క విషయంలో కొంచెం ఎక్కువనుకోండి, పూజించడం సాధ్యపడదా? మర్చిపోయాను రంగుమాత్రం తనకన్నా తేటగా ఉండాలండోయ్.
బహుశా గొప్పలుచెప్పి, ఆచరణలో చతికిలబడటం మన సంస్కృతేమో!
ఈ contradictions మాత్రమే మన సంస్కృతేమో!
బహుశా సంస్కృతి అంటే ఇకపై సంస్కరించలేనంతగా సంస్కరించబడినదేమో!
మీరు చెప్పినట్లు ప్రవర్తించేవారున్నారు. వారు చెప్పేది సంస్కృతి కాకపోవచ్చు. వారిని విమర్శించడం అనేది ఇక్కడ అప్రధానం. నేనుంచిన ప్రశ్నలకు సరయిన చర్చ జరిగితే అలాంటివారికి సమాధానం కూడా అందులోఅనే ఉంటుందేమో ఆలోచించండి.
Delete"నేనుంచిన ప్రశ్నలకు సరయిన చర్చ జరిగితే అలాంటివారికి సమాధానం కూడా అందులోఅనే ఉంటుందేమో ఆలోచించండి."
Deleteఅంగీకరిస్తున్నాను.
"మీరు చెప్పినట్లు ప్రవర్తించేవారున్నారు. వారు చెప్పేది సంస్కృతి కాకపోవచ్చు"
నేను చెప్పిన తంతు భారతీయ సంస్కృతిలో ఒక విడదీయరాని భాగం.
"వారిని విమర్శించడం అనేది ఇక్కడ అప్రధానం."
ఈకపై ఇలా జరగకుండా ప్రయత్నిస్తాను.
ఇకపై ఇలా జరుగకుండా ప్రయత్నిస్తాను అన్న మీ పాజిటివ్ స్పందనకు ధన్యవాదములు. అభినందనలు సర్.
Deleteభారతీయ సంస్కృతిలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మన సంస్కృతిలో మరో గొప్పతనం ఏమిటంటే హిందూ సంస్కృతి పాత కొత్తల మేలు కలయికగా తనను తాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళుతుంది.
హిందూయిజం పేరుతో కొంతమంది చెప్పే కొన్ని అంశాలు మాత్రమే మన సంస్కృతి కాదు.
కొండల రావు గారు,
Deleteనా సమస్య కొత్తదనాన్ని అంగీకరించగలిగే వారితోకాదు. కొత్తదైన ప్రతిదానినీ వ్యతిరేకించి, వేదకాలానికి వెనక్కువెళదామనే హిందూ వహాబీలతోనే!
నాకు తెలిసినంతవరకూ వేదం కొత్తదానిని త్రోసిపుచ్చమని చెప్పలేదండీ. కొత్తదనాన్ని శాస్త్రీయమైనదానిని అంగీకరించకపోవడం అజ్ఞానం అవుతుంది. అయితే మతపరమైన విశ్వాసాలు మాత్రం పూర్తిగా వ్యక్తిగతంగా ఉన్నంతవరకూ వాటిని విమర్శించాల్సిన అవసరం లేదు. సమాజపరంగా విధానంగా ఏవైనా బలవంతంగా అందరూ ఆమోదించాలనడం పైశాచికత్వం అవుతుంది. మన భారతీయ సంస్కృతిలో కొన్ని అశాస్త్రీయమైన ధోరణులు - అంశాలను తప్పిస్తే ఇప్పటికీ ప్రపంచంలోనే భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు చాలా విలువ ఉన్నది. ఆ విలువను విదేశీయులకంటే మనవాళ్లే చెడగొడుతున్నారనేది నా అభిప్రాయం.
Deleteవేదం నాకు తెలియదు. తెలియనిదానితో నాకు విరోధం ఉండాల్సిన అవసరంలేదు. నేను వ్యతిరేకించేది మన ధోరణులనే.
Deleteమతం వ్యక్తిగతంగా ఉండాల్సిన విషయం కాదనను. కానీ అదెప్పుడో రాజ్యవ్యవస్థలను శాశించే స్థాయికి తెగబడింది. ఒక వ్యవస్థగా మతాన్ని నేను చీదరించుకుంటాను. ఒక వ్యక్తిగత నమ్మకంగా ఐతే గౌరవిస్తాను. Once more... తమకు తమ మతంవల్ల కలిగిన అభిప్రాయాలను ఆధారంచేసుకొని మొత్తం ప్రపంచాన్ని judge చేసేవారిమీద నాకు చాలా తక్కువ అభిప్రాయం ఉంది. అలాంటివారు హిందువైనా, ముస్లిమైనా, క్రైస్తవుడైనా ఇంకెవరిని నేను గౌరవించలేను.
"మన భారతీయ సంస్కృతిలో కొన్ని అశాస్త్రీయమైన ధోరణులు - అంశాలను తప్పిస్తే ఇప్పటికీ ప్రపంచంలోనే భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు చాలా విలువ ఉన్నది."
క్షమించాలి. దూరపు కొండలు నునుపు అన్నది సామెత. మనకు వారి పధ్ధతులు నచ్చినట్లే, వారికీ మన పధ్ధతులు నచ్చుతున్నాయి. ప్రపంచంలో ఏమతమూ మానవులంతా ఒకటే అన్న భావనని సమర్ధించేది కాదు. ఏదో ఒక రూపంలో బానిసత్వాన్ని సమర్ధించే మతం నా దృష్టిలో ఏవిధంగానూ గొప్పది కాజాలదు.
@IconoclastFebruary 15, 2014 at 7:48 PM garu,
Deleteమతం విషయంలో మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎవరైనా దీనిని అంగీకరించాలి.
భారతీయ సంస్కృతి అంటే కేవలం హిందూమతం అనో, హిందూ సంస్కృతో అనుకుంటే పొరపాటు. హిందూ మతానికీ భారతీయ సంస్కృతికీ తేడా ఉన్నది. నేను చెప్పేది భారతీయ సంస్కృతి గురించే తప్ప హిందూ మతం గురించి కాదు. అయితే భారతీయ సంస్కృతిని ఎక్కువగా ప్రభావితం చేసేది హిందూ మతం అయినంత మాత్రాన హిందూ మతం చెప్పేదే భారతీయ సంస్కృతి అనుకోవలసిన అవసరంలేదని నేను అభిప్రాయపడుతున్నాను.
తొలినాటి అనాగరిక దశలోని సమాజాల వికారాలను తమకు తాము కట్టుబాట్లతో క్రమబధ్ధం చేసుకొని
ReplyDeleteనాగరికతవైపు అడుగులు పడగా ఆయా సమాజాలలో ఏర్పడిన మానవ వికాస పరిణామాలను ఆయా
సమాజాల సంస్కృతులుగా నిర్వచించవచ్చు .
అనేక వేల యేళ్ళ తరబడి కొనసాగిన మానవ వికాస పరిణామ క్రమంలో ప్రపంచంలోని అనేక ప్రదేశాలలో
అనేక సంస్కృతులేర్పడ్డవి . దూర తీరాలలో ఉండడంవల్లా , సంబంధాలు లేకపోవడం వల్లా సమాజాల సంస్కృతుల మధ్య తేడాలు సహజం . అంతమాత్రాన హెచ్చు తగ్గులు చూడడం అవివేకం . ఆయా ప్రదేశాల స్థితి గతులను బట్టి
దేని కదే సాటి .
మానవ వికాస పరిణామక్రమంలో ఏర్పడినదే విజ్ఞానం కూడా . ప్రపంచంలోని సమాజాలన్నింటిలో విజ్ఞానం
వెల్లివిరిసినట్లే భారతీయ సమాజంలో కూడా వేదాది వాజ్ఞ్మయ రూపంలో విజ్ఞానం వెల్లి విరిసింది . ఈ విజ్ఞానమంతా
ఆయాయి కాలాల పరిమిత శోధనావకాశాల ప్రమాణాల కనుగుణంగా జరిగిందే .
ప్రపంచంలోని ఏసమాజంలోని ప్రాచీన విజ్ఞానంగానీ , అట్లనే భారతీయ ప్రాచీన వాజ్ఞ్మయ విజ్ఞానంగానీ అపరిమితమూ కాదు , అత్యాధునికమూ కాదు . అన్నీ అందులోనే ఉన్నాయనడం పొరపాటు . ఎందుకంటే
ఇప్పటితో పోల్చుకుంటే అప్పడు ఇంతగా శోధనావకాశాలు లేవు .
వేల సంవత్సరాల నాటి భారతీయ సమాజపు ఊహాజనిత నవగ్రహాల పొరపాటు గ్రహించినప్పటికీ నర నరాలలో
జీర్ణించుకు పోయిన ఆచార వ్యవహారాలలోని కర్మ క్రతువులు కొనసాగుతూనే ఉన్నవి . సూర్యుడు భూమి చుట్టూ
పరిభ్రమిస్తూనే ఉన్నాడు . ఈ ఆధారంగానే నవజాత శిశువుల జనన కాలాలు , జన్మనక్షత్రాలు , జాతక చక్రాలు , భవిష్యత్తూ నిర్ణయించబడుతూనే ఉంది . ఇంకా ఘోరమైన విషయమేమిటంటే ..... తిధి , వార , నక్షత్రాలు ముందే నిర్ణయించుకుని మరీ ఆపరేషన్ల ద్వారా డెలివరీలు చేయిస్తున్నారు . ధీనికి డాక్టర్లుకూడా ప్రోత్సహిస్తున్నారు .
నిన్న మొన్నటి దాకా ఈ భారతీయ సమాజాన్ని నిరక్షరాస్యత వైపు అణగద్రొక్కి , ఆ అజ్ఞానాన్ని ఆసరా చేసుకొని పెత్తనం చెలాయించి అసత్యాలను ఆసరా చేసుకొని అందలాలెక్కిన ఒక వర్గపు మేధావుల వికృత సంస్కృతీ
సంప్రదాయాల విజ్ఞానమిది .
ధన్యవాదములు రాజా రావు గారు. సంస్కృతి మరియూ విజ్ఞానం ఏదీ ఒకటి ఎక్కువా తక్కువా కాదు. కానీ ప్రతీదీ ఏదీ మీరన్నట్లే అపరిమితమూ, ఆధునికమూ ఎప్పటికీ కాదు. మార్పుని అంగీకరించలేనివారు మూఢంగా, బలవంతంగా పాతదానినే పట్టుకుని ప్రవర్తించడం అలా అందరూ ఉండాలని చర్యలు చేయడం తప్పు. పాతది లేకుండా కొత్తది లేదు. పాతదాని ఆధారంగా ఆచరణలో కొత్తది తయారవుతుంది. మహాకవి గురజాడ అన్నట్లు పాత కొత్తల మేలు కలయికే ఎప్పటికప్పుడు ఏర్పడే నూతన సంస్కృతి అవుతుంది. అయితే ఇప్పుడు సంస్కృతి వివిధ రకాలుగా ఉన్నా ఎప్పటికైనా మానజాతి విశ్వజనీనమైన సంస్కృతిని ఏర్పరచుకుంటుంది.
Deleteడాక్టర్లు కూడా పూజలు చేసే ఆపరేషన్లు చేసేవారు చాలామంది ఉన్నారు. డబ్బు వస్తుందంటే దేనినా ప్రోత్సహించే డాక్టరులు చాలామంది ఉన్నారు. డాక్టర్ కావడానికి బట్టీ పట్టి చదివే చదువుకు సమాజహితంకోసం సమాజాన్ని చదవడం వేరు కదా?
నేను ప్రేమికుల రోజును అనడం కన్నా ప్రేమను వ్యతిరేకించడానికి కారణం
ReplyDeleteఇద్దరు వ్యక్తులు తమ పెద్దలు చేసిన కట్టుబాట్లు నాశనం చెయ్యడానికి అని అర్ధం ఈ ప్రేమ, ఎందుకంటే మన పెద్దలు గోత్రాలు ఏర్పాటు చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉండి ఉంటారు అలా వ్యతిరేకించిన వాళ్ళు గోత్రాలు లేకుండా ఉన్నారు.
మరి గోత్రాల వల్ల లాభాలు ఏమిటి?
ఒకే జీవ కణం నుండీ పుట్టిన వారు భార్యా భర్తలు అయ్యే అవకాశాలు తగ్గించడానికి, ఎందుకంటే తండ్రి గోత్రం కొడుకుకు వస్తుంది. మరి ఇక్కడ వెంటనే పుట్టే ప్రశ్న మరి తల్లి గోత్రం అని అడిగే స్త్రీ వాదులు ఉన్నారు, కానీ మన పెద్దలు తండ్రి గోత్రం ఎందుకు ఎన్నుకున్నారు అంటే ఎక్కువ జన్యు కణాలు తండ్రి నుంచే వస్తాయి అని తెలుసుకుని ఉండవచ్చు, కానీ పెళ్లి సంబంధాలు చూసే సమయంలో తల్లి గోత్రం కూడా చూస్తారు, ఎందుకంటే తల్లి జీవకణం/తండ్రి జీవకణం ఒకటే అయితే ఒక్కోమారు పుట్టే పిల్లలు అసమాన నిర్మాణాలు ఉండటం కారణం!
మరి ప్రేమికులు ఇవి పట్టించుకుంటారా?
ఇక తరువాత ప్రేమను వ్యక్త పరచడానికి బహుమతులు ఇస్తారు, మరి ఆ బహుమతులు ఎంతవరకు ఉపయోగం అన్న విషయం ఎవరూ గుర్తించరు! చిన్న పిల్లవాడైనా పెద్ద పిల్లవాడైనా బహుమతి ఒకమారు అలవాటు అయితే ఇక జీవితాంతం దాని కోసమే జీవిస్తారు, అంటే నువ్వు ఇచ్చే బహుమతి విలువ బట్టి నీ ప్రేమ స్థాయి నిర్ణయించ బడుతుందా?
ఇక మన సంకృతి యొక్క ఆకారం చూస్తే మనం లేదా మన పెద్దలు ఎక్కువగా మన సహచరులను లేదా మనల్ని బాగు చేసే మార్గం ఎన్నుకున్నాం అనిపిస్తుంది మరి అది గుదిబండ ఎలా అవుతుంది?
ఉదాహరణకు తులసి మొక్క - దీని వల్ల లాభాలు
1. sinusitis లో సమస్య ఉన్న వారికి ఇది చక్కని పరిష్కారం అని చాలా మంది తెలిపారు
2. Brest cancer సమస్యను తగ్గించే ఔషద గుణాలు ఉన్నాయి అని అంటున్నారు చాలా మంది
ఇక పసుపు
సహజంగా దొరికే ఒక antioxidant, కొంచం ఎక్కువ తీసుకుంటే నష్టం కాదు అనను కానీ సమానంగా తీసుకుంటే నష్టం లేదు ఇంకా లాభమే!
ఇక మన పెద్దలు మన శరీరం సరిగ్గా పెరగే అవకాసం ఇచ్చే వస్తువులకే ప్రాధాన్యం ఇచ్చారు
అందుకే ఆడవాళ్ళకు blouse మగవాళ్ళకు లుంగీ కానీ మనం అవి కట్టుకోవడం పాపంగా చూస్తున్నాం.
ఇక వీటి వల్ల కేవలం నువ్వే బాగు పడుతున్నావు అనే వాళ్ళు కోకొల్లలు !
కానీ నిజం ఇప్పట్లో లాగా కాదు అప్పుడు(అప్పుడు అంటే నా అభిప్రాయం ఈ నియమాలు చక్కగా పాటించే సమయంలో - కొన్ని నియమాలు లాభాలకు వాడుకోనంత వరకూ), పని చేసిన వాడికే లాభం వెళ్ళేది బద్దకస్తుడికి కాదు.
బద్దకస్తుడు అంటే
1. తను నడవగలిగినా వాహనం చొదించె వాడు
2. తను కాకుండా యంత్రంతో చేయించే వాడు
ఇది వరకు రోజులలో మనం వేసుకునే వస్త్రాలు దూదితో నేసినవే, ఇప్పుడు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మనం విదేశీ వస్త్రాలు ధరిస్తున్నాం, ఏదైనా అంటే కొంతమంది వింతగా యుద్ద సామగ్రీ మనం విదేశాల నుంచీ దిగుమతి చేసుకోవాలి అని కూడా వ్రాస్తున్నారు, యుద్ధం అనివార్యం అంటే ఎదుట వాడికి మనం తప్పు చేస్తున్నాం అని అనిపించడం అని కూడా అర్ధం చేసుకోలేని వ్యక్తులు.
కట్టుబాట్లనేవి ఆయా కాలమాన పరిస్తితులను బట్టి మంచి కోసమే ఏర్పాటు చేసినా ఆచరణలో కొన్ని తప్పని తేలినప్పుడు, లేదా కట్టుబాట్లు ఏర్పాటు చేసేటప్పుడే ప్రకోపించిన పైత్యంతో ఏర్పాటు చేస్తే వాటిని బలవంతంగా నిలబెట్టాల్సిన అవసరంలేదు. సతీ సహగమనం అనేది దుర్మార్గమైన కట్టుబాటు. పతీ సహగమనం ఎందుకు లేదు? సతీ సహగమనం మాత్రమే ఎందుకు? దీనికేమి చెపుతారు మీరు? ప్రేమ అంటే మీరనుకుంటున్నట్లు లేదా కొందరు అనుకుంటున్నట్లు ఇద్దరు యువతీ యువకుల మధ్య ఉండే వ్యామోహం కాదు. ప్రేమ విశ్వజనీనమైనది. ప్రేమికులరోజు అంటూ కేవలం ఆ రకం ప్రేమికులకోసమే ఒక రోజు పెట్టి మార్కెట్ శక్తులు తమ అమ్మకాలని పెంచడంకోసం ఇలాంటివాటిని పెంచి పోషిస్తుంటారు. పార్కులలో కేవల ఆ రోజు మాత్రమే వెంటబడి తాళిబొట్లు పట్టుకుని హడావిడి చేస్తే సంస్కృతిని కాపాడుకోలేరు. సంస్కృటిని కూడా బలవంతంగా కాపాడుకోలేము. ప్రేమతోనే అర్ధమయ్యేలా అవగాహన కల్పించి ప్రజల మద్దతుతో మాత్రమే కాపాడుకోగలం. అదే మార్గం కూడా. ఆచరణలో ఆటంకంగా ఉన్నదేదీ కాలపరీక్షకు నిలవదు. ప్రేమ అనేది ఓ సహజాతమైన అంశం , బిడ్డపై తల్లికి , ప్రక్రుతిపై మనిషికి ఉండే ప్రేమకు బహుమతులను బట్టి విలువలు కట్టగలమా?
Deleteగోత్రాలు అనేది శాస్త్రీఅయమైన అంశమా? కాదా? నాకు అంతగా తెలీదు. కనుక వాదించలేను. గోత్రం అనేది మతపరమైనదనుకుంటాను.
విదేశీ స్వదేశీ అనేదానిలో విదేశీ వస్తు బహిష్కరణ అనేది గాంధీ ఆనాటి జనసామాన్యాన్ని కదిలించడానికి తీసుకున్న ఎత్తుగడ. గాంధీ చాలా తెలివైనవాడు. అప్పటి పరిస్తితులను బట్టి ఉప్పుతో సత్యాగ్రం చేయించాడు. ప్రజలను సమీకరించడంలో శాంతియుత మార్గంలో సత్యం-అహింసలు ఆయుధాలుగా చేసి ఉద్యమమ నడిపించడం అనేది చరిత్రగా మిగులుతుంది. ఎప్పటికీ అది పాఠమే. అయితే అందులోనూ కొన్ని లోపాలుండవచ్చు. దానిని ఇప్పటి పరిస్తితులతో పోచి చూడాలంటే. మనం ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించాలంటే కొన్ని తప్పవు. అయితే అవి ఎవరికి ప్రయోజనం కలిగిస్తున్నాయనే విధానాలను బట్టి చూడాలి. ఒక వస్తువు అవసరానికా? లాభానికా? అంటే వాడకానికా? అమ్మకానికా? అనేదానిని బట్టి మనం ఆలోచించాలి. ఉదాహరణకు గోధుమలు ఆహారంగా ఉపయోగపడుతుంది అంటే వాటిని అవసరం మేరకు దిగుమతులు చేసుకోవాలి. అదే కార్లు లాంటి లక్షరీ అయితే దానిని బట్టి ఆలోచన మారాలి. అంతే తప్ప గాంధీ విదేశీ వస్తు బహిష్కరణను పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రంలా వాడకూడదంటాను. సామ్రాజ్యవాదులను ఎదిరించడంలో గాంధీ స్పూర్తిని సామ్రాజ్యవాదులకు సాగిలపడే నేటి పాలకుల దిగజారుడుతనాన్ని విమర్శించవచ్చు.
నేను విదేశీ వస్త్ర బహీస్కరణ గురించి మాత్రమే మాట్లాడాను, మీరు అన్నట్టు ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది నేటి యువత ఆలోచించట్లేదు, కొన్నిసార్లు నేను కూడా.
Deleteఅవసరం వేరు అవసరం చేసుకోవడం వేరు.
బట్టలు అవసరం అన్న విషయం కూడా గుర్తించాలి నేటి ప్రజలు అనేది నా అభిప్రాయం!
ఇక సతీ సహగమనం అనేది నేను కూడా ఒప్పుకోను, దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను ఎందుకంటే నేను పుట్టే సమయానికి అవి నిషేదింపబడ్డాయి!
దేవదాశీ వంటి వ్యవస్థ కూడా అంతే.
ఇలాంటి వాటి గురించి నాకు చిన్నప్పుడు తెలియదు, పెరిగి పెద్దయ్యకా తెలిసింది!
బహుమతులకోసం ప్రేమికులు సరే... గోత్రాలు చూసి పసిపిల్లలకి ముసలోల్లనిచ్చి కట్టబెట్టిన సంస్కృతి గురించి ఏ సైన్సు చెప్పింది... సెన్సులేకుండా..? మర్చిపొయ్యా.. అప్పటికి మీరు పుట్టలేదుకదూ! మీకు తెలిసుండవులేండి
Delete