కృషి విద్యాలయంలో నాకు చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికీ గుర్తున్నారు. కొంతమంది ఎప్పటికీ గుర్తుంటారు. అలాంటివారిలో ప్రధముడు బుంగా పాపరాజు. బోనకల్ ప్రక్కన ఉన్న ఆళ్ళపాడు గ్రామం. ఆళ్ళపాడు నుండి చాలామంది కృషి లో చదువుకున్నారు. పాపరాజుతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. పాపరాజుతో నాకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ టపా వ్రాస్తున్నాను. కృషి విద్యాలయం వీడియోలలో పాపరాజు ఉన్న కొన్ని బిట్స్ ని అతికించి ఈ వీడియో తయారుచేశాను. వీడియో ఎడిటింగ్ నేర్చుకుని నేనే ఇది తయారుచేశాను. వీడియో అందుకే క్వాలిటీగా ఉండదని గమనంలో ఉంచుకోవాలని విజ్ఞప్తి.

పాపరాజుతో నాకు ప్రత్యేక అనుబంధం ఉండడానికి కొన్ని కారణాలున్నాయి. వాటికంటే కూడా తనతో నాకు అనుబంధం ఎక్కువగా ఉండడానికి కారణం వాడిలో ఉన్న లీడర్ షిప్ క్వాలిటీస్ ఎక్కువ కారణం అని చెప్పాలి. పాపరాజు అమ్మ గారిది మా వూరు. తెల్లబోయిన తిరుపతయ్య అని కాంగ్రెస్ నాయకుడు. ఆయన చెల్లెలు. మా కుటుంబంతో వారికి మంచి అనుబంధం ఉండేది. ఆ విధంగా కుటుంబ మిత్రులుగా పాపరాజు అమ్మ, నాన్న మా కుటుంబానికి కూడా బాగా సన్నిహితంగా ఉండేవారు. పాపరాజు తండ్రి బుంగా గోపయ్య గారైతే నాతో బాగా సన్నిహితంగా ఉండేవాడు. పాపరాజు గురించి నాతో బాగా చర్చించేవాడు. మీరు ఎలాగైనా వాడిని గొప్పవాడిని చేయాలని కోరేవాడు. నీలాగా బాగా తెలివికలవాడిని చేయాలనే వాడు. వాడ్ని మంచి స్థాయిలో చూడాలని కోరుకునేవాడు. నేనేమో గానీ వాడయితే ఇపుడు మంచి స్థాయిలోనే ఉన్నాడు. పాపరాజుని పదవ తరగతి పరీక్షల సమయంలో మా ఇంట్లోనే ఉంచాడు. అవసరం లేదన్నా లేదు వాడిక్కడే ఉండి చదవాలని పట్టుబట్టి ఉంచాడు గోపయ్య గారు. కొద్ది రోజులు అలా వాడు మా ఇంట్లో ఉన్నాడు. అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. పాపరాజు అన్న బాలరాజు వాళ్ళు కూడా నాతో బాగుండేవారు. ఆళ్ళపాడులో ఫ్రెండ్స్ యూత్ క్లబ్ అని ఉండేది. ఆ కార్యక్రమాలకు నన్ను అతిధిగా పిలిచేవారు. ఇపుడు నడుస్తుందో లేదో తెలియదు.

పాపరాజుకు కొంచెం సిగ్గు ఎక్కువ. అయితే ఎంత సిగ్గు ఉందో అంత అల్లరి ఉంది. ఆత్మాభిమానం ఎక్కువ, అవమానాన్ని తట్టుకునేవాడు కాదు. మళ్ళీ కొంచెం సేపటిలో కలసిపోయేవాడు. చదువులో కూడా బాగానే రాణించేవాడు. ఏదైనా పట్టుదలతో సాధించాలనే గుణం, ఏదైనా పని చేయించాలంటే నలుగురిని కూడేసే లక్షణాలున్నాయి. కృషిలో విద్యార్ధులు కూడా ఏ ప్రోగ్రాం అయినా పాపరాజు నాయకత్వంలోనే జరిగేది. ఆటలపోటీలు, సాంస్తృతిక కార్యక్రమాలు, వనభోజనాలు, క్విజ్ తరహా పోటీలు ఏదైనా లీడర్ పాపరాజే. అటువంటి కార్యక్రమాలలో స్టూడెంట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేయడంలో ఆ వయసులోనే మంచి టీమ్ లీడర్ గా ఉండేవాడు. ఇపుడూ అదే స్పిరిట్ కొనసాగుతుందనే అనుకుంటున్నాను. 

నిలుచున్న వారిలో ఎడమనుండి రెండవవాడు
పాపరాజు అండ్ కో (వీడికి పెద్ద మిత్రబృందం ఉండేది) నాతో బాగా చనువుగా ఉండేవారు. ఓ టీచరు, శిష్యుడిలా గాక ఓ ఫ్రెండ్ లా ఉండేవారని చెప్పవచ్చు. వ్యక్తిగత విషయాలలో కూడా వీళ్ళు నాకు సూచనలు ఇచ్చేవారు. నాకు టక్ చేయడం నేర్పింది వీళ్ళే. అంతక్రితం నేను టక్ చేయడానికి ఇష్టపడేవాడిని కాదు. ఇపుడు కూడా చేయడం లేదు. నాతోపాటు ఇతర టీచర్లందరిచేతా వీరు టక్ చేయించారు. కృషిలో కోటేశ్వరరావు గారు, వీరబాబు గారు వంటి వివేక్ స్కూలుకు చెందిన టీచర్లు మాత్రమే టక్ చేసేవారు. కృషి, వివేక్ రెండూ కలసి కృషి విద్యాలయంగా మారాక కృషి టీచర్ల చేత, అంతకు ముందు వివేక్ లో టక్ చేయని టీచర్ల చేత వీళ్ళు టక్ చేయించారు. అలా వీళ్ళు టీచర్లకు కొత్త పాఠాలు నేర్పేవారనే చెప్పాలి. స్కూలులో ఎక్కడ రిపేర్లు చేయాలి. ఎక్కడ ఎలా శుభ్రం చేయాలి. బోర్డులను, బెంచిలను ఎలా నీట్ గా ఉంచాలి. మొక్కలను ఎలా పెంచాలి వంటి విషయాలపై స్వంత ఇంటిలా వీళ్ళు సూచనలు ఇవ్వడమే గాక చాలా ప్రేమతో ఆ పనులను చేసేవారు. ఓ ఆశ్రమంలా ఉండేదా వాతావరణం. సినిమాలు గురించి, భారతం, భాగవతం, రామాయణం వంటి పురాణాలలోని కథలు సరదాగా చెప్పుకునేవారు. ఇదే అంశాన్ని పిల్లలకోసం శనివారం ఓ పూట కేటాయించాలని నేను సూచించినపడు టీచర్లనుండి వ్యతిరేకత వచ్చింది. పేరంట్స్ లో చెడ్డపేరు వస్తుందని భయపడ్దారు. కానీ పాపరాజు బృందం ప్రోత్సాహంతో ఆ పని మొదలు పెట్టాను. చాలా సక్సెస్ ని, మంచి పేరునీ తెచ్చిపెట్టిందా ప్రోగ్రాం. ప్రతి శనివారం సాయంత్రం పిల్లలు విద్యార్ధులు అందరూ చదువుతో సంబంధం లేకుండా వైజ్ఞానిక, సాంస్కృతిక, కళా రంగాలలో ఎవరికున్న ప్రావీణ్యం వాళ్ళు ప్రదర్శించేవారు. వివిధ ప్రోగ్రాంలు నడిపేవాళ్ళం. చాలా సందడి వాతావరణం ఉండేది. ఎపుడు శనివారం వస్తుందా అన్నంత ఆనందంగా ఎదురుచూసేలా ఆ ప్రోగ్రాం నడిచింది. పాపరాజు టీమ్ సపోర్టు లేకుంటే ఆ ప్రోగ్రాం నడిచేది కాదనే చెప్పాలి. పేరంట్స్ నుండి మంచి స్పందనే వచ్చింది. ఆ విషయాన్ని వీలైనపుడు ఈ బ్టాగులో ప్రత్యేకంగా వ్రాస్తాను.

పాపరాజుకు ఆత్మాభిమానం ఎక్కువ. దగ్గరివారు అవమానపరిస్తే బాగా ఫీల్ అయ్యేవాడు. జర్రున కళ్ళలో నీళ్ళు తిరిగేవి. ఓ సందర్భంలో జ్వాలా సర్ కొట్టినపుడు అలిగి ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ మరుసటి రోజు సెట్ అయ్యాడు. నాపై కూడా ఓ సందర్భంలో అలిగినట్లు గుర్తు. ఎంత ఏక్టివ్ గా ఉంటాడో అంత సెన్సిటివ్ గా ఉండేవాడు. మాట పడని మనస్తత్వం. ఇపుడది అధిగమించే ఉంటాడని భావిస్తున్నాను. తన క్లాసులో తనకంటే పెద్దవాళ్ళున్నా (వయసులోనూ, ఎత్తులోనూ) అందరికీ వీడే లీడర్. కృషిలో విద్యార్ధి సంఘ ఎన్నికలు కూడా నడిచేవి. నామినేషన్లు, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఓ పద్ధతి ప్రకారం జరిపేవాళ్ళం. ఈ సందర్భంగా పాపరాజుకు సంబంధించి మేమెవరమూ ఊహించని సంఘటన జరిగింది. ఎస్.పి.ఎల్ గా పాపరాజు, అదే క్లాసుకు చెందిన ప్రతిమ పోటీ పడ్డారు. ప్రతిమకు స్కూలులో మంచి విద్యార్ధిగా పేరుంది. బాగా చదివేది. అన్ని విషయాలలో మంచి ప్రతిభ కనబరచేది. స్టాఫ్ లో కూడా వీరిద్దరిలో ఎవరు గెలుస్తారా? అనే ఉత్కంఠ ఉండేది. కానీ రిజల్ట్సు ఏకపక్షంగా వచ్చాయి. పాపరాజు భారీ మెజారిటీతో గెలిచాడు. నాకు తెలిసి స్కూలు చరిత్రలో ప్రతిమకు అది మొదటి అపజయం అనుకుంటాను. ఎందులోనైనా టాప్ గా ఉండే ప్రతిమ అంత తేడాతో ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరచింది. పాపారాజు ఏదో మాయచేసి ఉంటాడని అనుకున్నాము. కానీ వాడిలో ఉండే లీడర్ షిప్ క్వాలిటీయే దానికి కారణం అని భావిస్తున్నాను. ప్రచారం చేసుకోవడంలో, చొరవలో ప్రతిమ వెనుకబడడం మెజారిటీ తేడాకు కారణంగా నేను భావిస్తున్నాను. అయితే కొద్ది రోజుల తరువాత పాపరాజు ఎస్.పి.ఎల్ గా పనిచేయలేదు. ఆ స్థానంలో ప్రతిమే కొనసాగింది. సహజంగా ప్రతిమ అంటే ఎవరికీ ద్వేషం ఉండేది కాదు. కానీ పోటీ పాపరాజు నుండి కావడంతో రిజల్టు ఆశ్చర్యకరంగా రావడం ఎప్పటికీ మరచిపోని, గమనంలో ఉంచుకోదగ్గ విషయం. పాపరాజు ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడు. ఆ వివరాలు, కృషిలో తన అనుభవాలపై రాజు అభిప్రాయం మరో టపాలో తెలుసుకుందాం. 
పల్లా కొండలరావు,
30-04-2020,
చొప్పకట్లపాలెం.

Post a Comment

  1. It was happened in 1996 sir.
    Paparaju gurinchi meeru cheppindhi correct sir.He is one of my best classmate sir. Inni rojulaina ivvanni gurthupettukoni post chesinanduku thank u sir. Maa chinnanati gnapakalu gurthu thesthunnaduku tq very much sir.Video lo Jwalaa sir kuda unnaru and me also*

    ReplyDelete
  2. Meeru super sir awesome memory collections

    ReplyDelete
  3. Dear sir,
    Hatsoff to your memory power and thanks for remembering my school days.

    Happy to share that, about my feelings as a student of Krushi vidhayalam.

    I have studied till 7th standard in govt school and we don't have any extra cultural activities in our govt school and we have only regular classes.
    Once I joined in Krushi school, my life got changed with good education and cultural activities and all our class mates got participated in quiz competition, group discussion and debate programs and all those programs got improved our listening skills and leadership skills.
    As a part cultural programs, I am elected as SPL (school People's leader) in our School, that is one of the most memorable day in my school life.

    In my school days I had learn difference between boss and leader and now it has been useful for my real-life.
    I have learn lot of things from you sir (as a Leader ).
    I had stayed at your home in my 10th class and all your family members are treated as your family member and I don't forget those days.

    I had seen and Learned so many things from your motivational and leadership styles at my School days and now it has been useful for my carrier.

    Thanks you so much sir.

    ReplyDelete
  4. Sir it was amazing video we are very thankful to you, we got golden and sweet memories

    ReplyDelete
  5. Sir what an amazing video. I dint expect that i am in this video.. i am very happy to see all my friends in this video... by seeing this video we remembered all our memories... i am very thankful for this video sir.. u have taken us 2oyrs before iam thankful to to u sir.. as i can see all my friends once again... santosh,paparaju,pratgima and all

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top