టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వలస కూలీలకు కూరగాయలు, బియ్యం పంపిణీ
ఖమ్మం
జిల్లా బోనకల్ మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో ఉంటున్న
మహారాష్ట్రకు చెందిన వలసకూలీలకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్
(టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూరగాయలు, బియ్యం పంపిణీ
చేశారు. కరోనా కారణంగా చొప్పకట్లపాలెం వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చి
ఇబ్బందిపడుతున్న 18 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, మాస్కులు, ఇతర నిత్యావసర
వస్తువులను సంఘం జిల్లా కార్యదర్శి పల్లా కొండలరావు, ఉపాధ్యక్షులు తేనె
వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, వైబ్రెంట్ ఆఫ్ కలాం
సంస్థ సభ్యుడు మండెపుడి శ్రీనివాసరావులు అందజేశారు. వలస కూలీలను ప్రభుత్వం
వెంటనే ఆదుకోవాలని, వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని,
అప్పటిదాకా వారికి తగిన వసతి ఏర్పాట్లు చేయాలని పల్లా కొండలరావు
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేసిన
వైబ్రెంట్ ఆఫ్ కలాం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు లగడపాటి హేమలతకు, గ్రామస్థుల
ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు షేక్ మదార్సాహెబ్,
గ్రామస్తులు పాల్గొన్నారు.
Excellent Sir
ReplyDeleteధన్యవాదములు జై గారు.
Delete