మానవతా వాది తన్నీరు జగ్గయ్య
- పల్లెప్రపంచం అధ్యక్షుడు పల్లా కొండలరావు
నిరంతరం
గ్రామ సంక్షేమం కోసం కృషి చేసిన మానవతా వాది తన్నీరు జగ్గయ్య అని
పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు తెలిపారు. బోనకల్ మండలం
చొప్పకట్లపాలెం గ్రామంలో గురువారం రాత్రి జరిగిన తన్నీరు జగ్గయ్య 32వ
వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ
అభిమానాన్ని పొందిన మంచి మనిషి అన్నారు. 32ఏండ్లు గడిచినా ప్రతీరోజూ ఆయన
పేరు ఏదో ఒక రూపంలో గ్రామంలో వినిపిస్తోందన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు
అభివృద్ధి కోసం, చైతన్యం కోసం కృషి చేసిన మహానుభావుడని తెలిపారు.
పల్లెప్రపంచం స్టడీ సర్కిల్ సభ్యురాలు కిలారు అఖిల అధ్యక్షతన జరిగిన ఈ సభలో
తొలుత తన్నీరు జగ్గయ్య కు పూలతో నివాళులు అర్పించారు. తన్నీరు జగ్గయ్య
సేవలను కొనియాడుతూ మాజీ సర్పంచ్ బూసి వెంకటేశ్వర్లు, బోయినపల్లి అంజయ్య,
పున్నయ్య, కొండేటి అప్పారావు, రచ్చ మధు, చలమల హరికిషన్, కిలారు సురేష్,
బండి శ్రీనివాసరావు,రచ్చ శివ, తేజ, సింధు,సాత్విక, మేఘన, టింకూ, హర్ష,
చెన్నంశెట్టి ప్రసాద్, రచ్చ నరేంద్ర తదితరులు మాట్లాడారు.
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.